Menu

ఐ లవ్ పైరసీ…ఏంచేద్దాం !?!

బృందావనం సినిమా పైరసీ అవుతోందని నిర్మాత దిల్ రాజు మీడియాముఖంగా బాధపడ్డారు. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో “నేను ఆత్మత్యాగం చేసుకునైనా ఈ పైరసీని ఆపేలా చేస్తాను. ఇండస్ట్రీని కాపాడటానికి దేనికైనా రెడీ” అని చెప్పడం కొంచెం బాధాకరంగా అనిపించింది.

కానీ…ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి. ఒరిజినల్ కొనాలంటే జేబు పర్మిట్ అస్సలు చెయ్యదు. సాధారణంగా తెలుగు సినిమాల్ను థియేటర్లో చూసే నేను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బయట ఉండటం వలన మళ్ళీ పైరసీ వలనే చూసే అవకాశం లభించింది. ఇప్పుడు కొన్ని సెలెక్టివ్ సినిమాలు థియేటర్లో చూడటమే తప్ప, తెలుగు సినిమాలు చూసే ఖర్మను తప్పించుకు తిరుగుతుంటాను.  నాకు బెంగాలీ, తమిళ్, మళయాళం, మరాఠీ, కన్నడ వంటి ఇతర ప్రాంతీయభాషాచిత్రాలు చూసే అలవాటు, అవి ఎలాగూ మనకు థియేటర్లో దొరకవు కాబట్టి పైరసీ తప్పలేదు.

పైరసీ చట్టవ్యతిరేకమే. శిక్షార్హమే. కానీ వేరే దారీ!? నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే కొంత గిల్టీగా ఫీలైనా ఐ లవ్ పైరసీ…

“కొంత గిల్టీ” అని ఎందుకంటున్నానంటే, భారతదేశంలోని పైరసీ చట్టం Copyright Act, 1994 కి అనుబంధంగా వచ్చింది. ఇందులో క్లియర్గా;
Infringement of cinematograph films – section 51 read with section 14(d) of the Act
Copyright protection in films extends to
– making a copy of the film;
-taking a photograph of any image forming a apart of the film;
-selling, giving in hire or offering for sale or hire any copy of the film, irrespective of its
earlier sale or hire; and
-communicating the film to the public.

అని ఉందే తప్ప పైరేటడ్ కాపీలు కొనడం (buying) లేదా, కలిగి ఉండటాన్ని (processing) నేరంగా పరిగణించలేదు. పైగా ఇదే చట్టంలో “free use” అనే మరో తిరకాసు ఉంది. “Certain uses of copyrighted works are not considered to infringe upon the rights of the copyright owner and so one does not require permission from the copyright owner. These uses are known as ‘Fair Use’. Such uses are exceptions to copyright that allow limited use of copyright works without the permission of the copyright owner. For example, limited use of works may be possible for research and private study, criticism or review, reporting current events, judicial proceedings, teaching in schools and other educational establishments etc. However ‘Fair Use’ is not a defence in case of infringement of film copyright.” అంటూ కొంత వెసులుబాటు కలిపిస్తుంది. నేను చేసేది చాలావరకూ fair use అని నా నమ్మకం 🙂

ఇక తెలుగు సినిమాల విషయంలో నాకెందుకో  ఆ గిల్టీఫీలింగ్ కొంత తక్కువ. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య పైన చెప్పిన కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఒకసారి సినీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూస్తే. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా “ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి” అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది. అనిపిస్తుంది.

పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. ఒక వార్త ప్రకారం  దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బు అతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….

ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా! ఐ లవ్ పైరసీ !!

30 Comments
 1. NaChaKi October 17, 2010 /
 2. shankar Gongati October 17, 2010 /
  • Sudhakar October 18, 2010 /
 3. sunilbharat October 17, 2010 /
 4. viplove October 17, 2010 /
 5. కొత్తపాళీ October 18, 2010 /
 6. అబ్రకదబ్ర October 18, 2010 /
 7. Indian Minerva October 18, 2010 /
 8. Indian Minerva October 18, 2010 /
 9. శంకర్ October 18, 2010 /
 10. rayraj October 18, 2010 /
 11. shankar Gongati October 18, 2010 /
 12. viplove October 19, 2010 /
 13. shankar Gongati October 19, 2010 /
 14. keshavcharan October 19, 2010 /
 15. viplove October 19, 2010 /
  • rayraj October 20, 2010 /
   • rayraj October 20, 2010 /
   • viplove October 20, 2010 /
 16. shankar Gongati October 19, 2010 /
 17. viplove October 20, 2010 /
 18. Venkat Uppaluri October 20, 2010 /
 19. విజయవర్ధన్ October 20, 2010 /
  • విజయవర్ధన్ October 20, 2010 /
   • విజయవర్ధన్ October 24, 2010 /
 20. chakri October 20, 2010 /
 21. టి.యస్.కళాధర్ శర్మ October 25, 2010 /
 22. మహామాయ October 30, 2010 /
 23. టి.యస్.కళాధర్ శర్మ November 1, 2010 /
 24. టి.యస్.కళాధర్ శర్మ November 1, 2010 /