సుప్రసిద్ధ తమిళ్ చిత్ర కథా నాయకుడు, సహాయ నటుడు, నిర్మాత మురళి(46) ఈ రోజు మృతి చెందారు.
“హృదయం (1991)”, “నవవసంతం (1989)” డబ్బింగ్ చిత్రాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ప్రత్యేకించి హృదయం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అయితే ఆ చిత్రంలో ఆయన పాత్రకి వున్న హృద్రోహం నిజజీవితంలో కూడా “హార్ట్ఎటాక్” అయ్యి ఆయన కబళించడమే విషాదం.
ఆయన కుమారుడు అథర్వ ఈ మధ్యనే “బాన కాతడి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. అందులో ఒక ప్రత్యేక పాత్రలో మురళి కూడా నటించారు. అదే ఆయన ఆఖరు చిత్రం కావడం మరో విషాదం.
ఆయనకి నవతరంగం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన గుర్తుగా ఈ పాట:
కమల్ says:
“హృదయమా…హృదయమా..నీ మౌనమెంత వేదనా.. హృదయమా..హృదయమా..!!”
“ఊసులాడే ఒక జాబిలంట..సిరిమువ్వలుగా నన్ను తాకేనటా..చూపులతో బాణమేసెనట..చెలి నాయెదలో సెగ రేపెనట..”
ఈపాటలతో అప్పట్లో కుర్రకారు ఊసులాడారు..పాటతో పాటు ఆ నటుడు..చాన్నాళ్ళుగా అందరిమనసులో ఉండిపోయారు..!
అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా..?
మురళి ఆత్మకు శాంతి కలగాలని….!
శ్రీనివాస బాబు says:
ఆ రోజుల్లో నాకు బాగా నచ్చిన సినిమాలలో ఒకటి… హృదయం సినిమా… దాని లోని పాటలు హీరో, హీరోయిన్ల నటన అధ్బుతం…
మురళి గారికి నా నివాళి.. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను…
srinivas says:
ఒక్క సినేమా తో అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హృదయం లో అతని నటన ఎప్పటికి గుర్తుండి పోతుంది. ఆసినేమా కథకి ఇతను అతికినట్టు సరిపోయాడు.వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను
parimalam says:
హృదయంలో ఆయన పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది. గజిబిజి బాగ్రౌండ్ మ్యూజిక్ లేకుండా మంచి సాహిత్యంతో వచ్చిన ఈ పాట కూడా ! ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దిస్తున్నా !
అబ్రకదబ్ర says:
‘హృదయం’కన్నా ముందొచ్చిన ‘నవవసంతం’తోనే మురళి తెలుగులో మంచి గుర్తింపు పొందాడనుకుంటాను. హీరోయిన్ సితార కి అదే తొలి సినిమా అనుకుంటా. అప్పట్లో ఆ సినిమా పాటలు కూడా పెద్ద హిట్.