Menu

Monthly Archive:: October 2010

పురాణాల మత్తు వదలని ‘బాపు’!

1979, నూతన (సేకరణ) ‘ఆఫ్ బీట్ల భారతంలో ‘పిడకలవేటగా తయారైన మనవూరి పాండవులు ఆఫ్ బీట్ చిత్రాల్ని సైతం ‘అమ్మో అనిపించేలా,ప్రేక్షకుల  చేత పరుగులు తీయించేలా చిత్రించగల్గిన ఏకైక దర్శకుడు బాపు.తానుగీతగీస్తే బొమ్మ,చుక్కవేస్తే బొమ్మ,కుంచె విదిలిస్తే బొమ్మ,అనిపించుకున్న బాపు చిత్రించిన ‘మనవూరి పాండవులు’అనబడే ఒక ఊరిపాందవుల కథ ప్రమాణాల దృష్ట్యా ఆలోచిస్తే కొంత నిరాశను కలిగించినప్పుడు,దర్శకుని సమర్థతను శంకించేదానికన్నా  తెలుగు ఆఫ్ బీట్లకు పట్టిన గ్రహణానికి మనల్నిమనం నిందించుకోకతప్పదు. భారతంలో పిడకల వేట ఇంక కథ…మామూలు సెంటిమెంటును

పుచ్చిపోయిన పునాదిరాళ్ళు(చిరంజీవి మొదటి సినిమా)

నూతన,జూన్-జులై,1979 మాయలుమంత్రాలు విఠలాచారి సిన్మాల్లోనేకాదు పునాదిరాళ్లు చిత్రంలో కూడా ఉన్నాయి. హాష్టల్లో కుర్రాళ్ళు రికార్డులు పెట్టుకుని గంతులేస్తుంటారు.పక్కగదిలో కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్న మనహీరోగారికి వీళ్లవరస నచ్చదు.వెంటనే పక్కగదిలోకి వెళ్ళి”మీ తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకుని డబ్బు పంపిస్తుంటే,ఇలా గెంతులెస్తారా?హన్నా”అని చెయ్యి విరిగేలా జాడిస్తూ కూకలేస్తాడు.దెబ్బకి ఆ కురాళ్లలో జ్ఞానోదయమవుతుంది. వెంటనే టాపిక్ మారిపోతుంది.”మనదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు,ఆకొమ్మలకి చీడపురుగులు పట్టాయి,మనం వెళ్ళి బాగుచేద్దాం(ఇహ వీళ్ళుపడతారు కామోసు)”అని ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేస్తారు.(గోటు విలేజ్ కాంపయిన్?) మరొకమంత్రాలమారి సన్నివేశం.వ్యవసాయకూలీలు సమ్మె చేస్తుంటారు.భూస్వాములు పక్క

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1

మూఢనమ్మకాలపై ఆయన ప్రకటించిన యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? ‘అనుగ్రహం’పై తెలుగు ప్రేక్షకులకు ఆగ్రహమా? మనిషిని నమ్మకం ముందుకు నడిపిస్తుంది.మూఢనమ్మకం    దిగజారుస్తుంది,దడిపిస్తుంది,వణికిస్తుంది. ఇది మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల.ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య ఇది. మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మస్థైర్యాన్ని నశింపచేస్తాయి.వ్యక్తిత్వం కోల్పోతాడు మనిషి.ఆలోచనా శక్తి ఉండదు.పిరికిపందలా,పరాన్నభుక్కులా భయంతో అనుక్షణం గడుపుతుంటాడు. శ్యాం బెనెగల్‘అనుగ్రహం’చిత్రానికి తీసుకున్న,సామాజిక

కులగౌరవ హత్యల నేపధ్యంలో ‘ఆక్రోష్’

“ఇంకా కులమేంటండీ?” అనేవాళ్ళు ఎవరూ వారివారి కులాల్ని దాటి పెళ్ళిచేసుకోరు. ఎంత అభ్యుదయవాదైనా తల్లిదండ్రుల ఇష్టమనో, పెద్దల మాట వినాలనో కుటుంబ గౌరవాన్ని కాపాడేస్తూ కులాన్ని భద్రంగా కొనసాగించేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం. కానీ… కుటుంబగౌరవం కులగౌరవంగా మారితే… అది కాపాడుకోవడానికి మానవహననం జరిగితే… అదప్పుడు భయంకరమైన సామాజిక సమస్య. సాంప్రదాయ ఆధిపత్యానికీ ప్రజాస్వామిక చట్టానికీ మధ్య సమస్య. ఈ సమస్యని అత్యంత సునిశితంగా, అంతే వ్యాపారాత్మకంగా సృజించిన చిత్రం ‘ఆక్రోష్’. ఈమధ్యకాలంలో బీహార్, హర్యాణా,

దేవకట్టా ‘ప్రస్థానం’ కి మరో వీరతాడు

“వెన్నెల” చిత్రంతో పరిచయమైన దేవకట్టా తన మలి చిత్రంగా  ‘ప్రస్థానం’ రూపొందించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ అనిపించుకోకపోయినా, విమర్శల ప్రశంసలతో పాటూ మంచి సినిమాని ఆశించే ప్రేక్షకుల నుంచీ మన్ననలు  పొంది మంచి మార్కులే వేయించుకుంది. ఈ చిత్రం కీర్తి ఇప్పుడు జాతీయస్థాయిలో ఇనుమడించే అవకాశం లభించింది.  ప్రస్థానం చిత్రం తాజాగా  నవంబరు 22  నుంచి గోవాలో మొదలుకానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సావల్లో ప్రదర్శనకు ఎంపికైంది.  ఇండియన్‌ పనోరమా విభాగంలో