Menu

రన్నింగ్ కామెంట్రీ:అనుకోకుండా ఒక మంచి సినిమా

ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది-అనురాగ్ కశ్యప్
ఈ సినిమా పీప్లీ లైవ్ కంటే మంచి సినిమా- indiainfo.com

అయినా కూడా చాలా మందికి ఈ సినిమా గురించి తెలియదు. నాకూ నిన్నటి వరకూ తెలియలేదు. సోషల్ ఇష్యూస్ గురించి చిత్రీకరించబడ్డ చిత్రాల్లో ఉత్తమ చిత్రం గా జాతీయ అవార్డు అందుకున్నప్పటికీ ఈ సినిమా గురించి అంతగా ప్రచారం జరగకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనప్పటికీ గతవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎంతో మంది ప్రశంశలు అందుకుంది. FTII గ్రాడ్యుయేట్స్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా ఇది. పేరు ‘అంతర్ద్వంద్ ‘

ఈ మధ్యనే ‘ఉడాన్ ‘ , పీప్లీ లైవ్’, ‘తేరే బిన్ లాడెన్ ‘  లాంటి రియలిస్టిక్, ఆఫ్ బీట్  సినిమాల విజయవంతం అయిన నేపథ్యంలో అదే కోవలో వచ్చిన మరో చిత్రం ‘అంతర్ద్వంద్ ‘ .
బీహార్ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ని ఒక రియలిస్టిక్ థ్రిల్లర్ గా పేర్కొనవచ్చు. తమ కూతుళ్ళకు సరిపడ అల్లుళ్ళు దొరకని కొంతమంది బీహారీ జమీందార్లు, ధనవంతులు తమకు నచ్చిన కుర్రాళ్ళను కిడ్నాప్ చేసి తమ కూతుళ్ళకు బలవంతంగా పెళ్ళి చేస్తుండడం ఎన్నో ఏళ్ళుగా జరుగుతూ వస్తున్న ఒక అచారం. ఆడవాళ్ళను బలవంతపు పెళ్ళి చేయడం మనం రోజూ వింటున్న సంగతే గానీ ఇలా మగవాళ్ళని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్ళికొప్పించడమే ఈ సినిమా ముఖ్య కథాంశం.

వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇలాంటి ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా సమాజంలోని ఒక సమస్యను ఎత్తి చూపుతూనే మరో వైపు కొత్త కొత్త మలుపులతో థ్రిల్లింగ్ గా కథను నడిపిన విధానం చాలా బావుంది. సాంకేతికంగా కూడా ఎంతో బావున్న ఈ సినిమాలో స్వాతి సేన్, వినయ్ పాఠక్ మరియు మిగతా నటులు అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

సుశీల్ రాజ్ పాల్ ఈ చిత్రానికి దర్శకుడు.

More reviews from the net

After Peepli LIVE comes another brilliant film”ANTARDWAND”

And so, as PEEPLI LIVE has brought the focus of Urban India to the issues faced in rural India, in an entertaining way, ANTARDWAND, too brings to light the social evil that plagues Rural India, in the mainstream media debate.

Why Antardwand is better than Peepli Live?

ANTARDWAND was born out of passion, with a story to tell, ‘uncorrupted’ by commercial consideration, with a director remaining true to his craft. Not surprisingly still, it won the National Award, perhaps, Peepli Live, may win it this year. President Ms. Pratibha Patil endorsed it “ I congratulate the film Antardwand because such films are of great use and help for social change”

Antardwand is a film about real people

More than a social drama, Antardwand is actually a thriller merely because it’s impossible to predict which direction the film will take. Thankfully, the film does not end in ‘Bollywood’ style.

హైదరాబాదులోని INOX లో సాయంత్రం 7:45 నిమిషాలకు మరియు సినీమ్యాక్స్ లో  మధ్యాహ్నం 2:30 కు మాత్రమే ప్రదర్శింపడుతున్న ఈ సినిమా ఇంకో వారం ఉంటుందో లేదో అన్నది అనుమానమే కాబట్టి సినీ ప్రేమికులు అర్జెంటుగా చూసెయ్యండి.

2 Comments
  1. rajendra kumar February 11, 2011 /