Menu

దేవకట్టా ‘ప్రస్థానం’ కి మరో వీరతాడు

“వెన్నెల” చిత్రంతో పరిచయమైన దేవకట్టా తన మలి చిత్రంగా  ‘ప్రస్థానం’ రూపొందించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ అనిపించుకోకపోయినా, విమర్శల ప్రశంసలతో పాటూ మంచి సినిమాని ఆశించే ప్రేక్షకుల నుంచీ మన్ననలు  పొంది మంచి మార్కులే వేయించుకుంది.

ఈ చిత్రం కీర్తి ఇప్పుడు జాతీయస్థాయిలో ఇనుమడించే అవకాశం లభించింది.  ప్రస్థానం చిత్రం తాజాగా  నవంబరు 22  నుంచి గోవాలో మొదలుకానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సావల్లో ప్రదర్శనకు ఎంపికైంది.  ఇండియన్‌ పనోరమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు.  రాజకీయ రంగం నేపథ్యంగా సాగే కథతో ‘ప్రస్థానం’ సినిమా రూపుదిద్దుకొంది. ఈ చిత్రంలో  శర్వానంద్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.అలాగే  ఈ సంవత్సరం పనోరమా విభాగానికి ఎంపికైన తెలుగు చిత్రం ఇదొక్కటే కావటం మరో విశేషం.

దర్శకుడు ఎన్‌.చంద్ర అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ వివిధ భాషల నుంచి 140 చిత్రాలను పరిశీలించింది. 26 చిత్రాల్ని ఎంపిక చేశారు.ఈ సందర్బంగా దేవకట్టాకు నవతరంగం  శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

10 Comments
  1. srikanth October 17, 2010 / Reply
  2. rekha October 17, 2010 / Reply
  3. కొత్తపాళీ October 18, 2010 / Reply
  4. Balaji Sanala October 18, 2010 / Reply
  5. MOHAN RAM PRASAD October 18, 2010 / Reply
  6. శశిపాల్ రెడ్డి రాచమల్ల October 20, 2010 / Reply
  7. $hankar Gangadhari October 20, 2010 / Reply
  8. Sudheer Voonna October 20, 2010 / Reply
  9. Sanjay October 25, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *