Menu

Monthly Archive:: December 2010

ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

నువ్వొక నిర్వాజమైన వ్యాజ్యానివి. అరణ్యరోదనల కోరస్‌కి తొలి గొంతుకవి. నీ ఇష్టాయిష్టాల గొలుసుల్తో, లేదా మరింకెవరి సంకెళ్ళతోనైనా నీ నేస్తం నిస్తేజ జీవితాన్ని కట్టేయడం నీకయిష్టం. ఫక్తు వకీలు వాసనల నల్లకోటుని కోర్టు ఆవరణ బైట వేసుకోవడం నీ వల్లకాదు. చావు బ్రతుకుల అర్థాల్ని జనరలైజ్ చేయడం. అంగుళం శబ్దమైనా లేని ఆ జంటపదాల ఎనలేని భావాన్ని బౌండు పుస్తకాల మధ్య కుదించడం నీకు కుదిరే పనికాదు. అందుకే, వెర్రిగొంతుక అరువిచ్చి భంగపడిన నువ్వు ఒక అతి

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!

ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం – దారుణమైన

‘సీక్వెల్స్’ రక్షా? శిక్షా?

“ఆ ఆనందం, ఆ అనుభూతి మరో సారి ఆస్వాదించటానికి ..ఇంకా ఇంపార్టెంట్ గా ఇంకొన్ని డబ్బులు కొట్టెయ్యటానికే సీక్వెల్స్ తీస్తూంటా”  ..రామ్ గోపాల్ వర్మ. ఆయన నమ్మి చెప్పారో..నమ్మించటానికి చెప్పారో గానీ … సీక్వెల్స్ అనేవి ఎప్పుడూ  భాక్సాఫీస్ కు హాట్ ఫేవరెట్సే. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన కాన్సెప్టునో, టైటిల్ నో బేస్ చేసుకుని ఈ సీక్వెల్ మన ముందుకు మొహమాటం లేకుండా  దూకుతూంటాయి.  దాంతో ఈ చిత్రాలు  నిర్మాణ సమయంలోనే మంచి పబ్లిసిటీని, క్రేజ్

‘ఫిక్కీ ఫ్రేమ్స్‌ 2010’ లో తెలుగు సినిమా కోసం…

హైదరాబాద్ లోని మారియాట్ హోటల్‌లో ఫిక్కీ ఫ్రేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం  ప్రారంభమై రెండు రోజుల పాటు మీడియా, వినోద రంగాల వ్యాపార సదస్సు జరిగింది. అందులో మన తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌ అనేది సినీ నిర్మాణానికి అవసరమైన ఓ సాధనం మాత్రమే. కథకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. పెట్టుబడిని తిరిగి రాబట్టుకొనేలా చిత్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నారు  ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అలాగే నిర్మాతలు సినిమాలు