Menu

తెలుగు సినిమాకు సరికొత్త -వేదం

వేదం సినిమా ప్రారంభం నాటి నుంచి ..రెలీజి అయ్యక ధియేటర్ లో చూసి బయటకు అడుగుపెట్టెంతవరకు నేను విన్న మాటలు .
పర్యవరణ పరిరక్షణ రోజు న మేము ఈ సినిమా చూసాము
1.పచ్చని చెట్ట్లను రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరిది అని ఒక బ్యానర్ చూస్తే అనిపించింది కేవలం పచ్చని చెట్లనే కాదు …క్రిష్ లాంటి దర్శకులను రక్షించుకోవలసిన బాధ్యత కూడ ప్రేక్షకులదే అని .
2.అబ్బా చాలాకాలానికి ఓ 15 వందలు ఖర్చుచేసినా కాని ఒక చెత్త సినిమా చూడలేదు అనే సంతోషం మిగిలిందిరా అది చాలు .
3 .ఇప్పటి వరకు మన ఆడియన్స్ మైండ్స్ ప్రోగ్రామింగ్ అయిపోయి ఉన్నాయిరా ,దాని కి కారణం కూడ ఇప్పటి వరకు సినిమాలు తీసిన కొంతమంది దర్శకులే ముందు ముందు చూడు .
4.ఓ ఆరు వారాల సినిమా అంతే.
5.తెలుగు ఫీల్డ్ లో సూపర్ డైరక్టర్లు అంటే (…) అనుకున్నాం అసలు డైరక్టర్లంటే శెఖర్ కమ్ముల ,క్రిష్ లాంటోల్లు రా.
6. స్టార్ హీరో లు ఉన్న కాని …సినిమా రెండో రోజే లేడిస్, ఫ్యామిలిస్ తో వచ్చారు అంటే అర్ధం చేసుకో. ఆ గౌరవం చాలు రా క్రిష్ కి .
7. అల్లు అర్జున్ ,మంచు మనోజ్ ల లాంటి యువ స్టార్ హీరో లతో క్రిష్ లాంటి డైరక్టర్ సినిమా నా?
8.యువ దర్శకులు కధ వినిపించేటప్పడి నుండి ఎడిటింగ్ టేబుల్ నుంచి ,ఫస్ట్ కాపి బయటకు వచ్చెంతవరకు …చిన్నోడు పెద్దోడు..ప్రతి ఒక్కడి సలహాలు సినిమా ఇలా తియ్యలి అలా తియ్యలి ఇది అది అని మాట్లాడితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ల సర్టిఫికేట్ మాటలు..,ప్రపంచ సినిమా డీవీడి ల సినిమా మేకింగ్ జ్ఞానోదయాలు అబ్బో….అసలు ప్రస్తుతం సినిమా తియ్యలనుకున్న దర్శకుడికి తాను నచ్చినట్లు తీసే స్వాతంత్రం దోరక్డం ..కోట్ల రూపయలు బడ్జెట్ దోరకడం కన్నా ఎంతో ఆనందకరమైంది .
ఇక సినిమా తీసిన తరువాత…రిక్షాతను నుంచి ,తిన్నది అరగ బ్లాగులు రాసుకునే నా లాంటొడి వరకు అందరు ఆవులింతలు వచ్చెంతవరకు ..చెప్పే సూక్తులు వినాలంటే …దర్శకుడి కి సినిమా తియ్యడం ఏమో కాని ఇవి భరించడం కష్టం .ఈ విషయలాలో క్రిష్ లాంటోల్లకు క్రియేటి విటి పక్కన పెడితే , చాలా సహన శక్తులుండాలి.
9, సాంగ్స్ సూపర్ , స్టొరి కి , సీన్స్ కి మంచి గా కుదిరినాయి.( రెండొరోజే మోబైల్ లో వినిపించాడు)
(సినిమా పాటలు అంటే బయటకు వచ్చి పాడుకునే లా ఉండాలి అని అనుకోవడం కోసం కాకుండా..
హాలు లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ కధ కు ,సన్నివేశాన్ని ఆస్వాదించేందెందుకు దోహద పడే లా ఉండాలి అది ఈ సినిమా లో సరిగా జరిగింది . అని చిన్న చర్చ )
10 .హింది సినిమా లు బాగ చూస్తుంటాము కాబట్టి కాస్త ఆ ఫీల్ కూడ కలిగింది పాటల్లో.
11. ఈ సినిమా మలయాలం లో నో ,లేద తమిల్ లో నో వచ్చి ఉంటే ఈ పాటి కి మనోళ్ళు అధ్బుతమైన రీమేక్ రైట్స్ ఇచ్చి కోనే వాళ్ళు .ఆకాశానికెత్తే వారు.
12. ఇలాంటి వి మనోళ్ళు చాలా మంది కి నచ్చదబ్బా. క్రిష్ మూడో సినిమా తమిలో చేస్తే బాగుంటది. అక్కడ దోరికే సక్సెస్ ఎక్కువ.
13. కొత్తగా ఏం లేదు రా అని .ఎందుకు బాగో లేదని విడమర్చి చెప్ప్తుండగా…
శవాలను పోస్ట్ మార్టం చేసే అతను భార్య పక్కన పడుకున్నప్పుడు ఆమే శరీరాన్ని పోస్ట్ మార్టం చేసే శవం లా చూడడు .సినిమా ని కూడ అలా చూడకు.
ఇకా గేటులో ఒక మిత్రుడు కోత్తగా…నన్నడిగిన ప్రశ్న..
రెయ్ సైఫు….అసలు ఈ మధ్య జిహాద్ లంటూ ఎందుకు మోదలయ్యాయిరా?
(హూ… మళ్ళీ చిన్న గా కనిపించే పెద్ద ప్రశ్న )
(థ్యాంక్స్ క్రిష్ కనీసం జిహాద్ ఎందుకు? అనే ప్రశ్న కలిగించినందుకు .)
టోటల్ గా చెప్పాలంటే… ( ప్రేక్షకుడిని …’మాస్ గాడివి ‘ అని అనుకోకుండా , రాములు కోసం …నుంచి ఖురైషి కోసం వరకు …మనవారి కోసం ఒక ఆలోచన నేర్పినందుకు .)
జుగ్ జుగ్ జియో …క్రిష్ . ఆమీన్

6 Comments
  1. zulu June 21, 2010 /
  2. రామనరసింహ June 21, 2010 /
  3. Uttara June 24, 2010 /
  4. Samnjeev June 25, 2010 /
  5. shankar gongati July 2, 2010 /
  6. chakri July 8, 2010 /