ఫిల్మ్
కెమెరా లో ముఖ్య బాగాలైన lens, aperture, shutter గురించి స్థూలంగా తెలుసుకున్నాం.
ఇక మిగిలింది film /sensor. నిశ్చయంగా రాబోయేది డిజిటల్ సినిమాయే అయినా ఫిల్మ్ అన్నదే లేకుండా మొత్తం డిజిటల్ అయ్యే పెను మార్పు రావటానికి ఇంకా కొన్ని సంవతరాలు పడుతుంది కనక ఫిల్మ్ గురించి తెలుసుకుందాం.
Gorge Eastman సెల్యులోస్ తో చేసిన రోల్ ఫిలిం ప్రపంచానికి పరిచయం చేసిన తరవాత ఎంతో మంది ఫిలిం రిసెర్చి మరియు అభివృద్ధి దిశగా పని చేసిన తరవాత ఎన్నో మార్పు చేర్పులకి లోనయియింది.ఈ నాడు మనకి ఎన్నో రకాల ఫిలిమ్స్ అందుబాటులో ఉన్నాయి.
FILM – సైజుని బట్టి
ఫిలిం ఫార్మటు లేదా negative సైజుని బట్టి మనకి 8mm, 16mm, 35mm, 65mm ఫిల్మ్స్ ఉన్నాయి. .ads, music videos. documentaries, television, or features etc ఇలా అవసరాన్ని బట్టి ఫిలిం సైజు ని నిర్ణయించుకొని వాడుతుంటారు.మనోరంజక సినిమా విషయం లో అన్నింటిలోకి 35 mm ఫిలిం చాల విశేష మైన ప్రాచుర్యం లోకి వొచ్చింది.
నలుపు తెలుపు మరియు రంగులు
మనకి నలుపు తెలుపు మరియు కలర్ ఫిల్మ్స్ వేరు వేరు గా ఉంటాయని చెప్పనక్కరలేదు.వీటిల్లో మళ్లీ negative ఫిల్మ్స్, positive ఫిల్మ్స్ ( reversal film ) అని రెండురకాలుగా ఉంటాయి.
ప్రతుత డిజిటల్ కాలంలో నలుపు తెలుపు ఫిల్మ్స్ లకి కాలం చెల్లిపోయింది. సినిమాటోగ్రఫీ లో negative నే వాడుతారు. ఎందుకంటే master negative నుంచి మనకు కావలసినన్ని పాజిటివ్ ప్రింట్స్ వేసుకోవొచ్చు. కొన్ని సందర్భాలలో ఏదో కలర్ ఎఫ్ఫెక్ట్స్ కోసం పాజిటివ్ ఫిల్మ్స్ వాడుకోవొచ్చు. కాని ఆది సినిమాకి పెద్దగా ఉపయోగపడదు. ఒకవేళ అలాంటి ఎఫ్ఫెక్ట్స్ అంతగా అవసరం అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ లోసులభంగా చేసుకోవొచ్చు. ఇక ప్రస్తుత డిజిటల్ కాలం లో వేలికోనల మీద రంగులు మార్చుకొనే సౌకర్యం ఉంది కనక ఆ విషయం అనవసరం.
Film speed :
కాంతికి ఫిలిం యొక్క సున్నితత్వాన్ని (Sensitivity) మనం ఫిలిం స్పీడ్ గా వ్యవహరిస్తాం. దీనిని ASA లేదా ISO లలో తెలుపుతారు.
ASA అంటే American Stranded Association .
ISO అంటే International stranded association
ఫిలిం స్పీడ్ ని బట్టి మళ్లీ ఫిల్మ్ ని చాల రకాలుగా విభజించ వచ్చు.
అవి 50 ASA, 100 ASA, 200 ASA, 250 ASA, 500ASA,
ASA/ISO పెరుగుతుంటే సున్నితత్వం ( Sensitivity ) పెరుగుతుంది .
ఉదా: 100ASA > 200ASA > 500ASA
Color balance films
మనము ఎలాంటి కాంతి లో చిత్రీకరణ చేస్తున్నామో అనేదాన్ని బట్టి కూడా మనకి ముఖ్య్నగా రెండు రకాల ఫిల్మ్స్ ఉన్నాయి.
వాటిని కలర్ బాలన్సు ఫిల్మ్స్ అంటారు. మనకి ముఖ్యంగా
1)Day light balance films లేదా Day light films .
2) Tungsten balance films . లేదా Tungsten films
వీటిని film speed తో కలిపి సూచిస్తారు.
ఉదాహరణకి 50D, 200T, 250D, 500T ….etc
అంటే ప్రతి ఫిలిం మీద పూసే రసాయన పూత (emulation) వేరుగా ఉండటం వల్ల అ భినత్వం వొస్తుంది. ప్రతిఫిలం కి ఫిలిం టైపు ని బట్టి నెంబర్ ఉంటుంది . industry లో 200D , 500 T అనకుండా..ఆ నంబెర్ తో పలుకుతుంటారు.
ఉదా :KODAK VISION3 250D Color Negative Film 5207/ 7207 ని 5207 లేదా 07అని అంటుంటారు.
తీయబోయే ప్రదేశాన్ని బట్టి, అక్కడి ఉండే lighting ని బట్టి, సీన్ ని బట్టి, effect ని బట్టి ( నైట్/డే ), సీన్ యొక్క మూడ్ ని బట్టి , అందుబాటులో ఉన్న లైట్స్ ని బట్టి ఇలా చాల విషయాలని పరిగణన లోకి తీసుకొని ఫిల్మ్స్ ని సెలక్ట్ చేసుకుంటాడు సినిమాటోగ్రాఫర్ .
మళ్లీ కలుద్దాం.
రాజశేఖర్ says:
చాలా మంచి విషయాలు తెలియపరిచారు, ధన్యవాదాలు
chakradhar says:
ధన్యవాదాలు : )