Menu

“వేదం” తమిళంలో…

జాగర్లమూడి రాధక్రిష్ణ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఒక విభిన్నమైన చిత్రం “వేదం”. పాత కథలనే తిరగరాసి సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఐదు కథలతో, వైవిద్యమైన స్క్రీన్ ప్లేతో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అల్లు అర్జున్, మనొజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రంగా కూడ ప్రేక్షకులకి చక్కని అనుభూతి మిగిల్చిన చిత్రం.

ప్రస్తుతం తెలుగులో తమిళ దర్శకుల హవా నడుస్తుంది. ఈ తరుణంలో తెలుగు దర్శకుడైన క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం “వానమ్” పేరుతో తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఆ విషయాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలేమో!

కేబుల్ రాజుగా శింభు నటిస్తుండగా, మనొజ్ తన పాత్రని తనే పోషిస్తుండడం విశేషం. సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.

“వేదం” చిత్రం గురించి శింభు…

“I was impressed by it, especially Allu Arjun’s characterisation. I thought this role will be ideal as the character has mass appeal. At the same time, multiplex audiences will also love it.”

ఈ చిత్రం తెలుగులో లాగే తమిళంలో కూడా ప్రశంశలు అందుకోవాలని, క్రిష్ కి తగిన గుర్తింపు రావాలని ఆశిద్దాం.

–వెంకట్ గోపు

8 Comments
  1. ravigaru July 13, 2010 /
  2. shankar gongati July 13, 2010 /
    • అబ్రకదబ్ర July 15, 2010 /
  3. DRK Reddi July 14, 2010 /
  4. shankar gongati July 14, 2010 /