Menu

Wanted by Jonathan


మీకు సినిమాల్లో పని చేయాలని ఆసక్తి ఉందా? అయితే ఈ పోస్ట్ మీ కోసమే!

గతంలో ఎన్నో లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో ప్రశంసలు అందుకున్న మిత్రుడు నవతరంగం సభ్యుడు జొనాథన్ ఇప్పుడు పూర్తి నిడివి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో పని చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు కావలెను.

ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది మైల్ ఐడి కి ఈమైల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

j.vesapogu[at] gmai[dot]com

జొనాథన్ నిర్మించిన చిత్రాల వివరాలు.

Beautiful Hell – లఘు చిత్రం
షార్ట్ ఫిల్మ్ మేకర్ గా జొనాథన్ నవతరంగం పాఠకులకు పరిచయమే. జొనాథన్ రూపొందించిన మూడు లఘు చిత్రాలు గతంలో నవతరంగంలో ప్రదర్శించాము. ఈ మధ్యనే ఈ యువదర్శకుడు రూపొందించిన మరో లఘు చిత్రం – Beautiful Hell. ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు సూచనలు జొనాథన్ కి తెలియచేస్తారాని ఆశిస్తున్నాము. గమనికః ప్రస్తుతం మన రాష్ట్రంలో లఘుచిత్రాల నిర్మాణం అక్కడా ఇక్కడా జరుగుతూనే ఉన్నా జొనాథన్ అంత ఉత్సాహంగా పని చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ […]View Post

K – లఘు చిత్రం

మిత్రుడు, నవతరంగం అభిమాని, ఔత్సాహిక సినీ దర్శకుడు జొనాథన్ గురించి నవతరంగం పాఠకులకు పరిచయం చెయ్యనక్కర్లేదు. గతంలో జొనాథన్ రూపొందించిన మూడు లఘు చిత్రాలను నవతరంగంలో ప్రదర్శించడం జరిగింది. ఒక్కో సినిమాకు తన దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ వెళ్తున్న జొనాథన్ రూపొందించిన మరో లఘుచిత్రం నవతరంగం పాఠకుల కోసం అందివ్వడం ఆనందంగా ఉంది. త్వరలో జొనాథన్ లఘుచిత్రాల నుంచి పూర్తి స్థాయి చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదుగాలని ఆశిస్తూ ఈ లఘు చిత్రం మీకోసం… K- Short […]View Post

జాస్మిన్-లఘు చిత్రం

గతంలో నవతరంగం ద్వారా తన లఘుచిత్రాలు రెండింటిని ప్రదర్శించిన జొనాథన్ ఈ మధ్యనే పూర్తి చేసిన మరో లఘు చిత్రాన్ని మీ కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ఈ సినిమాతోపాటు జొనాథన్ మిగతా సినిమాలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అతనికి తెలియచేస్తారని ఆశిస్తున్నాము. జొనాథన్ దర్శకత్వంలో వచ్చిన మరో రెండు లఘు చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. http://navatarangam.com/2008/11/2-short-films/ Jasmine from Jonathan on Vimeo. View Post

రెండు లఘు చిత్రాలు

నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది.View Post

4 Comments
  1. srikanth July 12, 2010 /
    • Krish July 13, 2010 /
      • srikanth July 13, 2010 /
  2. రాజశేఖర్ July 13, 2010 /