సినిమాటోగ్రఫీ – 5

Windflower-05237-nevit

Shutter Angles

ఫిలిం మీద కాంతి పడకుండా అడ్డుగా షట్టర్ ఉంటుందనీ,  ఫిలిం మీద  ఎంత సేపు కాంతి పడాలో అనేది  shutter నిర్నయిస్తుందనీ తెలుసుకున్నాం.

సాదారణంగా  స్టిల్ ఫొటోగ్రఫీలో.. ఫిలిం/ సెన్సర్ కి ముందు ఉండే shutter  ఫిలిం/సెన్సర్  మీద కాంతి పడకుండా అడ్డుగా ఉంటుంది.

మనం ఎంత సేపు కాంతి పడాలని  నిర్ణయిస్తామో  అంత కాలం మాత్రమే  ఆ shutter తెరుచుకొని తరవాత మూసుకొని పోతుంది. (ఈ ధ్వనినే మనం క్లిక్ మనే సౌండ్ గా వింటాం). దీనిని  shutter speed లో తెలుపుతారు.  shutter speed ఎక్కువ ఉంది అంటే తక్కువ సమయం expose అయింది అని అర్థం.

అయితే మాములు కదలికని స్టిల్ ఇమేజ్ లాగా తీయాలంటే 1 /60 అంతకంటే ఎక్కువ shutter వేగం పెట్టాలి. వేగం తగ్గితే  ( 1/30,1/15 అంతకంటే  తక్కువ)   ప్రతిబింబం blur  అవుతూ ఉంటుంది.

ఎక్కువ వేగం తో  తో కదిలే subjects ని స్టిల్ లాగా తీయాలంటే ఎక్కువ shutter speed ఉండాలి.

అలాగే   సినిమాటోగ్రఫీ విషయానికి వొస్తే.. ఒక సెకండులో  24 ఫ్రేములు  తీయాలి కనక.. అర్ధవృత్తాకారంగా ఉండే ఒక బిళ్ళ(D shutter అనికూడా అంటారు) ఫిలిం గేటు  ముందు  తిరుగుతూ shutter లాగ పనిచేస్తుంది. దీనిని rotating  shutter  అంటారు.  ఈ తిరగటం వల్ల ఫిలిం మీద ఒకసారి కాంతి పడటం. ఇంకోసారి ఆగిపోవటం జరుగుతుంది. కాంతి పడి  film expose కాగానే, కొక్కెం expose కాని ఇంకో కొత్త ఫ్రేం ని కిందకు లాగుతుంది.ఈ సమయంలోనే  అర్ధ  వృత్తం బిళ్ళ అడ్డొచ్చి  కాంతి ఆగిపోతుంది.  మళ్లీ అర్థ చంద్రాకారం తెరవబడి కొత్త ఫ్రేము expose  అవుతుంది. క్రింది బొమ్మ ఈ విషయాన్ని సులువుగా  అర్థం చేసుకోడానికి ఉపయోగ పడుతుంది

షట్టర్ కోణము ( shutter angle )

తెరవబడిన అర్ధ  వృత్తం ని షట్టర్ కోణం / shutter angle  అంటారు. ఇది  దాదాపు 180 గా ఉంటుంది . ఆ కోణం తగ్గించుకునే వీలు ఉంటుంది. ఈ షట్టర్ కోణము తగ్గినపుడు కాంతి ఫిలిం మీద పడే సమయం తగ్గుతుంది. ( అంటే shutter speed పెరుగుతుంది). ఆది ఎలాగో ఈ క్రింది సూత్రం  వివరిస్తుంది.

సూత్రం :

exposure time   =  shutter angle / frame rate x 360

ఉదా :  E .T = 180 /24×360 = 1 /48

అంటే exposure time లేదా shutter speed   1 /48 (దాదాపు 1 /50 )

E .T = 90 /24×360 = 1 /96 ( దాదాపు1/100)

అయితే సినిమాటోగ్రఫీ విషయం లో మనకి ప్రతి ఫ్రేంలో కొంత బ్లర్  అవసరం. దీనిని అమౌంట్ అఫ్ blur అంటారు.

షట్టర్ కోణము 180 ఉన్నపుడు ప్రతిబింబం కొంచం ( very little ) blur ఇమేజ్ ని ఏర్పరుస్తుంది. అలా సెకనుకి  24 ఫ్రేములని  చిత్రీకరించి ప్రొజెక్ట్ చేసినపుడు అ blur  ఒకదానితో ఒకటి కలిసి పోయి ఆ కదలిక చాల సహజంగా ఉంటుంది. (amount of blur  సరిగ్గా సరిపోతుంది.)

పై   సూత్రం ప్రకారం షట్టర్ కోణము తగ్గినపుడు shutter speed పెరుగుతుంది. అంటే ఫిలిం  expose కావటానికి తక్కువ సమయం తీసుకుంటుంది . అంటే amount of blur తగ్గుతుంది.

తక్కువ శుట్టేర్ angle లో చిత్రీకరించినపుడు ప్రతిబింబం లో కావలసిన blur  లేక తక్కువ కావటం  వల్ల  projection లో కదలిక సహజంగా ఉండక ఆగి ఆగి ఉన్నట్టు అనిపిస్తూంది. దీనిని stroboscopic effect అంటారు. ( stroboscopic effect http://www.youtube.com/watch?v=LVwmtwZLG88&feature=related

వేగం ఎక్కువగా ఉన్న వస్తువు ని లేదా కెమేరా కదిలే వేగం ఎక్కువగా ఉన్న షాట్ ని చిత్రీకరించేటప్పుడు  ఈ షట్టర్ కోణం ని కొంచం తగ్గించుకొని సరిపడా blur ఉండేట్టు చూసుకుంటారు.

1) సాధారణంగా still photography లో సరియిన exposure కోసం లేదా  ప్రతిబింబాన్ని blur కాకుండా expose చేయటానికి shutter speed  ని ఉపయోగిస్తారు.కొన్నిసార్లు blur తో ఉన్న ఫోటోలు తీయటం creative ఫోటోగ్రఫి.

2) అదే సినిమాటోగ్రఫీలో అయితే  సహజ కదలికకు కావలసిన blur ని సాదించటానికి shutter angle ని  ఉపయోగిస్తారు. కథానుగుణంగా  బ్లర్  తగ్గించి  stroboscopic effect  చిత్రీకరిచంచటం creative cinematography.

ఇంతకుముందు కెమెరాల్లో shutter angle మార్చుకొనే వీలుండేది కాదు.  కాని ప్రస్తుతం వాడుకలో ఉన్న కెమెరాల్లో ఈ సదుపాయం ఉంది.

మళ్ళీ కలుద్దాం.

చక్రధర్

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుసినిమాటోగ్రఫీ – 4సినిమాటోగ్రఫీ – 6

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

చక్రధర్

రచయిత:

డిగ్రీ అయ్యిందనిపించాక..సృజనాత్మకత వైపు మనసు వెళ్ళింది.లలిత కళల్లో, ఫోటోగ్రఫి విభాగంలో డిగ్రీ చేశాను. కొంతకాలం ఫ్రీలాన్సు ఫోటోగ్రఫి చేశాను.తరవాత ..సినిమా వైపు గాలి మళ్ళింది. ఆ తరవాత ..."సినిమా' మొదలయ్యింది.

8 Comments to “సినిమాటోగ్రఫీ – 5”

  • బాగుందండి. Thank you for the informative series.
    మీరు చెప్పిన “amount of blur effect” animation చిత్రాలలో కూడా వుంటుందా? అది ఎలా చేస్తారు?

    • :) :) అమౌంట్ అఫ్ బ్లర్ animation చిత్రాలకీ వర్తిస్తుంది.
      ఇంకెలా చేస్తారు.. software ఉన్నాయిగా.. flash . after effects,Combustion, Apple Motion/Shake, Maya …etc .

  • Thank you, చక్రధర్ గారు.
    Adobe After Effectsలో blur controlకు 720degrees (not just 360degs!) వరకు option వుంది.
    Strobe Effect తీసుకు రావటానికి (పాత newsreel లాంటి look కావాలని) Saving Private Ryan shooting 45degree shutterతో చేసారంట.

    • నాకీ విషయం తెలిదు.. థాంక్ యు

  • Blurఅవసరం కాబట్టి video cameraకు still cameraకన్నా తక్కువ pixels/resolution చాలు. Blur వల్ల బొమ్మ కొంత అస్పష్టంగానే record అవుతుంది. ఐతే frame rate (shooting మరియు ప్రదర్శన fps)పెంచితే amount of blur తగ్గించవచ్చు. అందుకే James Cameron మంచి video quality వుంటుందని అవతార్ ను 48fpsతో తీద్దామనుకున్నాడంట (అంటే థియేటర్లో కూడా 48fpsతో ప్రదర్శించాలి). ఐతే ఖర్చు చాలా అవుతుందని మానుకున్నాడంట.

    • :) బాగానే రిసెర్చి చేస్తున్నారు.

  • చక్రధర్‌గారు మంచి సమాచారమే ఇస్తున్నారు గాని ఒక విషయంలో మీరు మరొక సారి పునరాలోచించి చెప్పండి….

    అయితే సినిమాటోగ్రఫీ విషయం లో మనకి ప్రతి ఫ్రేంలో కొంత బ్లర్ అవసరం. దీనిని అమౌంట్ అఫ్ blur అంటారు.

    షట్టర్ కోణము 180 ఉన్నపుడు ప్రతిబింబం కొంచం ( very little ) blur ఇమేజ్ ని ఏర్పరుస్తుంది. అలా సెకనుకి 24 ఫ్రేములని చిత్రీకరించి ప్రొజెక్ట్ చేసినపుడు అ blur ఒకదానితో ఒకటి కలిసి పోయి ఆ కదలిక చాల సహజంగా ఉంటుంది. (amount of blur సరిగ్గా సరిపోతుంది.)

    పై సూత్రం ప్రకారం షట్టర్ కోణము తగ్గినపుడు shutter speed పెరుగుతుంది. అంటే ఫిలిం expose కావటానికి తక్కువ సమయం తీసుకుంటుంది . అంటే amount of blur తగ్గుతుంది.

    తక్కువ శుట్టేర్ angle లో చిత్రీకరించినపుడు ప్రతిబింబం లో కావలసిన blur లేక తక్కువ కావటం వల్ల projection లో కదలిక సహజంగా ఉండక ఆగి ఆగి ఉన్నట్టు అనిపిస్తూంది. దీనిని stroboscopic effect అంటారు. ( stroboscopic effect http://www.youtube.com/watch?v=LVwmtwZLG88&feature=related

    వేగం ఎక్కువగా ఉన్న వస్తువు ని లేదా కెమేరా కదిలే వేగం ఎక్కువగా ఉన్న షాట్ ని చిత్రీకరించేటప్పుడు ఈ షట్టర్ కోణం ని కొంచం తగ్గించుకొని సరిపడా blur ఉండేట్టు చూసుకుంటారు.

    1) సాధారణంగా still photography లో సరియిన exposure కోసం లేదా ప్రతిబింబాన్ని blur కాకుండా expose చేయటానికి shutter speed ని ఉపయోగిస్తారు.కొన్నిసార్లు blur తో ఉన్న ఫోటోలు తీయటం creative ఫోటోగ్రఫి.

    2) అదే సినిమాటోగ్రఫీలో అయితే సహజ కదలికకు కావలసిన blur ని సాదించటానికి shutter angle ని ఉపయోగిస్తారు. కథానుగుణంగా బ్లర్ తగ్గించి stroboscopic effect చిత్రీకరిచంచటం creative cinematography.

    ఇంతకుముందు కెమెరాల్లో shutter angle మార్చుకొనే వీలుండేది కాదు. కాని ప్రస్తుతం వాడుకలో ఉన్న కెమెరాల్లో ఈ సదుపాయం ఉంది.”

    పైన మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి..చెప్పగలరు..!

    • కొన్ని భావాలను రాసి అర్థం చేయించటం కష్టం, వివరణ రాత పూర్వకంగా ఇవ్వలేము. అయినప్పటికీ.. తెలిసినంతలో క్లుప్తంగా వివరించటం జరిగింది.
      పైన చెప్పిన దానిలో ఎలాంటి తప్పిదాలు లేవు.
      ఒకవేళ మీకు ఏదయినా తప్పిదమో, సందేహలో ఎక్కడ ఉందొ ఆది సూటిగా అడగటం ఉత్తమం. అంతేకాని దాదాపు వ్యాసం అంతా కాపీ చేసి, సరి చూసుకోండి అనటం భావ్యం కాదు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories