కొత్తతరం సినిమాలు

1

గత రెండుమూడు సంవత్సరాలుగా consumer కెమెరాలలో వస్తున్న పెనుమార్పుల మూలంగా ఔత్సాహిక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తమ కలలను నిజం చేసుకోవడానికి కొత్త దారులు తెరుచుకోవడం తెలిసిందే. HD ఆవిర్భావంతో మొదలై HDSLRల రాకతో మరో కొత్త రూపును సంతరించుకుంది ఈతరం ఇండిపెండెంట్ సినిమా. ఒకప్పటి ఫిల్మ్ కెమెరా వాడకపోతే అది సినిమానే కాదనే రోజులుపోయి అంతా డిజిటల్ మయమైపొయింది. రాబోయే panasonic AGAF100, Sony F3 Super 35mm కెమెరాలతో ఈ విప్లవం ఏ రూపు సంతరించుకుంటుందో ఊహించడం కూడా కష్టమే. Canon 7D కెమెరాతో ఓ ఔత్సాహికుడు తీసిన ఈ క్రింది సినిమా చూస్తే ఇండిపెండెంట్ సినిమాలకి హాలివుడ్ సినిమాలకి మధ్య అంతరం అంతరించిపోతుందని మీకే తెలుస్తుంది .
ఇకమీద స్టూడియోలు కూడా కొత్త టెక్నాలజీతో మ్యాజిక్ చేసే కొత్తనీరు కోసం వెదకడం మొదలుపెట్టడం ఖాయం. దానికి సూచనగానే అమెజాన్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ తో కలిసి మొదలుపెట్టిన అమెజాన్ సస్టూడియోస్ . ఈ సైటు గురించి నేను చెప్పేకంటే హోంపేజిలో ఉన్న వీడియో చూసి మీరు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఇది హాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోయినా ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తే మరో పదేళ్ళలోనైనా మన తెలుగులోకూడా ఇలాంటి ప్రయోగాలు మొదలయ్యే అవకాశాలుండొచ్చేమో!

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

శంకర్

రచయిత:

9 Comments to “కొత్తతరం సినిమాలు”

  • చాలా మంచి సమాచారం. ధన్యవాదాలు. నిర్మాతలు దొరకట్లేదు అనుకునేవారికి ఇది మంచి అవకాశం.

    • Amazon Studios పైన John August blog post:
      http://johnaugust.com/archives/2010/on-the-amazon-film-thing

      • నాకు తెలిసినంతవరకూ ఇది వర్కవుట్ కాదనేవాళ్ళంతా స్క్రిప్ట్ ని మళ్ళీ వ్రాయడం అనేది సాధ్యంకాదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నరే కానీ ఇందులో ఉన్న మరో అవకాశం test movie optionని మర్చిపోతున్నారు. నన్ను బాగా ఆకర్షించింది ఈ రెండో విషయమే. అందరూ సినిమా తీయాలనుకునేవాళ్ళే, తీసేయగలం అనుకునేవాళ్ళే కానీ డబ్బులు పెట్టేవాళ్ళకు అంత భరోశా ఎలా ఉంటుంది. అందుకే ఈ test movie అనేది తప్పనిసరి అని నా అభిప్రాయం.

  • ఇలాంటి ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయిలో ఫలించాయి. భవిష్యత్తులో ఫలిస్తాయి.జాతీయస్థాయిలోకూడా ఇప్పటికే ప్రయోగాలు ఎప్పుడో మొదలైపోయాయి. కానీ, తెలుగు సినిమాలో మాత్రం ఈ పోకడ మరోపదేళ్ళకైనా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పరిశ్రమకు ఆ అవసరం లేదు.

  • మహేశ్
    ఎందువల్లో చెబుతారా?

    • నాదీ అదే ప్రశ్న .. ఎందుకు అవశరంలేదో ???

    • @శంకర్ 2: కోట్లు పెట్టి సినిమా తీసేవాడికి డిజిటల్ ఎందుకు? డిజిటల్ లో తీసి ఎక్కడా రిలీజ్ చేసుకోలేనోడికి సినిమా ఎందుకు? ఇది ప్రస్తుత తెలుగు పరిశ్రమ పరిస్థితి. అది మరో పది సంవత్సరాల్లో అస్సలు మారదు. మాహాఅయితే ఫిల్మ్ లో తీసిన సినిమాల్ని అన్ని థియేటర్లలో డిజిటల్లో ప్రదర్శిస్తారు. అంతే!

      స్టార్ (నటుడు/నిర్మాత/దర్శకుడు) సినిమా లేనిదే తెలుగు ప్రేక్షకుడు థియేటర్ కి రాడు. పెద్ద సినిమాల్నే సగం మంది పైరేటెడ్ డివిడి దొరుకుతుందిలే అని రావటం లేదు, ఇక చిన్న సినిమా రేపోమాపో టివిలో వచ్చేస్తుందో లేక “దాన్ని కూడా చూడాలంటావా!” అనే ఆటిట్యూడ్ తో చూడ్డం మానేశారు. ఇక డిజిటల్ సినిమా ఎందుకు చూశారు?

      అయినా డిజిటల్ అనేది టెక్నాలజీ దానితో కంటెంట్ మారదు. విధానం మారదు. పరిస్థితి అస్సలు మారదు. ఐతే ఒకటి మాత్రం జరుగుతుంది, సినిమా తియ్యాలనుకునే ప్రతొక్కడూ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక సినిమా తీసేస్తాడు. ఆ తరువాత వాళ్ళలో 99% మంది వాళ్ళకు సినిమా తియ్యడం రాదని తెలుసుకుంటారు ;)

      • డిజిటల్ ని కూడా డిజిటల్ థియేటర్లలో ప్రదర్శించొచ్చు.. డిజిటల్లో తీసి ఫిల్మ్ లోకి మార్చొచ్చు. డిజిటల్ vs ఫిల్మ్ గురించికాదు నేను చెప్పేది. ఇండిపెండెంట్ గా సినిమాలు తీసి వాటిద్వారా పెద్ద సినిమాల అవకాశాలు పొందాలనుకునేవాళ్లకి కొత్త టెక్నాలజీ, అమెజాన్ స్టూడియో లాంటివి ఎలా పనికొస్తాయోనని చెప్పడం నా ఉద్దేశ్యం. తెలుగు సినిమా మార్కెటింగ్ లాంటి విషయాలు మాట్లాడేందుకు అవశరమైన అనుభవం నాకు అస్సలు లేదు.

        PS: I think you’ve read my post in different context.

  • ఫలించవచ్చు గానీ మన బ్లాగులు ఎలా లిమిటెడో అదీ అంతే అవ్వొచ్చు.

    >>ఇండిపెండెంట్ సినిమాలకి హాలివుడ్ సినిమాలకి మధ్య అంతరం అంతరించిపోతుందని మీకే తెలుస్తుంది
    మన వాళ్ళూ టాలివుడ్ సినిమానందుకునేందుకు ప్రయత్నిస్తారు.

    లో-బడ్జట్ సినిమాలెన్నిటినో -రిలీజ్ అయ్యేయో కూడా తెలీనివి – ఎన్నో తేజ టీవీలోనో ఎందులోనో చూస్తూ ఉంటాను. ఇంత డబ్బు పెట్టి తీశారు గానీ, ఎందుకు ఈ చీప్ ఇమిటేషన్? అదే డబ్బుతో కొత్త పుంత తొక్కి ఏదన్నా ప్రయత్నించ వచ్చు కదా అనుకునే వాడిని.నా ఉద్దేశ్యం ఆ నిర్మాతలూ అంతంత మాత్రమే.మన ఆదర్శవాదులూ వాళ్ళని ఎప్రోచ్ అవ్వరు.ఆ గ్యాప్ అలా కంటీన్యూ ఐపోతూనే ఉంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories