Menu

పురాణాల మత్తు వదలని ‘బాపు’!

1979, నూతన (సేకరణ)

‘ఆఫ్ బీట్ల భారతంలో ‘పిడకలవేటగా తయారైన మనవూరి పాండవులు

ఆఫ్ బీట్ చిత్రాల్ని సైతం ‘అమ్మో అనిపించేలా,ప్రేక్షకుల  చేత పరుగులు తీయించేలా చిత్రించగల్గిన ఏకైక దర్శకుడు బాపు.తానుగీతగీస్తే బొమ్మ,చుక్కవేస్తే బొమ్మ,కుంచె విదిలిస్తే బొమ్మ,అనిపించుకున్న బాపు చిత్రించిన ‘మనవూరి పాండవులు’అనబడే ఒక ఊరిపాందవుల కథ ప్రమాణాల దృష్ట్యా ఆలోచిస్తే కొంత నిరాశను కలిగించినప్పుడు,దర్శకుని సమర్థతను శంకించేదానికన్నా  తెలుగు ఆఫ్ బీట్లకు పట్టిన గ్రహణానికి మనల్నిమనం నిందించుకోకతప్పదు.

భారతంలో పిడకల వేట

ఇంక కథ…మామూలు సెంటిమెంటును భారతం ‘సెంటుసీసాలో’ ‘భావన’ చేస్తే-తీరామూత తీసి చూస్తే…?అదే పరిస్థితి!

సరే,ఒక పన్నెండూళ్ళ దొర(దుర్యోధనుడు)గారి హాయాంలో నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ విభిన్న కారణాలతో (ఒక కారణంలోనూ బలం లేకపోయినా)అయిదుగురు యువకులు(పాండవులు)తిరుగుబాటు చేసినప్పుడు ఆదొరగారి చేత  మోసగించబడ్డ స్వయాన తమ్ముడు(శ్రీకృష్ణుడు)ఈ పాండవులకి బాసటగా నిలిచినప్పుడు-దొరగారి చెల్లెలు (కుంతీదేవి) ఊరంతా వెలివేసినా పాండవులైదుగురికీ వండివార్చి పెట్తున్నప్పుడు-వస్త్ర్రాపహరణం,లాక్షా గృహదహనం,ఊరుభంగాలతోపాటు అర్ధంలేని మరో చిత్రీకరణ-మయసభ కూడా ఆయా సందర్భానుసారం ‘మోడర్నైజ్’చెయ్యబడ్డాక చివరికి గీతాబోధతో శ్రీకృష్ణులవారి యుగధర్మాన్నీచాటిచెప్తూ,అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ వెంబడిస్తూనే వుంటుంది అంటున్నప్పుడు నియంతల వెనుక పాండవుల వేట…స్లో మూవ్ మెంట్ లో ‘ఆనందంగా’ చూసి వచ్చేయడం,ఈ చిత్రంలోని ప్రత్యేకత.

– జాటర్ ఢమాల్

21 Comments
  1. అబ్రకదబ్ర October 27, 2010 /
  2. rayraj October 27, 2010 /
  3. alapati ramesh babu October 27, 2010 /
  4. krishnapriya October 27, 2010 /
  5. Rose October 27, 2010 /
    • satmali October 28, 2010 /
  6. విజయవర్ధన్ October 27, 2010 /
      • విజయవర్ధన్ October 28, 2010 /
      • geethoo October 29, 2010 /
      • satya November 5, 2010 /
    • latha November 7, 2010 /
  7. జంపాల చౌదరి October 29, 2010 /
    • V. Chowdary Jampala November 4, 2010 /
      • విజయవర్ధన్ November 4, 2010 /
  8. టి.యస్.కళాధర్ శర్మ October 29, 2010 /
  9. gopi kiran October 29, 2010 /
  10. chakri November 1, 2010 /