Menu

మహిళాదర్శకురాలు అయితే మాత్రం !?

భానుమతీ రామకృష్ణ,జి.వరలక్ష్మి,సావిత్రి,విజయ నిర్మల,మంజులా నాయుడు,జీవితా రాజశేఖర్,డాన్స్ మాస్టర్ సుచిత్ర ల తెలుగు మహిళా దర్శకుల జాబితాలో మరో పేరు చేరనుంది. వారేనందిని రెడ్డి.  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేసిన నందిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘ అలా మొదలైంది’. నాని, నిత్యమీనన్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి కర్బందా, స్నేహా ఉల్లాల్ అతిథి పాత్రలు చేస్తున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నందిన రెడ్డి చెప్పిన కొన్ని విషయాలు నాకైతే కొంచెం విస్మయాన్ని కలిగించాయి. మహిళా దర్శకురాలిగా ఎలాంటి సినిమాలు చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా “Umpteen times people have asked me if I’m gonna make gender specific or offbeat cinema but I repeat I don’t want to be another Mira Nair, my sensibilities are totally commercial. The attitude towards women directors changed when Farah Khan made a success of a mainstream cinema and I’m sure I’ll have my moment too,” అన్నారు. దానికి కొనసాగింపుగా చెబుతూ, “I was never conscious about being a woman and was too absent minded to worry about trivial stuff” అనేశారు. ఆడది అనే స్పృహే లేని మహిళ సినిమా దర్శకత్వం వహించితే ఏమిటి ఘనత మరి!? ఇంకొక విషయం.  ఫరాఖాన్ తో పోలిక సక్సెస్ విషయంలో బాగున్నా, బహుశా నందిని రెడ్డి మర్చిపోయిన అసలు నిజం ఫరాఖాన్ మొట్టమొదటి డ్యాన్స్ డైరెక్టర్ అనేది. నృత్యదర్శకురాలిగా మగ ప్రేక్షకులు కావలసిన హీరోయిన్ల మేని విరుపులు, అందాల విందులు చెయ్యగలిగిన ఫరాఖాన్ అదే అలవాటైన మగదృక్కోణంలో సినిమా తియ్యగలగడంలో ఆశ్చర్యం లేదు. అదే డాన్స్ మాస్టర్ సుచిత్ర తీసిన సినిమా కూ వర్తిస్తుంది. కానీ అదొక క్రైటీరియాగా అనుకుని ముందుకు సాగితే మాత్రం does it really make any difference?

మన తెలుగులో సంఖ్యాపరంగా మహిళా దర్శకులు తక్కువే అన్నది ఒక నిజం. కానీ మహిళలు దర్స్జకులుగా మారితో సినిమాకు-సమాజానికి వచ్చే ఉపయోగం ఏమిటి అనేది మన మూలప్రశ్న కావాలి.ఎందుకంటే, మహిళాదర్శకులు తీసిన చిత్రాల్లో కూడా ఒకటీ అరా పక్కనబెడితే మిగతావన్నీ “మగధృక్కోణం” నుంచీ తీసిన చిత్రాలే. అలాంటి సినిమాలు పురుషుడు తీసినా,మహిళతీసినా పెద్దతేడా ఏముంది?

మహిళా దర్శకురాళ్ళు సినిమాలద్వారా మహిళల్ని ఉద్దరించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక మహిళ రచయిత్రి అయితే తన రచనకు ఒక మహిళాధృక్కోణాన్ని,ఒక భిన్నమైన పార్శ్వాన్నీ అందిస్తుంది.కనీసం అలాంటిది మహిళా దర్శకులు చేస్తే ఒక women perspective సినిమాలకు-సమాజానికీ అందుతుంది అనేది నా పాయింట్.

ఉదాహరణకు రాఘవేంద్రరావు మహిళల అందాల్ని తెరమీద ఆరబోసి మగప్రేక్షకుల ఫ్యాంటసీలను రంజింపజేసాడనుకోండి, ఒక మహిళాదర్శకురాలుకూడా అదే ‘దృష్టి’తో (Gaze:The Gaze in describing the social power relations between women and men — how men gaze at women; how women gaze at themselves; how women gaze at other women; and the effects of these ways of seeing.) హీరోయిన్ ను చూపిస్తే మన visual culture కొచ్చేలాభం ఏమిటి? అనేది నా ప్రశ్న. అది ఇప్పటికే (డాన్స్ మాస్టర్ సుచిత్ర విషయంలో) జరిగింది కూడా. ఒక మహిళ నిర్మించిన ‘ఝుమ్మంది నాదంలో’ హీరోయిన్ అందాల ఆరబోత ఇప్పటీకీ మన జ్ఞాపకాల్లో ఫ్రెష్ గానే ఉంది. అలాంటప్పుడు నిజంగా వచ్చే తేడా ఏమిటి?

మహిళల సమస్యల్ని,అనుభవాల్ని,అభిరుచుల్నీ,అందాల్ని మహిళలు చూసే దృష్టి వేరుంటుంది.మగాళ్ళు చూసే దృష్టి వేరుంటుంది. ఆ రెండూ represent అయితేనే ఒక critical balance సాధ్యమవుతుంది. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని,వాళ్ళతో బంధాల్ని,అనుబంధాల్ని,సంబధాల్ని చూసే దృష్టి వేరుంటుంది. Some how we all are blissfully unaware of such things, due to Patriarchal hegemony. అందుకే If women also make films like men, why do we need women directors? అని ఆలోచించమంటున్నాను.

58 Comments
 1. Balaji Sanala November 24, 2010 /
 2. సుజాత November 24, 2010 /
 3. chakri November 24, 2010 /
 4. shankar Gongati November 24, 2010 /
 5. సుజాత November 24, 2010 /
 6. Nagarjuna G November 24, 2010 /
   • shankar Gongati November 25, 2010 /
   • shankar Gongati November 25, 2010 /
 7. గొ్పీ కిరణ్ November 25, 2010 /
 8. హెర్క్యులెస్ November 25, 2010 /
 9. గొ్పీ కిరణ్ November 25, 2010 /
 10. kalpana November 25, 2010 /
 11. తాడేపల్లి November 25, 2010 /
 12. kalpana November 26, 2010 /
   • kalpana November 26, 2010 /
 13. Murali Raju November 26, 2010 /
 14. chakri November 26, 2010 /
 15. తాడేపల్లి November 26, 2010 /
 16. ఓబుల్ రెడ్డి November 26, 2010 /
 17. లలిత November 27, 2010 /
 18. లలిత November 27, 2010 /
  • లలిత November 28, 2010 /
   • Ravi November 29, 2010 /
  • Ravi November 29, 2010 /
   • Ravi November 29, 2010 /
   • Ravi November 29, 2010 /
   • Ravi November 29, 2010 /
 19. geethoo November 27, 2010 /
   • geethoo November 27, 2010 /
   • geethoo November 28, 2010 /
   • geethoo November 28, 2010 /
 20. chakri November 27, 2010 /
 21. srikanth November 28, 2010 /
  • holyman November 29, 2010 /
   • srikanth November 29, 2010 /
 22. Aruna Katragadda Gali November 29, 2010 /
 23. మహిళ November 30, 2010 /
  • holyman November 30, 2010 /
 24. shankar Gongati November 30, 2010 /
 25. "ORANGE" Ram December 8, 2010 /
 26. holyman December 8, 2010 /
 27. Mauli March 6, 2011 /