Menu

Monthly Archive:: December 2010

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు! ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే!

గుండె భావాల బాలచందర్

సినిమా అంటే  కేవలం ఎంటర్ టైన్‌ మెంట్‌ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో  మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్‌. విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్‌ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని

నాగవల్లి = చంద్రముఖి/2

అయిదు భాషల్లో విజయం సాధించన “చంద్రముఖి” సీక్వెల్ వస్తోందంటే అందరిలోనూ ఎంతో ఉత్సుకత వుండటం సహజం. అందునా గతంలో చంద్రముఖి సినిమాతో సంబంధం వున్న నటీనటుల ఆకస్మిక మరణాలు (విష్ణువర్థన్, సౌందర్య) ఈ సినిమా చేసినా తీసినా ప్రమాదమంటూ (నిజమో అబద్ధమో) ప్రచారం జరగటంతో చాలా మందికి “నాగవల్లి” సినిమా పైన ఆసక్తి పెరిగింది. ఎక్కువైన అంచనాలవల్లనో, పాత కథనే తిప్పి తిప్పి కొత్తదిలా చూపించచే ప్రయత్నం వల్లనో “నాగవల్లి” ఆశించనంత గొప్పగా కనిపించలేదు. అయితే హిట్లు

ఆరెంజ్ నచ్చిందా? నచ్చలేదా?

……అంటే కొంత నచ్చింది, కొంత నచ్చలేదు. ఈ సినిమా గురించి చాలామంది చాలా రాసేసారు. కాబట్టి నేను కథ అదీ మళ్ళీ చర్చించదలచుకోలేదు. నాకు తట్టిన ఒకే ఒక్క విషయం గురించి చర్చించదలుచుకున్నాను. ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిజమైన ప్రేమలో అబద్దాలాడకూడదు అన్న పాయింట్ నాకు నచ్చింది. నిజమే ప్రేమలో నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. కానీ అది ఎలాంటి ప్రేమ అవ్వాలి? ఈ విషయంలో దర్శకుడు భాస్కర్ కి ఉన్నన్ని అపోహలు ఇంకెవ్వరికీ ఉండవేమో! చూడగానే