Menu

Monthly Archive:: September 2010

మనోహర్-మనవాడే!

మొన్నీ మధ్యనే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మగధీర కి రెండు అవార్డులు వచ్చినా అవి రెండూ కూడా ఇద్దరు తమిళ వాళ్ళకి వచ్చాయని, కాబట్టి ఆ కొద్ది పాటి సంతోషమైనా తమిళ్ వాళ్ళకి ఉండాలని కొంతమందంటే…అయినా కూడా వచ్చింది తెలుగు సినిమాకి కదా! కాబట్టి గర్వపడాల్సింది మనమే అని ఇంకొంతమంది అభిప్రాయం. అయితే ఈ మగధీర లాంటి మెగా సినిమా నీడలో మరో తెలుగు వాడికి (అచ్చమైన తెలుగు వాడు, మన నెల్లూరబ్బాయి 🙂 ) జాతీయ

57 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

57వ జాతీయ చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ జాతీయ చిత్రంగా మళయాళ చిత్రం ‘కుట్టిశ్రాంక్’ ఎన్నికయింది. ఉత్తమ నటుడిగా అమితాబ్ వరుసగా మూడోసారి ‘పా’ చిత్రానికి గానూ ఎన్నికయ్యారు. ఉత్తమ నటిగా అనన్యాఛటర్జీ(బెంగాళి) కి ‘అబోహొమన్’ చిత్రానికి లభించింది. ఉత్తమ సహాయ నటుడిగా లాహోర్ చిత్రంలో నటించిన ఫారూక్ షేక్ సహాయ నటిగాఅరుంధతీనాగ్(పా) ఉత్తమ బాలనటులు గా ‘పసంగ’ తమిళ చిత్రంలో నటించిన జీవ, అన్బుకరసు లకు అవార్డు లభించింది. ఉత్తమ సామాజిక చిత్రంగా శ్యామ్ బెనగల్

ఆత్రపడ్డ అభిమానులపై ఆకలిగా పడ్డ ‘పులి’

పెద్ద హీరోల సినిమాలకు ఉండే ఇబ్బందే ఇది. కథ కోసం కాక, హీరో ఇమేజ్ కోసం ఆలోచించడం మొదలుపెడతారు. కోట్లు కుమ్మరించి, ఏళ్ళ తరబడి సినిమా తీస్తారు కానీ, తీరా కథకో, కథనానికో వచ్చేసరికి ఫలానా వర్గం వారి కోసమంటూ ఏవేవో అనవసరపు రాజీలకొస్తారు. వెరసి, సినిమాను అవకతవకగా మార్చేస్తారు. అందరి మీదకూ వదిలేస్తారు. దర్శక, నిర్మాతల పూర్వపుణ్యఫలం వల్లో, హీరో అదృష్టం వల్లో ఏవో కొన్నిసార్లు ఈ వంట ప్రేక్షకులకు రుచించవచ్చు. కానీ, చాలాసార్లు ఆ

ధమాకా “దబంగ్”

కొత్త సీసాలో పాత సారా అనే మాట అర్థం కావాలంటే ఈ సినిమా చూడాలి. ఇదే సినిమా కథని ఏ 1980లోనో తీస్తానంటే మిథున్ చక్రవర్తి ఎగిరి గంతేసి చేసేవాడు. సినిమా సూపర్ హిట్ కొట్టేది. 2010లో కూడా ఇదే కథతో హిట్ కొట్టడం ఎలానో నూతన దర్శకుడు అభినవ్ కశ్యప్ (అనురాగ్ కశ్యప్ సోదరుడు) నిరూపించాడు. అందులో సల్మాన్ ఖాన్‌ని హీరోగా ఎంచుకోవడమే మొదటి విజయం. ఈ సినిమా కథ చాలా సాధారణమైనది.. మనకందరికి తెలిసినది.

తెలుగు సినిమా ! ఎక్కడికి…ఈ పయనం?

2009 సంవత్సరం లో సినీపరిశ్రమ కొచ్చిన నష్టం 170 కోట్లని కొందరు చెబితే, కాదు 230 కోట్లని మరికొన్ని అంచనాలు తేల్చాయి. కేవలం నాలుగు హిట్ చిత్రాలొచ్చిన అత్యంత దారుణమైన సంవత్సరంగా మిగిలింది. ఇన్ని నిరాశలమధ్యా, కనీసం ఈ దెబ్బతోనైనా కాస్త పరిశ్రమ పోకడమారి మంచి సినిమాలు తీస్తారనే ఆశలు కొందరిలో ఉదయించాయి. 2010 ప్రారంభమయ్యింది. జనవరిలో సంక్రాంతికి ఎన్.టి.ఆర్, వెంకటేష్ వంటి అగ్రహీరోల సినిమాలు వచ్చినా నిరాశను మాత్రంమే మిగిల్చాయి. అదుర్స్ పరిస్థితి ఎవరికీ అర్థం