Menu

Abohoman (The Eternal) : బెంగాలీ

శిఖ: నాతో అఫైర్ పెట్టుకుంటావా?
అప్రతిమ్: ఉహూ!
శిఖ: ఏం! తల్లంటే భయమా లేక పెళ్ళానికి భయపడుతున్నావా?
అప్రతిమ్: అవేవీ కావు. నువ్వు ప్రేమ ఎంతగా బాగానటించగలవంటే, ఆ నటన చూసి ఎక్కడనన్ను నిజంగా ప్రేమించావో అని భ్రమపడతానని భయం.

‘అబోహమాన్’ అనే బెంగాలీ సినిమాలో ఒక పాత్రకు, నాయిక ‘శిఖ’కు మధ్య నడిచే సంభాషణ ఇది.

నాయిక నటనకు ఎంత అచ్చమైన కితాబు !
శిఖ గా నటించిన ఆ నటి పేరు అనన్యా చటర్జీ… ఈ సంవత్సరం జాతీయ అవార్డు అందుకున్న ఉత్తమ నటి.
Well deserved so.
ఈ సినిమాలో నటన చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే.

ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే జీవితంలో జరిగిన (జరిగిందనుకుంటున్న) సంఘటన ఆధారంగా తీసిన ఈ రితుపర్ణ గోష్ చిత్రం మానవసంబంధాల సున్నితత్వాన్ని, సృజనాత్మక వ్యక్తుల జీవన వైదుష్యాల్నీ బహుచక్కగా ప్రతిఫలించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. హేమాహేమీలైన నటీనటుల నుంచీ నటనరాబట్టడం కష్టం కాకున్నా, వారిని ఈ పాత్రల్లో ఊహించి మలచడం ఒక ఛాలెంజ్ అని చెప్పక తప్పదు.  స్క్రిప్టు విషయంలో రితుపర్ణ చూపించిన ప్రతిభ, దాన్ని కవితాత్మకంగా తెరకెక్కించిన వైనం జాతీయావార్డుకి అర్హం. అందుకే లభించింది కూడా.

Aniket (Deepankar De) is one of the finest filmmakers of Bengal, Deepti (Mamata Shankar), an actress, with whom he had fallen in love while casting in one of his films, had sacrificed her career for love and marriage. Apratim (Jisshu Sengupta) is their only son. They had been a perfect family. The plot thickens when Aniket auditions a young actress, Shikha (Ananya Chatterjee), who bears an uncanny resemblance to his wife when she was younger. Deepti enthusiastically begins to coach Shikha for her husband’s film – so much so that Shikha becomes even more like the girl Deepti used to be and as a result the aging Aniket falls in love with Shikha, a woman as young as his son, despite the sadness and trouble it brings to his family.

తప్పకుండా చూడవలసిన చిత్రం.
నాదగ్గర ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కూడిన DVD ఉంది. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళతో పంచుకోగలను.

8 Comments
  1. Balaji Sanala September 20, 2010 /
  2. vijay September 20, 2010 /
      • vijay September 20, 2010 /
  3. viplove September 20, 2010 /
  4. mohan October 2, 2010 /
  5. srikanth December 19, 2010 /