అసలు కథ చెప్పలేనుగానీ, ఒక కథ చెబుతుండగా జరిగిన ఉపయోగకరమైన కొసరుకథ గురించి చెబుతాను…
సాధారణంగా ప్రేమకథలు చాలా సాధారణంగానే ఉంటాయి.
అమ్మాయి అబ్బాయిని కలవడం లేదా అబ్బాయి అమ్మాయిని కలవడంతో మొదలై,
గొడవపడటం, అభిమానించుకోవడం, ప్రేమించుకోవడం, సమస్యలు రావడం, ఆ సమస్యలు తీరడమో లేక పోరాడి తీర్చుకోవడమో జరిగి పెళ్ళితో సుఖాంతం అవుతాయి. మరి ప్రేమకథల్లో భిన్నత్వాన్ని ఎలా నింపుతామయ్యా అంటే… హీరో-హీరోయిన్లకు భిన్నమైన నేపధ్యాల్ని, భావజాలాల్ని,వ్యక్తిత్వాల్నీ ఇచ్చి. ఏ క్లాసిక్ boy meets girl కథ తీసుకున్నా, అందులోని ప్రేమకు పునాది నాయికా నాయకులకున్న వైరుధ్యం. అదే ప్రతి ప్ర్రేమ కథకూ వచ్చే వైవిధ్యం.
ఎప్పుడైతే అమ్మాయో అబ్బాయో ప్రేమ కోసం comfort zone నుంచీ బయటికొచ్చి పోరాడతారో అప్పుడే ప్రేమ సాఫల్యం చెందుతుంది. మన సినిమాలు చాలా వరకూ మగాడి కోణంలోంచీ ఉంటాయి కాబట్టి ఈ పని మగాడే చేస్తాడు. అందుకే “హీరో” అవుతాడు.
ఇంత ఉపోద్ఘాతానికి కారణం ఏమిటంటే, మొన్న ఒక కాబోయే డైరెక్టర్ కు కథ చెప్పడం జరిగింది. ఒక ప్రేమకథ.
కథ ప్రారంభంలో హీరో హీరోయిన్ పరిచయం చెప్పగానే అతను “హీరోయిన్ పాత్రకు మరీ ఎక్కువ ఇంపార్టన్స్ ఇచ్చినట్టున్నారే!” అన్నాడు.
ఒక్క క్షణం ఆలోచించి ,”అంత నిర్ధిష్టమైన విలువలున్న హీరోని కదిలించే గుణం హీరోయిన్లో లేకపోతే ప్రేమకథ పండదు కదండీ?”ఆన్నా.
“కానీ…హీరోయిన్ కు అంత ఎస్టాబ్లిషింగ్ సీన్ ఇస్తే హీరోకి ఇబ్బందికదా!” అనేది అతని సందేహం.
“ప్రేమ కథలో ముఖ్యమైన వాళ్ళే హీరోహీరోయిన్లు, మరి వాళ్ళ పాత్రలు ఎలివేట్ చెయ్యకపోతే వారి ప్రేమకు బలం రాదు” అనేది నా వాదన.
“ఒక డైలాగ్ తో హీరోయిన్ పాత్ర చెప్పెయ్యొచ్చుకదా!” అనేది అతని కోణం.
“హీరోహీరోయిన్ పాత్రలు అవసరమైనంతగా చెప్పకపోతే, ఆ తరువాత వచ్చే conflict అర్థాంతరంగా, అపరిపక్వంగా ఉంటుంది” అనేది నా లాజిక్.
కొంతసేపు ఇలా చర్చించుకున్న తరువాత విసుగొచ్చి…
“హీరోహీరోయిన్ ప్రేమించుకోవడానికి కారణాలూ, క్యారెక్టర్లూ కాదయ్యా కావలసింది. వీళ్ళే హీరోహీరోయిన్ అని చెప్తే చాలు, వీళ్ళు ప్రేమించుకుంటారని ప్రేక్షకులు తెలిసిపోతుంది. ఆ మాత్రం సినీజ్ఞానం లేకపోతే ఎట్లా? మీ చదువుకున్నోళ్ళతో ఇదేనయ్యాబాబూ సమస్య” అని తనొక జ్ఞానగుళిక విసిరాడు.
ఈసారి ఖంగుతునడం నావంతయ్యింది. ఆ షాక్ లో…”హీరో వెధవ – హీరోయిన్ తింగరిదీ ఐతే సరిపోతుందా ప్రేమకథకు?” అని కొంచెం గౌరవప్రదమైన వెటకారంగా అన్నా. అందుకతను నవ్వుతూ “పోస్టరు చూసి సినిమా కొచ్చిన ఎవడికైనా వీళ్ళు హీరో హీరోయిన్లని తెలుసు. అలాంటప్పుడు మనం కొత్తగా వీడు హీరో కాదు ఒక పాత్ర. ఆ పాత్ర మరో ఆడపాత్రతో ప్రేమలో పడుతుంది. అదే హీరోయిన్ను. వీళ్ళ ప్రేమకి కారణాలు ఇవి. అని చెప్పఖ్ఖర్లేదయ్యా” అని నాకు జ్ఞానబోధ చేశాడు.
నా బుర్రతిరిగి భూమ్మీదకొచ్చింది.
So, మొత్తానికి నాకు తెలిసొచ్చిందేమిటంటే తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్ ప్రేమించుకోవడానికి కారణాలు అవసరం లేదు.
హీరో హీరోయిన్ అయితే చాలు. ముఖ్యంగా హీరో పరమవెధవ, హీరోయిన్ తింగరిదీ అయితే మరీ సౌలభ్యం.
ఏ కారణం లేకుండా ఖచ్చితంగా హీరో హీరోయిన్ను ప్రేమించేస్తాడంతే!
జైహో తెలుగు సినిమా !
sreenivas pappu says:
శంఖంలో పోస్తేకానీ తీర్థం కాదన్నట్టు బాగా జ్ఞానోదయం చేసినట్టున్నాడు సినీజీవి ఎవరో.ఇంతగొప్ప మేధావులుంటే తెలుగు సినిమా ఎందుకు బాగుపడుతుంది మరి.
అందుకే పునాదులతో సహా మాడిమసైపోయి ఆ బూడిదల్లోంచి కొత్త జీవం పుట్టుకురావాల్సిందే.
సుజాత says:
ఇన్నేళ్ళుగా తెలుగు సినిమాలు చూస్తూ కూడా హీరో హీరోయిన్ తో ప్రేమలో పడటానికి కారణాలు వెదికారా మీరు? ప్చ్…మీకు తెలుగు సినిమా రంగంలో మంచి కమర్షియల్ భవిష్యత్తు ఉండేట్లు లేదే!
కాబోయే డైరెక్టర్ లాజిక్ బానే ఉంది! మీకే అర్థం కాలేదు.
K మహేశ్ కుమార్ says:
@సుజాత: నిజమే…నాకే అర్థం కాలేదు.
అతని లాజిక్ సినిమాలు ఎలా ఉన్నాయి/ఉండాలి అనే పద్దతిలో ఉంటే, నాది ‘ఈ సినిమా కథ’ ఎలా ఉండాలి అనే కోణంలో సాగింది.కాంప్రమైజ్ ఎక్కడవ్వాలో ఇంకా తెలిసి రాలేదు
V. Chowdary Jampala says:
చక్రపాణి (విజయా ప్రొడక్‌షన్స్) గారి గురించి చెప్పబడే అనేక కథలలో ఒకటి:
గుండమ్మ కథ సినిమాలో నాగేశ్వరరావు, జమునల ప్రేమను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని ఎవరో అన్న మాటకి జవాబుగా:
“ఆడు నాగేశ్వర్రావు, అది జమున. వారిద్దరూ ప్రేమించుకోకపోతే నువ్వూ నేనూ ప్రేమించుకొంటామా”?
అబ్రకదబ్ర says:
వీరోవిను విలన్ని పేఁవించినట్టో, లేపోతే వీరో సైడు వీరోని పేఁవించినట్టో కత రాత్తే పోలా? దెబ్బకి ప్రేక్షకులకి పట్టిన దెయ్యం వదులుద్ది.
వెంకట్ గోపు says:
మన తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ ని లేదా హీరోయిన్ హీరోని చూడగానే అది ఒక జన్మజన్మల బంధంలా ప్రేమ పుడుతుంది, అది అంతే! ఎందుకంటే వాళ్ళు హీరో, హీరొయిన్ కాబట్టి!! అలా ఎందుకు, ఎలా అన్న లాజిక్ కూడా తట్టదు మన బుర్రలకి!
ఇది తెలుగు సినిమా శాసనాల్లో ఒకటి!!
u says:
same comment as sujatha ! pch ! no hope for you in telugu industry due to lack of basic telugu movie knowledge.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
సినిమా ప్రపంచం బయట వాళ్లు హీరో హీరోయిన్లు – అది వారి వృత్తి…ఎంత స్టార్స్ ఐనా కథ ప్రపంచంలో వాళ్లూ మనుషులే(కాదు అని ఎవరైనా అంటే సినిమా అనే మందుకి వాడు బానిసైపోయాడనే అనుకుంటాను, మత్తులో ఉన్నవాడికి స్పర్శ ఙ్ఞానం ఉండదు)…….అప్పటి కాలం వేరు…చక్రపాణి మనలా తెలివి తక్కువ వాడు కాదు….అప్పటి ప్రేక్షకుల గురించి బాగా తెలిసి వాడిన మాట అది….ఇప్పటి ప్రేక్షకులు చదువుకున్నారు….తార్కిక దృష్టి ఎక్కువ…సో….
పాత్రల ఫీలింగ్స్ తో ఎంపతైజ్ అవ్వాలంటే (తాదాత్మ్యం చెందటం) వాటిని చూడటం వినా వేరే దారి లేదు…..
ఉదా : టైటానిక్,గీతాంజలి,రోజా….etc…
అభిమాని says:
1965 లో వచ్చిన ‘ప్రేమించి చూడు’(అక్కినేని,రాజశ్రీ, జగ్గయ్య, కాంచన)సినిమాలో టైటిల్స్ అయిపోయిన వెంటనే ‘దొరికేరు దొరగారు’ యుగళగీతం మొదలైపోతుంది. Establishing love లాంటివి ఏమి ఉండవు. అప్పట్లో అదొక సాహసోపేతమైన ప్రయోగంగా దర్శకులు పి.పుల్లయ్య గారిని ఎందరో ప్రశంసించారు. అందుకు ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆ సినిమాలో ఆ ‘ప్రేమని ఎలా సాధించుకున్నారు’ అనేదే ముఖ్యాంశం కాని ఎలా ప్రేమలో పడ్డారన్నది కాదు.
ఆ రకంగా చూస్తే కథ pre-ప్రేమ ప్రధానంగా నడుస్తుందా, post-ప్రేమ ప్రధానంగా నడుస్తుందా అన్నదాన్ని బట్టి, అవసరమైతే establishing part ని వదిలేసినా తప్పు లేదని నా అభిప్రాయం.
(PS: ఇంగ్లీష్+తెలుగు కలిపిన అతిదుష్ట సమాసానికి క్షంతవ్యుడిని)
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
గుండమ్మ కథ ఎవరిదో ఆ మకుటం(టైటిల్) చూస్తేనే అర్ధం అవుతుంది…అది నాగేశ్వరరావు,జమున ల ప్రేమ కథ ఎంత మాత్రమూ కాదు.
నాగేశ్వరరావు,జమునలు సపోర్టింగ్ పాత్రలు…..వారి ప్రేమని ప్రేక్షకులు ఫీల్ అయ్యే రేంజి లో ఎస్టాబ్లిష్ చెయ్యల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.
ప్రధాన పాత్ర గుండమ్మ లో మార్పు కోసం పాటు పడే పాత్రలే అవి……దీనికి రామారావు పాత్ర ఎక్కువగా శ్రమిస్తుంది కనుకనే ఆ పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కలిగివుంది.
అప్పటి వారు మహా మేధస్సు కలిగిన వారు……వారిని ఈ తుక్కు ముక్కలతో జమ కట్టకండి…..వారు చెప్పినవి చేసినవి కనీసం అర్ధం చేసుకున్నా చాలు…ఆణిముత్యాల్లాంటి చిత్రాలు కాకపోయినా కనీసం మంచి సినిమాలే తియ్యొచ్చు.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
@అబిమాని – మకుటం చూడండి…..ప్రేమించండి కాదు…ప్రేమించి చూడు…..ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుంది అనే కదా దాని అర్ధం…..
title tells the story & genre….what does it mean positioning the audience.
మనకి ఇదంతా తెలియకపోయినా…మన మనసు వాటిని గ్రహిస్తుంది….మకుటం యొక్క ప్రాధాన్యతల్లో ఇది ఒకటి కదా.
geethoo says:
haha..so funny.
Mahesh garu, a question:
స్టోరీ line కాకు౦డా, whole script తో వెళ్ళరా? discussions కి?
I was taking to my grandpa who worked on dialogues dept. for couple of సుత్తి movies. He said the same thing. directors/producers will listen to the story-line. నచ్చితే, further ఆలోచిస్తారు or develop చెస్తారు అని. నిజమేనా?
దీనిని బట్టి చూస్తే..writers కి అసలు importance లేదు అనిపిస్తు౦ది. what do you think?
K మహేశ్ కుమార్ says:
@గీతూ: చాలా ఇరుకునపెట్టే ప్రశ్న వేశారు.
ప్రస్తుతానికి పరిశ్రమలో పూర్తి స్క్రిప్టు రాసుకునేవాళ్ళు వేళ్ళమీద లెక్కించొచ్చు. ఒకవేళ పూర్తిస్థాయి స్క్రిప్టు మనం రాసుకున్నా, చదివే ఓపిక, తీరిక చాలా మంది నిర్మాతలకు/దర్శకులకూ ఉండదు. చదివినా దాన్ని visualize చేసుకునే తీరులో మనోళ్ళింకా ఆరితేరలేదు. దానికి కారణం ఒక standardized script format మనకు లేకపోవడం. హాలీవుడ్ ఫార్మేట్ ను తెలుగు సినిమా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో adopt చేసుకోకపోవడం. కొంతమంది హాలీవుడ్ ఫార్మేట్లో రాస్తున్నా, అది ఇంకా పరిశ్రమకు అలవాటు కాకపోవడం. ఇలా కర్ణుడి చావుకి వందకారణాలున్నాయి చెప్పుకుంటూ పోతే.
పూర్తిస్థాయి స్క్రిప్ట్ మన కోసం రాసుకోవడం వరకూ బాగానే ఉంటాయిగానీ, mainstream industry అవసరం కోసం రాయడానికి కొంత process ఉంటుంది. మొదటగా ఒక సింగిల్/డబల్ పేజ్ “ఐడియా” వినిపించడం. ఇందులో థీం,స్థూల కథ, కథన విధానం/వైవిధ్యం గురించి పరిచయం, ఒకవేళ వీలైతే దాని వ్యాపారాత్మక ప్రాముఖ్యం ఉంటాయి. అది నిర్మాతా/దర్శకుడికి నచ్చితే పరిశ్రమ భాషలో “ట్రీట్మెంట్” రాయమంటారు.హాలీవుడ్ పరిభాషలో చెప్పాలంటే ఇది step-outline అన్నమాట.ఇది 20-40 పేజీలు ఉంటుంది.
ఈ స్టెప్ అవుట్ లైన్లోనే ‘సీన్ ఆర్డర్’మిళితమై ఉంటుంది. ఇది నచ్చితే రచయితకు అడ్వన్స్ ఇచ్చి సినిమా మొత్తం రాయమంటారు. ఒకవేళ నిర్మాత/దర్శకుల ఆస్థాన రచయితలుంటే ఆ ట్రీట్మెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టి రాయమంటారు. ప్రస్తుతానికి “స్క్రీన్ ప్లే” తెలుగు పరిశ్రమలో ఏ రచయితా రాయరు. వాళ్ళు రాసేదల్లా కథావిస్తరణ మాత్రమే. అందులో description ఎడమవైపు, కుడివైపున డైలాగులూ రాసి పనికానిచ్చేస్తారు.
ఇంకా ప్రమాదం ఎక్కడొస్తుందంటే ఐడియా ఒకడి దగ్గర తీసుకుని, ట్రీట్మెంట్ ఇంకోడి చేత రాయించి, మళ్ళీ ఆట్రీట్మెంటుని నలుగురికిచ్చి నాలుగు వర్షన్లు రాయమంటారు. ఆ తరువాత వాళ్ళ ఆస్థాన విద్వాంసుల్ని పిలిచి అ నాలు వర్షన్స్ లో వచ్చిన మంచి సీన్లను ఏరి ఒక చోట పోగేసి సినిమాగా రాయమంటారు. మరో ఇద్దరి చేత ఆ అతుకుల బొంతను అల్లించి వాళ్ళకు స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇస్తారు. ఇక మాటల రచయితలు ఉండనే ఉన్నారు. వీళ్ళేం రాస్తారో వాళ్ళకే తెలియాలి
ఇలా తెలుగు సినిమాలో “కథ” అనే మాట ఎక్కడా వినపడకుండా సినిమాలు తయారైపోతాయి. అందుకే ఈ బాధంతా. కథ ఉంటే పాత్రలుంటాయి. పాత్రలుంటే వాటికి వ్యక్తిత్వాలుంటాయి, వ్యక్తిత్వాలుంటే వాటికి గమ్యాలుంటాయి, గమ్యాలంటే ఘర్షణ ఉంటుంది. అప్పుడే కథ రక్తి కడుతుంది. ఇవేమీ లేకుండా తెలుగు సినిమా కథ నడిచి పోతొంది. సినిమా నుంచీ సినిమా పుడుతోందేతప్ప కథ నుంచీ సినిమా తయారు కావడం లేదు. అది జరగాలనే మ ప్రయత్నం. చూద్దాం!
geethoo says:
@Mahesh garu, I was reading your detailed post again.
I am just curious:
How did the process go in the movie ‘NEW’. Who had the story line? who wrote the screenplay? I know you did the ‘dialogues’ part. Can you elaborate your experience on it? (if you are allowed to or If you can)
also, కథా విస్తరణ and screenplay కి తేడా clear గా చెప్తారా ప్లీజ్.
K మహేశ్ కుమార్ says:
@గీతూ: ‘న్యూ’ గురించి రాయాల్సింది, చెప్పాల్సిందీ చాలా ఉంది. సినిమా రిలీజు కోసం ఎదురుచూస్తున్నాము. అదైపోయిన తరువాత వివరంగా రాస్తాను.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
పరుగు సినిమా చూసే ఉంటారు…… దాన్లో ప్రకాశ్ రాజ్ కూతురు కోసం ఏడుస్తుంటే….నాకు ఎందుకేడవాలో అర్ధం కాలేదు…వారి మధ్యన అనుబంధం చూడకుండా లోపల ఫీలింగ్స్ ఏలా కలుగుతాయి???దార్లో అమ్మాయి కనిపిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి అని ఒకడు అంటే ఆ అమ్మాయికి వాడ్ని ఎందుకు ప్రేమించాలో అర్ధం కాదనుకుంట కదా……ఇడియట్ గురొస్తుందేమో…..ఆ ఒక్క సీన్ వల్ల ఆ సినిమా ఆడిందంటే….అలా అన్నవాడి సినిమా పరి ఙ్ఞానాన్ని శంకించాల్సిందే……ఫీలింగ్స్ సంభాషణల్లో పలికించేవి కాదు……కథ అవసరాన్ని బట్టే సన్నివేశాలుంటాయి…..సన్నివేశాలు రస ప్రాధాన్యతని బట్టి రాస్తారు.
సారాంశాన్ని బట్టి రసపోషణ ఉంటుంది. హీరోల మీద అధారపడటం అనే మత్తు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని నా అభిప్రాయం…..హిట్ లేక దిక్కు తోచని స్థితి లో ఉన్న హీరోల మీద అధారపడి వీళ్లేం చేస్తారో??
Shankar Gangadhari says:
ఏ కారణం లేకుండా ఖచ్చితంగా హీరో హీరోయిన్ను ప్రేమించేస్తాడంతే! తెలుగు సినిమాల్లొ ముమ్మాటికి ఇప్పుడు అదే జరుగుతుంది..
జైహో
sudha says:
@అబ్రకదబ్ర
హీరోయిన్ విలన్ ని ప్రేమిస్తే వాడు హీరో అయిపోతాడు…..(ఎన్ని సినిమాలు చూళ్ళేదూ)
సైడు వీరోయిన్ని ప్రేమిస్తున్నాడని అనుకుంటే అదే హీరోయిన్ అయిపోతుంది. అందువల్ల చెప్పొచ్చేదేంటంటే …. హీరోగా, హీరోయిన్ గా ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడిపోయిన వాళ్ళే హీరోలు, హీరోయిన్లు.
వాళ్ళు ఎవరిని ప్రేమిస్తే అవతలి వాళ్ళు హీరోహీరోయిన్లు. అదలా డిసైడింగయిపోయింది.
పాత్రలకి మూసపోసి కొన్ని లక్షణాలు ఆపాదించి పెట్టాం. అందులోంచి బైటకి రావడం వీజీ కాదు.
ప్రేక్షకులకి పట్టిన దెయ్యం దిగిరావాలంటే అద్భుతమైన చిత్రరాజాలు తీసిన మన సినీ తాతలు దిగిరావాల్సిందే.
అబ్రకదబ్ర says:
వీరో సైడు వీరోని పేఁవించాలన్నా, సైడు వీరోయిన్ని కాదు
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
ఓ దర్శకులు నిర్మాతలు నటులు రచయితలు అనే నియంత లారా…… సినిమా కథని మీ ఇష్టం వచ్చినట్టు కైమా (లేదా హలీమ్) చేసుకోండి…సమస్య లేదు….
ప్రేక్షకుల్ని చూడమని ఆహ్వానించకండి…….రాజకీయాలు సినిమా వాళ్ల చేతుల్లో లేవు కాబట్టి సరిపోయింది..లేకపోతే జిజియా పన్ను వేసే వాళ్లు…థాంక్ గాడ్.
viplove says:
@Mahesh
experience is rather funny…
but why “jai ho telugu cinema” at end as if this one wud-be-director person is some iconic figure and his attitude IS telugu cinema. even if there are 99% of them, they dont define “telugu cinema” as such..may be they just define trend of this age.. You can make fun of people but not culture ( i believe cinema is also a culture). it is like , if one idiot eats a pizza for ugadi, and we say ,damn fake telugu new year!!!
K మహేశ్ కుమార్ says:
@విప్లవ్: నేను కలిసిన దర్శకుడు ఈ భావజాలానికి ఒక ఉదాహరణ మాత్రమే. కాకపోతే పరిశ్రమ మొత్తంలో ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉంది అనేది మీరుకూడా అంగీకరిస్తున్న విషయం. అది ఎంతవరకూ పరిశ్రమ పరిణితికి దోహదం చేస్తుంది అనేది నా మూల ప్రశ్న. ఆ అసహనంలోంచీ “జైహో తెలుగు సినిమా” అని ముగించడం జరిగింది. అది పరిస్థితి పట్ల నా అసహనమే తప్ప మొత్తంగా పరిశ్రమను అవమానించాలనే ఆలోన లేదు.
నేనూ ఈ సినిమాని ప్రేమించేవాడినే, కానీ మార్పుని కోరుకుంటున్నవాడిని. ఉన్న లోపాల్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? లోపాల్ని ఎత్తి చూపించకుండా కళ్ళు మూసుకుని పిల్లి పాలుతాగినట్లు మనమూ ప్రవర్తిస్తే ఎట్లా? అందకే కొన్ని ఆత్మవిమర్శలూ, ఎత్తిపొడుపులూనూ! ఇదొకదారి. ఇది తప్పని తెలుసుకుంటే నా వ్యవహారం మారుతుందేమో…లేదా నా harsh tone వల్ల కొందరు మారతారేమో…సమయమే నిర్ణయించాలి.
viplove says:
@mahEshgaru
నాకు తెలుసు అది అసహనంతో వచ్చిన మాటే అని..
ఎలా అయితే ఒక సినిమా తీసాక నేను తీయాలి అనుకున్న చిత్రం వేరు మీరు అర్థం చేసుకున్నది వేరు అని దర్శకుడు ప్రేక్షకుడికి చెప్పాల్సిన అవసరం రాకూడదో…అలాగే… సినీ ప్రేమికులుగా…తెలుగువాళ్ళగా రెండు “identities” ఉన్న మనం ఆ రెండిటినీ కాపాడుకుంటునే ఒక ప్రేమ మరొకదాన్ని మింగేయకుండా చూసుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం.
ఇంకా తిట్టండి…వ్యక్తులను. అవమానించండి, చీల్చిచెండాడండి కానీ అదంతా ఏ సినిమాకు ఆ సినిమాకే పరిమితం అవ్వాలి కానీ అన్ని సినిమాలకూ కలిపేసి కాదు అని. ఉదాహరణకు… నాలుగు బ్రూస్లీ సినిమాలో , షరాన్ స్టోన్ సినిమాలో చూసి ఈనాటికీ ఇంగ్లీషు సినిమాలంటే రక్తం , సెక్సు తప్ప ఏమీ ఉండవు అనుకునేవాళ్ళూ ఉన్నారు. అలాగే ఇల్లాంటి అవకతవక మనుష్యులు ఒక దశాబ్దంపాటు తెలుగు సినిమాను సామూహిక అత్యాచారం చేసినా, చేస్తున్నా…. మనవరకూ ఆ “తెలుగు సినిమా” ఒక పవిత్రమైనదే కదా !
geethoo says:
wow…thanks for the input Mahesh garu. నా కళ్ళు ఒక్కసారిగా తెరిపి౦చారు. thanks for your time.
ummm…I was excited to see Shekar Kammula, Deva Katta started changing the process…but still they are writer-directors not just writers.
I was just writing my ‘statement of purpose’ to join the ‘screen writing course’ and మీ ఈ post చూసాక కొద్దిగా disappointed. by the way, నేను మీకు లాగె ఒక aspiring writer ని.
anyways, I hope things get better in the industry and more educated people come into the scenario of writing and making films.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
@Geethoo : I suggest u few books if u r interested in reading.
1.Story by Robert Mckee
2.Screenplay & Screenwriters problem solver by Sid Field.
3.Hero with a thousand faces by Joseph Campbell
4.screen writing is story telling by Kate wright
5.True art of screenwriting by Blake Harris (available on net)
and to understand the visual grammer
1.shot by shot
2.5C’s of cinematography
3.settingup your shots.
4.technique of video and film editing.
will help u understand the craft better
K మహేశ్ కుమార్ says:
Blake Snyder: Save the cat కూడా కలుపుకోండి.
http://www.blakesnyder.com/
geethoo says:
Thank you Aditya and Mahesh garu,
@ Aditya: I browsed few pages (sneak peek) in ‘hero with a thousand faces’. It covers more non-filmy stuff. Have you read this book already?
Screen writing is story telling and True art of screenwriting books amazon లో దొరకలేదు. probably I need to find them in other place.
one more question: where are you pursuing your film-making(?) course?
@ Mahesh garu: thanks for the link. I added all the books in my amazon wishlist. right now I am covering SydField’s foundations for screen writing. I also bought ‘shot by shot’ which is pretty interesting.
I am starting my on-line course @ NYFA from next month. I will be sharing my experience on a regular basis.
thanks.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
@Geethoo : i didn’t read Hero with a thousand faces.as far as im concerned…it’s all about cultural(story) evolution..but author introduced 12 sequential structure in that book – author of screenwriting is storytelling mentioned that 12 sequence structure…. i suggest u to read 20 master plots it will be useful.
i didn’t get any degree/diploma on filmmaking.just studied the craft all by myself….now im writing a script for my debut film.
i’ve these books…if u r interested so…let me know.
u can xerox these.
geethoo says:
thank you ఆదిత్య గారు,
but I live in US. I will buy the books suggested by you anyways. but I love to meet you and మహేశ్ గారు when I move there next year.
one question: are you using any software to write your debut script?
K మహేశ్ కుమార్ says:
@గీతు: at NT we strongly recommend Celtx (http://celtx.com/download.html).
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
no s/w…i write it on a notebook. pen & paper….i feel romantic when i write it on paper.
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
mahesh garu…have u seen my recent posts? added to NT.
i was just practicing the craft….appears on video/film making category on NT….wt do u do..
K మహేశ్ కుమార్ says:
mail me : mahesh@navatarangam.com
chinnari says:
ఇన్త డీస్క శన్ అనవసరమ్. హీరొ ప్రెమిన్చాడు కాబట్టె ఆ పిల్ల హీరొఇన్ అయిన్ది.హీరొఇన్ ప్రెమిన్చిది కాబట్టె వాడు హీరొ అయ్యాడు.కొతి మొకము రాజు కప్పగన్తుల రాణీ
ఆ.సౌమ్య says:
అదేదో సినిమాలో చెప్పారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమొచ్చేస్తుందంట.
అయినా హీరోయిన్ కి బలమయిన పాత్ర లేకపోవాడం అనేది ఇప్పటి సమస్య కాదు. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుండీ ఉన్నదే. అదపాదడపా మిస్సమ్మ (పాతది, కొత్తది), మల్లీశ్వరి (పాతది) స్వాతి, అనుకోకుండా ఒకరోజు లాంటి కొన్ని హీరోయిన్ సబ్జెక్ట్స్ సినిమాలలో తప్ప ఎప్పుడో హీరోకే వ్యక్తిత్వముంటుంది. ఈ సమస్య సినిమాది కాదు, సమాజానిది. సమాజంలో మనుషులే సినిమాలలో పనిచేస్తారు. అదే సినిమాకి ఆపాదించబడింది. ఇంకా నయం ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ ఎలా ఉండాలో చెప్పాట్లేదు. పాత సినిమాల్లో అయితే భారత పతివ్రతలా ఉండాలని ఒకటే పాఠాలు చెప్పేవారు. ఈ రోజుల్లో పాఠాలు లేవుకానీ, వ్యక్తిత్వమూ కూడా లేదు…ఒళ్ళు చూపించుకోవడం ఒకటే ఉంది.
K మహేశ్ కుమార్ says:
జోకులు పక్కనపెట్టితే, మీరు చాలా విలువైన observation ముందుంచారు. సమాజపు వైఖరి సినిమాల్లో ప్రతిఫలించడం, ముఖ్యంగా మహిళల విషయంలో ముమ్మాటికీ నిజం. దీనికి విరుగుడు కావాలి.అందుకే మారిన సమాజపు మహిళల పాత్రలు సినిమాల్లో రావాలి. అది కాకపోతే హీరోకోసం పాటలు పాడటానికీ, ప్రేక్షకులకోసం ఒళ్ళు చూపించడానికీ తప్ప కథానాయకికి మరో పనుండదు.
ఆ.సౌమ్య says:
‘పరుగు’ సినిమా
తండ్రీకూతుళ్ల అనుబంధం గురించి గొప్పగా చెప్పలనుకుంటూ, తెలిసో తెలియకో స్త్రీని జస్ట్ ఒక బొమ్మగా చూపించిన సినిమా అది. ఒక వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు లేకుండా తండ్రి ప్రేమకో, ప్రియుడి ప్రేమకో అంకితమయిపోయే కూతురు/ప్రేయసి కథ అది.
ఆ.సౌమ్య says:
మార్పు వచ్చింది కదా….బట్టలు తక్కువ వేసుకోవడంలో
కొత్తపాళీ says:
fantastic!
నేను కూడా నాగేస్సర్రావు, జమున, చక్రపాణి కథే చెబుదామనుకున్నా – జంపాల గారు చెప్పేశారు
ఇంకో మాట – ప్రేమ అనేది అందం ఆకర్షణలకి సంబంధించినదైతే, తెలుగులోనూ (నాగభూషణం, కృష్ణంరాజు, మోహన్ బాబు) తమిళంలోనూ (నంబియార్) విలన్లు చాలా అందంగా ఉండేవాళ్ళు, ఒక్కోసారి ఆయా హీరోలకంటే ఎక్కువగా. ఐనా హీరోయిను ఎప్పుడూ హీరోనే ప్రేమించింది! ప్చ్!!
hanu says:
nijame namDi,, mana vaLLaki avemi avasaram ledu, hero i love u anTe chaalu heroine i too anestumdi ante….
sujata says:
హ హ ! హీరో హీరోయినూ మొదటి సారి ఒకరినొకరు చూసుకుని కొన్నినానో సెకండ్లలోనే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడం – తిరుగులేని సినీ ఫార్ములా !
ఇంకో ఫార్ములా – ప్రేమలో పడ్డాకా, ‘ప్రేమంటే ఇదేనా ?’ అని డబల్ చెక్ చేసుకోవడం.. ఆ తర్వాత అది ప్రేమేనే అని ఇంకోరెవరో కంఫర్మ్ చేసాక సంత్ర్ప్తి చెందడం..
మూడోది – నేను ప్రేమించాను గాబట్టి నన్ను ప్రేమించూ అని వెంటపడడం, హీరోయిను తప్పకుండా ఒప్పేసుకోవడం.
మేం చదువుకుంటున్నపుడు హృదయం అని ఒక సినిమా వచ్చింది. దాన్లో హీరో ప్రేమను హీరోయిను స్వీకరించదు. అదో సెన్సేషనల్ సబ్జెక్టు ఆ రోజుల్లో !
vijay says:
PRATHIGHTANA,ANKURAM lanti manchi heroine oriented cinema lani marachipothe yela?
Prekshakulu normal ga hero, heroin’s lo thamanu identify chesukuntaru.Valla (ante mana) positive sense santrupthi parachadaniki adhi chala avasaram,
శ్రీనివాసమౌళి says:
అసలు ప్రేమించటం అంటే ఏమిటి?
SHANKAR says:
వయసులో వచ్హే వంటి తీట.
Krishna Chaitanya says:
మరీ ఇలా చెప్తున్నానని అనుకొకండి, ఓక సారి చక్రపాణి గారు ఇలా అన్నారు, “స్టార్స్ ఉంటె సౌలభ్యం ఇదె…వీరు ప్రెమ లొ పడతారు అని జనానికి చెప్పవలసిన అవసరం రాదు…ఎందుకంటె వాళ్ళు ప్రేమ లొ చివరికి అయిన పడతారని ఊహించుకునే cinema కు వస్తాడు…ఆదే కొత్తవాళ్ళతొ ఐతె వారు ప్రేమలొ పడడానికి చ్హాలా కసరత్తు చేయాలి”
keshavcharan says:
ప్రేమించుకోవడం అంటే ఏన్టో తెలుసుకోవాలనుకునే వారికి నేనైతే ‘ఉపేంద్ర’ సినిమా చూపిస్తాను. చక్కగా చెబుతాడు.
నిజానికి మన వాళ్ళ సినిమాలలో ఈ ప్రేమ trend ని break చేసిన సినిమాలు లేకపోలేదు. ఐతే, క్షణక్షణం, అనుకోకుండా ఒక రోజు,బంగారం, నా ఆటొగ్రాఫ్ (భూమిక) నుండీ మొన్నటి వేదం వరకూ చాలా చూస్తూనే ఉన్నాం…..గమనించట్లేదు అంతే. అంతా కథలో ఉందండీ. అయితే ఇందులో చాలా మటుక్కు చిత్రాలు సరిగ్గా ఆడలేదనుకోండి ! యథా ప్రజా తథా సినిమా.
keshavcharan says:
ఇంకొకటి మర్చిపోయా…డేంజర్
vijay says:
MRUGATRUSHNA cinema,Revathi,Sharath Babu, raja ravindra in main leads, shows why heroin has to love hero only.
Very good movie asusual known recognozed it.
ramgopal says:
naa idea prakaram script hollywood format lo untene correct anadam sari kadu
script aneddi na drustlo shoot lo etuvanti confusions lekunda oka school pilladu thana hme work cheskoni ela velthado ala undali anthe
director thana team ki ardamayye reethi lo unte chaalu ani naa abiprayam
vallu ela raskoni vallaki shoot chesepudu easy ga unte chalani naa abiprayam…nenaithe naa script na own format lo raskuntunna
K మహేశ్ కుమార్ says:
@రాంగోపాల్: హాలీవుడ్ ఫార్మేట్ అనేది గాలిలోంచీ ఊడిపడలేదు. సినిమా అనే మీడియం ను అక్షరాల్లో ఎలా పెట్టొచ్చనే విషయాల్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రయోగించి, ఫలితాన్ని పొంది రూపొందించిన సాహితీ ప్రక్రియ అది. కథలు, నవలలు,కవితలు, నాటకాలకు ఎలా ఒక నిర్ధిష్టమైన రూపం, లక్షణం అంగీకరించిబడి ఆమోదం పొందుంటుందో అలాగే స్క్రిప్ట్ రైటింగ్ అనేది కూడా.
కవితని నాకు అర్థమౌతుంది కాబట్టి తవిక లాగా రాసుకుంటాను అంగీకరించండి. కథని తక లాగా రాసుకుంటానూ అంటే కుదురుతుందంటారా!
Ramgopaul says:
mahesh garu naascript emi oka naval kaadu andariki ardamavadaniki …nenu katha ni thaka leka thoka ani raastha adi naa school members ki ardam avuthe chaalu. meeru cheppinattu aksharalu ,format andaru raase chintakaya pachadi chesthe cinema emanna 100days adesthunda leka naa own format lo raasthe cinema ardam avada..sir therakekkincheppudu chese work lo undi sir…katha ni lek meru ane format.. naaku nache reethilo raaskoni janaalaki nache reethi theesthanu ok na ..
geethoo says:
రామ్ గోపాల్ గారు,
మీ own format అ౦టే telugu, english movies కాకు౦డా నా?
Somewhere in ‘making of Ishqiya’ (hindi movie) I have seen that they followed hollywood format. under dialogues part they have script in Hindi. other than that most of the camera moment and other details were in english.
I think these days everybody is sticking to that ‘courier font with 12 size’ which is standard hollywood screenplay format. I think it has advantages like no. of pages is approximately equal to no. of minutes of the movie. Also I think existing formats లో రాస్తే in case somebody wants to read it proofread it for you it will be easier for them coz they have seen that format before. కొత్త formats అ౦టే కొద్దిగా కస్టమేమో ఆలోచి౦చ౦డి.
I think new generation in our telugu industry (including: Shekar’s school – Sai Kiran Adavi, Anish Kuruvilla and Deva Katta) are adopted hollywood format. I think it is better we follow the same because of the advantages it has. or atleast our old format (left side – camera moment and other details, right side – dialogues)
What do you think?
Ramgopaul says:
sekharkammul aneesh kurvilla leka pothe em chesevaru patha chinthakayapachadi giigigra tiruthu kv reddy garu ela rasaru adurthi garu ela rasaru telsukoni ala makki dimpetam anthega kothavallu vacharu kotha format techaru alge nenu na own faormat naku naaa school ki ardam avuthe chalu ..janaalaki cinema ardam avuthe chalu..scripy formt elane undalani emana G.o unda. script lo dammundali ..picturization lo power undali…anthe gaani scrip faormat elane undalani evadu chepale ..asalu nenu naa script lo action contty matrame raastha dialouges vere ga raatha adi naaku ala esy ga untundi..anthe ..nuvv kuda kotha format try chey boss
geethoo says:
Okay Ramgopal garu, మీ ఇష్ట౦.
మీ profile గురి౦చి తెలుసుకోవచ్చా? What you do? Have you done any projects before?
Ramgopal says:
geeto garu hero heroine ne preminchali edi darmam heroine vere vadini premisthe danni kamam antaru mana prakshkulu nijam kadantara hero vere ammayini premiste adi mosam antaru ….edi varasa ee varasa ni ela vaadukuynna chivaraki mana varasaki ravala leka pothe mana box office boxlu baddalvutai daniki A certificate istaru mana cesorvallu …dammunte sita ni ravanasuridiki kalapamanandi evaraithe e topic etharo vallani …manitratnam ke vaasipoyindi theda chesthe ……mana valla mind set ki ala kudaradu opppukoru so ee discusion pakka na peetti mana poiunt ki vaddam ….. na profile gurchi adfigaruga ….profile chepthe konni addam v astai ela juss friend ga iyithe open avuthayi …..enjoiiiiiiiiiiiiiiiiiii
raghunadh says:
your expressed your critic very artistic way. very good brother keep maintain that quality.
comment plz says:
guys if you have tome will u plz comment on my frends short film
the buddy
http://www.youtube.com/watch?v=bIYA8daE3Ng
tell me how to post it properly
shashi mohan.pingali says:
friends you are making this a serious debate by stretching your mind,it is not that hero loves heroine or heroine loves hero….. but it is just as simple as that a boy loves a girl that can happen to anyone and anywhere…..
But when you want people or audience(sorry spectators)get convinced with your narration in script or cinema that a (this so and so)girl loves this boy,unexpectedly you show him different i..e with a lot of good qualities or above the rest or even paragon of virtues and what ever the deeds he makes in the process will earn him famous(not only heroine of course everyone falls in love with good qualities)there by you called him hero సిమ్ప్ల్ల్ల్గా చెప్పవలె౦తె oka అమ్మయ్ ఆ అబ్బయ్ని love cheyadaniki anni arhathalu unna vyakthi hence termed as hero
it is foolish to question why sita cannot be shown as loving ravana ,,,,because when ravana is presented as hero then automatically the lady lead is heroine and u can even name her sita ( there are many films where ntr acted as ravana as lead character)but not the sita of rama s wife because that character will not come in this plot.boss you are trying to link two different plots
u cant ask why illeana is shown as girl friend of mahesh in pokiri but the not charmi of mantra………because both are different plots altogeher(actually she does’nt exist in this plot)
like wise when we made hero with some super and extra qualities in comparison we show other with bad nature so that there arises a hate towards this character………so obviously girl loves the former than the later
K మహేశ్ కుమార్ says:
@పింగళి శశిమోహన్: మీరు వ్యాసాన్ని పూర్తిగా వేరే కోణంలో అర్థం చేసుకున్నారు. వ్యాసమూ చర్చా హీరో హీరోయిన్ని ప్రేమించాలా లేక విలన్ను ప్రేమించాలా అని కాదు. మన సినిమాల్లో తరుగుతున్న పాత్రల ఔచిత్యాలు చిత్రీకరణల గురించి.
మొన్ననే బిందాస్ అనే ఒక సినిమా చూశా…;)
సినిమా మొదలవగానే హీరో ఎంత పరమనీచమైన వెధవో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తరువాత హీరో-హీరోయిన్ ఎంత దిగజారి ప్రవర్తిస్తారో చక్కగా చూపిస్తారు. ఇంతలో హఠాత్తుగా ప్రేమ ప్రేమ అని డూయెట్ పాడుకుంటారు. ఇంత ప్రహసనంలోనూ వీళ్ళ characters కి వీళ్ళ ప్రేమకీ అస్సలు సంబంధం ఉండదు. ఇలాంటి భావాదారిద్ర్యాన్ని మనం కమర్షియల్ సినిమా పేరుతో నెత్తికెక్కించుకుంటున్నామన్న బాధే ఈ వ్యాసానిది కూడా.
కాబట్టి మీరు అసలు విషయాన్ని వదిలేసి కొసరు విషయాని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. పైగా మీరు random గా వాడేస్తున్న plot, character తో చాలా పెద్ద confusion సృష్టిస్తున్నారు.
hari says:
why because cinimalo hero kaabatto hero heroinene love cheyali.
Gowri Kirubanandan says:
పండగ అన్న సినిమాలో శ్రీకాంత్ నాగేశ్వరరావు కొడుకు. కానీ ఎవరికీ ఆ విషయం తెలియదు. నాగేశ్వరరావు చెల్లెలు కూతురుగా నటించిన రాశి డైలాగ్స్ ఎంత చండాలంగా ఉంటాయంటే,
చీటికీ మాటికీ శ్రీకాంత్ ని మాటలతో హింసిస్తూ ఉంటుంది. ఒకసారి పిల్లలందరినీ తండ్రి పేరు అడుగుతుంది.అందరూ తమ తమ నాన్న పేరు చెప్తారు. శ్రీకాంత్ చెప్పకుండా మౌనంగా ఉంటాడు.. అప్పుడు ఆమె అంటుంది.” నీ తండ్రి పేరు నీకు మాత్రమే తెలియదా? లేకపోతే మీ అమ్మకి కూడా తెలియదా? ”
సభ్యత లేకుండా మాట్లాడిన ఆ హీరోయిన్ తోటే మళ్ళీ శ్రీకాంత్ డ్యూయట్ పాడతాడు. ఇదీ మన తెలుగు సినిమా సంస్కృతి!