Menu

రావణ్ అసలు కథేంటి?

అనగనగా ఛత్తీస్ ఘడ్ – జార్ఖండ్ లాంటి ఒక అటవీ ప్రాంతం.
ప్రభుత్వం అక్కడ మైనింగ్ ల కోసమో లేక సెజ్ లకోసం ప్రైవేటు కంపెనీలకు భూమినో కట్టబెట్టాలనుకుంది.
అక్కడో ఆదివాసీ లీడరు(వీర).
గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటాడు.
ప్రభుత్వానికి అతనొక ‘విలన్’.
ఆ లీడర్ ని మట్టుబెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ఒక వీరపోలీస్ (దేవ్) ను పంపిస్తుంది.
ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలౌతుంది.
ఈ ఘర్షణ నేపధ్యంలో ఆదివాసీ జనాలను హింసించడంతో పాటూ వాళ్ళ లీడర్ చెల్లెల్ని స్పెషన్ ఫోర్స్ వాళ్ళు రేప్ చేస్తారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఆశయం, ఆదర్శంతో పాటూ వ్యక్తిగత కక్షతోడైన లీడర్, దొరికిన పోలీసుల్ని దొరికినట్లు చంపి, ఆ పోలీస్ అఫీసర్ భార్య(రాగిణి)ని చంపడానికి కిడ్నాప్ చేస్తాడు.
చావంటే భయపడని రాగిణి ధైర్యం, సహజమైన అందం వీర ను ఆకర్షిస్తుంది.
జనాలకోసం పోరాడుతున్న వీర ఆదర్శం, ప్రభుత్వం కోసం ఎన్ని మానహక్కుల ఉల్లంఘలైనా చెయ్యగల దేవ్ నిజం తెలుసుకున్న రాగిణి కూడా వీర వైపు ఆకర్షించబడుతుంది.
దేవ్-వీరలో పోరులో చంపగలిగినా,  రాగిణి కోసం వీర దేవ్ ని వదిలేస్తాడు. రాగిణిని దేవ్ కు అప్పగించేస్తాడు.

దేవ్ కి రాగిణి శీలం మీద అనుమానం వస్తుంది.
రాగిణి దేవ్ ఆసహ్యించుకుని అజ్ఞాతంలో ఉన్న వీర దగ్గరికి వచ్చేస్తుంది.రాగిణిని అనుసరించి దేవ్ వీరను కనిపెట్టి కాల్చిచంపుతాడు.
పెళ్ళాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వ దౌష్ట్యాలకు కొమ్ముకాసే దేవ్ తో జీవించడం కన్నా, తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదర్శవాది వీరతో మరణించడం మంచిదని రాగిణి అతనితో పాటూ లోయలో పడి చనిపోతుంది.
దేవ్ తన మిషన్ పూర్తయిందనుకుని వెనక్కుతిరుగుతాడు.

ఇప్పుడు రావణ్ సినిమా చూసి చెప్పండి, సినిమాలో ఈ కథ ఎలా అర్థమౌతుందో….! 🙂

– చక్రధారి

12 Comments
  1. sowmya June 23, 2010 / Reply
    • GopiCM June 23, 2010 / Reply
  2. ఆనామిక June 23, 2010 / Reply
  3. badri June 23, 2010 / Reply
  4. తెలుగు ప్రేక్షకుడు June 24, 2010 / Reply
    • kiran June 24, 2010 / Reply
  5. Sowmya June 24, 2010 / Reply
  6. అభిమాని June 25, 2010 / Reply
  7. vasu June 26, 2010 / Reply
  8. Al Pacino June 26, 2010 / Reply
  9. Al Pacino June 26, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *