Menu

అందమైన కల- ఏ మాయ చేసావే

మధ్య కాలం లో  వొచ్చిన “ఏ మాయ చేసావే”  చిత్రం లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాల అందంగా కుదిరింది.

ప్రతి ఫ్రేం చాల క్వాలిటీ గా కనిపిస్తుంది. ఎక్కడ తడబడదు.  ప్రతి షాట్ ని పక్క ప్లాన్ చేసుకుంటే కాని రాదు అలా చిత్రీకరించటం. సినిమాతోగ్రఫి మీద గట్టి పట్టు ఉంటే తప్ప ఆది సాధ్యం కాదు. director, cinematographer టీం ఎంత క్లారిటీ గా ఉంటే అంతా బాగా జరుగుతుంది చిత్రీకరణ . ఉహించిన దృశ్యాని , ఉహించినట్టుగా ఫిలిం  మీద  చిత్రీకరించటం అంత సులువైన విషయం కాదు.

నీళ్ళని తోసుకుంటూ వెళుతున్న పడవలో ఉన్న కెమేరా  టైటిల్స అవగానే మెల్లిగా గాల్లోకి లేచి   గట్టునే ఉన్న చర్చ ని establish చేస్తుంది. నీళ్ళు + చర్చ్  లాంగ్ షాట్ రెండు  సరిగ్గా కనపడేలా exposure నిర్ణయించుకోవటమే ఈ షాట్ గొప్పతనం  దీంతోనే తెలిసిపోతుంది సినిమా అంతా నాణ్యమైన సినిమాటోగ్రఫీ ఉండబోతోందని. తరవాత 24 మమ్ అంత కంటే ఎక్కువ wide angel లెన్స్ తో చూపించే చర్చి, telephoto lens లో చూపించే  హీరో, హీరోయిన్ ల expressions (close ups ) తో మొదలవుతుంది  దృశ్యాల విందు.

ఓ పక్క wide angle లో landscapes,  architecture కనువిందు చేస్తే.. ఇంకో పక్క soft lighting లో, మెరిసే కురులతో   చందమామ లాగా హీరోయిన్ ముఖరావిందపు అందాలు దర్శనమిస్తాయి. ఇది సినిమా మొత్తం కొనసాగించ బడింది.

indoor అంతా సాఫ్ట్ లైట్ వాడితే.. outdoor అంతా దాదాపు సహజ  కాంతి ఉపయోగించి  చిత్రీకరించారు. సినిమాలో  close ups వోచ్చినపుడు..45 , 90 దెగ్రీస్ లో  లైట్ వాడి మిగతా భాగం soft shadow లోకి వెళ్లేట్టు చెసి portrait అందాన్ని  ఇముడింప చేసారు.

ఈ సినిమా గురించి మనోజ్ మాటల్లో

Manoj: Usually, love stories have colorful background, but Gowtham sir asked me to make it more white and wide for this flick, which is something novel. As the heroine’s character in the film is from Christian community, white color was used a lot – for the heroine’s house, the church, etc. – since white is seen to represent Christianity.

సినిమా దాదాపు తెలుపులో ఉండాలని దర్శకుని సూచన.అందుకే సినిమా మొత్తం తెలుపు రంగు dominate చేస్తూ ఉంటుది. కాని ఈ తెలుపుని తెలుపుగా చిత్రీకరించటం అంతా సులువైన పని కాదు. తెలుపుతో పాటు మిగతా రంగులు.. పాత్రల మేని రంగు ని ఒకే సారి పట్టేయటం కష్టం. ఆది ఈ సినిమాలో బాగా చిత్రీకరించాగాలిగాడు మనోజ్ పరమహంస,. తెలుపు రంగు ఎక్కడా burn out కాకుండా.. detail ని retain చేయగలిగాడు. షాట్ లకి lens లని  ఎంచుకున్న విధానం,  కెమేరా movements ని సమర్థవంతంగా నిర్వహించటం, background  నుంచి సబ్జెక్టు  అందంగా కనపడేట్టు  lighting  చేసి నాణ్యమైన దృశ్యాలతో  సినిమా అంతా ఒక అందమైన కల లాగ  చూపించగలిగాడు.సినిమా  చూస్తుంటే  ఓ  పిల్ల తెమ్మెర తాకినట్టు అనిపిస్తూంది.

ప్రస్తుతం గౌతం మీనన్ తో మరో  సినిమా షూటింగ్ జరుగుతోండగా , శంకర్ దర్శకత్వంలో రానున్న  3 Idiots  Tamil remake సినిమాకి పనిచేసే అవకాశం దొరికింది.

మనోజ్ పరమహంస ద్వారా  మరిన్ని దృశ్య కావ్యాలు  రావాలని కోరుకుందాం.

చక్రధర్

30 Comments
 1. విజయవర్ధన్ December 28, 2010 /
  • శంకర్ December 28, 2010 /
  • chakradhar December 29, 2010 /
  • chakradhar December 29, 2010 /
  • chakradhar December 29, 2010 /
 2. అబ్రకదబ్ర December 29, 2010 /
  • శంకర్ December 29, 2010 /
   • కమల్ December 29, 2010 /
   • అబ్రకదబ్ర December 30, 2010 /
   • అబ్రకదబ్ర December 31, 2010 /
   • కమల్ December 31, 2010 /
   • kondaveeti nani March 31, 2011 /
  • chakradhar December 31, 2010 /
 3. విజయవర్ధన్ December 29, 2010 /
   • అబ్రకదబ్ర December 31, 2010 /
 4. sri January 9, 2011 /
 5. sri January 9, 2011 /
 6. MADHU January 30, 2011 /
 7. Eva June 20, 2015 /
 8. musikcineArjun July 30, 2015 /