Menu

పుచ్చిపోయిన పునాదిరాళ్ళు(చిరంజీవి మొదటి సినిమా)

నూతన,జూన్-జులై,1979

మాయలుమంత్రాలు విఠలాచారి సిన్మాల్లోనేకాదు పునాదిరాళ్లు చిత్రంలో కూడా ఉన్నాయి.

హాష్టల్లో కుర్రాళ్ళు రికార్డులు పెట్టుకుని గంతులేస్తుంటారు.పక్కగదిలో కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్న మనహీరోగారికి వీళ్లవరస నచ్చదు.వెంటనే పక్కగదిలోకి వెళ్ళి”మీ తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకుని డబ్బు పంపిస్తుంటే,ఇలా గెంతులెస్తారా?హన్నా”అని చెయ్యి విరిగేలా జాడిస్తూ కూకలేస్తాడు.దెబ్బకి ఆ కురాళ్లలో జ్ఞానోదయమవుతుంది.

వెంటనే టాపిక్ మారిపోతుంది.”మనదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు,ఆకొమ్మలకి చీడపురుగులు పట్టాయి,మనం వెళ్ళి బాగుచేద్దాం(ఇహ వీళ్ళుపడతారు కామోసు)”అని ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేస్తారు.(గోటు విలేజ్ కాంపయిన్?)

మరొకమంత్రాలమారి సన్నివేశం.వ్యవసాయకూలీలు సమ్మె చేస్తుంటారు.భూస్వాములు పక్క ఊర్నుంచి కూలీల్ని పిలిపిస్తారు.కూలీలకి అండగా నిలబడ్ద మనచేతిజాడింపు హీరోగారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సూటిగా వాళ్లకళ్లలోకి చూస్తూ(మెస్మరిజమా?)మేం సమ్మె చేస్తుంటే మీరొచ్చి మా కడుపుకొడతారా అని అంటాడు.హీరోగారు అన్న ఆఒక్కమాటతో వాళ్లమనసులు మారిపోతాయి.పలుగుపారా కిందపారేసిపోతారు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.హీరోగారు గొప్పమాంత్రికుడు కాదనీ,అన్నిచోట్లా ఆయన పప్పులుడకవనీ చెప్పే సన్నివేశం ఒకటుంది.

ఆఊళ్ళో ఉన్నదొకటే బావి(ట)ఆ ఊరిపెత్తందారు ఆ బావి తనతాతముత్తాతల సొమ్మనీ,ఎవరూ

నీళ్ళు తోడుకోరాదనీ అటకాయిస్తాడు.హీరోగారు మందీమార్బలంతో  వచ్చి(తిరుగుబాటుచేస్తాడా?పెత్తందారు డొక్క చీలుస్తాడా?దయచేసి మిగతా కథ వెండితెరమీద చూడకండి).పెత్తందారు చూపించిన కాయితాలు చూసి,నిజమే,ఇది నీతాత సొమ్మే అని అంగీకరించి,పదండ్రా మరోబావి తవ్వుకుందాం అని వెళ్ళిపోతాడు.

ఈసిన్మా హీరోకీ,సుగ్రీవసైన్యానికీ,నిర్మాతకీ,డైరెక్టరుకీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీమీద చాలా గురి ఉంది.సిన్మామొదట్నుంచీ చివరిదాకా గాంధీ సిద్ధాంతాలు వల్లిస్తూ,గాంధీ బొమ్మను చూపిస్తుంటారు(ఆవార్డు గ్యారంటీ!)అసహజ సన్నివేశాలు,అసందర్భ ప్రేలాపనలు ఈ చిత్రం నిండా కోకొల్లలు.”ఈచిత్రంలో యుగళగీతాల్లేవు,ద్వందార్ధాలపాటల్లేవు(అంతాఒక అర్థమేమరి)క్లబ్ గీతాల్లేవు”అని పత్రికల్లో నిర్మాతలు చేసిన ప్రకటన్ చూసిమోసపోకండి.ఇందులో జయమాలినిపాటా,డాన్సూ రెండూ ఉన్నాయి(షరామామూలే)

-జాటర్ డమాల్

24 Comments
 1. సుజాత October 26, 2010 /
 2. అబ్రకదబ్ర October 26, 2010 /
 3. sasank October 27, 2010 /
 4. Ram October 27, 2010 /
   • sasank October 27, 2010 /
   • అభిమాని October 27, 2010 /
   • అభిమాని October 28, 2010 /
 5. Ram October 27, 2010 /
 6. Sowmya October 28, 2010 /
 7. satya October 29, 2010 /
 8. gopi kiran October 29, 2010 /
 9. Sripal Sama November 2, 2010 /
 10. ramesh r November 2, 2010 /
 11. Nagarjuna November 3, 2010 /
  • Nagarjuna November 3, 2010 /
   • wannolove November 3, 2010 /
 12. chakri November 3, 2010 /
  • chakri November 3, 2010 /
 13. కొత్తపాళీ November 3, 2010 /