సినిమాటోగ్రఫీ – 4

IMG_0523

focus – Aperture – Depth of field

1) focusing : లెన్స్ ని  కొంచం ముందుకి వెనక్కి జరపటం ద్వారా ఎంచుకున్న సబ్జెక్టు ని చక్కగా (షార్ప్) గా చూడగలం. దేనినే focusing అంటారు. ఇది ఫోకస్ రింగ్ ఉపయోగించి చేయగలం.

2)ప్రతి లెన్స్ కనీస దూరం నుండి అనంతం వరకు ఫోకస్ చేస్తుంది. ఈ కనీస  దూరాని దీన్ని minimum focusing distance  లేదా  minimum working   distance అంటారు.

3)minimum focusing distance ని దాటి దగ్గరగా ఉన్నవస్తువుని ఫోకస్ చేయలేము. ఇది కన్నుకి కూడా minimum focusing distance ఉంటుంది.

4) minimum focusing distance అనేది focal length ని బట్టి మారుతుంది. తక్కువ ఫోకాల్ length  కి తక్కువగా, ఎక్కువ focal length కి ఎక్కువగా ఉంటుంది.

ఫోకస్ పుల్లెర్: camera & accessories కి  సంభందించిన అన్ని విషయాలకి గాను  సినిమాటోగ్రాఫర్ కి సహాయం చేయటానికి ఫోకస్ పుల్లెర్ ఉంటాడు.సబ్జెక్టు ని ఫోకస్ చేయటానికి, అవసరానికి అనుగుణంగా లెన్స్ లు, filters మారుస్తూ ఆర్టిస్ట్ ల కదలికలకి, కెమేరా movements కి అనుగుణంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.ఇది చాల చాల  కీలకం అయిన  జాబ్. camera కి  సంబందించిన అన్ని విషయాలతో పాటు ఏ లెన్స్ వాడుతున్నాం? aperture ఎంత ? డెప్త్ అఫ్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ? లాంటి విషయాల పై ఖచ్చితమైన అవగాహన ఉండాలి .view finder లో, మానిటర్ లోగాని అతి చిన్నout focus  కనపడదు. అదే ప్రొజెక్ట్  చేసినపుడు తెలిసిపోతుంది. ఏమాత్రం తేడా వొచ్చినా out of focus అయ్యి షాట్ వేస్ట్ అయిపోతుంది.zoom lens వాడుతున్నపుడు జూమ్ తో పాటు ఫోకస్ చేయాల్సిన బాధ్యతకూడా ఫోకస్ పుల్లెర్ దే. అంతకంటే ముఖ్య మైన విషయం..ఏంటంటే.. ఒక షాట్ తీస్తున్నపుడు ఆర్టిస్ట్ ద్వారా షాట్ వేస్ట్ అయితే.. ఎవ్వరు ఏమి అనరు. కాని టెక్నికల్ గా అదీ focusing విషయంలో అయితే తిట్టడం ఖాయం.

Aperture :

aperture అంటే  లెన్స్ opening అనీ,  లెన్స్ మీద aperture రింగ్ ఉంటుందని తెలుసుకున్నాం , ఈ రింగ్ ని తిప్పినపుడు మెటల్ blades  మూసుకోవటం తెరుచుకోడం జరిగి, లెన్స్ యొక్క ఓపెనింగ్ మారుతూ తద్వారా లోపలి వెళ్ళే కాంతి  ఎక్కువ, తక్కువ అవుతూ ఉంటుంది. aperture రింగ్ మీద ఉండే అంకెలు నిర్దారిత ఓపెనింగ్ ని చూపిస్తాయి. ఈ  అంకెలని f stops లేదా focal numbers (f/no) లేదా aperture numbers అని అంటారు. f/no తో సూచిస్తారు.

focal numbers  క్రింది సూత్రం ద్వార రాబట్ట వొచ్చు.

f/no = f/d

where  f= focal length of the lens. d = diameter of the lens. ( ఎంత ఓపెన్ చేస్తామో ఆ diameter )

ఏ లెన్స్ కైనా ఈ నిష్పత్తులు  ఒకేలా ఉండేలా చూస్తారు. కనుక f/no మారవు.

Focal numbers  or  Aperture numbers :

f/1, f/1.2, f/1.4, f/1.8, f/2, f/2.8, f /4, f/5.6, f/8,f/11,f/16,f/22,f/32,f/45, f/64.

( పైవే కాక  f/2.8 కి  f /4 కి మధ్యలో f/3.5 ఉండవచ్చు.)

f /no  పెరిగే కొలది లెన్స్ aperture/ఓపెనింగ్ తక్కువ అవుతూ  లోపలికి  ప్రవేశించే కాంతి తగ్గుతుంది.

f /no తో పాటే Depth of field (DOF) పెరుగుతుంది.

Depth of field (DOF) : ఒక వస్తువుని  ఫోకస్ చేసినపుడు. వస్తువుతో పాటు కొత్త మేరకు వస్తువు  ముందు, వెనక కూడా ఫోకస్ లో ఉంటుంది. దేనినే depth of field అంటారు. అంటే దృశ్యానికి సంభందించి  “z ” axis లో ఎంత మేరకు focusing లో ఉంటుందో అదే  depth of field. సినిమాటోగ్రఫీ/ఫోటోగ్రఫి లో DOF చాల ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Depth of field ని ప్రభావితం చేసే అంశాలు

1) focal length పెరిగితే DOF   తగ్గుతుంది. DOF of wide angle lens > telephoto lens

2 ) aperture /ఓపెనింగ్  పెరిగితే DOF తగ్గుతుంది లేదా f /no పెరుగుతుంటే DOF పెరుగుతుంది.

౩) కెమేరా నుండి సబ్జెక్టు దూరం పెరిగితే DOF పెరుగుతుంది.

DOF ని aperture నిర్ణయిస్తుంది.దృశ్య రసాత్మకతని ఎంచుకున్న aperture ప్రభావితం చేస్తుంది.

ఉదా : background blur , focus shifting

సినిమాటోగ్రఫీ/ photography విషయంలో సబ్జెక్టు ని బట్టి, షాట్ ప్లాన్ ని బట్టి లెన్స్ & aperture ఎన్నుకోబడుతుంది.

ఉదాహరణకి  పాటలో హీరో /హీరోఇనే వెనక ఉండే group dancers అందరూ కనపడాలంటే ముందుగా wide angel lens వాడుతారు. రెండుమూడు వరసల్లో నిల్చున్న అందరూ ఫోకస్ లో ఉండాలంటే..ఎక్కువ DOF ఉండాలి కనక ఎక్కువ f /no పెట్టుకోవాలి.

అదే హీరో/ హీరోయిన్ expression ని క్లోజ్ అప్ లో చూపించినపుడు telephoto lens వాడుతారు. బ్యాక్ గ్రౌండ్ blur చేసి  వాళ్ళని  హైలైట్ చేయటానికి  తక్కువ DOF అవసరం కనక   తక్కువ f/no పెట్టుకుంటారు.

లెన్స్ కి సంబందించి ముఖ్య విషయాలు

1)ప్రతి లెన్స్ కి ఫోకాల్ లెంత్ ని బట్టి  minimum focusing distance , angel of vision , field of vision ఉంటుంది.

2) focal length పెరుగుతున్న కొద్ది.. వస్తు పరిమాణం  పెరుగుతూ.. వస్తు దూరం తగ్గుతూ ఉంటుంది.  అంటే వస్తువు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూంది.

3) focal length తగ్గిన కొద్ది వస్తు పరిమాణం చిన్నదిగా.. వస్తు దూరం పెరిగినట్టు… అంటే వస్తువు దూరంగా  ఉన్నట్టు కనిపిస్తుంది.

4) focal length కి  DOF కి  విలోమ  సంబంధం  ఉంది . focal length పెరిగితే DOF తగ్గుతుంది, focal length తగ్గితే DOF పెరుగుతుంది.

*ఒక సన్నివేశ చిత్రీకరణలో వివిధ రక రకాల లెన్స్ లని వాడుతారు. ప్రతి  షాట్ కి choice of lens మరియు choice of aperture  ఉంటుంది. ఎంచుకున్న ఛాయస్ ని బట్టి  సినిమాటోగ్రఫీ స్టైల్ మారుతుంది.

*ఫలానా షాట్ కి  ఫలానా లెన్స్ నే వాడాలని  ఏమి లేదు కాని సాదారణంగా ఎక్స్ ట్రీమ్ లా౦గ్,  షాట్లా౦గ్ షాట్ తీయటానికి wide angel lens ని, మీడియమ్ షాట్, తీయటానికి నొర్మల్ లెన్స్ వాడుతారు. క్లోజ్ అప్ షాట్, ఎక్స్ ట్రీమ్ క్లోజ్ అప్ షాట్  telephoto lens వాడతారు.

*  ప్రేక్షకులని బ్రమింప చేయటానికి కూడా లెన్స్ ఛాయస్ ఉపయోగ పడుతుంది. ఉదా:  రైలు పట్టాల మీద నడుస్తున్న వ్యక్తీ  ని రైలు చాల దగ్గర వ వొచ్చిడీ కొట్టబోతోంది అని బ్రమింప చేయటానికి  telephoto lens ఉపయోగిస్తారు. తద్వారా దూరంగా ఉన్నరైలు దగ్గరగా ఉన్నట్టు  అనిపిస్తూంది. ప్రేక్షకుడు  టెన్షన్ కి లోనవుతాడు.

*కథాంశాన్ని బట్టి, perspective మారుస్తూ.. కొత్త visual experience ఇవ్వటానికి  సినిమాటోగ్రాఫర్స్  ఇష్టానుగుణంగా  లెన్స్ లని  వాడుతారు.

మళ్లీ కలుద్దాం.

చక్రధర్

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుసినిమాటోగ్రఫీ – 3సినిమాటోగ్రఫీ – 5

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

చక్రధర్

రచయిత:

డిగ్రీ అయ్యిందనిపించాక..సృజనాత్మకత వైపు మనసు వెళ్ళింది.లలిత కళల్లో, ఫోటోగ్రఫి విభాగంలో డిగ్రీ చేశాను. కొంతకాలం ఫ్రీలాన్సు ఫోటోగ్రఫి చేశాను.తరవాత ..సినిమా వైపు గాలి మళ్ళింది. ఆ తరవాత ..."సినిమా' మొదలయ్యింది.

16 Comments to “సినిమాటోగ్రఫీ – 4”

  • awesome brother ! five Cs చదివాను కాని ఇంత క్లియర్ గా అర్ధం కాలేదు నాకు,అద్భుతం గా రాస్తున్నారు ! keep it up !

    • thank you.

    • ఆదిత్య గారు. పైన వివరిస్తున్నది సినిమాటోగ్రఫీ బేసిక్స్, పూర్తిగా టెక్నికల్‍కు సంబందంచినవి. మీరు చెబుతున్న 5′cc పుస్తకం సినిమా దర్శకులకు, సినిమాటోగ్రాఫర్స్‌కి సినిమా తీయడానికి ఉపయోగపడే..1.కెమెరా యాంగిల్స్, 2. కంటిన్యుటీ, ౩.కటింగ్, 4.క్లోజ్‌ అప్స్, 5.కాంపోజిషన్ సంబందించినది కదా..?. చక్రధర్గారు పూర్తిగా కెమెరా టెక్నికల్‌కి సంబందించిన వివరాలు చెబుతున్నారు అనుకుంటున్నాను.

    • 5c of cinematography అనేది సెకండ్ లెవెల్ లో చదవాల్సిన పుస్తకం. basics యే తెలీకుండా ఆది చదివితే ఉపయోగం తక్కువే. ఒకసారి basics అయిపోయిన తరవాత దాన్ని కూడా చర్చిద్దాం.

  • చక్రధర్ గారు..! f/stop కి మోషన్‌కెమెరాకు వున్న ‘T’stop కి వున్న తేడా ఏమిటో చెప్పగలరా..దయచేసి..?

    • F STOP ద్వారా వొచ్చిన మొత్తం కాంతి ఫిలిం తలాన్ని చేరదు. కొంత lens elements సంగ్రహించటం వల్ల తగ్గిపోతుంది. తద్వారా under expose కావటానికి అవకాశం ఉంది. కనక ఫిలిం తలాన్ని చేరే కాంతిని T STOP తో సూచిస్తారు. prime lens లలో ఈ తేడా చాల తక్కువ.. కాని జూమ్ lens లో ఎక్కువ elements ఉండటం వల్ల సంగ్రహణ ఎక్కువగా ఉంటుంది. చాల మంది సినిమాటోగ్రాఫర్లు film latitude అనుసరించి అనుకున్న F STOP కంటే ఒక half STOP ఎక్కువ చేసి expose చేస్తారు. తద్వారా కొంత కాంతి సంగ్రహణ కి గురియినా exposure కి పెద్ద ప్రమాదం ఉండదని వాళ్ళ అబిప్రాయం.

      • f stops కి T stops కి అంత తేడా ఉన్నప్పుడు స్టిల్‌కెమెరాస్‌కి కూడ T stop పెట్టవచ్చు కదా..? మీరు చెప్పిన విషయంలో కొంత నాకు కన్‌ఫ్యూజన్ ఉన్నది. మోషన్‍౬కెమెరాకి మాత్రమే T stop ఉంటుంది. F stop కేవలం స్టిల్ కెమెరాస్ లెన్స్ మీద ఉంటుంది..మరి మీరు సినిమాటోగ్రాఫర్స్ F stop ఆఫ్ స్టాప్ ఓపన్ చేసి శూట్ చేస్తారు అని చెబుతున్నారు..మోషన్‌కెమెరాకి T stop ఉంటుందికదా..? హుఫ్ నాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నది.విచిత్రమేమంటే స్టిల్ కెమెరాస్ కి మోషన్‌కెమెరా లెన్స్ మీద ఒకే రకమైన స్టప్ నంబర్స్ ఉంటాయి లైక్..4, 5.6, 8, 11 ఇలా..

        • అందులో పెద్దగా confuse కావటానికి ఏమి లేదండి కమల్ గారు.
          స్టిల్ ఫొటోగ్రఫీలో TTL ( Through-The-Lens )metering ఉంటుంది. ఆది చూపించేది T – stop అన్నమాటే.
          అందుకే స్టిల్ ఫోటోగ్రఫి లేన్సేస్ కి ప్రత్యేకంగా T stop రింగ్ ఉండదు.
          సినిమా కెమెరాలో TTL metering ఉండదు కనక lens మీద T stops ఉంటాయి. T stops కేవలం final exposure కి మార్గదర్శక అంకెలు మాత్రమే. exposure ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది సినిమాటోగ్రాఫర్ కి అనుభవ పూర్వకంగా వొస్తుంది.

          • TTL metering వేరు. T stop వేరు. ఒకప్పుడు స్టిల్‌ఫోటోగ్రఫీలో ట్విన్‌లెన్స్ కెమెరాస్ 120 ఫార్మాట్‌లో ఉండేవి, అలాగె కపుల్ రేంజ్‌ఫైండర్ కెమెరాస్ ఉండేవి. వాటితో పాటు SLR కెమెరాస్ కి కూడ మీటరింగ్ విదానం కెమెరా లెన్స్‌ద్వారా కాకుండా కెమెరా బాడికి ఉన్న సెన్సార్ ద్వార మీటరింగ్ చూసే విదానముండేది. తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో అసెంబ్లీ లాంగ్వేజి వచ్చాక లెన్స్ ద్వారా TTL మీటరింగ్ విదానమొచ్చింది అంతెగాని వాటిని ‘T’ stop అని పిలవరు.
            T stop అనగా Transmission 0f the light అని అర్థం. ఇది కేవలం మోషన్‌కెమెరాస్‌కి మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఆక్యురేట్.. స్టిల్‌కెమెరా కంటే..! F stop అనగా 0pining of the lens. స్టిల్‌కెమెరాస్‌లో ఈ F stop అంత పర్‌ఫెక్షన్ ఉండదు.

  • “film latitude” అంటే ఏమిటో కూడా వివరించండి.

    • రాబోయే వ్యాసాల్లో అన్నీ వివరించటం జరుగుతుంది. :)

  • @ kamal
    TTL మీటరింగు ని T stops అని పిలుస్తారు అనటం లేదు. మీరు still ఫోటోగ్రఫి lens మీద T stops ఎందుకుండవు? అన్న ప్రశ్నకి TTL మీటరింగు అంటే through the lens మీటర్ కనక దాదాపు T stops లాగానే exposure guide గా ఉపయోగపడుతుంది. . బహుశ అందుకే T stops ఉండవేమో అని చెప్పటం జరిగింది.
    ఇక F stops అయినా T stops అయినా exposure విషయం లో cinematographer ని guide చేయటానికి మాత్రమే.వీటితో పాటు light meters సహాయం తీసుకొని exposure విషయం లో ఒక నిర్ణయానికి వొస్తాడు cinematographer.

    • చక్రధర్‌గారు. మీరిచ్చిన ఈ ” TTL మీటరింగు అంటే through the lens మీటర్ కనక దాదాపు T stops లాగానే exposure guide గా ఉపయోగపడుతుంది. . బహుశ అందుకే T stops ఉండవేమో అని చెప్పటం జరిగింది. ” బదులుకు మరో అనుమానం వచ్చింది నాకు.
      అంటే TTL విదానం ఉన్నప్పుడు T stops అని పిలువకపోవచ్చు అన్న మీ సమాదానాన్ని అనుసరించి చూస్తే మరి ట్విన్‌లెన్స్ కెమెరాస్‍కి, కపుల్‌రేంజ్‌ఫైండర్ కెమెరాస్‌కి.. TTL విధానం లేని కాలపు SLR కెమెరాస్‌కి కూడ అప్పట్లో ‘T’ stop అని పిలవబడలేదు కదా..? F stop అనే పిలుస్తున్నారు అప్పట్లో కూడ..! అప్పటినుండి ఇప్పటిదాక మోషన్‌కెమెరాకు అపెర్చ్యూర్ నిర్ణయించే విదానాన్ని ‘T’ stop అనే పిలుస్తున్నారు. cinematographer ఎక్స్‌పోజర్ గురించి ఎలగైనా నిర్ణయించుకొని..ఆ విషయంలో అతనికి తన టెక్నికల్ థాట్‌కు అనుగుణంగా అనుసరిస్తాడు.. అది వేరే సంగతి. నేను ప్రశ్నించింది..వివరించంది కేవలం ‘F’ stop కి ‘T’ stop కి మద్యనున్న టెక్నికల్ వ్యత్యాసమేమిటి అన్నది మాత్రమే.

      • నాకు తెలిసిన టెక్నికల్ వ్యత్యాసం.
        f stop, lens ఎంత ఓపెన్ అయింది తెలుపుతుంది. దీని ద్వారా depth of filed నిర్ణయంచ బడుతుంది.
        T stop ఫిలిం తలాన్నిచేరిన కాంతిని తెలుపుతుంది. ఇది exposure నిర్ణయించు కోవటానికి ఉపయోగ పడుతుంది.
        f stop,T stop మధ్యన తేడా ఎక్కువ గా ఉండి, T stop ని ఉపయోగించి exposure పెడితే depth of field లో తేడా రావటానికి ఛాన్స్ ఉంది.
        లేదా depth of field కోసం “f stop” నే exposure గా ఎన్నుకుంటే.. underexposure అయ్యే ప్రమాదం ఉంది.

        మరొక విషయం. స్టిల్ ఫోటోగ్రఫి లో exposure కొరకు bracketing విధానం అలవంబిస్తారు. హాఫ్ stop లేదా ఫుల్ stop ఎక్కువ, తక్కువలతో stills తీస్తారు. ఎడిటింగ్ లో తమకి నచ్చిన ఫోటోని ఎంపిక చేసుకుంటారు.(may be correct exposure). సినిమాటోగ్రఫీ విషయం లో ఇలా bracketing చేయటానికి budget సహకరించదు.
        ఇక స్టిల్ ఫోటోగ్రఫి lens మీద T stops ఎందుకు ఉండవు అనే ప్రశ్నకి మీదగ్గర సరియిన సమాధానం ఉంటే పంచు కోగలరు.

        • హమ్మయ్య ఇప్పటికి వచ్చారు నేను అనుకున్న విషయానికి. Transmission of light అన్నది సినిమాటోగ్రఫికి చేందిన సాంకేతిక పదం..అంటె పైన మీరు వివరించిన విదము ” f stop, lens ఎంత ఓపెన్ అయింది తెలుపుతుంది. దీని ద్వారా depth of filed నిర్ణయంచ బడుతుంది.
          T stop ఫిలిం తలాన్నిచేరిన కాంతిని తెలుపుతుంది. ఇది exposure నిర్ణయించు కోవటానికి ఉపయోగ పడుతుంది. ” మీరు చెప్పిన ఈ విషయం వాస్తవము..! మళ్ళీ మీరు డెప్తాఫ్ ఫీల్డ్ జోలికి వెళ్ళకండి అదొక మరో సబ్జెక్ట్ అవుతుంది. ఇక మీరు అడిగిన ” ఇక స్టిల్ ఫోటోగ్రఫి lens మీద T stops ఎందుకు ఉండవు అనే ప్రశ్నకి మీదగ్గర సరియిన సమాధానం ఉంటే పంచు కోగలరు. ” ప్రశ్నకు.. స్టిల్‌ఫోటోగ్రఫీ లెన్స్‌కి కాని లేక మోషన్‌పిక్చర్ కెమెరా లెన్స్ మీదగాని T stop ఎక్కడా రాయరు. రెండు చోట్ల F stop అని మాత్రమే ఉంటుంది. కాని సినిమాటోగ్రఫీలోనే T stop అన్న టెక్నికల్ పదం వాడుకలో ఉన్నది..అనగా మీరు చెప్పినట్లు ఏ సినిమాటోగ్రాఫర్‌కి ఎంత ఎక్స్‌పోజర్ కావాలో దానిననసురించి F stop నిర్ణయించుకుని వాడే పదమే T ( Transmission of Light) stop అంటారు. కాకపోతే స్టిల్‌కెమెరాస్ కన్న మోషన్‌పిక్చర్ కెమెరాలెన్స్ కి వున్న F(T) stop చాలా పర్‌ఫెక్ట్‌గా తయారు చేయబడి ఉంటాయి.

          • మీరు తొలుత అడిగిన ప్రశ్న సూటిగా ఉంటే.. ఇంత discussion అవసరమయ్యేది కాదు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories