Menu

వేదం – సమీక్ష

సిద్దాంతాలూ, భావజాలాలు defuse అయిపోతున్న ఈ ఆధునికోత్తర (post-modern) యుగంలో బ్లాక్ అన్డ్ వైట్ లో కథచెప్పడం కష్టం.
హీరోలూ విలన్లూ లేని లోకంలో… పాత్రలే కథల్ని చెబుతాయి.
ఆ కథలే నిజానికి, కల్పనకు వారధులౌతాయి.
అవి ఒక్కోసారి కాల్పనిక ప్రపంచాల అంచుల్ని తాకిస్తే, మరోసారి కటిక సత్యాల్ని కళ్ళ ముందు ఉంచుతాయి.
అందుకే…భిన్న వర్ణాల్ని, భిన్నపార్శ్వాలను, భిన్నపాత్రలను, భిన్న అంశాలనూ, భిన్న కథలనూ ఒకటిగా అల్లిన పంచరంగుల దారం ‘వేదం’.
అవసరాలు, అపోహలూ, ఆభిజాత్యాలూ, అనుమానాలూ నిర్దేశించిన పరిస్థితుల్లో చిక్కిన ఐదుగురి కథ ‘వేదం’.

కుటుంబపు ఆర్మీ లెగసీ కన్నా, తన రాక్ బ్యాండ్ పాటే వ్యక్తిత్వం అనుకునే వినయ్ చక్రవర్తి (మంచు మనోజ్).
బస్తీలో బ్రతుకుతూ, రిచ్ అమ్మాయిని పెళ్ళిచేసుకుని బంగళాబ్రతుకుల కలలు నిజం చేసుకోవాలుకునే కేబుల్ రాజు(ఆల్లు అర్జున్).
సొంతంగా బిజినెస్ పెట్టుకుందామనుకునే ఒళ్ళమ్ముకుని బ్రతికే సెక్స్ వర్కర్ సరోజ(అనుష్క శెట్టి).
వెట్టిచాకిరికి బలైపోతున్న మనవడిని రక్షించుకోవడానికి తాపత్రయపడే ఒక తాత రాములు(నాగయ్య).
ముస్లింగా పుట్టడం వలన అనుమానానికి బలై, జీవితంపు ఆనందాల్ని కోల్పోయే పాతబస్తీ ఖురేషీ(మనోజ్ బాజ్పాయ్).
ఈ ఐదుగురి జీవితాల్నీ సమూలంగా మార్చేసిన రెండురోజుల ఘటనా క్రమం ఈ సినిమా కథ…కథాక్రమం కూడా.

మంచు మనోజ్,ఆల్లు అర్జున్, అనుష్క శెట్టి, మనోజ్ బాజ్పాయ్ పాత్రల్లో బలమున్నా, నటన పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. బలమైన దృశ్యాల్లో కూడా నేపధ్యసంగీతాన్ని తీసేస్తే వీరి నటనా వైదుష్యం తెలిసిపోయి… వెలిసిపోతుంది. మనోజ్ బాజ్పాయ్ డబ్బింగ్ విషయంలో చూపించిన అశ్రద్ధ, పంటికింద రాయే. నిజానికి నటులు కాని రాములు పాత్రధారి నాగయ్య, కేబుల్ రాజు బామ్మగా చేసిన పెద్దావిడ, మనోజ్ తల్లిగా చేసిన టి.వి. నటి, అనుష్కతోపాటూ ఉండే third sex పాత్రధారీ చేసిన నటన అత్యంత పాత్రోచితంగా, సహజంగా ఉంది. కొత్తవాళ్ళచేత ఇంతబాగా నటింపజేయగలిగిన దర్శకుడు, ప్రముఖ నటుల దగ్గరికొచ్చేసరికీ నిరాశపర్చడం క్షమించలేని లోపం.

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పేదా-గొప్పా తేడాలు, హిందుత్వ రౌడీయిజం, ముస్లింలపై అనుమానం, స్త్రీల exploitation, ఇస్లాం టెర్రరిజం వంటి ఎన్నో విషయాల చూట్టూ సీన్లు అల్లుకున్నా దేన్నీ సమగ్రంగా దర్శకుడు అర్థం చేసుకున్న ఆధారాలు కనిపించవు. కొన్ని సీన్లలో మన భావాల్ని manipulate చేసి రసస్పందన కలిగించడానికి ప్రయత్నం కనిపిస్తుందే తప్ప దర్శకుడి integrity కనిపించదు. అవగాహన అగుపించదు. ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీని సంభాషణ పరంపరల మధ్య, ఆణిముత్యాల్లాంటి కొటేషన్ల లాంటి మాటలు కొన్ని “అబ్బా” అనిపించినా, మొత్తంగా చూస్తే చాలా అమెచ్యూర్ గా ఉన్నాయి. కొన్ని పనికొచ్చే మాటల్ని యధావిధిగా సెన్సారు వారు ఆడియో కట్ ఇచ్చారు. A సర్టిఫికెట్ ఇచ్చిన ఈ చిత్రంలో పాత్రో చితమైన, సీన్ కు అవసరమైన మాటల్ని కట్ చేసి సెన్సార్ చేసిన ఘనకార్యమేమిటో అర్థం కాదు.

ఆరితేరిన సంగీత దర్శకుడు కీరవాణి చాలా నీరసంగా అందించిన ట్యూన్లు సినిమా చూసి బయటొచ్చిన తరువాత గుర్తుండవు. సినిమా చూస్తున్నప్పుడూ తమ ప్రభావాన్ని చూపవు. నేపధ్య సంగీతం ప్రధమార్థంలో చెవులకు కఠోరంగా అనిపించినా, ద్వితీయార్థానికి కల్లా సినిమాకు పుష్టిని అందించింది. అన్ని లోయాంగిల్ షాట్లు సినిమాలో ఎందుకున్నాయో నాకు అర్థంకాకపోయినా, జ్ఞానశేఖర్ సినెమాటోగ్రఫీ అందంగానే ఉంది.

దర్శకుడిగా ద్వితీయచిత్రమే అయినా గమ్యంతో తెలుగుసినిమాకు కొత్త ఊపిరినిచ్చిన క్రిష్ తన వైవిధ్యాన్ని నిలుపుకున్నాడు. కాకపోతే, తన అపరిపక్వ పత్రిభని మరింత మెరుగు పరుచుకోవలసిన అవసరం చాలా కనిపిస్తుంది. సీన్ ను ఊహించిన విధానాలు బాగున్నా , నటనను రాబట్టుకోవడంలో, సీన్ కొరియోగ్రఫీ మీద పట్టుసాధించడంలో శ్రమించాల్సింది చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సీన్లలో ‘డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చులే’ అనే తేలికతనం కనిపిస్తుంది. ఇప్పటికే మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్న పరిశ్రమ మాటలు తలకెక్కితే ఈ దర్శకుడూ అపరిపక్వంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, క్రిష్ కాస్త మెలకువగా ఉండటం తెలుగు సినిమా భవిష్యత్తుకు ఎంతైనా మంచిది.

కథావిస్తరణలో లోపమో లేక పాత్రలు ఆ పరిస్థితుల్లోకి నెట్టబడేంతవరకూ రాని పరిణితిలోని సహజత్వమో తెలీదుగానీ, క్లైమాక్స్ ఏమాత్రం బలం తగ్గివున్నా అత్యంత బోరింగ్ సినిమాల కోవలోకి వెళ్ళిపోయే చిత్రంగా మిగిలుండేది. చిత్రం ప్రదమార్థం, ద్వితీయార్థంలో కథ ఏమీ జరక్కపోయినా, పతాకసన్నివేశం అత్యంత బలంగా ఉండి అప్పటి వరకూ నిరాశపడిన ప్రేక్షకుడిని ఇరుకునపెట్టి “బాగుంది” అనిపించే సినిమా ఇది.

అందుకే…వేదం “బాగుంది”. చూడండి.

62 Comments
 1. SK June 4, 2010 /
  • SK June 4, 2010 /
 2. Surya June 4, 2010 /
  • NaChaKi June 6, 2010 /
 3. anamakudu June 4, 2010 /
 4. naresh Nunna June 4, 2010 /
 5. రమణ మూర్తి June 4, 2010 /
  • PHANI June 4, 2010 /
   • sasank June 4, 2010 /
   • sasank June 6, 2010 /
   • Srinivas Komanapalli June 10, 2010 /
   • sankar June 6, 2010 /
   • NaChaKi June 7, 2010 /
   • NaChaKi June 7, 2010 /
   • NaChaKi June 7, 2010 /
   • Aatma June 9, 2010 /
 6. Suresh Kumar Digumarthi June 4, 2010 /
 7. సుజాత June 4, 2010 /
  • suresh June 8, 2010 /
 8. sasank June 4, 2010 /
 9. సురేష్ కుమార్ దిగుమర్థి June 5, 2010 /
 10. Norman Bates June 5, 2010 /
   • sasank June 5, 2010 /
   • sasank June 6, 2010 /
 11. vardhan June 5, 2010 /
 12. vardhan June 5, 2010 /
 13. venu June 5, 2010 /
  • తెలుగు ప్రేక్షకుడు June 5, 2010 /
   • తెలుగు ప్రేక్షకుడు June 5, 2010 /
   • sasank June 6, 2010 /
 14. sonyk June 5, 2010 /
 15. Harsha June 5, 2010 /
  • sasank June 6, 2010 /
   • sankar June 6, 2010 /
 16. Vasu June 5, 2010 /
 17. SANJEEV June 6, 2010 /
 18. vardhan June 6, 2010 /
 19. Chetana June 6, 2010 /
 20. తెలుగు ప్రేక్షకుడు June 6, 2010 /
 21. నచకి June 7, 2010 /
  • నచకి June 7, 2010 /
   • రవి June 7, 2010 /
  • రవి June 7, 2010 /
 22. achalla srinivasarao June 7, 2010 /
  • నచకి June 8, 2010 /
 23. manoj June 9, 2010 /
 24. srikanth June 9, 2010 /
 25. చక్రధారి June 12, 2010 /
 26. V Chowdary Jampala June 18, 2010 /
  • GopiCM June 23, 2010 /
 27. Geethoo June 23, 2010 /