Menu

స్నేహగీతం-A must watch

ఎప్పుడో రెండేళ్ళ క్రితం అనౌన్స్ అయ్యి అప్పటినుంచీ అప్పుడూ ఇప్పుడూ అంటూ అసలు విడుదలవుతుందో లేదో అనే అనుమానం వచ్చేలా డేట్ మీద డేట్ postpone చేసుకుంటూ మొత్తానికి ఈ రోజు విడుదలవుతున్న స్నేహగీతం సినిమా గురించి వివరంగా చెప్పాలన్నా పూర్తిగా విశ్లేశించాలన్నా ఇంకా కొంత సమయం కావాలి. ప్రస్తుతానికయితే స్నేహగీతం ట్రాన్స్ లో రాస్తున్న ఒక పరిచయం లేదా రికమెండేషన్ అనుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పేయ్యాలంటే స్నేహగీతం is worth your money and time. Go and watch it.

సాధారణంగా బాగా చదువుకుని ప్రపంచం చూసి సినిమా అంటే ప్యాశన్ తో ఈ మధ్యకాలంలో వచ్చిన ఎంతో మంది యువదర్శకులు తమ మొదటి సినిమాగా ఒక యువతీయువకుల బృందం చుట్టూ కాలేజి నేపథ్యంలో తిరిగే కథలను (Thanks to happy days) ఎన్నుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. హ్యపీడేస్ తర్వాత ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఇక ముందు కూడా ఇలాంటివి రావొచ్చు. స్నేహగీతం కూడా ఈ వెల్లువలో వచ్చి కొట్టుకుపోయే సినిమా ఏమో అనుకున్నా కానీ అలా అనుకునే వారి అభిప్రాయం తప్పని నిరూపించారు శ్రీధర్స్ ఆఫ్ స్నేహగీతం.

కథగా చెప్పాల్సి వస్తే స్నేహగీతం ఆరుగురు మిత్రుల కథ. మొదట కాలేజిలో ఆ తర్వాత కాలేజ్ బయట వారి జీవితాలు, వారిaspirations, dreams, goals, మధ్యలో కాస్త ప్రేమ, కాస్త fun, మధ్యలో కొన్ని కష్టాలు చివరికి సుఖాంతమైన జీవితాలు. ఇంకా చెప్పాలంటే It’s a realistic journey through the lives of realistic characters who talk and behave like us.

ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ విషయాలన్నీ చెప్పేస్తే సినిమాలోని ఆసక్తికరమైన అంశాలను రివీల్ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ఆ పని ఇంకొన్ని రోజులకి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ సినిమా గురించి మాట్లాడాలంటే superlatives ద్వారానే చెప్పగలను.

ముందుగా స్నేహగీతం అనే సినిమా ద్వారా “The Sridhars (లగడపాటి మరియు మధుర) have pulled of a rare feat” అని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే ఈ సినిమా దాదాపు అందరూ కొత్తవాళ్ళతో తీసినా ఎక్కడా యాక్టింగ్ లో ఆర్టిఫిషియాలిటీ కనిపించదు. ఆ విధంగా casting పరంగా ఇదొక rare feat అని చెప్పొచ్చు. ప్రతీ సినిమాలోనూ చూసిన మొహాలే చూసి బోర్ కొట్టేసిన తరుణంలో ఎంతో ఈజ్ తో కొత్తవాళ్ళతో performance రాబట్టుకోవడం ఒక అద్భుతమనే చెప్పాలి.

Snehageetham is also a film that speaks to the new generation. ఇంతవరకూ ఎన్ని యూత్ ఫిలింస్ వచ్చినా స్నేహగీతంలోలా ఒక generation యొక్క డ్రీమ్స్, aspirations, confusion లాంటి అంశాలను సరిగ్గా డీల్ చేసిన సినిమా ఒక్కటీ రాలేదు. ఇందులో నటించిన నటీ నటులు మన మధ్యలో ఒకరిగా అనిపిస్తారు. అందంగా ప్లాస్టిక్ స్మైల్స్ ఉన్న అమ్మాయిలు అసలే లేరు. ఉన్న ముగ్గురమ్మాయిలూ ఎంతో న్యాచురల్ గా ఉన్నారు. కొంచెం కామిక్ టచ్ ఉన్న పాత్రలో నటించిన సౌమ్య కూడా మనం రోజూ చూసే అమ్మాయిలానే ఉంటుంది, అలాగే అబ్బాయిలు కూడా…వారిలో ఒక rawness కనిపిస్తుంది. This really added to the realistic feel of the film.

Snehageetham is a film with all the emotions blended very smoothly and it definitely caters to all the classes of audience. సినిమా మొత్తం ఎంతో lighter vein లో నడుస్తుంది. అయినా కూడా సరైన సమయంలో సరైన చోట emotions ఒక పీక్ కి చేరుకునేలా చేసి సినిమా అద్యంతం ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ముఖ్యంగా ద్వీతియార్థంలో pace చాలా బావుంది.

Snehageetham makes you laugh and at times it also makes you cry. All in all it entertains and at times enlightens you.

ఇంకా చెప్పాలంటే
1) దర్శకుడు కథను ఎక్కడా డైవర్ట్ చెయ్యకుండా to the point ఉండేలా care తీసుకున్న తీరు
2) సినిమాలో ముఖ్ భూమికలు పోషించిన ఐదు మంది కథలనూ ఎంతో బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన విధానం
3) ఈ సినిమా సందేశాత్మక చిత్రం అని అనిపించినా ఎక్కడా పెద్దగా preachy గా అనిపించకపోవడం
4) సంగీతం
5) ఎడిటింగ్

లాంటి ఎన్నో అంశాల కారణంగా ఈ సినిమాని నేనైతే Must Watch సినిమాగా రికమెండ్ చేస్తున్నాను.

స్నేహగీతం లాంటి సినిమాని చూసి ఆదరించండి.తెలిసిన స్టార్స్ లేరనో, చిన్న సినిమా అనో, పైరేటెడ్ డివిడి వస్తే చూద్దామనో, ఆన్ లైన్లో వస్తుందనో ఇంకా పోతే టివిలో వస్తుంది కదా అనో ఈ సినిమా ని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు రాకపోతే మంచి తెలుగు సినిమాలు అసలు రాకుండా పోతాయి. మంచి సినిమాని ఆదరించండి. స్నేహగీతం చూడండి. మీ ఇంటిల్లపాదీ హాయిగా చూడదగ్గ సినిమా….మీరూ చూడండి మరింత మందికి చూపించండి. ముఖ్యంగా సినిమాలో లీడ్ రోల్స్ లో నటించిన యువతీ యువకులు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది కొత్త వారిని ఈ సినిమాలో పరిచయం చేశారు. వేణు మాధవ్, వెన్నెల కిషోర్ లాంటి ఒకరిద్దరు తప్పితే సినిమా మొత్తం కొత్త వాళ్ళే….మీరీ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేసి వారందరికీ మీ ఆదరాభిమానాలు అందచేయాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.

42 Comments
 1. Nagarjuna July 16, 2010 /
 2. Sandeep July 16, 2010 /
 3. Divya July 16, 2010 /
  • gopal July 16, 2010 /
   • Yogendra July 17, 2010 /
 4. Nagarjuna July 16, 2010 /
 5. Chetana July 16, 2010 /
 6. Chetana July 16, 2010 /
 7. sunny July 16, 2010 /
 8. wb July 17, 2010 /
 9. please stay away July 17, 2010 /
 10. Geethoo July 17, 2010 /
 11. guru July 17, 2010 /
  • rahul July 18, 2010 /
 12. Nagarjuna July 17, 2010 /
 13. Kiran July 17, 2010 /
  • rahul July 18, 2010 /
 14. Kiran July 17, 2010 /
 15. Nagarjuna July 17, 2010 /
 16. rahul July 18, 2010 /
  • Mindless Viewer July 18, 2010 /
  • rahul July 18, 2010 /
 17. srinath July 18, 2010 /
 18. Madhura sreedhar July 18, 2010 /
 19. Madhura sreedhar July 18, 2010 /
 20. శశిపాల్ రెడ్డి రాచమల్ల July 19, 2010 /
 21. Venu Lanka July 19, 2010 /
 22. Madhura Sreedhar July 19, 2010 /
  • lokesh bandi July 19, 2010 /
 23. PavanKKumar July 19, 2010 /
 24. Kishore July 20, 2010 /
  • Raja July 19, 2010 /
 25. ram kumar July 24, 2010 /
 26. Madhura Sreedhar July 26, 2010 /