Menu

డాక్యుమెంటరీ సినిమా-9

లాటిన్ అమెరికాలో సినిమా ఆయుధం

లాటిన్ అమెరికా సినిమాల్ని అర్ధం చేసుకోవాలంటే వాటికి వియత్నాంకి గల మమేకతని, అమెరికా ఆయుధబలగాలు, బలం మొ..వాటిని లెక్కలోకి తీసుకోవాలి.

సాంకేతికాభివృద్ధి చెందిన ఆయుధాలతో, పరికారాలతో అణచివేతకు పూనుకునే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనడానికి లాటిన్ అమెరికా దేశాల ఉద్యమకారులు ప్రజాసముద్రంలో చేపల్లా మారారు. కాని ఆ సముద్రాన్నే ఎండగట్టడానికి ప్రయత్నాలు సాగేటప్పుడు లాటిన్ అమెరికాదేశాలు ఎలాంటి పరిస్థితిలో ఉంటాయి? ఈ నేపధ్యంలో భాగంగా ఆ సినిమాని బేరీజు వేయాలి. లాటిన్ అమెరికాదేశాలన్నీ వలసపీడిత దేశాలు. ఈ దేశాలన్నీ ఆర్ధికంగా మాత్రమేగాక, సాంఘికంగానూ, రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ వలసవాదుల గుప్పిట చిక్కి తీవ్రమైన దోపిడీకి గురవుతున్నాయి. జాతి వివక్షత ప్రజలందరి నెత్తిన బలవంతంగా రుద్దబడింది. స్థానికపెట్టుబడిదార్లు, వలసవాదులంతా చేతులు కలిపి ప్రజలను తీవ్రంగా దోపిడి చేస్తున్నారు.

ఈ పరిస్థితిలో విముక్తి పొందిన క్యూబాను ఆదర్శంగా చేసుకుని లాటిన్, అమెరికన్ దేశాలన్నిటా అతివాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ అతివాద ఉద్యమాలతోపాటుగా “సినిమా ఉద్యమం” కూడా ఆవిర్భవించింది. సినిమాలలో ఉన్న శక్తి లాటిన్ అమెరికన్ మేధావులు గుర్తించారు. అయితే సినిమాను ఏ విధంగా ఉపయోగించాలి? ముందుగా ప్రజలలోవున్న అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యవంతులను చేయడానికి సినిమా ఉపయోగపడాలి. దేశంలోవున్న వాస్తవిక పరిస్థితులను ప్రజలకు తెరపై అర్ధమయ్యేటట్లు చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పాలంటే ఏ మార్గాన్ని ఎవరిమార్గాన్ని అనుసరించాలి? లాటిన్ అమెరికన్ దేశాలన్నిటా ఇప్పటికీ హాలీవుడ్ చిత్రాలు స్వైరవిహారం చేస్తున్నాయి. సినిమా కళాకారులపై వివిధ సినిమాల, వివిధ దర్శకుల ప్రభావం అపారంగా ఉంది. ముఖ్యంగా మేధావులపై బెర్గ్ మన్, ఫెల్లీనీ, యాంటోనియాని, ట్రప్పోల ప్రభావం అధికంగా వుంది. అయితే ఈ దర్శకుల సినిమాలు తమ సమాజానికీ, తమ సమస్యలకూ సంబంధం లేకుండా ఉండటంతో మేధావులందరూ వేరే మార్గాలు వెదుకసాగారు. ఆ ప్రయత్నంలో వీరికి ఐన్‌స్టీన్, వెర్టోవ్, ధవ్‌జెంకోలు ధృవతారల్లా గోచరించారు. ప్రజాసమస్యలపై సరైన ఆవగాహనతో చిత్రాలు నిర్మించిన దర్సకులుగా, ప్రపంచఖ్యాతి పొందిన వీరినుండి ఉత్తేజితులైన లాటిన్ అమెరికన్ మేధావులు తమ దేశాల సమస్యలనూ తెరకెక్కించే ప్రయత్నం చేయసాగారు.

లాటిన్ అమెరికన్ దేశాలన్నిటా కొన్ని “సినిమా గ్రూపులు” ఏర్పడ్డాయి. సినిమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను గావించడం దీని ప్రధాన ఉద్ధేశ్యం. ఈ గ్రూపులు పోర్టబుల్ జనరేటర్లూ, ప్రొజెక్టర్లూ, కొన్నిముఖ్యమైన సినిమాలు సేకరించి దేశమంతటా సంచారం సాగించాయి. ఈ చిన్ని గ్రూపులు తమకున్న కొద్దిపాటి యంత్రసామగ్రి సహాయంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు ప్రపంచ ప్రసిద్ధమైన సినిమాలు చూపించదం మొదలుపెట్టాయి. ఐజెన్‌స్టీన్ నిర్మించిన “బేటిల్ షిప్ పోటెంకిన్” “అక్టోబర్” “స్త్రయిక్” చిత్రాలూ, ధవ్ జెంకో నిర్మించిన “ది లాండ్” , బైఖర్మాన్ నిర్మించిన “సార్ట్ అఫ్ ది ఎర్త్” బునియల్ నిర్మించిన “లాస్ అల్విడాస్” సినిమాలూ, చూపించి వివిధ దేశాలలోని కార్మికులూ , కర్శకులూ తమతమ సమస్యలను ఎలా ఎదుర్కొన్నదీ అర్ధమయ్యేట్టు వివరించసాగారు. సినిమా ప్రదర్శనలో మధ్య మధ్య ఆపుచేసి ప్రజలు తమంతట తామే ఈ చర్చలు నిర్వహించుకునే అవకాశం కల్పించి వారిని విజ్ఞానవంతులను చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నం ఎంత ఫలవంతమయ్యిందంటే గ్రామాలలోని ప్రజలు ఈ గ్రూపుల కోసం ఎదురుచూస్తుండేవారు. పోలీసులనుంచీ, సంఘ విద్రోహశక్తులనుంచీ ఈ గ్రూపులకు ప్రజలే రక్షణ కలిపించేవారు. ఈ చిత్రాలతో పాటు క్యూబా, వియత్నాం చిత్రాలు కూడా ప్రదర్శించేవారు. ఫ్యాక్టరీ కార్మికులకు చూపించి చర్చలకు ఆహ్వానించేవారు.

ఇలా సినిమాలు ప్రదర్శించే ఉద్యమమేగాక సినిమాలు నిర్మించే గ్రూపులు కూడా తయారై ఉద్యమంలో చేరాయి. అటువంటి గ్రూపులలో బ్రెజిల్ లో గ్లాబర్ రోచా నాయకత్వాన “సినిమా నోవో ఉద్యమం” అర్జెంటీనాలో ఫెర్నాండో సోలోనాన్, ఆక్టివియోగెటినోల నాయకత్వాన “సినిమా విముక్తి ఉద్యమం” ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. ఇవిగాక లాటిన్ అమెరికన్ దేశాలన్నింటా చిన్న చిన్న గ్రూపులు ప్రజల సమస్యలపై చిత్రాలు నిర్మించాయి. ఇటువంటి చిన్న గ్రూపులలో బోలీవియాకు చెందిన “ఉక మాఊ” గ్రూపు ముఖ్యమైనది. ఈ గ్రూపులు కాక వ్యక్తులుగా బొలీవియాలో జార్జి సాంజనీస్, చిలీలో మిగుయిల్ లిట్టినీ, ఆంధ్రేరాక్ లో ప్రజాసమస్యలపై సినిమాలు నిర్మించి తామే ఉద్యమంగా రూపొందించారు. ఐతే మొదట క్యూబా సినిమాని పరిశీలిద్దాం..

భావవినిమయ దీపశిఖల .. క్యూబా చిత్రాలు

క్యూబా సోషలిస్ట్ భావాలు గల దేశం. క్యూబా లాటిన్ అమెరికాతో పోరాడే దేశద్వీపం. క్యూబా వియత్నాంకు రక్తసోదరి. క్యూబన్ సినిమా అంటే అమెరికా అణచివేత వ్యతిరేక రాజకీయాలే. దానికే మరోపేరు ప్రజలత్యాగం. క్యూబా నేపధ్య చరిత్ర తెలియనివారు క్యూబా సినిమాలన్నీ పచ్చి రాజకీయాలని ఈసడిస్తారు.

క్యూబా సినిమారంగం క్యూబా పోరాటంలో విరిసిన అనేక సాంస్కృతిక రంగ శాఖల్లో ఒకటి. క్యూబా సినిమాకి, క్యూబా విద్యారంగానికి సంబంధం ఉంది. 1961 లో దాదాపు మూడు లక్షలమంది అధ్యాపకుల్ని దేశం నలుమూలల్లోని మారుమూల ప్రజలకు విద్య నేర్పడానికి పంపింది. సుమారు రెండులక్షల జతల కళ్లద్దాల జతలు సప్లయి చేసింది విప్లవానంతరం వేలరెట్ల అధికసంఖ్యలో పుస్తక ప్రచురణ జరిగింది. అమెరికాలో ఐదువేల కాపీలు మొదట ముద్రణలో వేస్తే క్యూబాలో పదివేలు వేయడం గమనార్హం. విప్లవానంతరమే కొన్నివేల గ్రంధాలయాలు ప్రారంభించారు. చాలామంది సామాన్య ప్రజలకు విద్య, రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఈ కోణంలో క్యూబా సినిమా గురించి చెప్పాలంటే క్యూబా విప్లవ సినిమా గురించే చెప్పాల్సి ఉంటుంది.

విప్లవానికి ముందు క్యూబాలో సినీ పరిశ్రమ పాదుకోలేదు. కాని హాలీవుడ్ సినిమారంగం చౌకగా అక్కడి లోకేషన్లు వాడుకునేది. బటిష్టా నియంతృత్వ పాలనలో చౌకబారు అమెరికా చిత్రాల్ని డబ్బింగు చేసేందుకు కొన్ని వసతులు కల్పించారు. అందులోనే నగ్న చిత్రాలు తీసి దేశం మీదికి వదిలేవారు. థియేటర్లని అమెరికా గుత్త పెట్టుబడులు కంట్రోలు చేసేవి.

బటిష్టాకి వ్యతిరేక పోరాటంలో కొన్ని డాక్యుమెంటరీలు, చిన్న చిత్రాలు రహస్యంగా తీశారు. వీటిని సెర్రాలో, కొన్ని పట్టణ ప్రాంతంలోనూ నిర్మించడం జరిగింది. ఇందులో అతి తక్కువ సినిమా విలువలుండేవి. శబ్దం, వెలుతురు సరిగా ఉండేవి కావు. డబ్బింగ్ సౌకర్యాలు లేకుండానే తీసేవారు.

ఇలాంటి చిత్రాలను ఎక్కువగా ఆల్ ఫ్రెడో గువేరా తీసాడు. ఇతను ఫెడెల్ కాస్ట్రో సహాధ్యాయి. విధ్యార్థిసంఘ నాయకుడు. విప్లవ విజయానంతరం ఫేడేల్ కాస్ట్రో ఇతణ్ణి పరిపాలనా సహాయకునిగా నియమించారు. అంతేకాదు. మొదటిసారిగా క్యూబా సినీ సంస్థని చట్టపరంగా ప్రారంభించారు. క్యూబా సాంస్కృతిక రంగంలో ఇదే మొదటి అడుగు. ఇది “మినిస్ట్రీ ఆఫ్ ఫిలిం” (ICAIC) శాఖగా పనిచేసింది. హాలివుడ్, మెక్సికో చౌకబారు వ్యాపార చిత్రాలు ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించాయి. అందుకే ఈ శాఖ మొదటిపనిగా క్యూబా సినీ ప్రేక్షకులను ‘సినిమా’ పరంగా చైతన్యవంతుల్ని చేసింది.

క్యూబా ప్రజలకు వినోదం కల్పించడం కోసం జపానీ సమురాయ్, రష్యన్ గూఢచారి సినిమాలు తెప్పించారు. వీటిలో చాలావరకు రాజకీయాలు ఉండేట్లు చూశారు. స్పానిష్ భాష అర్ధం కాదు కాబట్టి వియత్నాం విప్లవ చిత్రాలను స్పానిష్ లోకి డబ్ చేసి ప్రదర్శించారు.

క్యూబాలో మారుమూల పల్లెల్లోని రైతాంగం వ్యాపార సినిమా మొహం చూడకపోవటం వలన కొత్త సినిమాని తీసికెళ్లడం సులభయమయింది. ICAIC ఇప్పుడు క్యూబాలోని మారుమూల ప్రేక్షకుని దగ్గరికి సినిమాని తీసుకు వెళ్ల గలిగింది. 500 థియేటర్లే కాకుండా ఇతర పద్ధతుల ద్వారా సినిమాని ప్రజలకి దగ్గరగా తీసుకుపోగలుగుతున్నారు. కళాశాలల్లో, గ్రంధాలయాల్లో, సెంటర్లలో ఫ్యాక్టరీ కూడలిలో చర్చా సమావేశాలు పెట్టి సినిమాను చూపుతున్నారు. వ్యాపార ప్రమాణాలనీ, బూర్జువా నాగరిక సినీ భాష స్వరూపాన్ని విప్పి చెప్పి దానికి లొంగిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

క్యూబా సినిమా పాలసీని అర్ధం చేసుకోవడానికి ఆల్ ఫ్రెడో గువేరా చెప్పిన వాక్యాలు ఉపకరిస్తాయి.

“Our work is not simply making or showing movies. Everything we do as part of global process towards developing the possibilities of participation – not passive but Active, not as recipients but as protagonists of the public”

విప్లవానికి ముందు క్యూబాలో అమెరికా విడుదల చేసిన చిత్రాల్ని గమనిస్తే అది సాంస్కృతిక అణచివేతగానే అర్ధమవుతుంది. కాస్ట్రో అధికారంలోకి వచ్చాక కూడా సినిమాలపై ఎక్కువ ఖర్చు చేయలేదు. ఒక్క డబ్బింగ్ థియేటర్ కూడా నిర్మించలేదు. “టికెట్ కొని చూసే ప్రేక్షకులకు అన్నవస్త్రాలే లేనప్పుడు సినిమా పరికరాలపై ఖర్చు చేయడం శుద్ధ దండుగ” అని ఆయన భావించాడు. సినిమా విలువల కోసం కాకుండా ప్రచారం నిమిత్తం మాత్రమే డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. క్యూబా డాక్యుమెంటరీ నిర్మాత ఆల్వారెజ్ తీసిన చిత్రాల్ని ప్రఖ్యాత దర్శకుడు గోడార్ట్ చూసి చాలా బాగున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ప్రజల మధ్య తారతమ్యాలు లేకుండా చేయడం కోసం, వారిలో ఐక్యత కోసం, మేధావి కార్మికుల మధ్య దూరాన్ని చెరిపి వేయడం కోసం, కార్మిక మేధావుల్ని తయారు చేయడం కోసం క్యూబా సినిమా ప్రయత్నిస్తోంది. పట్టణం – గ్రామాలకూ, నాయకులూ – పౌరులకూ, యువకులూ – వృద్ధులకూ మధ్య భేదం పాటించకపోవడాన్ని కర్తవ్యంగా పెట్టుకుంది.

ఒక వేశ్యావాటికగా ఆట మైదానంగా క్యూబాని ఉపయోగించుకొన్న విధానాన్ని ఈ తరం యువతకి చెప్పడం సినిమా బాధ్యతగా భావిస్తారు. ఎందుకంటే అమెరికాని ఇంకా ద్వేషించడం నేర్పాలి. మాతృదేశం పట్ల దేశభక్తిని పెంచాలి. మళ్లీ అమెరికా బూర్జువా సంస్కృతిపట్ల మమకరం పెరగకుండా అలసత్వం అధికం కాకుండా ఉండేందుకు ICAIC గతాన్ని విస్మరించ దలుచుకోలేదు. గతం బాధకు పర్యాయపదం. బాధ బాధ్యతను గుర్తుచేస్తుంది ఈ కోణంలో చూస్తే క్యూబా సినిమా మొత్తం లాటిన్ అమెరికా దేశాల శత్రువుల మీద ఎక్కుపెట్టిన ఆయుధం. ఈ ప్రాధమిక సూత్రం గుర్తు ఉంచుకోవటమే క్యూబా సినిమాకి ప్రాణం అందుకే కథాత్మక చిత్రాల్లో సైతం డాక్యుమెంటరీ విధానం ప్రతిబింబిస్తుంది.

క్యూబన్లు ఇంత శక్తివంతంగా సినిమాని నిర్మిస్తారు కనుకనే 1972లో క్యూబా ఫిలిం ఫెస్టివల్‌ని న్యూయార్క్ లో, సాన్ ఫ్రాన్సిస్కోలో జరపడానికి ఎనో సంస్థలు ముందుకొచ్చాయి.

ఆల్ ఫ్రెడో గువేరా, ఆల్వారెజ్, ఫ్రాగా, సాల్ యొన్ మొ.. ప్రముఖులు వీసా కోసం దరఖస్తు పెట్టారు. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటనలో ఉన్నారు. చైనా అగ్రనాయకుల విందులో పాల్గొంటూ రెండు అగ్రరాజ్యాల మధ్య పరస్పర సంబంధాలు మరింత గట్టిపడాలని “చీర్స్” కొట్టేవేళ, ఇక్కడ అమెరికాలో క్యూబా చిత్ర ప్రముఖులకు వీసా రద్దు చేయడం జరిగింది. క్యూబా ఫిలిం ఫెస్టివల్ ని నిరాకరించారు. ప్రపంచంలో పెద్ద కమ్యూనిస్టు దేశమని భావించే చైనా పర్యటన చేసిన అమెరికా నాయకత్వం “క్యూబా చిత్ర నిర్మాతలు అమెరికాలో అడుగుపెడితే ప్రమాదమని” భావించడంలోనే క్యూబా సినిమా ఎంత శక్తివంతమో తెలుస్తోంది..

క్యూబా డాక్యుమెంటరీ చిత్రాలు రాజకీయంగా ఎంతో విలక్షణమైనవి. కేవలం ప్రచార లక్షణం మాత్రమే ఉండదు. రాజకీయ పాఠాలు చెప్పినా కూడా ఏ దృశ్యంలో కూడా ప్రచారం కనిపించదు. సిద్ధాంతాల వల్లింపు ఉండదు. చిత్రం ద్వారా చెప్పదలుచుకున్న విషయం సూటిగా చొచ్చుకువస్తుంది. అప్పుడప్పుడు ఆకస్మికంగా హృదయంలోకి చొరబడుతుంది. కొన్ని దృశ్యాలు లాలనతో బుజ్జగిస్తూ తమలో ఇముడ్చుకుంటాయి. వెంటనే మనసులోకి ఆ భావాలు ఆక్రమిస్తాయి. కథంతా మన ఇష్టపూర్వకంగా జరుగుతుంది. వినోదం, విషయ విజ్ఞానాల మధ్య సరిహద్దు చెరిగి పోతుంది. రెండూ కలగలిపి, కంటికీ మేధస్సుకీ పని కలిపిస్తుంది.

శక్తివంతమైన శైలిని ఒక్కో దర్శకుడు ఒక్కో రీతిలో మలుచుకున్నాడు. కొందరు బ్రెక్ట్ శైలినీ, మరికొందరు తమంతతామే కొత్త శైలినీ ఏర్పరుచుకున్నారు ఎపిక్ డాక్యుమెంటరీ రూపాన్నీ కలిగించారు. కళాత్మకతా, ప్రచారం సమ్మేళనంతో ఒక కొత్త కమ్యూనికేట్ కళారూపంగా మలిచారు. కమ్యూనికేటివ్ మీడియం కి అంతకన్నా ఎక్కువ ప్రయోజనం ఏముంటుంది??