‘రక్తచరిత్ర’ అసలు చరిత్ర

e9iwwl

రక్తచరిత్ర సినిమా నేపథ్యం ఏమిటి?

పగ, ప్రతీకారమే.. పరమ సోపానమా?

అనంతపురంలో ఇప్పుడు రక్తపుటేరులు పారుతున్నాయా?

రక్త చరిత్ర ద్వారా వర్మ కోరుకుంటున్నదేమిటి?

ప్రేక్షకులకు చెప్పదలచుకున్నదేమిటి?

ఫ్యాక్షన్‌ రాజకీయాలను వర్మ తిరగ దోడుతున్నారా?

RaktaCharitra a Lie – నరేష్ నున్నా

22 Comments

22 Comments

 1. RamNV

  October 28, 2010 at 6:04 pm

  అన్న నరెశ్ … సూపర్ గా రాసారు. i will aggree with your article.

 2. K మహేశ్ కుమార్

  October 29, 2010 at 12:08 pm

  వర్మ చాలా కన్వీనియంటుగా ఇది యదార్థంపై ఆధారమైన కల్పితగాథ అని కావలసినన్ని లిబర్టీలు తీసేసుకున్నారు. కాబట్టి ఏది నిజం, ఏది కల్పితం ఏది నిజంలాంటి కల్పితం ఏది కల్పితం లాంటి నిజం అనే ఆలోచనలు సినిమా చూస్తున్నంతసేపూ కలగాపులగం చేసేస్తాయి.

 3. రవి

  October 29, 2010 at 12:50 pm

  సరిగ్గా చెప్పారు.

  ఫాక్షనిజం మూలం స్వప్రయోజనమే తప్ప రక్త చరిత్ర సినిమా చివర్లో చూపించినట్టు ఏదో హోం మినిస్టరై, ఊళ్ళో రౌడీలను ఇంటికి పిలిచి, సంకటి, కోడికూర పెట్టి రౌడీయిజం మానెయ్యమని చెప్పి రాష్ట్రాన్ని ఉద్ధరించే ప్రయత్నం కానే కాదు. మహా అయితే ఫాక్షనిస్టు – ఆ రౌడీలను తన అదుపులో పెట్టుకుని, తన స్వార్థానికి వాడుకుంటాడేమో. అంతే.

  వర్మ చేసింది స్టంటు మాత్రమే. అది కూడా చాలా తెలివయిన, కన్నింగ్ స్టంటు. జనాలకు సీమ ఫ్యాక్షన్ మీద ఉన్న ఉత్సాహం, ఓ విధమైన వర్షిప్, ఫాక్షనిస్టుల క్రౌర్యం పట్ల ఉన్న అంచనాలను – బుక్కారెడ్డి, ప్రతాప్ రవి తదితర పాత్రల ద్వారా గ్లోరిఫై చేశాడు. వర్మ వంటి ruthless director ఇలా పబ్లిసిటీ స్టంట్లు అనుచితమైన కల్పనల వెంటబడ్డం దురదృష్టకరం.

 4. Praveen Sarma

  October 29, 2010 at 3:13 pm

  పరిటాల రవి హోమ్ మినిస్టర్ ఎప్పుడు అయ్యాడు? నాకు తెలిసి అతను కార్మిక శాఖ మంత్రి అయ్యాడు. తెలుగు దేశం నాయకత్వంతో విబేధాలు వచ్చి పదవికి రాజీనామా చేశాడు. పదుల సంఖ్యలో జనం చూస్తుండగా పోలింగ్ ఏజెంట్ పై కాల్పులు జరిపిన చరిత్ర పరిటాల రవికి ఉంది. అతను సినిమాలో హీరో అవ్వడం ఏమిటి? ఫాక్షనిస్టులు హత్యలు చేసేది స్వప్రయోజనాల కోసమే కానీ సమాజం కోసం కాదు. రాయలసీమ ఫాక్షనిజం మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ వాటిలో నిజాలు చూపించడం లేదు. పల్లెటూర్లలో ఫాక్షనిస్టులు దళితులపై దాడులు ఎలా చేస్తున్నారు, బేరైట్స్ & సున్నపురాయి లాంటి ఖనిజాలు స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారు వంటి నిజాలు చూపించరు. ఫాక్షనిస్టులని హీరోలుగా చూపించడానికే సినిమాలు తీస్తున్నారు.

  • కమల్

   October 29, 2010 at 5:04 pm

   ఫాక్షనిస్టులు..దళితులమీద దాడి చేసారా..? ఎక్కడ..? రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు కేవలం దళితుల్ని తమ తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అంటే ” కట్టె, కత్తి,బాంబులు ” పట్టుకొని నడిచేవిదంగా ఆర్థిక విధానంతో లోబర్చుకొని నిమ్నకులాలవారిని తమ వెంట తిప్పుకుంటున్నారు ఫ్యాక్షనిస్టులు, అంతేగాని సర్కారు , కోస్తా జిల్లాలలోగా కులాల ఆధిపత్యం రాయలసీమలో లేదు, అలాగే కులతత్వంతో కులదాడులు లేవు. రాయలసీమలో రెడ్లు ఫ్యాక్షనిస్టులో..లేక మరో కులమో.. రెండువైపుల ఒకే కులపు ప్రత్యర్థులు వుంటారు..కొండకోచు అన్నట్లుగా ఒకటి..రెండుచోట్ల మాత్రమే వేరు వేరు కులాల ఫ్యాక్షనిస్టులు ప్రత్యుర్థులుగా ఉంటారు..అదీ కులవైరంతో వచ్చిన ఫ్యాక్షనిజం కాదు కేవలం ఆధిపత్యంకోసం పోరాటం మాత్రమే. ప్రస్తుత నరేశ్ రాసిన వ్యాసంలో కూడ మూలాలను వెతకలేదు కేవలం ఎవరో చెప్పినవో లేక వార్తాపత్రికలలో చదివినవే లాగే అనిపిస్తున్నది. అసలు ఫ్యాక్షన్ మూలాలు వేరు..వాటిని శోదించే దిశగా ఎవరు ప్రయత్నం చేయలేదు..కేవలం ” హింస ” ను తమ తమ వ్యాపారధోరణికి వాడుకుంటున్నారు..అంతే. అందులో భాగమే రామ్‌గోపాల్‌వర్మ ” రక్తచరిత్ర ” సినిమా.

 5. Praveen Sarma

  October 29, 2010 at 6:32 pm

  కర్నూల్ జిల్లా వేంపెంటలో తొమ్మిది మంది దళితులని ఊచకోసింది ఫాక్షనిస్టులే. ఓ రోజు వేంపెంట గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడిని నక్సలైట్లు కాల్చి చంపారు. CPI(ML)PWG సానుభూతిపరులు అని అనుమానంతో తొమ్మిది మంది దళితులని మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి అనుచరులు హత్య చేశారు. ఆ తరువాత బుడ్డా వెంగళరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారు. రాయలసీమలో బేరైట్స్, సున్నపురాయి లాంటి ఖనిజాలు ఉన్నాయి. వాటిని అక్రమంగా రవాణా చేసి సంపాదించే ఫాక్షనిస్టులు ఉన్నారు. రాయలసీమ ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడం కనుక అక్కడ 5,000 రూపాయలకి, 10,000 రూపాయలకి హత్యలు చేసే కిరాయి హంతకులు దొరుకుతారు. అక్కడ ఫాక్షనిజానికి ఆర్థిక వెనుకబాటుతనం ప్రధాన కారణం. కులం ప్రధాన కారణం కాదు కానీ ఫాక్షనిస్టులు దళితులపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి.

  • కమల్

   October 29, 2010 at 8:27 pm

   బుడ్డవెంగళరెడ్డి కథ వేరు. ఆయన అనుచర వర్గమున్న ప్రాంతం వేంపేటలో కమ్యూనిస్టులు సంఘాలు పెట్టి బుడ్డావెంగళరెడ్డిని, అతని ఆధిపత్యాన్నిసవాల్ చేసారు.కేవలం ఆధిపత్యపోరుకోసం ఒక గర్భణి మహిళను సజీవంగా దహనం చేసి చంపారు బుడ్డామనుషులు అప్పుడే తొమ్మిది మంది ఊచకోత, తర్వాత బుడ్డావంతు. అంతే కాని అది దళితులు, అగ్రవర్ణాల మద్యన పోరు కాదు.ఆ స్థానంలో దళితులున్నా లేక అగ్రవర్ణాలు వున్నా వారిని వదలరు తిరిగి ప్రతికారం తీసుకోవడం వారి ముఖ్యోద్దేశం. రాయలసీమ ప్రాంతంలో ఎవరు దాడి చేసినా తిరిగి ప్రతికార చర్య తీసుకునే మనస్తత్వం ఎక్కువ అక్కడి మనుషులల్లో. నక్సలైట్లు దాడి చేసినా మల్లి తిరిగి దాడి చేసే ప్రతికార పగ వుంటుంది. నక్సలైట్స్ అని భయపడరు. అది సర్వసాదారణం. ఇక కిరాయిహంతకులు ఒక్క రాయలసీమలోనే కాదు వొంగోలు, విజయవాడ, వైజాగ్‌లలో కూడ ఉన్నారు. గుంతకల్ ప్రాంతంలో 100 రూపాయలకు కూడ హత్యలు చేసేవారున్నారు. మీకో విషయం తెలుసో లేదో అలా కిరాయిహత్యలు చేసేవారిలో ఎక్కువగా దళితులె వున్నారు..వారు అలా తయారు కావడానికి ముఖ్యకారాణం ఈ ముఠానాయుకులే. దానికి ఆర్థిక వెనుకబాటుకు సంబందమే లేదు. రాయలసీమ ప్రాంతం భౌగోళికంగానే చాలా తేడాలున్నాయి, సాయిల్ డిఫెసెన్సీ..సంవత్సరానికి ఒక పంటపండడమే గగనం అయినరోజుల్లో విపరీతమైన కరువు. ఇలా చెప్పుకుంటే పోతె చాలా వున్నాయి అందుకే చెబుతున్నది మూలాలను లోతుగా అద్యయనం చేస్తేనె అర్థమవుతాయి అని. అన్ని చోట్ల ఉండే గ్రామకక్షలే ఇక్కడా ఉన్నాయి కాకపోతే తీవ్రత వేరుగా వుంటుంది. మాచర్ల గుంటూరు ప్రాంతాలలోను ఉన్నాయి ఇలాంటి గ్రామకక్షలు. కేవలం గ్రామంలోనే మొదలవుతాయి ఫ్యాక్షన్స్..అంతేగాని టౌన్ ప్రాంతాలలో ఎక్కడా కనపడవు ఫ్యాక్షన్స్. ఇలాంటి విషయాలమీద రాచపాలం చంద్రశేఖర్‌రెడ్డి అని ఒక ప్రొఫెసర్ విసృతమైన పరిశోదనలు చేసారు. అలాగే ” సీమ కక్షల కథలు” నూకా రాంప్రసాద్‌రెడ్డి అని ఒకప్పటి ఆంద్రజ్యోతి తిరుపతి ఎడిషన్ సబ్‌ఎడిటర్ ఒక సంకలనం వేసారు.. అ పుస్తకాన్నే నేను ” రక్త చరిత్ర ” సినిమాకి ముందు అనుకున్నమరో పేరు గల దర్శకులకు ఇచ్చాను. అందులో ఉన్నాయి అసలు సిసలు ఫ్యాక్షన్ కథలు అవి చదవండి అప్పుడు తెలుస్తాయి.అందులో వై.సి.వి.రెడ్డి. కేతు విశ్వనాథరెడ్డి. డా. శాంతినారాయణ. పి.రామకృష్ణారెడ్డి. పులికంటి కృష్ణారెడ్డి. మధురాంతకం రాజారాం. వి.ఆర్. రాసాని. సింగమనేని నారాయణ.. ఇలా చాలా మంది రాసిన రాయలసీమ సజీవ చిత్రాలవి. అలాగే నేను, మరో రచయత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఇద్దరం కలసి కడప. కర్నూల్ జిల్లాలోని చాలా గ్రామాలు తిరిగి కొన్ని పరిశోదనలు చేసాము. వాటిలో నుండి ఒక చిన్న ఉపకథను ఆదారంగ చేసుకొని నా బ్లాగ‌లో సీరియల్ కిందా రాస్తున్నాను. మీకు వీలుంటే చదవండి..
   http://mahavarnam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%B8%E0%B0%BF%20-%20%20%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2

   మీరే కాదు చాలా మంది కేవలం మీడియాలలో చూసినవో లేక వార్తాపత్రిఅకలో చదివినవే ఆదారంగా చేసుకొనో లేక ఎవరన్నవారికి రాయలసీమ ప్రాంతపు మిత్రులు ఉండి వారు చెప్పే తమ ప్రాంతపు ఇలాంటి ఘటనలను కాస్త ఎక్కువగా అతిగాను..కొంచం గొప్పగాను చేసి చెప్పే మాటలు విని అవే నిజమనుకుంటున్నారు. ఒకసారి ఈ విషయాలమీద మరో రచయత, ప్రస్తుత ఒక దినపత్రికకు సబ్‌ఎడిటర్ అయిన పాలగిరి విశ్వప్రసాద్ ఇంటర్‌వ్యూ చూడండి.
   http://poddu.net/?q=p/454

   ఇక ఖనిజాల సంగతి..అలాంటివి ప్రతిప్రాంతంలోనూ ఉన్నాయి..వాటిని బలవంతులైన వ్యక్తులు..రాజకీయనాయుకులు..ముఠానాయకులే దోచుకునేది అంతెగాని వాటిని సామాన్య జనాలు ఉపయోగించుకోలేరు. ఇలాంటివి కేవలం ఒకప్రాంతానికే పరిమితం కావు.

   • Praveen Sarma

    October 29, 2010 at 8:49 pm

    వైజాగ్ లో 5,000 రూపాయలకి లేదా 10,000 రూపాయలకి హత్యలు చేసే కిరాయి హంతకులు లేరు. నేను ఉండేది శ్రీకాకుళంలో. వైజాగ్ గురించి నాకు బాగానే తెలుసు. ఫాక్షన్ సినిమాలలో నిజాలు చూపించకుండా ఫాక్షనిస్టులని హీరోలుగా చూపిస్తున్నారు. మా జిల్లాలో కూడా ఫాక్షన్ గ్రామాలు ఉన్నాయి. రాయలసీమలో బేరైట్స్, సున్నపురాళ్లు ఉంటే మా జిల్లాలో మాంగనీస్, అభ్రకం ఉన్నాయి స్మగ్లింగ్ చెయ్యడానికి. ఇక్కడ కూడా స్మగ్లింగ్ రాజకీయ సపోర్ట్ తోనే జరుగుతుంది. సినిమాలలో నిజాలు చూపించకుండా రొమాంటిక్ వరల్డ్ చూపించడానికి ఫాక్షనిస్టులని హీరోలుగా చూపిస్తున్నారు.

   • praveen

    November 3, 2010 at 12:53 am

    బ్రదర్…పైన కమల్ గారు వ్రాసిన దానికి, మీ కామెంట్ కి ఏమైనా పొంతన ఉందా..మీకు బ్లాగ్లోకం లో ఉన్న పాపులారిటీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది !

 6. mary kumari madiga

  October 29, 2010 at 7:19 pm

  పెదరికములొ ఉన్న ఉన్నత వర్గ్గ్గలవాల్లు ఈప్యక్శనిజము లొకి ఎన్దుకు రావదము లెదు,కులము తక్కువ వల్లనె ఈ ప్యక్క్షన్ హిజము మత్తులొకి,దిమ్పుతున్నరు రయలశీమ దనవన్తులైన ఉన్నత వర్గల దొరల్ల్ల్ ,వల్ల అస్తుల్ల్ని, కుతుబల్ల్ని కాప్పఅదీ ఇన్త్తత్తి కుక్కలుగ దలిత బలహిన వర్హగలను వాఅద్ద్కున్తుకన్నరు.తెలుగు తైపెఅన్ని అక్క్షరలు సరిగ్గ్ రవతము లెదు.

 7. Praveen Sarma

  October 29, 2010 at 9:11 pm

  ఇరవై ఏళ్ల క్రితం ఎప్పుడో ఫాక్షన్ రాజకీయాలకి వ్యతిరేకంగా ఓ సినిమా వచ్చింది. పేరు గుర్తు లేదు. కృష్ణ హీరో. ఆ సినిమా ఎన్ని రోజులు ఆడిందో తెలియదు కానీ ఇప్పుడు రక్త చరిత్ర లాంటి చెత్త సినిమాలకి ప్రొమోలు ఇవ్వడానికి చవకబారు టివి చానెళ్లు ఉన్నాయి.

  • జంపాల చౌదరి

   October 30, 2010 at 3:09 am

   మీరు చెప్పే చిత్రం పేరు భోగిమంటలు అనుకొంటాను.
   కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి అనే రచయిత మానవహోమం అన్న నవల 1979/80లలో చతుర పత్రికలో ప్రచురింపబడింది. ఈ చిత్రం ఆ పుస్తకంపై ఆధారపడిందని గుర్తు. రాయలసీమ ఫాక్షనిజం ఆధారంగా వచ్చిన మొదటిపుస్తకాలలో ఒకటి ఇది.

   • Praveen Sarma

    October 30, 2010 at 6:29 am

    నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఫాక్షన్ సినిమాలు లేవు. ఆ సినిమాలు వచ్చిన తరువాత చూస్తే అందులో వాస్తవాలు కనిపించలేదు. కనీసం పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా స్క్రిప్ట్ లు తయారు చెయ్యకుండా కేవలం సొంత కల్పనలతోనే స్క్రిప్ట్ లు తయారు చేశారు. ఫాక్షన్ సినిమాలు రాయలసీమ ప్రజల మనోభావాలని కించపరుస్తున్నాయని ఓ పత్రికలో చదివాను. రాయలసీమలో మెజారిటీ ప్రజలు ఫాక్షనిజాన్ని సమర్థించడం లేదు. ఫాక్షనిజం గురించి తెలియనివాళ్లు చూస్తే సినిమా హిట్ అయ్యిందని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటారు.

   • కమల్

    October 30, 2010 at 10:23 am

    అవనండి అదే మొట్టమొదటి..కడపప్రాంతపు గ్రామకక్షల మీద వచ్చిన నవల..! మొదట్లో దానిని ప్రచురణకు అంగీకరించలేదు అప్పటి చతుర నవలలను చూసే కోసరాజు, అక్కినేనుకుటంబరావు..కాని కేతువిశ్వనాథ్‌రెడ్డిగారో మరో రచయత చెప్పాకగాని నమ్మలేదు..అప్పటి పరిస్థితులను. మరో విషయం చెప్పమంటారా..!! ఆ ” మారణహోమం ” నవల రచయత కొన్నేళ్ళకు అదే ఫ్యాక్షన్ హత్యకు గురయ్యాడు. అతనొ కమ్యూనిస్ట్ యోధుడు…తర్వాత ఫ్యాక్షన్ రాజకీయలకు బలయ్యాడు.

   • V. Chowdary Jampala

    November 1, 2010 at 4:41 am

    2000/01 ప్రాంతాల్లో విశ్వమోహనరెడ్డి గుంటూరు జిల్లాలో ఎన్‌కౌంటర్లో మరణించాడని గుర్తు. మీరేమో ఫాక్షన్ రాజకీయలంటున్నారు?

    మానవహోమం ప్రచురించిన చతుర ఎడిటర్ – చలసాని ప్రసాదరావు

   • కమల్

    November 3, 2010 at 10:31 am

    సారీ…! నేను తప్పు రాసాను ఆయన గుంటూర్ జిల్లా వినుకొండ సమీపాన ఎన్‌కౌంటర్ అయ్యారు, విశ్వమోహన్‌రెడ్డిగారి స్వస్థలం కడపజిల్లాలోని జమ్మలమడుగు. ఇక చతుర ఎడిటర్ విషయంలో కూడ తప్పు రాసాను. కాని నవల ప్రచురణలో మిగతావారినందరిని సంప్రదించాడని విన్నాను.

 8. వేటూరి..రావణ…చరిత్ర..అన్నింటా ఒకే కోణం…వక్ర మార్గం.

  విమర్శలో వికాసం,సమీక్షలో నిజం,నిజాయితి ఉండాలి…స్వంత అభిప్రాయాలు కాదు.

  దృష్టిని బట్టి దృశ్యం ఉంటుంది…. కళ్లజోడు వాడితే బాగుంటుందేమో…

  • naresh nunna

   October 30, 2010 at 1:03 pm

   Dear Mr. Aditya,

   This is not an answer to your observation, rather a comment. I request you to go through the link:

   http://www.thesundayindian.com/telugu/20101003/
   (Page 34- 39)

   Probably, ur opinion on my writings may be consolidated further. Since I know u r a film- personality, I would appreciate if ur comments on my writings are candid and constructive, instead of passing “విమర్శలో వికాసం,సమీక్షలో నిజం,నిజాయితి ఉండాలి” kind generalised statements.

  • naresh nunna

   October 30, 2010 at 2:47 pm

   By the way mr. Aditya, I could be reached at

   naresh.nunna@thesundayindian.com

 9. Dear Naresh,
  I didn’t pose a question,either!!!it was my response.
  i’ve seen the link…
  to my opinion, criticism for the sake of criticism is a rotten material…..a writer should be a dialectical thinker first.
  Im not a critic.to say it precisely,i don’t want to be critic…i do not waste my time on criticism.
  Language is tool for self-expression…i never misused it.

 10. SRINIVAS

  October 31, 2010 at 7:23 pm

  asalu inthaki nee baadha enti Naresh garu?? Cinema is very nice…meeku Ramagopa varma nachaka pothe mee istam vachinattu comment chestaaraa…??

  Ramgopal varma istam vachinattu cinema teesaadu…meeru istam vachinattu comment chesaaru…anthe gaaa

 11. chakri

  November 3, 2010 at 11:16 am

  వర్మ కి కావలసింది సరిగ్గా ఇదే.
  రక్త చరిత్ర చూసి, దానిగురించి మాట్లాడుకోడం, చర్చించడం, బుర్ర బద్దలు కొట్టుకోడం.
  ఇదంతా విని ( చదివి) సినిమా ఇంకా చూడని వాళ్ళకి సినిమా చుడాలనిపించడం.

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title