Menu

తెలుగు సినిమాను కాపాడేది రెంట్ విధానమా పర్సంటేజి విధానమా?

ఒక చిన్న కేస్ స్టడీ
థియేటర్ రెంట్ విధానం:
‘ప్రస్థానం’ చిత్రం మొదటి వారం కలెక్షను హైదరాబాద్ లోని ఒక థియేటర్లో మూడు లక్షల (Rs 3,00,000).
ప్రభుత్వానికి వెళ్ళవలసిన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 7% తీసేస్తే మిగిలేది రెండు లక్షలా డెబ్బై ఐదు వేలు (Rs 2,75,000).
థియేటర్ రెంటు వారానికి రెండు లక్షలా యాభైవేలు (Rs 2,50,000).
నిర్మాతకు వచ్చింది పాతికవేలు (Rs 25,000)

పర్సంటేజి విధానం:
యాభైశాతం (50%) థియేటర్ నిండితే నిర్మాత – థియేటర్ యజమాని 50% – 50% కలెక్షన్లు పంచుకోవాలి.
ఒకవేళ థియేటర్ కేవలం ముప్పై శాతం (30%) నిండితే నిర్మాతకు 40% థియేటర్ యజమానికి 60% పర్సంటేజి వస్తుంది.
థియేటర్ కేవలం ఐదుశాతం (5%) నిండినా, అందులో నిర్మాతకు 25%, థియేటర్ యాజమాన్యానికి 75% చెందుతుంది.

ఈ లెక్కన ప్రస్థానం సినిమా ఆక్యుపెన్సీ యాభైశాతం ఉందనుకునుంటే వచ్చిన కలెక్షన్లో యాబైశాతం, అనగా ఒక లక్షా యాభైవేలు నిర్మాతకు రావాలి.
ఒకవేళ కేవలం ఐదుశాతం మాత్రమే నిండారనుకున్నా వచ్చిన కలెక్షన్లలోంచీ, పాతిక శాతం అంటే, అథమం డెబ్బై ఐదు వేలు వచ్చుండాలి.
కానీ నిజానికి వచ్చిందెంత…?
రెండులక్షలా యాభైవేలు ఎదురుడబ్బులిచ్చి థియేటర్ అద్దెకు తీసుకుంటే ఆ బొక్క పోను తిరిగొచ్చింది పాతికవేలు.

డబ్బులు పెట్టి సినిమా తీసింది నిర్మాత. డబ్బులు పెట్టి థియేటర్ రెంటుకు తీసుకునేది నిర్మాత.
వాడికి మిగిలేది మాత్రం పచ్చడి మెతుకులు. థియేటర్లు అద్దెకు తిప్పుతున్నవారికి మాత్రం పరమాన్నం.
సినిమాలు బాగుంటాయా లేదా అనే చర్చను పక్కనబెడితే…
ఇలాంటి విధానాలు ఉన్నంతవరకూ ఏ నిర్మాతైనా రిస్కు తీసుకుని ఒక మంచి సినిమా నిర్మిస్తాడా లేదా అనేది మాత్రం పెద్ద డౌటు.
ఈ పరిస్థితి ఎందుకుంది? మార్పు ఎక్కడ రావాలి?

23 Comments
  1. peeyesn September 28, 2010 /
  2. aditya September 28, 2010 /
  3. కమల్ September 28, 2010 /
  4. Sharath Chandra September 28, 2010 /
  5. shankar Gongati September 28, 2010 /
  6. rayraj September 28, 2010 /
    • కమల్ September 28, 2010 /
      • rayraj September 28, 2010 /
      • geethoo September 30, 2010 /
      • geethoo October 1, 2010 /
      • Vinay Talluri October 6, 2010 /
  7. Sree September 29, 2010 /
  8. wb September 30, 2010 /
    • విజయవర్ధన్ September 30, 2010 /
  9. Rangan September 30, 2010 /
  10. Sharath Chandra October 5, 2010 /
  11. Dinesh Potluri October 17, 2010 /
  12. ramesh September 25, 2011 /