సీక్వెల్ అనేది ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే. క్రేజ్ తీసుకొచ్చి ఓపినింగ్స్ కు మొదటి సినిమా విజయం ఎంత బాగా సహకరిస్తుందో …పోల్చుచూసుకోసుకుని నిరాశచెందటానకి కూడా అదే సమస్యై కూర్చుంటుంది. తాజాగా “గాయం” కు సీక్వెల్ వచ్చిన ‘గాయం-2′ కూడా అదే కోవలో చేరింది. మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. పనిలో పనిగా…ఈ కొత్త సినిమాని పాత క్లాసిక్ తో పోల్చుకుని చూసేలా చేసి నిరాశకల్గించింది. అప్పటి మధురస్మృతులు గుర్తు చేసి ఆనందపరిచింది. హీరో జగపతి బాబు, నూతన దర్శకుడు ప్రవీణ్ శక్తి వంచన లేకుండా కష్టపడినప్పటికీ ఇంటర్వెల్ దాకా అసలు కథ ప్రారంభం కాకపోవటం,స్క్రీన్ ప్లే సమస్యలు కథనానికి ఇబ్బందులై నిలిచాయి.
రామ్(జగపతి బాబు) ధాయలాండ్ లో ఓ హోటల్ నడుపుకుంటూ తన కొడుకు, భార్య విద్య(విమల రామన్)లో హ్యాపీగా ఉంటూంటాడు. అయితే అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో మీడియోలో హైలెట్ అయి రామ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి గురునారాయణ(కోట శ్రీనివాసరావు) మనుష్యులు వస్తారు. వాళ్ళొచ్చి రామ్ గతంలో దుర్గ(గాయం లో హీరో) అనే విషయం బయిటపెట్టి చంపబోతారు. గతాన్ని సమాధి చేసి బ్రతుకుతున్న రామ్ కి తాను దుర్గ అనే విషయం ఒప్పుకోవటం ఇష్టముండదు. అయినా కొన్ని పరిస్ధితుల్లో మళ్లీ దుర్గగా మారి తిరిగి హైదరాబాద్ వచ్చి తన మిగిలిన శత్రు శేషాన్ని తుగముట్టించటానికి సమాయుత్తమవుతాడు. ఆ క్రమంలో అతని భార్య ఎలా స్పందించింది …కొడుకు ఏమయ్యాడు అనేది మిగతా కథ.
‘హిస్టరీ ఆఫ్ వయలెన్స్’ అనే హాలీవుడ్ చిత్రం నుంచి ప్లాట్ తీసుకుని ఈ చిత్రం కథనం అల్లారు. కథ సెంట్రల్ పాయింట్, దుర్గా తిరిగి తన పాత జీవితంలోకి రావటమనేది ఇంటర్వెల్ దాకా రాదు. దాంతో అక్కడవరకూ కేవలం దుర్గా ఫ్యామిలీ స్టోరీ, పండని హర్షవర్దన్ కామిడి, హైదరాబాద్ నుంచి విలన్ మనుష్యులు వెతుక్కుంటూ రావటం చుట్టూ తిరుగుతుంది. పోనీ సెకెండాఫ్ లో అయినా అందుకుంటాడా అంటే అప్పటివరకూ హీరో వెంటబడ్డ విలన్ విచిత్రంగా సెకెండాఫ్ లో చల్లపడిపోతాడు. దాంతో హీరోనే ఎంతసేపు ఒన్ సైడెడ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ సృష్టిస్తూంటాడు. అందుకే కొంత సాగదీత అనిపిస్తుంది.
నటుడుగా జగపతిబాబు చాలా పరిణితితో చేసిన పాత్ర అనిపిస్తుంది. విమలారాన్ అందంగా కనిపించడంతో పాటూ కథలో లీనమై ఎమోషన్స్ పండించింది. సక్రమంగా ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తున్న నటి అవుతుంది. విలన్ గా చేసిన కోట, ఆయన కొడుకు ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. లాయర్ సాబ్ గా తణికెళ్ళ భరణి…అప్పటి గాయం పాత్రను కంటిన్యూ చేసారు.గంధం నాగరాజు డైలాగులు అక్కడక్కడా చమక్కుమనిపిస్తాయి. ఇళయరాజా సంగీతమే ఆయన రేంజికి తగినట్లు అనిపించదు.
ఒరిజనల్ గాయంతో పోల్చకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. ఓ హిట్ సినిమా సీక్వెల్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే పాఠం కూడా ఈ చిత్రం చెప్తుంది. తన కెరీర్ ని శరవేగంతో తిరిగి పట్టాలు ఎక్కిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుని జగపతి బాబు చేసిన ఈ చిత్రం కొంత నిరుత్సాహాన్ని, ఈ మధ్యన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోని జగపతి గత చిత్రాలుతో పోల్చి చూసుకుంటే కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏదైమైనా, రామ్ గోపాల్ వర్మ క్లాసిక్ అనే ఆశలు పెట్టుకోకుండా…దుర్గా పాత్రలా గతాన్ని త్రవ్వుకోకండా వెళ్ళండి…అంతగా నిరాశపడరు.
K మహేశ్ కుమార్ says:
ఇతే చూడొచ్చన్నమాట…గాయం సినిమాని థియేటర్ బయట వదిలివెళ్ళి చూస్తా అయితే..
krishna chaitanya says:
హిస్టరీ ఆఫ్ వయలెన్స్ కథ మన తెలుగు సినిమా కు చాలా దగ్గ్రరగా అనిపిస్తుంది…మన వాళ్లు మరీను…ఒక తెలుగు సినిమా ను ఇంగ్లిశులొ చూసి మళ్ళి తెలుగు లొ రిమేక్ చేసారు…baasha,ఇంద్ర సమరసింహరెడ్డి కథలు ఇవె కదా….
GopiCM says:
హహహ అవును
sasank says:
ee cinemaalo baaga nacchindhi emito antey raashtram loni plotical situation ni dhairyam gaa choopakaligaaru.chaala mandhi pedda producers and heroes koodaa aa dhairyam cheyyalekapoyaaru…..daani kosamaina okka saari cinema chooseyacchu
kota srinivas rao acting is superb in the movie
j.surya prakash says:
మీరు చెప్పింది కరెక్టే..నేను ప్రస్ధావించటం మర్చిపోయాను…ధాంక్స్
సూర్య
అభిమాని says:
To all those people referring RGV’s Gaayam:
I strongly believe that RGV has nothing to do with this sequel. He is neither the director, nor the producer. The credit “Ramgopal Varma presents” was with his permission, just to bring the people to the theaters.
Gaayam was a classic by two stalwarts Maniratnam and RGV, and there is no meaning in comparing this mediocre movie to the earlier one.
అబ్రకదబ్ర says:
వర్మ కెరీర్‌లో ‘గాయం’ ఓ చెప్పుకోదగ్గ సినిమా. కానీ దాన్నో క్లాసిక్ అనటం చాలా అతిగా ఉంది.
రాజశేఖర్ says:
@అబ్రకదబ్ర
కదా…! నాకు అలాగే అనిపిస్తుంది, రాము గాయం ఒక మంచి సినిమా కాని క్లాసిక్ అనేంత కాదు (నా అభిప్రాయం)
Srinu Pandranki says:
Ya, We cant call Gayam as CLASSIC.
నాకు ఈ movie లొ political situations ని బాగా చూపిన్చారినిపిన్చిన్ధి
U can watch this director’s short movie, which he had shot 3years back
SOUL..
http://www.youtube.com/watch?v=YeSk63im-30