Menu

దర్శకత్వంలో పాఠాలు – ‘మధుర’ శ్రీధర్

‘స్నేహగీతం’ అనే సినిమా నుంచి నేను నేర్చుకున్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ మరియు లెసన్స్‌ను చర్చించుకుందాం :

అయితే ఇక్కడ చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే… ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు, సూత్రాలు దాదాపుగా తక్కువ బడ్జెట్‌ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయి.

అనుసరణీయాలు :

 • షూటింగ్‌ మొదలు కావడానికి ముందే బౌండ్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవాలి.
 • మధ్యమధ్య తరచుగా చూసే మార్పులు చేర్పులు చాలా డిజాస్టర్స్‌కు దారిస్తాయనే విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి.
 • డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో వున్న ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్‌ మీద పూర్తి స్పష్టత వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల లొకేషన్‌లో మన పని సులభమవుతుంది.
 • అయితే కథ, కథనాలు బయట వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా వుండాల్సిన అవసరాన్ని డైరెక్షనన డిపార్ట్‌మెంట్‌ సభ్యులంతా గుర్తెరిగేలా చేయాలి.
 • మన ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన 24క్రాప్ట్స్‌కు చెందిన వారందరూ సినిమా విజయం కోసం అంకితభావంతో కృషిచేసేలా వాళ్ళను ఇన్‌స్ఫైర్‌ చేయగలగాలి. వాళ్ళందరితో వీలైనప్పుడల్లా సమావేశం అవుతూ వుండడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
 • సినిమా రూపకల్పన సందర్భంగా జరిగే మంచి, చెడు సంఘటనలు మన మనస్సుపై ప్రభావం చూపకుండా శ్రద్ధ వహించాలి. ఆ మేరకు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఓర్పుగా, నేర్పుగా అధిగమిస్తుండాలి.
 • సినిమా విడుదలకు ముందు తర్వాత మన సినిమాను రకరకాల మాధ్యమాల్లో ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే వుండాలి.
 • టీవి, రేడియో, వెబ్‌సైట్స్‌, మొబైల్స్‌, దినపత్రికలు, వారపత్రికలు, షాపింగ్‌మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, మ్యూజిక్‌ స్టోర్స్‌, సూపర్‌మార్కెట్స్‌ వంటివి ఇందుకు సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
నేర్పుకున్న పాఠాలు:
 1. స్క్రిప్ట్‌ దశలోనే నిర్మాతతో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ (సృజనాత్మక విభేదాలు) అన్నిట్నీ పరిష్కరించేసుకోవాలి. స్క్రిప్ట్‌ను బౌండ్‌ చేయించేనాటికి ఇద్దరి మధ్య సినిమా రూపకల్పనకు సంబంధించి ఎటువంటి విభేదాలు వుండకూడదు. దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తే విబేదాలు సినిమా బడ్జెట్‌పై గణనీయంగా ప్రభావం చూపుతాయి.
 2. ఛాయాగ్రహకుడితో కథ, కథనాలను క్షుణ్ణంగా చర్చించండి. షఉటింగ్‌ ప్రారంభానికి ముందే స్టోరీ బోర్డ్‌ను సిద్ధం చేసుకోవడంతోపాటు షాట్‌ డివిజన్‌ను ప్రిపేర్‌ చేసుకోవడం పూర్తి చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో షాట్‌ డివిజన్‌ను లొకేషన్స్‌లో మార్చుకోవచ్చు. అయితే ఈ విషయమై ముందుగా హౌంవర్క్‌ చేయడం వలన దాదాపు 30శాతం శ్రమ, సమయం మనకు ఆదా అవుతాయి.
 3. మొదలైన దగ్గర్నుంచి ఆరు నెలల్లో సినిమా విడుదలై తీరేలా పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అందుకు అవసరమైన ఆర్థిక వనరులన్నీ పూర్తిగా అమరాక మాత్రమే షఉటింగ్‌ మొదలుపెట్టాలి.
 4. సినిమా అనే దోశను వేడివేడిగా సర్వ్‌ చేసినపుడు మాత్రమే రుచికరంగా వుంటుంది.
 5. ప్రీప్రొడక్షన్‌, ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్‌ అనే నాలుగు దశలూ సినిమా రూపకల్పనకు చాలా కీలకమైనవే. ప్రమోషన్‌ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్‌లో ఇన్‌క్లూడ్‌ చేయాలి. నేను అబ్జర్వ్‌ చేసినదాని ప్రకారం చాలామంది ప్రొడక్షన్‌ వరకే బడ్జెట్‌ వేసుకుంటుంటారు. షూటింగ్‌ పూర్తయ్యేసరికి ఏదో ఒక రూపంలో (ఫర్‌ ఎగ్జాంపుల్‌ శాటిలైట్‌ రైట్స్‌) డబ్బులు వస్తాయని, అవి ఖర్చు పెట్టవచ్చని అంచనా వేస్తుంటారు. ఇది చాలా తప్పు. షూటింగ్‌ పూర్తయ్యాక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయడంలో జరిగే ఆలస్యం ఇటువంటి తప్పుడు అంచనాలవల్లే జరుగుతుంది.
 6. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తవాళ్ళు రూపొందించే సినిమాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. స్వంతంగా విడుదల చేసుకోవడానికి కూడా సిద్ధపడి మాత్రమే రంగంలోకి దిగాలి.
 7. ఇకపోతే విడుదలకు ముందు మీ టీమ్‌ మెంబర్స్‌కు తప్ప ఇతరులెవ్వరికీ పొరపాటున కూడా మీ సినిమాను కానీ, అవుట్‌పుట్‌ను కానీ చూపించకండి.
 8. థియేటర్లలో సామూహికంగా సినిమా చూసే ప్రేక్షకుల స్పందనకు ప్రివ్యూ థియేటర్‌లో ఒంటరిగా కూర్చుని సినిమాను డిసైడ్‌ చేసే పెద్ద మనుషుల లేదా మేథావుల స్పందనకు చాలా వ్యత్యాసం వుంటుంది.
 9. ‘శివ’, ‘గీతాంజలి’, ‘మనీ’ ‘ఆనంద్‌’ వంటి చిత్రాలు ఘన విజయాలు సాధిస్తాయని ప్రివ్యూ థియేటర్లలో ఆ సినిమాను చూసిన మేథావులెవరూ అంచనా వేయలేకపోయారనే విషయం ఇక్కడ గమనార్హం.

‘మధర’శ్రీధర్

14 Comments
 1. raghava November 23, 2010 /
 2. Balaji Sanala November 23, 2010 /
 3. joh November 23, 2010 /
 4. vamsi November 23, 2010 /
 5. aditya November 23, 2010 /
 6. geethoo November 24, 2010 /
   • geethoo November 24, 2010 /
   • geethoo November 25, 2010 /
 7. శశిపాల్ రెడ్డి రాచమల్ల November 24, 2010 /
 8. అబ్రకదబ్ర November 25, 2010 /
 9. Charan November 26, 2010 /
 10. srinivas bollaram December 8, 2010 /
 11. damodara January 5, 2012 /