ఓ సినిమా చూసి బాగుంది/బాగలేదు అని విమర్శించడానికి ఙ్ఞానం(knowledge)తో పని లేదు ఓ మాత్రం ఇంగిత ఙ్ఞానం(common sense) చాలు…కానీ కథలు రాయడానికి మెదడు,మనసు రెండూ ఉపయోగించాలి…..మనసు భావోద్వేగాలకి కేంద్రం ఐతే ,మెదడు విషయాలను తర్కిస్తుంది.సినిమా చూసే ప్రేక్షకుల మానసిక అవసరాలను(emotional need), జిఙ్ఞాసని (intellectual need) తీర్చాల్సిన భాధ్యత రచయితదే.
మనిషి తనని తాను పరిశీలించుకునేలా చేసేదే కథ…..కథ విన్నంత మాత్రానే లేదా చూసినంత మాత్రానే మనిషిని ఒదిలిపోకూడదు..వెంటాడాలి..వేధించాలి..తన(కథ) గురించి ఓ మనిషి అలోచించేలా చేయాలి….ఈ అలోచనే మనిషి తనని తాను తెలుసుకొనేలా చేస్తుంది….అందరూ మారకపోవచ్చు….కానీ ఒక్క విత్తనం చాలు ఎన్నో వనాలు తయారవడానికి.సినిమాల్లో మనం చూసేది కథనం.
కథనం చూడటం వల్ల కథ మనకి గుర్తుండిపోతుంది.దానిలో రచయితకి ప్రేరణ కలిగించిన మూలం మనల్ని అలోచింపజేస్తుంది.
మరి ఇలాంటి కథనాలు ఎలా తయారవుతాయి?వీటికి మూలం ఏమిటి?
ఓ చిన్నవిత్తనం విత్తగానే అది మొలకెత్తి పెద్ద వృక్షం అవుతుంది…కానీ ప్రకృతి శ్రమ ఎవరు గుర్తిస్తారు??
దానిలోపల ఎన్నో చర్యలు,ప్రతిచర్యలు..ఆటుపోట్లు…యుద్ధాలు,స్వీయ రక్షణ,స్వయం పోషక చర్యలు వీటన్నిటినీ ఎవరు గమనిస్తారు??రచయిత శ్రమ కూడా ఇంతే……
ప్రకృతి మొత్తం ద్వంద్వాలతో నిండి వుం
టుంది.ఒక వైపు ఈ ప్రకృతి జీవి పెరగడానికి ప్రోత్సహిస్తూనే,మరో వైపు దాన్ని చావగొట్టే సన్నహాలు చేస్తూ వుంటుంది……ఈ ద్వంద్వ ప్రకృతే మనిషి మనుగడకు ఆలంబన….మంచి-చెడు,చీకటి-వెలుగు,న్యాయం-అన్యాయం,నీతి-అవినీతి,కష్టం-సుఖం అన్నీ ద్వంద్వాలే. ఓ క్షణం ఆదమరిస్తే రెండో వైపు లాగబడతాం……ఆకర్షణ/వికర్షణ ప్రకృతికున్న సహజ గుణాలు…మంచి నుండి వికర్షణ, చెడువైపు ఆకర్షణ…ఇలా ఆదమరిచిపోకుండా మంచిని తెలుసుకోవాలంటే మార్గదర్శి కావాలి..
ఇలాంటి ప్రపంచంలో మనకి దారి చూపించేది ఈ కథలు..దాన్ని నడిపే కథానాయకులే…
నీ మాటల్ని జనాలు మర్చిపోతారు
నీ చేతల్నీ జనాలు మర్చిపోతారు
కానీ
నువ్వెలాంటి అనుభూతిని కలిగించావనేది మత్ర్రం ఎప్పటికి గుర్తుంచుకుంటారు. _ మాయా ఆంగ్లౌ.
…………………అందుకే ప్రేక్షకులు సినిమాని అంతగా ప్రేమిస్తారు.
ప్రతి మనిషికి కోరికలుంటాయి..వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తాడు…ప్రయత్నానికి అటంకం ఏర్పడినప్పుడు…సంఘర్షణ మెదలవుతుంది..దానిలోంచి బయటపడటానికి తన శక్తులన్నీ ఉపయోగిస్తాడు….ఫలితంలేనప్పుడు….తన పరిధి చిన్నదని గ్రహిస్తాడు…అప్పుడు ఇలాంటి సమస్యలు అధిగమించిన నాయకుడ్ని అన్వేషిస్తాడు….అతన్ని తన మార్గదర్శిగా భావించి అతన్ని అనుసరించడం ప్రారంభిస్తాడు…..నాయకుడి మార్గం సవ్యమైనది కావటం వల్ల సత్యాన్ని ఆ మార్గం ద్వారా దర్శించివున్నాడు గనుక అతన్ని అనుసరించేవారు కూడా ఆ సత్యాన్ని దర్శించే అవకాశం ఉంది…సత్యమార్గం మనకి సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది…భవిష్యత్ పై భధ్రతని,వర్తమానంలో ఉత్సాహాన్ని ఇస్తుంది…సందేహాలెదురైనప్పుడు పక్కన మార్గదర్శి ఉండనే ఉన్నాడు….ఇక గమ్యం చేరడమే మిగిలివుంది…ఇది నిరంతర ప్రయత్నం,కఠోర సాధనతో సాధ్యమవుతుంది. సమస్య పై విజయం సాధించగానే మార్గదర్శి పై అభిమానం పెరుగుతుంది.ఋణపడి ఉన్నాననే భావన కలుగుతుంది……తనలాగే సమస్యల్లో వున్న ఇతరులకి సహాయం అందించటం ద్వారా మార్గదర్శి ఋణం తీర్చుకుంటాడు.
ఇది రామాయణ, మహాభారత కాలాల నుండీ జరుగుతున్నదే……యధార్ధ గాధలు కావచ్చు లేదా కల్పిత కథలు కావచ్చు.. రచయితలు ఈ సత్యాల్ని ముందుగా దర్శించి లేదా ఊహించి కథలుగా రాసి వ్యాప్తి చేస్తారు……..కథల వల్ల లబ్ధి పొందిన మానవులు కథానాయకుడ్ని ఙ్ఞప్తికి తెచ్చుకున్నంతగా కథా రచయితని గుర్తుంచుకోరు…….దీనికి రాముడు,కృష్ణుడే ఉదాహరణ… అంత మాత్రం చేత రచయిత తన ప్రయత్నాన్ని విరమించడు….రచయిత భాధ్యతని ఎరిగి ప్రవర్తించాల్సిన ఉన్నతమైన మానవుడు…పేరు తనకి వచ్చిందా తన బిడ్డకి వచ్చిందా అని పక్షపాతంగా అలోచించని ధన్య జీవి.
ఏదో అలోచన లేదా ఊహ మనసుని కుదురుగా ఉండనివ్వదు..దాని గురించి ఏదో చెప్పాలనే తపనే దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేలా చేస్తుంది.సమాచారంతో సంతృప్తి చెందిన మేధ, మనసుకి పని కల్పిస్తుంది…భావోద్వేగాలని రెచ్చగొట్టమంటుంది..అర్ధం పర్ధం లేకుండా భావోద్వేగాల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటని బుద్ధి ప్రశ్నిస్తుంది.మనదగ్గరున్న సమాచారానికీ,మనం కల్పించిన లేదా సృష్టించిన భావోద్వేగాలకీ సమన్వయం కల్పిస్తూ వీటికి ఓ అర్ధాన్ని వెతికే ప్రయత్నంలో రచయిత మానవ జీవితానికి సంబంధించిన ఓ సత్యాన్ని కనుగొంటాడు…దాంతో కథ పూర్తవుతుంది.ఇప్పుడు అర్ధవంతమైన కథనానికి తెర లేస్తుంది.
కథనం అంటే?? కథని చెప్పటమే కథనం…(ఇంతకు మించి నిర్వచనం అనవసరం…దృశ్యాన్ని ఉపయోగించు లేదా పదాల్ని ప్రయోగించు,చెప్పేది కథే కద)కథని నోటికి వచ్చినట్టు చెప్పటం కాకుండా ఓ ప్రణాళిక ప్రకారం చెప్పాలి…..కథ మొత్తాన్ని మూడంకాల్లో(Three Acts) చెప్పడం పూర్తి చెయ్యాలి.మూడే ఎందుకు??కథ అంటే ఒక సమస్య కాబట్టి, ఏ సమస్యకైనా సమస్య ఏర్పడటం,కొనసాగటం,పరిష్కారం అనే మూడు దశలుంటాయి కాబట్టి. అంతే కాకుండా ఒక మనిషి పరిణామక్రమాన్ని చూస్తే మూడుకున్న విలువ అర్ధం అవుతుంది… పుట్టుక పరిణామం మరణం…ప్రకృతిని చూడండి సృష్టి స్థితి లయలనే (ప్రారంభం మధ్యమం ముగింపు) మూడు అంచల్లో తన పనిని పూర్తి చేస్తుంది.రచయిత కూడా తన కథని ఇలా మూడంకాల్లో ముగించాలి.
![]()
![]()
ఇది కథనాన్ని చెప్పే భూమిక……
1.పరిచయం : కథ ఆవరణ పరిచయం,కథానాయకుడి పరిచయం,లంగరు(Hook),ఇతర పాత్రల పరిచయం,పాత్రల మధ్య సంబంధాలు,
ప్రధాన కథకి దారి తీసే పరిస్థితుల పరిచయం.
ఉదా : జురాసిక్ పార్క్ సినిమాలో పాత్రలు పార్క్ లోకి ప్రయాణాన్ని మొదలుపెట్టడం వరకు.
2.పరిణామం : అసలు కథ అంటే, అసలైన సమస్య ఇక్కడ ఏర్పడి ఇక తప్పించుకోవటానికి వీలుకాని విపత్కర పరిస్థితి వరకు.
ఉదా: ప్రయాణం నుంచి చివరకు రాకాసి బల్లులు వాళ్లని చుట్టుముట్టడం వరకు.
3.పరిష్కారం : విపత్కర పరిస్థితి నుండి చాకచక్యంగా బయటపడటంతో సమస్యకి పరిష్కారం లభిస్తుంది,సమస్యతో ఉక్కిరిబిక్కిరి ఐన పాత్రలకి పరిష్కారంతో ఊరట లభిస్తుంది.
ఉదాః ప్రమాదం నుండి తప్పించుకుని పార్క్ నుండి బయటపడటం వరకు.
* ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం మూడంకాల నిర్మాణం(three act structure) గురించి చెప్పటం కాదు.
ఇది స్థూలంగా, కథని చెప్పటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న పద్ధతి.ఒక చెట్టుకి వేర్లు,కాండము,కొమ్మలకి ఆకులు ఉండే రీతిలోనే దీని నిర్మాణం ఉంటుంది..పైన బొమ్మలో చెట్టుని ఉదాహరణగా చూపించటం జరిగింది.చెట్టు వేర్లు భూమిలోపల పొరలో ఉన్నట్టే కథకి సంబంధించిన కీలకమైన సమస్య ఏర్పడటానికి కారణమయ్యే అంశాలు చాలా లోతుల్లో ఉంటాయి…..విత్తు విత్తడం,దాని పోషణ మాత్రమే చూసేవారికి తెలియాలి,అంటే సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణం పాత్రల పరిచయం ఇతరత్రా విషయాలు అర్ధమయితే చాలు…మిగతా విషయాలు చూసే వారికి అనవసరం…ఆ లోతుల్లో ఏముంటుందో రచయితకు మాత్రమే తెలుస్తుంది…..ప్రతి చెట్టు దేనికది భిన్నమైనట్టే ప్రతి కథ దేనికదే భిన్నమయినది….ప్రతి కథని ఒకేలా చెప్పటం కుదరదు….కథని బట్టి కథనం ఉంటుంది….పైన బొమ్మల్లో చెప్పింది స్థూల రూప నిర్మాణం గురించి…ఇక్కడ చెప్తున్నది గుణభేదం గురించి…..సూక్ష్మరూప నిర్మాణం.
ఉదా: ప్రతి మనిషి స్థూలంగా చూసినప్పుడు ఒకే విధమైన ఆకారాన్ని కలిగివుంటాడు…తల మొండెం పాదాలు…ఐతే అలోచనలు,ప్రవర్తన,రూపురేఖలు భిన్నంగా ఉంటాయి……మనషుల అలోచనలు భిన్నంగా ఉన్నంత మాత్రాన వారి స్థూలరూపంలో భేదం ఉండదు కదా.కాని ప్రవర్తనలో తేడా ఉంటుంది అవునా….అదే ఒక మనిషిని ఇంకో మనిషి నుండి వేరు చేస్తుంది….ఇదే గుణబేధం.
ఇప్పుడు మనకి అందుబాటులో వున్న ఆరు కథన రీతుల్ని చూద్దాం.
1.Inevitable.
2.Pile – On.
3.Hidden Agenda.
4.Flash Back.
5.Flash Forward.
6.Temptation and Redemption.
1.Inevitable : దీనిలో ప్రధానపాత్రకి సహాయకారిగా నాలుగు నుండి ఐదు పాత్రలుంటాయి.పాత్రలు,సమస్య పరిచయం తర్వాత కథలోకి ప్రవేశించగానే ప్రధానపాత్రకి సహాయకారిగా వున్న ఒక్కో పాత్ర మరణిస్తూ సమస్య పరిష్కారంపై ఒత్తిడి పెరుగుతూ వుంటుంది.కథ ముగింపుకి చేరే సరికి సహాయపాత్రలన్ని చనిపోయి ప్రధానపాత్ర పై ఒత్తిడి అధికమై ప్రాణాపాయస్థితికి చేరినా కూడా సాధించాల్సిన లక్ష్యం పై నుండి మన దృష్టి మరలదు.ఇలాంటి విపత్కరమైన స్థితిలో ప్రధానపాత్ర ఆ సమస్యకి పరిష్కారం ఎలా కనుగొంటుంది అనేదే ఈ కథనరీతి.
ఉదా : Predator.
2.Pile – On : దీనిలో ముఖ్యాంశం ఓ నేరం,దొంగతనం,అపహరణ లేదా హత్య దీని చుట్టు కథ తిరుగుతుంది..దీనికి సంబంధంలేని లేదా పాక్షికంగా సంబంధం వున్న ఒకటి లేదా రెండు పాత్రలు దీనిలో చిక్కుకుంటాయి….ఇక పోలీసులు,నేరస్తుల మధ్య ఓ అమాయక జంట…ముగింపుపై ఆసక్తి క్రమంగా పెరుగుతుంది. అధ్బుతమైన నాటకీయత పండుతుంది.
ఉదా: Somelike It Hot,Midnight Run, క్షణ క్షణం,మనీ,అనగనగా ఒక రోజు.
3.Hidden Agenda : ఈ కథనంలో అతి ముఖ్యమైన ఒక విషయాన్ని దాచి కథని నడుపుతారు..కథ ముగింపు చేరేసరికి ఆ దాచివుంచిన రహస్యం కీలకమై కూర్చుంటుంది.ఇప్పుడు ముగింపు అత్యంత ఆసక్తికరంగా మారుతుంది.
ఉదా : The Professionals (1966).
4.Flash Back : దీనిలో మూడు రకాలున్నాయి.
a)Book End/Upfront b)Back to Back c)Upside Down
a)Book End / Upfront FB: దీనిలో కథ ముగింపు దగ్గర మొదలై గతంలోకి ప్రయాణిస్తుంది.ఈ కథనంలో పాత్రలకన్నా,ప్రేక్షకులకి ఎక్కువ సమాచారం తెలుస్తుంది.కీలకమైన సమాచారం కొన్ని పాత్రలకి తెలియకపోవటంతో ప్రేక్షకులకి విపరీతమైన ఆందోళన కలుగుతుంది.ముగింపుపై
ఉత్కంఠ ఏర్పడుతుంది.
ఉదా: All About Eve.
b)Back to Back FB : ఈ కథనంలో ఇద్దరు వ్యక్తుల కథలు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి…రెండు ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో
మొదటి కథ ముగింపు చూసిన మనకి రెండవ కథ ముగింపుపై ఆసక్తి ఏర్పడుతుంది.
ఉదా : The Godfather II.
c)Upside Down FB: ఈ కథనంలో, ప్రారంభంలో ఓ అంశాన్ని దాచి వుంచుతారు, Act – 2 ప్రధమార్ధం, ద్వితీయార్ధం తారుమారు చేసి ఇంటర్వెల్ తర్వాత రావల్సిన ద్వితీయార్ధాన్ని ప్రధమార్ధంగాను,ప్రధమార్ధాన్ని ద్వితీయార్ధంగానూ ఉపయోగిస్తారు.Joseph campbell 12 sequence structure తెలిసిన వారికి ఈ విషయం అర్ధం అవుతుంది.
ఉదా: సమరసింహా రెడ్డి.
5.Flash Forward : వాస్తవానికి ఇవి రెండు కథలు.ఇద్దరి సమస్యలు.ఒక సమస్య పరిష్కారం ఇంకోదానిపై అధారపడి ఊంటుంది.ఒకటి పరిష్కారమైతేగాని రెండో సమస్య పరిష్కరించబడదు.మాములుగా చూస్తున్నప్పుడు రెండో సమస్య వున్నట్టు మనకి కనిపించదు…వాస్తవానికి మొదటి సమస్యే మనకి అసలు సమస్య అనిపిస్తుంది…ముగింపుకి వచ్చేసరికి రెండో సమస్య ఉందని అసలు అదే ప్రధానమైందని అర్ధం అవుతుంది.ఈ కథనంలో ముగింపు మనం ఊహించలేము.ఇది riddle plot కి చక్కగా సరిపోయే కథనం.
ఉదా: Sixth Sense.
6)Temptation and Redemption : ఈ కథనంలో ప్రధానపాత్రని మనం పూర్తిగా తప్పుగా అర్ధం చేసుకుంటాం లేదా రచయిత అలా తప్పుగా అర్ధం చేసుకునేలా చేస్తాడు…కథ ప్రారంభంలో ప్రధానపాత్ర జులాయి,అమాయకుడు,చేతకాని వాడు,దద్దమ్మ,పొగరుబోతు లాంటి పాపులర్ గుణాలేవైనా ఉండొచ్చు కానీ కథ క్రమంగా ముగింపు చేరేసరికి ప్రధానపాత్రలో దాగివున్న అద్భుతమైన గుణం మనల్ని అతన్ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు అతని ముందు మన తలలు దించుకునేలా చేస్తుంది.
ఉదా:లేడీస్ టైలర్,ఏప్రిల్ 1 విడుదల,మున్నాభాయ్ MBBS.
ఇవి కాకుండా మరో మూడు కథన రీతులున్నాయి…ఐతే అవి Miniplot Structure కి సంబంధించినవి.పైన చెప్పినవి Archplot Structure కి సంబంధించినవి….ఇవికాక ఇంకా ఉండొచ్చు….
Mini plot structure కథన రీతులు :
a)Sequential Narrative : మూడు లేక నాలుగు ప్రధానపాత్రలుంటాయి వాటికి ప్రత్యేకమైన సమస్యలుంటాయి వీటన్నిటికి పరిష్కారం చివరవచ్చే ముగింపులో వుంటుంది.
ఉదా : Gods must be crazy
b)Rashomon type : ఒకే సమస్యని భిన్న కోణాల్లోంచి చూసిన పాత్రల వాదన ఇది…అన్ని వాదనలు వింటేగాని అసలు సమస్య అర్ధంకాదు.
ఉదా: Rashomon,పోతురాజు
c) Tandem narrative : ఎక్కువ పాత్రలు ఎక్కువ కథలు ఇతివృత్తం ఒకే అంశానికి సంబంధించినదై ఉంటుంది.
ఉదా: Love Actually.
కథలు రాసుకునేప్పుడే ఏ కథనరీతిని అనుసరించాలో రచయితకు అర్ధమైపోతుంది.
ఈ వ్యాసం ఔత్సాహిక దర్శకులకు,రచయితలకు ఉపయోగకరం అనిపించి రాయడం జరిగింది.
ఇలా కాకుండా కథల్ని ఎలా ఐనా తయారుచేసుకోవచ్చు….ఇలా తయరుచేయటం మంచిది అనిపిస్తే ఈ పద్ధతి అనుసరించవచ్చు.
సాధన చేయడానికి అనువుగా సినిమా ఉదాహరణలు ఇవ్వడం జరిగింది… తప్పులు కనిపిస్తే తెలియజేయండి.
ఆదిత్య చౌదరి.మూల్పూరి
(ఔత్సాహిక దర్శకుడు)
greenlong2498@gmail.com
// 0 &&
rahul says:
good one informatic information
Phanindra says:
Very nice and informative article. Thanks for your efforts.
naresh says:
phani garu meru chal manchiga coments istunnaru.na name naresh nenu youth meda oka story ready chesanu dani gurunchi screenplay ela cheyalo teliyadam ledu naku koddiga information isthara please…..
K మహేశ్ కుమార్ says:
స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పేప్పుడు కూడా ఏదో ఇంగ్లీషులో చెప్పేసి కానిచ్చేస్తాం. ఇలా తెలుగులో చదువుతుంటే బాగుంది.చాలా మందికి రీచ్ అవుతుంది కూడా…అభినందనలు.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
Thank you Rahul,Phani & KMK.
KODALI says:
Meru racina artical naku baga nachinadhi……
కథ,kadhanum pattla mekuvuna avagahana,patu naku baga ardhamyinthe….
kadha ఎలా rayali annadhani medha oka avagahanakalligincharu…….
Meku na dhunyavadhalu
KODALI
Rakesh says:
I happened to have watched Gayam 2 movie today. I wanted to watch it on the first day itself as I loved Gayam-1 and couldn’t stop myself to watch its sequel. I booked the tickets early this morning on bookmyshow.com and went to watch the movie at INOX.
Soon I realized that the movie was boring and a complete dud. But, as the second part started, I was shocked to see the movie’s striking resemblance to the Telangana Movement. This definitely cannot be a coincidence. The makers of this movie seem to have deliberately made an attempt to belittle the Telangana movement. The incidents showed in the movie very much match the ones that have recently happened at Osmania University. It’s a shame that the people behind this movie tried to make a mockery of Yadaiah and Ishant Reddy’s sacrifice.
In one scene, student pours petrol on himself as a protest but, suddenly, someone lights a match stick from behind and the poor student is set on fire. This definitely will make us recall those sad moments when a soldier of ours immolated himself for the cause of Telangana. But, the way this incident has been shown in the movie has certainly made my heart heavy. They have no right to show something like this.
Alright. Let’s consider that it’s just a coincidence for the moment. Scenes like this have been shown in various movies in the past. But, as the movie catches its momentum, all the scenes make you feel as if you are watching the Telangana movement at its peak. It makes you feel that the incidents that happened earlier this year are right before you but, in poor light.
In another scene, a student is being beaten badly by the goondas and is made to write a suicide note. The goondas plan to get it signed by the student and later set him on fire and throw his body on campus which they think would stir up the agitation against the government. This once again makes us recall Ishant Reddy who sacrificed his life for the cause of Telangana. By this time I was sure that this is a deliberate attempt.
Furthermore, they tried to show that the Telangana movement was not an outbust of the people in response to the injustices done to them but, as a political gimmick.
Kotasrinivas Rao has been shown as one who is desperate to grab CM gaddi. They seem to have tried to relate Kota’s character to that of KCR. They even tried to show KCR’s nirahara deeksha as a political stunt and just a play to grab CM’s seat.
This movie should not have been allowed to be released in first place. They have played with the sentiments of people.
Thanks KK for sharing
Source:
http://www.simplytelangana.com/2010/09/04/gayam-2-shows-telangana-movement-in-poor-light/
bose says:
Dear Rakesh
This is the attitude which makes “our” movement look inferior.
Let “them” show however they conceieve .
after all artistic expression should have freedom.
May be they look at it that way. what is wrong ???
We are asking for telangana not a taliban state ..right ? If we start asking everyone who speaks against us to be banned or nipped ….that is not democrisy but dictatorian demand.
Are people so dumb to believe one movie ? If we think they are , that means, we dont much respect for our people.
Our film actors…name any star…..even in functions like vajrotsavams , when one comedian imitates them and mock their acting / dancing /dialogue-delivery skills..they take it sportive spirit and encourage his talent…why cant we do the same ? Lets talk of film’s art than trying to be moral or social police over anything we did not like in them.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
@ Bose : Great attitude Mr.Bose..I appreciate it.
One great lesson of life , there is no market for ur emotions , so never advertise ur feelings………jus diplay ur attitude..
j.surya prakash says:
అయ్యా ఈ పాయింట్ ని హైలెట్ చేస్తే అనవసరంగా ఓ చెత్త సినిమాకి మరికొంతమందిని తోలినట్లే…వదిలేయండి
సూర్య
శశిపాల్ రెడ్ది రాచమల్ల says:
నమస్కారం సార్ బాగున్నారా? కేక సార్ చాలా బాగుంది. అదిరిపొయింది. కథ కథనం చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు. రాచమల్ల రెడ్డి.
అబ్రకదబ్ర says:
మీరు చెప్పిన మూడంకాల పద్ధతి తెలుగు సినిమాలకు వర్తించదు. మన ఫార్ములా మనదే. ఇక్కడ రెండంకాలే – ఇంటర్వల్ ముందు, ఆ తర్వాత. మొదటి అంకంలో పరిచయం, మూడు పాటలు, కొన్ని కామెడీ సీన్లు, రెండు ఫైట్లు. రెండో అంకంలో మరో పరిచయం (హీరోగారి ఫ్లాష్‌బాక్ అన్నమాట), మరో మూడు పాటలు, మరి కొన్ని కామెడి సీన్లు, మరిన్ని ఫైట్లు, అండ్ దెన్ ముగింపు. అసలు మనకున్నది ఒకటే కథ. పాత్రల, ప్రదేశాల పేర్లు మార్చి పైన చెప్పిన సన్నివేశాల్లో తగిలించేస్తే అదే కొత్త కథలా ముస్తాబవుద్ది. అవసరమైతే ఆలీవుడ్ నుండో, ఇంకే వుడ్ నుండో రెండు మూడు సీన్లెత్తేసి ఇరికించేస్తే క్రియేటివ్ డవిరెక్టరన్న పేరొస్తది. సుడి బాగుంటే అంత చెత్త సినిమా కూడా బాక్సాఫీసు బూజు దులిపి సెన్సేషనల్ హిట్టవుద్ది (ఇక్కడ ప్రేక్షకులనని లాభం లేదు. వచ్చేవన్నీ చెత్త సినిమాలేనైతే వాటిలో కాస్త మంచి చెత్తనే నెత్తినెక్కించుకోటం తప్ప, వాళ్లేం చెయ్యగలరు?)
K మహేశ్ కుమార్ says:
@అబ్రకదబ్ర:
మీ సెటైర్ అర్థమయ్యింది.
ఒకప్పటి మన సినిమాలు తీసుకుంటే మూడంకాలు లేదా ఐదంకాల్లో సినిమా అయిపోయేది. క్లాసిక్ స్టోరీలన్నీ అలాగే ఉంటాయి మరి. ఇప్పటికీ మన రెగ్యులర్ సినిమాలను నాలుగంకాల్లో కానిచ్చెయ్యొచ్చు. Act 2 ని Act 2A – Act 2B గా మార్చుకుని మధ్యలో ఇంటర్వెల్ ఇచ్చెయ్యొచ్చు. కానీ కథలే లేని ప్రస్తుతం సినిమాల్లో సీన్లు తప్ప ఇంకేదీ అక్కరలేదు లెండి. ఏదో మనం నేర్చుకోవడానికీ చర్చించడానికీ తప్ప…
Gandi venkatesh says:
నమస్తె ఆది అన్నా…..
చాలా బాగా రాసావ్. మీ వ్యాసమ్ చదివాక కథ,కథనం అంటె ఎమిటి, ఎలా రాయాలొ ఒక అవగాహాన వచ్హింది..నాకు తెలిసి ఇలాంటి వ్యాసాలు ఎ బుక్ లొను దొరకదు, కథ రాసెటపుడు ఎ విశయాలు ప్రదానమొ చక్కగా వివరించారు.. ఇకనైనా తెలుగు సినిమా కథలొ మార్పు రావాలి అనుకుంటున్నాను.హీరొ కొసం కథ కాకుండా కథ కొసం పనిచెయాలి.. మార్పు రావలని కొరుకుంటు…
ధన్యవాదములతొ
మీ వెంకి
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
Thanks : వెంకీ & శశిపాల్.
wb says:
బావుంది – క్లుప్తంగా, సూటిగా. దీన్ని బేస్ చేసుకోని ఇంకా వివరంగా, సోదోహరణంగా, ఇంటరాక్టివ్ గా ఏదన్నా చేస్తే… నేర్చుకొనే వాళ్ళకు ఉపయోగకరంగా వుంటుందేమో? సూచన మాత్రమే. విమర్శ కాదు.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
@WB – కృతఙ్ఞతలు…..మీ అలోచన బాగుంది.
ఐతే ఇంకొన్ని పరిచయం చేయల్సివుంది.
నా స్క్రిప్ట్ వర్క్ అయ్యాక వీలుచూసుకుని చేస్తాను.
chakri says:
వ్యాసం వర్ధమాన సినీ రచయితలకి ఉపయోగకరంగా ఉంది ..కాని ఎక్కువ తెలుగు సినిమాలని ఉదాహరణలు గా ఇచ్చి ఉంటె బావుండేది.
ఆదిత్య చౌదరి. మూల్పూరి says:
@thnk Chakri.
gopi kiran says:
nice chowdaryji good and knowledgeble one, thank u
ఆదిత్య చౌదరి. మూల్పూరి says:
@Gopi : you r welcome.
హెర్క్యులెస్ says:
చాలా బాగా రాశారు. తప్పకు౦డా చాలామ౦దికి స్క్రీన్‍ప్లే మీద క్లారిటీ వచ్చు౦టు౦ది.
ఆదిత్య చౌదరి. మూల్పూరి says:
Thank u హెర్క్యులెస్
srikanth says:
hello; the content you wrote mostly belong to Syd field!! Please mention the same there…
and personally bro; if you really want to write a good screenplay; I think you should come out of this box and try to write independently!!
ఆదిత్య చౌదరి. మూల్పూరి says:
@Srikanth.
నువ్వు బయటికొచ్చి రాయి బ్రో…
నాకిక్కడ చాల కంఫర్ట్ గా వుంది.
సిడ్ ఒక్కడే కాదు..Robert Mckee,Kate wright,Joseph Campbell…కూడా వున్నారు.
అవన్నీ చదివితేనే నాకు తెలిసింది….ఐనా బ్రో Three act structure మొదట చెప్పింది Aristotle.
srikanth says:
okay got it!! no issues!! But if we mention their names i feel its like respecting their intellect!!
aristotle wrote on this 3 act structure.. seriously didnt know that…
if you have any books please share them!!
mail me to challasrikanth1@gmail.com
thanks a lot
vasu says:
i am Really Proudof u . u Told Wright . i am Happy . Really Thanq Verymuch