Menu

నంది అవార్డులు 2009

2009 సంవత్సరానికి నంది అవార్డులను నంది అవార్డుల జ్యూరీ కమిటి గురువారం ప్రకటించింది. ఈ వార్త ని టివి లొ చూస్తున్న నేను అవార్డులు ఎవరిని వరించాయో తెలుసుకోవాలని ఆసక్తి గా న్యూస్ చానల్సు

వెతుకుతూ టీవీ లో స్క్రోల్ అవుతున్న పేర్లు చూసి షాక్ తిన్నాను.
ముఖ్యం గా ఉత్తమ కథానాయకుడు,ఉత్తమ కథానాయిక,ఉత్తమ హాస్య నటుడు,ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ ఫైట్ మాస్టర్,ఉత్తమ సినిమాటోగ్రాఫర్

విభాగాలకు ప్రకటించిన పేర్లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.

మగథీర” లో రాంచరన్,”మహాత్మ” లో శ్రీకాంత్,”కొంచెం ఇష్టం కొంచెం కష్టం”,” ఓయ్” లో సిథార్థ,తొలి చిత్రమైనా “లీడర్” లో చక్కగా నటించిన రానా లను కాదని దాసరి గారికి ఎలా ఇచ్చారో జ్యూరీ సభ్యుల కే తెలియాలి.
నవ రసాలను పండించిన వాళ్ళకే అవార్డులు ఇచ్చామని చెప్పుకున్న సభ్యులకి మేస్త్రి సినిమా లో దాసరి గారు పండించిన నవ రసాలు ఇతర నటుల లో కనిపించక పోవటం ఆశ్చర్యకరం.పోనీ రానా నటన లో పరిణితి లేదు అనుకున్నా మిగతా ముగ్గురి లో ఒకరిని తప్పకుండా అవార్డు వరించాల్సిందే.

అలాగే ఉత్తమ కథానాయిక విషయం లో కూడా జరిగింది.తీర్థ సొంత ఊరు లో చక్కని నటన కనబర్చి ఉండొచ్చు కానీ డైలాగ్సు చెప్పేటప్పుడు డబ్బింగ్ తో లిప్ సింక్ అవ్వదు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం,అదుర్సు,నమో వెంకటేశ చిత్రాల్లో అద్బుతమైన హాస్యం పండించిన బ్రహ్మానందం ని కాదని వెన్నెల కిషోర్ కి ఇవ్వడం భాధాకరమే.ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ ఫైట్ మాస్టర్,ఉత్తమ సినిమాటోగ్రాఫర్ లాంటి విభాగాలకు కూడా అన్యాయమే జరిగింది.

అసలు అవార్డుల కమిటీ కి ఒక నిబధ్ధత అనేది లేదు.ఒక సంవత్సరం డబ్బింగ్ చెప్పించుకున్న హీరో లేదా హీరోయిన్ కి అవార్డు ఇస్తారు,మరో సంవత్సరం ఇవ్వరు.

విజయ శాంతి,సుహాసిని,మీనా,ఆమని,ఊహ,కళ్యాణి,భూమిక,కమలిని,త్రిష,ఛార్మి,తీర్థ వరకు అందరు డబ్బింగ్ చెప్పించుకున్న వాళ్ళే.1995 లో పాపం ఇంద్రజ “సొగసు చూడ తరమా” చిత్రం లొ అత్యద్భుతమైన నటన కనబర్చినప్పటికీ ఆ సంవత్సరం కమిటి నిబంధనల ప్రకారం డబ్బింగ్ చెప్పించుకోవటం వలన అవార్డు కి దూరం అయ్యింది.అదే సంవత్సరం “శుభసంకల్పం” చిత్రం లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం తో ఆమని ని ఉత్తమ నటి అవార్డు వరించింది. అలాగే 1993 లో “బావ బావమరిది”చిత్రానికి గాను సుమన్ కి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అది రీమేక్ సినిమా. ఆ సంవత్సరం తప్ప మరే సంవత్సరం ఒక రీమేక్ సినిమాకి అవార్డు రాలేదు.అప్పట్లో ఈ విషయం లో కూడా విమర్శలు వచ్చాయి.

హీరో ల విషయానికి వస్తే 1992 వరకు మాత్రమే న్యాయం గా అవార్డులు దక్కాయి.ఆ తర్వాత 1997 నాగర్జున అన్నమయ్య, 2004 రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు,2006 లో నగార్జున “శ్రీరామదాసు” కి న్యాయం జరిగింది.1995 లో” శుభసంకల్పం” కమల్ ని కాదని వెంకటెష్ “ధర్మచక్రం” కి ఇచ్చారు.2002 లో “ఇంద్ర”,”సంతోషం” చిత్రాల్లో నటనకు గాను చిరంజీవి,నాగార్జున లకు సంయుక్తం గా అవార్డులు ప్రకటించి అందరినీ మరో మారు ఆశ్చర్య పరిచారు జ్యూరీ సభ్యులు.

హీరోయిన్ల విషయం లో కూడా1996 సౌందర్య “పవిత్ర బంధం” వరకు బాగానే ఇచ్చారు.2001 లో లయ “ప్రేమించు”,2003 లో భూమిక “మిస్సమ్మ”,2005 లో కమలిని “ఆనంద్” కి మాత్రం పరవాలేదనిపించారు.

జ్యూరీ సభ్యులు తమకు నచ్చిన వాటికి మాత్రమే ఇస్తాం,ప్రజల అభిప్రయాల తో మాకు పని లేదు అని ముందే చెప్పేస్తే సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా ఈ నంది అవార్డు ల గురించి ఆలోచించడం మానేసి తన పని తాను చేసుకుంటాడు.అప్పుడిక అవార్డుల గురించి విమర్శలు,చర్చలు ఉండవు.జ్యూరీ సభ్యులు 14 మందో,16 మందో తమకు నచ్చిన వాటికి అవార్డులు ఇచ్చుకోవచ్చు.

ఆఖరికి అవార్డులు, సినిమా ల గురించి తెలియని చిన్న పిల్లాడు కూడా 2009 నంది అవార్డులు చూసి నవ్వుకుంటున్నాడు.

ఇక ముందు ఇచ్చే అవార్డులైనా పారదర్శకం గా ఉంటాయని,ఏ వత్తిడులకు,ప్రలోభాలకు లొంగకుండా ప్రతిభ ను మాత్రమే ప్రోత్సహిస్తారని ఆశిద్దాం.

అదే ఆశ తో,నమ్మకం తో 2010 నంది అవార్డుల కోసం ఎదురు చూద్దాం.

మీ విహారి.

9 Comments
  1. Siva Cheruvu October 9, 2010 /
  2. j.surya prakash October 9, 2010 /
  3. yogendra October 9, 2010 /
  4. Teja October 10, 2010 /
  5. harilorvenz October 13, 2010 /
  6. tfi October 15, 2010 /
  7. ramnarsimha October 18, 2010 /
  8. Sripal Sama October 18, 2010 /