చూడకపోతేనే ‘హ్యాపీహ్యాపీగా’

Happy Happy ga Wallpapers (9)

ఓ లవ్ స్టోరీ.. ఓ కామిడి ట్రాక్..ఫైనల్ గా చిన్న సెంటిమెంట్..ఇవి హిట్ ఫార్ములా దినుసులు అని ఫిక్స్ అయి రాసుకుని తీసిన చిత్రం హ్యాపీ హ్యాపీగా. ఈ ఫార్ములాకు దర్శకుడి ద్వారా అరవ మసాలా కలవడంతో ఫార్ములా వికటించి…(సినీ)పేషెంట్లు కూడా తినలేని ఓ కిచిడీలా తయారైంది. వరుణ్ సందేశ్…వరస ఫ్లాపులతో ఉండటంతో ఓపినింగ్స్ ఎలాగూ లేవు కనీసం మౌత్ టాక్ స్ప్రెడ్ అయి నిలబడేది..కానీ ప్రేక్షకులు నోట మాట రాని స్దితిలో పెట్టిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ కలే!

ఓ లవ్ స్టోరీ.. ఓ కామిడి ట్రాక్..ఫైనల్ గా చిన్న సెంటిమెంట్..ఇవి హిట్ ఫార్ములా దినుసులు అని ఫిక్స్ అయి రాసుకుని తీసిన చిత్రం హ్యాపీ హ్యాపీగా. ఈ ఫార్ములాకు దర్శకుడి ద్వారా అరవ మసాలా కలవడంతో ఫార్ములా వికటించి…(సినీ)పేషెంట్లు కూడా తినలేని ఓ కిచిడీలా తయారైంది. వరుణ్ సందేశ్…వరస ఫ్లాపులతో ఉండటంతో ఓపినింగ్స్ ఎలాగూ లేవు కనీసం మౌత్ టాక్ స్ప్రెడ్ అయి నిలబడేది..కానీ ప్రేక్షకులు నోట మాట రాని స్దితిలో పెట్టిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ కలే!

సంతోష్(వరుణ్ సందేశ్) అన్ని తెలుగు సినిమాల్లో లాగ ఓ అనాధ :) . నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్ గైస్ పేరుతో ఓ గిప్ట్ కార్నర్ తరహా వెరైటీ బిజెనెస్ చేస్తూంటాడు. తమకు కావాల్సిన వారుకి గిప్ట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కి షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేస్తూంటారు. సంతోష్ తన ఖాళీ టైమ్ లో ఎవరన్నా అమ్మాయి పడకపోతారా అన్నట్లు లవ్ లెటర్స్ పట్టుకు తిరుగుతూంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ (వేగ) పరిచయమవుతుంది. వెంటనే ప్రేమ పడిన అతను ప్రపోజ్ చేద్దామనుకునేసరికి..ఓ విషయం తెలుస్తుంది. ఆమెకి లవ్ అంటే సదాభిప్రాయం లేదని. దాంతో స్టైయిట్ గా ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా…తను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అబద్దమాడతాడు. ఎవరా చూపెట్టమని పూజ పట్టుబడితే…సంతోష్ అప్పటికప్పుడు తన కళ్ళకు కనపడిన అమ్మాయి ప్రియ(శరణ్యా మోహన్) ని చూపెడతాడు. అది నిజమే అనుకుని నమ్మిన పూజ వీరిద్దరనీ కలపాలని ప్లాన్ చేస్తుంది. ఈలోగా మరో ట్విస్ట్…ప్రియ మరెవరో కాదు…ఆ ఊళ్ళో ఉన్న పెద్ద డాన్ సూరి చెల్లెలు(ఈ మధ్యకాలంలో ఇదో ట్రెండు. అందమైన అమ్మాయిలందరూ గూండాగాళ్ళ చెల్లెళ్ళు). అతనికి తన చెల్లి వంక ఎవరు చూసినా నచ్చదు..కాలో..చెయ్యో తీసేస్తాడు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇరుక్కున్న సంతోష్ ఏం చేసాడు అన్నది మిగతా కథ.

నిజానికి ఈ కథ పవన్ కళ్యాణ్ బద్రి లాంటి చిన్న స్టోరీ లైన్. ప్రేమ కథలో ప్రేమనొదిలేసి కామెడీ పండించాలనే తపనతో సినిమాని రకరకాలుగా మార్చేస్తాడు డైరక్టర్. ఏ నిముషం ఏ ట్విస్టు వచ్చి కథను మలుపుతిప్పుతుందో అని చూడాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. లవ్ స్టోరీ చెప్పేటప్పుడు అనవసరంగా అలీ కామిడీ ట్రాక్ కథకు కలపకుండా ఉండి ఉండే ఫీల్ తో వేరే రకంగా ఉండేది. అలాగే ప్రేమ అంటే పడని పూజ పాత్ర …ఎందుకని సంతోష్ ని అతను చూపెట్టిన అమ్మాయితో కలపాలని నిర్ణయించుకుంటుందనేది క్లారిటీ ఉండదు. అక్కడే ఆమె క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉండే కథ వేరే విధంగా ఉండేదేమో. వరుణ్ సందేశ్ గ్లామర్ ఎందుకునే తగ్గినట్లు అనిపిస్తోంది. దానికి తోడు యాక్షన్ హీరో అనిపించుకోవాలనో ఎందుకో గాని అనవసరమైన ఫైట్స్. అలాగే శరణ్య క్యారెక్టర్ ని అతి ఎక్కువై సెంటిమెంట్ కోసం చంపంసినట్లు తెలిసిపోతూంటుంది. ఇక విలన్ సూరి..కామిడినో, సీరియస్సో అర్ధం కాకుండా కొనసాగుతుంది.

ఇక దర్శకత్వం గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. మిగతా విభాగాలు దర్శకత్వంకి తగినట్లే నాసిగా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో ఉన్న ఏకైక ప్లస్ మణిశర్మ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ‘ఒక్కడే…పుటుక్కు జరజర’ అనే పాట బాగుంది. తమిళ అమ్మాయిలు వేగ, శరణ్య ఇద్దరూ కథలో కుదురలేదు. శరణ్య అయితే మరీ చిన్న పిల్లలా హీరోకి చెల్లిలా అనిపిస్తుంది. అలీ అక్కడక్కడా నవ్వించినా అది అర్ధం లేని ట్రాకే. డైలాగులు అక్కడక్కడా బాగున్నా కథ తగ్గట్లే చాలా చోట్ల అనవరసంగా కావాలని పంచ్ లు విసురుతున్నట్లు ఉంటాయ. అలాగే మనస్సులో ప్రేమ ఉండి…ఎప్పుడూ కొట్టుకునే మొగుడూ పెళ్ళాలు…ఎమ్.ఎస్.నారాయణ, రంజిత ల సీన్స్ చాలా సినిమాల్లో ఆల్రెడీ చూసినవే కావటం మరో నస.

ఫైనల్ గా… ఎంతో ఫీలయి తీసినట్లున్న ఈ చిత్రాన్ని చూస్తే ఆ తర్వాత మనం కూడా ఎంతో ఫీలవుతామనేది నిజం. ఇంటర్వెల్ బ్యాంగ్., ట్విస్ట్ ల మీద పెట్టిన శ్రద్ద స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టి ఉంటే…హ్యాపీ..హ్యాపీగా అనే టైటిల్ తీసిన వారికి, చూసిన వారికి జస్టిఫై అయ్యేది. ఇక ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ చిత్రం వరుణ్ సందేశ్ కి మరో..మరో చరిత్ర, ఎవరైనా ఎపుడైనా…అంతే. మొత్తానికి ఈ సినిమా వారాంతరంలో చూడకపోతేనే మీరు హ్యాపీహ్యాపీగా…

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

9 Comments to “చూడకపోతేనే ‘హ్యాపీహ్యాపీగా’”

  • అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కామెంటు కూడా “బొ” అన్నమాట.

  • చిన్న దిద్దుబాటు. ఎం ఎస్ నారాయణ కి జోడి గా వేసినది రంజిత కాదు. రజిత.

  • nenu chuSanu already

  • హ హ ! ఆ న్యూజెన్ హైర్ ఆయిల్ ప్రకటన చూడగానే అర్ధం అయింది – సగం సినిమా ! బాడ్ టేస్ట్.

  • వెళ్ళిన కొద్ది మందీ హతాశులై తిరిగొస్తున్నారు బయటకు బ్రతుకుజీవుడా అని!

    పాచిబట్టిన కధ,కాస్తంటే కాస్త మెరుపు కనిపించే దర్సకత్వ ప్రతిభ అక్కడక్కడ కొంచెం నవ్వించే ఆలీ ,ఫర్వాలేదనిపించే సంగీతం,మంచి సాహిత్యం ఉన్న పాటలు,ఇలా గుడ్ అండ్ బ్యాడ్ మిక్చర్ పొట్లం ఈ సినిమా.మొత్తం తలనెప్పి రాకుండా, జేబులు చిల్లి పడకుండా ఉండాలనుకునే వారు ఈ సినిమా అదే పరిసరాల్లోకి కూడా వెళ్ళవద్దని పెద్ద మనసుతో సలహా కూడా ఇస్తున్నారు.ఇదే పంధాలో కొనసాగితే వరుణ్ సందేశ్ కి చివరి సినిమాల్లో ఇదే మొదటిది అవుతుందని కూడా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు.

    http://visakhateeraana.blogspot.com/2010/08/blog-post_5967.html

  • to day we plan to watch this movie any way i came to know movie is not worth watching so i dropped

  • నటుడికి అ౦ద౦ ఒక్కటి సరిపోదు, నటన కూడా కావాలి…. ఆసలు వరుణ్ స౦దేష్ హీరొనా… ము౦దు acting నెర్చుకోమని చెప్ప౦డి….

  • Happy happyga is an average film.

    cinematography & direction work are so poor.Music is good. i enjoyed varun jetli’s (ali) comedy. Climax is well justified.

    Finally, regular audience can’t enjoy this movie.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories