రెండు నిముషాలు ” టైం.” ప్లీజ్…

time

ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకుండా కిందా కామెంట్లరూపంలో అరిచి గోల చేసిన ఒకటి మాత్రం వాస్తవం అదేంటంటే షార్ట్ ఫిల్మ్ లకు నవతరంగం ప్రోత్సహించినంతగా మరే వెబ్ పత్రిక నవ యువ దర్శకులకు సహాయ పడలేదు అనే విషయం.
“చీకటి ని తిడుతు అనే … “ఏదో సామేత ఎప్పుడో చదివినట్లు గుర్తు.. అదే బాటలో ..జగదీష సత్య అనే మిత్రుడు కూడ ఈ మధ్య టైం విలువ ని తెలియ జేస్తు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాడు .

ముందు గా జగదీష్ సత్య గురించి :( తప్పదు వినాల్సిందే..రెండులైన్లు )నవయువ సినిమా కార్మికులకు ఏదైన ఉపయోగం రావచ్చు

పదేళ్ళ క్రితం గిన్నిస్ బుక్ లో ఎక్కే ఫిల్మ్ సిటి ఒకటి మన తెలుగు రాష్ట్రం లో కట్టారు ఇక ప్రపంచం నివ్వెరపోయే అధ్బుత సినిమాలు ఇండియా నుంచే వస్తాయి అనే నమ్మకం తో…వైజాగ్ నుంచి పదెళ్ళ క్రితం పోట్టను పట్టుకోని … దానితో పాటు బుర్రని నమ్ముకోని.. హైదరాబాదు వచ్చాడు …సినిమా కష్టాలు అన్నీ పడ్డాడు (అవి తను సినిమా తీసాక ఇంటర్వ్యూలో చెప్పుకుంటాడు విందురు కాని ఇప్పుడే వద్దు ) ఐతే …ఈ మధ్యా , ఈ మధ్య అంటే మీకు తెలుసు ‘ యుద్ధం ‘ మోదలైంది అనే ఆర్టికల్ చదివి ఉన్నారు కాబట్టి.సో…

జగదీష్ సత్య యుద్ధం పేరిట ఒక కధ ని అనుకున్నాడు .కోత్తప్రోడ్యుసర్ ఎవరో సహాయం తో … టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాడు. .నవతరంగం పాఠకులకు తెలిసిన విషయమే.. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా కష్టాలు పడ్డామన్నది ముఖ్యం కాదు నిర్మాతను ఎలా ఎప్పుడు కన్విన్స్ చేసామా అన్నదే ముఖ్యం.ఐతే ఇక్కడ జగదీష్ సత్యా మాత్రం ఒక ప్రముఖ హీరో నే నమ్ముకోని ఆ కధని కాని టైటిల్ ని కాని ఎవరి కి ఇవ్వకుండా..నిరీక్షిస్తున్నాడు .
టీవి కి పని చేసేటప్పుడు చాలా మంది ఏది సరిగా పట్టించుకోరు ఎందుకంటే ఎలా చేసిన చల్తా. మన డబ్బులు (నెల కు సాలరి ) వచ్చేస్తుంది బాస్, అనే ఫిలాసఫి ఉంటది. కాని జగదీష్ సత్య ఈ .టీ .వి లో చేసెటప్పుడు తనేదో పెద్ద సినిమా కు దర్శకత్వం చేస్తున్నట్లు శ్రమించేవాడు.చివరకు నేరాలు ఘోరాలు సింగిల్ ఏపిసోడ్ ని కూడా ఏదో పెద్ద సినిమా తీసేంత గా శ్రధ్ధ గా తీసేవాడు. ఓహో ఇతను కూడా మనలాంటోడే అని అప్పటి నుంచి మనలో ఒకడు అయిపోయాడు
*
కేమెరా మాన్ చక్రధర్ గురించి :
ఇక కేమెరా మెన్ చక్రి , ఇప్పుడు మంచి మిత్రుడులేండి.(అంటే కలిసి మందు తాగడం,వన్ బైటూ సిగరేట్లు తాగు తు.. ,బైకుల మీద జులాయిగా తిరగడం ,అనే తెలుగు సిన్మా లో మంచి ఫ్రెండ్స్ టైపా అని ఇమాజినేషలో పోవద్దు .మేము జస్ట్ ఫ్రెండ్స్ హహహ్హహ.)
ఒక జమానా లో సినిమా ఇండస్త్రీ అంటే అన్ని రంగాల్లో ..ఫక్తు తాగుబోతులు,రంకు వేషగాళ్ళు,దగుల్బాజులు,మోసగాళ్ళు ఉంటారు ఎవరి ని నమ్మోద్దు అనే మాటలు నా బచ్ పన్ నుంచి బాగా వింటూ వచ్చాను . కాని నిజంగా నేను అల్లాహ్ కు చాల కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పటివరకు ఒక సినిమా అంటు తియ్యకు పోయినా కామన్ సెన్సునండి ,ప్రోఫెషనల్ గాను మంచి టాలెంటెడ్ వ్యక్తులు నాకు మిత్రులు గ దోరికారు .
అందులో చక్రధర్ ఒకడు. చేతికి ఏ కెమెరా అయినా ఇవ్వండి కుమ్మేస్తాడు.దర్శకుడు సినియరా…జూనియర్ ,అస్సలు బుర్రలేనోడా ఏది పట్టించుకోడు ఎవరు వచ్చి అడిగినా వారి షార్ట్ ఫిల్మ్ లకు ప్రాణం పోస్తుంటాడు.

అలా ప్రాణం రావాలంటే కేమెరా మ్యాన్ కేవలం మంచి టాలెంట్ ఉంటే సరిపోదు వ్యక్తి మనసు కూడ ఎంతో బాగుండాలి .ఎందుకంటే మనసు బాగుంటేనే అతని భావాలు ఆశయాలు బాగుంటాయి అవి బాగుంటే అది అతను చేసే పని మీద ప్రభావం చూయిస్తాయి.
ఐతే ఈ మధ్యా.. , ఒక రోజు …సరదాగా కూర్చోని ఉన్నప్పుడు పది నిముషాల్లో జగదీష్ సత్య మేదడు లో ఆలోచన పుట్టడం వెంటనే చక్రధర్ కూడ సరే అనడం తో ..స్పాట్ లో …టైం అనే రెండు నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసారు.జగదీష్ గురించి , కెమెరామాన్ చక్రధర్ గురించి చెప్పాను . టైం షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పను అది మీరెయ్ చూసి మీ కామెంట్లు చెప్పండి.

నాకు నచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నాను.

టైం చూసాకా మీకెంత టైం ఉంటే అన్ని కామెంట్లు తో కుమ్మెయ్యండి..జగదీష్ సత్యా షార్ట్ ఫిల్మ్ అయినా లేదా పని పాట లేదా అని నన్నైనా. ఉచిత ఆఫర్ ఈ ఆర్టికల్ కే పరిమితం తోందరపడండి.(షార్ట్ ఫిల్మ్ చూడకుండా అయితే కుమ్మెయ్యకండే….ప్లీజ్)

SHUKRIYA ALOT

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

51 Comments to “రెండు నిముషాలు ” టైం.” ప్లీజ్…”

  • Where is the link ?

  • (ఎవరికో ..)అమ్మాలారా ,అక్కాలారా,చెల్లిలారా,అన్నలారా..భాయియో ఔర్ బహినో…
    నాకు తెలియకుండా జరిగిన ఈ టెక్నికల్ అంతరాయానికి చింతిస్తున్నాను.
    ఇటువంటి సంఘటనలు భవిశ్యత్తులో మరో మారు ఎవరి షార్ట్ ఫిల్మ్ తో కూడ జరగ కుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా నవతరంగం యాజమాన్యాన్ని మందలించాల్సిందిగా ..అలాగే…విదేశి సినిమాలను వెనకేసుకోస్తూ..చక్కని లింకులని అందిస్తూ, స్వదేశి షార్ట్ఫిల్మ్ లింకుల గోంతునోక్కే …ఇటువంటి తప్పులని అందరూ ఖండించాలని, ముఖ్యమంత్రి గారి ని కోరుతున్నాం. తొందరగా లింకు ని సరిదిద్దక పోతే… ఏం చెస్తాం ఖర్మా అనుకుని కింద లింకు ని నోక్కుకుంటూ చూసుకోవాల్సిందిగా బాధితులకు ఓదార్పు మైల్స్ చెసుకుంటాను.

    http://www.youtube.com/watchv=5Tpo8IQ0uK0&feature=channel

    SALAAM

  • @సైఫ్ అలి గొరే సయ్యద్:
    Thanks :)

  • నాకు పెద్దగా నచ్చలేదు. కాన్సెప్టూ మేకింగూ రెండూ ఎక్సైటింగ్ గా అనిపించలేదు. కష్టపడి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కాబట్టి అభినందనలు.

  • అస్సలు నచ్చలేదు నాకు.3 నిమిషాలు ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తూ కూర్చున్నా.గుడ్ కాన్సెప్ట్ కానీ తీసిన విధానమే బాలేదు.

  • ప్రయత్నించారు కాని ఫెయిల్ అయ్యారు…. మంచి ప్రయత్నం… ఇక విషయానికి వస్తే… షాట్ డివిజిన్ భాగలేదు… కాంటినుటే లేదు… ఇంతకన్నా ఏం లేదు చెప్పడానికి…. చివరగా ఒకమాట… ఓడి పొవచు కాని వృదా కాకూడదు….

  • బబూ…. కెమెరా చేతికి దొరికిందని ఇలాంటి పిచి పనులు చేస్తే ఎలా??… ఏంటో అందరూ షాట్స్, continuity , తొక్క, తోలు అని పిచి పిచ్చిగా ఏదో చెప్తున్నారు… అసలు అక్కడ పెట్టినదానిన్ని షార్ట్ ఫిలిం అని అంటారా???????…. ఫిలిం makers కి కావలసినది కామన్ సెన్స్… ఎందుకు ఇలా పిచ్చి పిచ్చివి పెట్టి అల టైం పాస్ చేస్తారు… ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టీ వాళ్ళ కంటే కామెంట్స్ వ్రాసే వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తున్నారు… Get inspired and inspire others… Dont make an average Indian film maker a fool in the global film industry by posting this kind of rubbish stuff…

    • అవునండి మీరు చెప్పింది నిజం. నేను మీతో ఎకిబవిస్తున్న.

  • ఈ లఘు చిత్రం ఏదో ఒక కొత్త కెమెరాని పరీక్షించటానికి తీసినట్టుంది, లేదా ఎవరో కొత్త వాళ్ళు నేర్చుకోవటం కోసం తీసినట్టుంది. కాని మీ పరిచయం లో ఆయనెవరో చాలా అనుభవం ఉన్నవారని చెప్పారు. మరి నాకయితే అలా అనిపించలేదు.

  • ‘టిక్ టిక్’అ౦తె. ఎమీలేదు. పర్వాలేదు..keep it up.

  • సయ్యద్ మియ్యా తమరి దగ్గర మ్యాటర్ తక్కువ, మాటలు ఎక్కువ అనుకుంట,
    ఎవరో జదదీశ్ అన్నావు, చక్రి అన్నావు. కుమ్మేస్తారన్నావు. నేనేదో నిజంగానే కుమ్మేశారు అనుకుని చూస్తే గడియారం తప్ప ఏమీ లేదు. వెంటనే అనుకున్నా “నిజంగానే టైం విలువైనది, నా లైఫ్ లో 5 మినిట్స్ (౩ మినిట్స్ ఫిల్మ్, తమరి వ్యాసం 2 మినిట్స్ :-) )వేస్ట్ చేశాను” అని.
    పైన అంత బిల్డ్అప్ ఇవ్వకుండ ఏమీ తెలియని కొత్తవాళ్ళు తీసిన చిత్రం అంటే బాగుండేదేమో!!

  • ఆలీ,
    Give some info like the camera used, budget, time taken to shoot and other technical details.

    ఇలాంటిది తీయాలంటే ఇంత సింపులా అనిపించేలా! అందరికీ తెలిసేలా.

    చక్రి

  • satish says, good chalabagundi mee concept..time viluva telusu kunte lifelo anything possible ani

  • గడియారం, నిద్ర పోతున్న మనుషులను చూపిస్తూ ఏదో కాన్సెప్ట్ చెప్పినట్టు మీరు అనుకుంటే అది మాకేలా చేరుతుంది మహాప్రభో!! అక్కడ ఇచ్చిన బిల్డ్ అప్ కి అందరూ ఏదో ఊహించుకున్నారు. మధ్యలో అదేదో కొటేషన్ చూపించారు…

  • 1. మూడు నిముషాలు అనవసరం.
    2. కెమెరా కుమ్మేసింది ఏమీ లేదు.. జర్కులు, కన్సిస్టెన్సీ పొరపాట్లు వున్నాయి.
    3. క్లాక్‌లో టైం వెనక్కి ముందుకి రకరకాలుగా మారుతోంది – వేరే వేరే రోజులని అనుకోవాలా? అలాగైతే సెటప్‌లో కాని, కాస్టూంలో కాని మార్పులు చూపించాల్సింది.

    ఇవి మినహాయిస్తే కాన్సెప్ట్‌పరంగా బాగుంది. మంచి ప్రయత్నం.

    వ్యాస రచయితకి: తినబోయేముందు రుచి గురించి చెప్పారు.. అదీ కొంచెం ఎక్కువ మోతాదులో చెప్పారు. అదే ఎక్స్పెక్టేషన్‌తో చూసేసరికి తేలిపోయినట్లైంది…!!

  • So, what is so very great about this? Is this meant for
    little kids or what? Stupid film, and exaggerated intro.

  • hello అరిపిరాల sir..,

    watch this, and say… he is doing movie direction… మూడు నిమిసాల లొనె ఇన్ని తప్పులుoటె మరి సినెమాలొ……

    http://www.youtube.com/user/jagadishdirector#p/a/u/1/YOIdxWrwlUI

  • that was g00d Oo
    Workin on your editing skills?
    Good job mate… ^^
    thanks for sharing

  • short film is good….i really liked the concept…tick tick/clock sounds good…its creating some feel…keep it up and do more better projects…

  • good…superb time viluva teliste edaina sadinchavachu….

  • good short film……
    good attempt….
    keep going…
    all the best jagadish…

  • బాగున్ధి…………
    comments వధిలెయ్…….
    do better projects in future mr.jagadish satya…

  • short film aina chal dragging anipinchindi.
    concept evarikaina ardamaite dayachesi cheppagalaru

  • Sorry Jagadish,

    Some thing is missing,
    cannot be in a sentence will meet u later

  • బిస్మిల్లాహ్

    ఒక మూడు నిముషాల షార్ట్ ఫిల్మ్ ని ఫ్రీ గా ఇంటర్నెట్ లో పెడితే
    చూసి ఫ్రీగ రక రకాల అభిప్రాయాలు చెప్పే వారు ఎంతమందో కదా…!!!
    టైం షార్ట్ ఫిల్మ్ ని ఇక్కడ పోస్ట్ చేసినప్పటి నుండి ఇందాక హైదరాబాద్ సెంట్రల్ లో కలిసిన నాయుడి వరకు అంతా
    ఈ రెండు రోజులలో ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి నా చేవుల్లో పడిన రక రకాల
    ఫోన్ ద్వారా కాని , కల్సిన వారు చెప్పడం ద్వారా కాని నేను విన్నా విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

    (PSA,EJS, K.VP, Anna .,etc..తప్పుగా అనుకోరనుకుంటున్నాను.)

    1. మేల్ క్యారక్టర్స్ బదులు ఫిమేల్ అయితే బాగుండేది.
    2. చిన్న క్లాక్ కాకుండా పెద్ద వాల్ క్లాక్ చూయిస్తే బాగుండేది
    3. ముసలి క్యారేక్టర్ ని చివరకు శవం లా చూయించి ఏండ్ చేయల్సింది
    4. అసలు పోత్తిళ్ళలో పాపాయి నుంచి చూయిస్తే ఒక అర్ధం ఉండేది.
    5. ప్రారంభం సన్ రైజ్ తో ఎండింగ్ సన్సెట్ తొ ఉండాల్సింది.
    6. టిక్ టిక్ టిక్ అని శబ్దం స్లో నుంచి హై వాలుం కి మారాల్సింది
    7. కిందపడుకోపెట్టడం బాగో లేదు
    8. అసల్ నాకైతే స్క్రీంప్లే నచ్చలేదు
    9. ఇలాంటి ఫిల్మ్ లకు ట్రాలి షాట్స్ వాడలి
    10. టాప్ ఆంఘిలే లేదు ఇక పడుకోవడం ఎక్కడ సరిగ ఎస్టాబ్లిష్ అవుతుంది?
    11. మేకప్ అస్సలేదు
    12. మంచి నీళ్ళ గ్లాసు కాకుండా బీరు బాటిల్ ఉండాలి అక్కడ
    13. నెనైతె నిముషం లో తీసేవాడిని రేండే రెండు షాట్స్ లో
    14. అసలు ఇలాంటి సబ్జెక్ట్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండాలి అది లేదు ఇక్కడ
    15. అసలు యుగాలు గా మానవుడు నిద్రావస్థలో ఉన్నట్లు చెప్పల్సింది కాస్త్యూంస్ మార్చి.
    16. నువ్వు రాసిందేమో స్రీదేవి లా ఉంది చూస్తే రమాదేవి లా ఉంది
    17. వాల్లిద్దరి గోప్పతనం రాశావు బానే ఉంది. ఫిల్మ్ గురించి రాయలేదు ఎందుకు?
    18. ఇంత సింపుల్ గా తీసారో అనిపించింది.
    19. ఎంతఖర్చైందిరా అసలు
    20. 30 ఇయర్స్ ఇండస్ట్రి అని చెప్పుకున్నట్లుంది నువ్వు రాసిన ఇంట్రో
    21. ఏదైన చల సింపుల్ గ తీసారు కన్సెప్త్ బాగుంది.
    22. అసలు మీ లెవెల్ ఎంటి మీరు చేస్తున్న పనులెంటి ? ఈ ఫిలంల లెవెల్ కాదు మీదు.
    23. పిల్లి కాని ఎలుక కాని పడుకున్న వాడి చుట్టు తిరిగినట్టు ఉంటే ఎంత బాగుండేది
    24. ఫ్యూచర్లో నీతో ఒక సినిమా చేస్తా
    25. చేసుకున్నా పెళ్ళామే అన్ని రోజులు నచ్చదు ,ఇక షర్ట్ ఫిల్మ్ గురించి కమెంట్ వేస్టు.
    26. అసలు ఇది షార్ట్ ఫిల్మ్ కాదు సినిమా సబ్జెక్ట్ ని పాడు చేసారు
    27. ఇది చూసే సరికి నాక్కూడ నిద్రోచ్చింది బాబు
    28. సందేశాలేంట్రా బాబు?
    29. అసలు షార్ట్ ఫిల్మ్ లని కనిపెట్టిందేవడ్రా?
    30 చెప్పాలంటే చెప్పాలనుకుంది అర్ధమైంది.టెక్నికల్ నాకెందుకు
    31. చివరకు ఇచ్చిన కోటేషన్ బాలేదు
    32. మూడు పెన్ గ్విన్ లు ఉన్న పోస్టర్ బదులు మూడు కోతుల పోస్టర్ ఉంటేఆ బాగుణ్ణు.
    33 మధ్యలో చెట్టు ఎందుకు చూయించార్రా?
    34.అసలైన పెద్ద మిస్టేక్ టైటిల్ టైం అని పెట్టడం . కాన్సెప్ట్ కు తగినట్లు లేదు
    35. ఇదే కాన్సెప్ట్ ని నేను చెప్తా మళ్ళి తీసి పెట్టండి ,,ఆదిమ మానవుడి ఫోటొ నుంచి…అంతరిక్షం లో ఆస్ట్రోనాట్ వరకు ఫోటొ లు వాడి బ్యాక్ గ్రఔండ్ సూర్య చంద్రులని వాడి ఒకపక్క టైం స్పీడ్ గా పోతుంది అనేలా స్పీడుగా మారే క్లాక్ ని చూద్దాం. ఏమంటారు .
    (జస్ట్ ఒక పని కి ఎన్ని రకాల అభిప్రాయలు ఏదురవుతాయో ముఖ్యంగా డైరక్టర్లకు, వివరించడమే ఉద్దేశ్యం . ఎవరిని తప్పు పట్టడం కాదు.)
    ఏ ఏ పరిమితుల్లో ,ఎంత సమయం లో ,ఎలా తీసావో మాకు తెల్సు అలా అని ప్రతి ప్రేక్షకుడికి మనం వివరించలేం కదా…సో మాకు అర్ధమైంది అది చాలు.
    all da best
    shukriya alot.

  • salamalekum – “Saif Ali Gorey Syed”

    సినిమాలు మీరె తీస్తారు, కామెంట్లు మీరే రాస్తారు…. మరి మెము….

  • >>ఒక మూడు నిముషాల షార్ట్ ఫిల్మ్ ని ఫ్రీ గా ఇంటర్నెట్ లో పెడితే
    >>చూసి ఫ్రీగ రక రకాల అభిప్రాయాలు చెప్పే వారు ఎంతమందో కదా…!!!
    If humour was intended in the above sentence, then
    please note that your humour was most disgusting. Were
    you not looking for *free* opinions?

    >>ఏ ఏ పరిమితుల్లో ,ఎంత సమయం లో ,ఎలా తీసావో మాకు తెల్సు అలా అని ప్రతి >>ప్రేక్షకుడికి మనం వివరించలేం కదా…సో మాకు అర్ధమైంది అది చాలు.
    Pitialble justifications! Sad that Jagdish is depending on a diplomatic critic like “Saif”. If that Jagdish continues to draw spirit from such people who jump at thinking conveniently, the verdict on the new proposed movie is just a four-letter word. No, not the one you thought! F..L..O..P!

  • a film by jagadish అని చెప్పాలనుకుంటే ఇలా ఉండకూడదు జగదీష్. కాని నీ attempt బాగుంది. all the best for your future projects

  • sucks

  • good.keep it up .all the best in your future films.

  • నాగరాజు ఫిల్మ్ వ్రితెర్.జగ్గు.ప్రయథ్నమ్ బాగున్ది.నీకున్న్న వనరులు నాకు తెలుసు.బగ చెసవ్.కనీఎ ఇఅది చిన్న పిల్ల కలువ దాత దనికి సరివఒవచు.కనీ సముద్రన్ని ఈదె అప్పసిత్య్ కొసమ్ ఇన్క కస్థ పదలి.నెక్ష్త్ next time better luc. al the best ra

  • సరె మొత్తనికి ప్రయత్నమ్ బాగున్ది…ఐతె తెలుగు సొర్త్ ఫిల్మ్స్ క్వలిత్య్ పెరగలన్తె ఇన్క క్రుశి అవసరమ్

  • GOOD ATTEMPT. I LIKED THIS SHORT FILM. CONCEPT IS GOOD…

  • బాగున్ధి………good short film.

  • hi….jagadish satya , nee short film chaala bagundhi…keep it up and keep doing great work…all the best.

  • good work.
    nice short film.

  • not nice

    raj

  • bnot nice

  • బాగున్ధి….మరిన్ని short films వెన్టనె చెయ్యన్ధి…..
    do more shortfilms frequently…
    iam eagerly wiating for your feature film…do early…

  • మన్చి ప్రయత్నమ్

  • time short film is good. good concept. good taking.

  • Hello Jagadish,

    I appreciate your attempt in making this, concept is good.

    I am sure you could do the best of your ability/talent in your future endeavours which is not comparable to this short film. GOOD LUCK!!!

    Thanx,
    Priyanka

  • Moodu nimishaala short film lo kaalam viluvanu baaga express chesaaru…

  • time sariponi ee rojullo ee short film ni chusina vaallu yemaipothaaru?…

  • valuble short film.

    good attempt.

    keep it up jagadish satya

  • This film has no relevance on present youth of this country, because they are the most hard working, intelligent and the busiest group that ever have been produced in last 60 years.

    So please change to different subject, take inspiration from prasthanam, that is the trend now. No one is kid any more in this country any more. And I don’t know if have noticed are not the present youth is triying to make money by quickest way possible by saving time. Thiat could be the future issue or subject every should think of.

  • ఫిల్మ్ బాగుంది
    3 మినట్స్ లొ చక్కటి కాన్సెప్ట్ తీసారు
    ఇన్స్పిరేషన్ గా ఉంది
    ఒ చిన్న ఐడియా తో ఏ ఖర్చు లెకుండా తీసారు
    పెద్ద గా ఖర్చు లేకుండా మనము అలాంటి అప్పుడప్పుడు తీయోచ్చని చూపారు. నేను ఒక ప్రయత్నం చేస్తా
    అల్లాహ్ మీకు శుభాలు కలిగించాలని మనసార కోరుకుంటున్నాను.అమెన్

  • THE FILM IS GOOD…Expecially i liked the concept.
    ALL THE BEST FOR U.
    I THINK FILM MAKERS CAN TAKE ANY SUBJECT FOR SHORTFILMS.
    KEEP DOING LIKE THESE PROJECTS.

    – PRANAY

  • బాగున్ధి ఇ short film. బాగా తీసారు. శుభాకాన్శ్హలు.

  • jagadish u did a good job…ur short film is gud…all the best for ur future movie projects.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories