Menu

Monthly Archive:: June 2010

మొదటి సినిమా-వి.ఎన్.ఆదిత్య

తన మొదటి సినిమా ‘మనసంతా నువ్వే’ తోనే ఘన విజయం సాధించిన వి.ఎన్.ఆదిత్య గారి అనుభవాలూ – జ్ఞాపకాలూ. నా చిన్నతనంలో నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగాం. నాన్నగారు స్టేట్ బాంక్ లో పనిచేసేవారు. నేను 1972 ఏప్రిల్ 30 న ఏలూరులో పుట్టాను. నాకు చాలా కాలం తెలియనిదీ, నేను సినిమా రంగంలోకి వచ్చాకనే తెలిసిందీ ఏమిటంటే.. మా నాన్న గారికి ఆయన చిన్నతనంలోనే ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అసిస్టెంటుగా పనిచేసే అవకాశం

డాక్యుమెంటరీ సినిమా-11

సినిమా విముక్తి ఉద్యమంలో అగ్నిజ్వాలల్లో ( The House of Furnaces) “అగ్నిజ్వాలల్లో అర్జెంటైనా” ఒక సినిమా ఇతిహాసం. మేధావులకీ, సౌందర్య(కళా) ఆరాధకులకీ సంతృప్తి కలిగించే టెక్నిక్‌లు, పద్ధతులు యిందులో లేవు. సంప్రదాయానుసారంగా తీసిన చిత్రాలు చూసే వారికిది ఒక షాక్ లాంటిది. అయితే ప్రేక్షకుల్ని తనలో యిముడ్చుకుని, వారిచే తలలూపించే షాక్ యిది. ఒక ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ. ఒక రాజకీయ చర్య, ఒక విప్లవ ఆయుధం, ఒక విముక్తి నినాదం – వీటన్నిటి మేలి కలయిక

అమ్మ కూడా ఒకప్పుడు హీరోయినే !!

తల్లిప్రేమ, తండ్రిప్రేమ, సోదరప్రేమ…. ఇలా ఒక prefix లేకుండా ఉత్తగా “ప్రేమ ” ఆడా మగా మధ్య మానసిక శారీరిక సంబంధాలే గుర్తుకువస్తాయి. ఆడామగా మధ్య ఆ ప్రేమే లేకపోతే మనిషికీ జంతువుకీ తేడా లేదు, సృష్టి ముందుకెళ్ళదు. కాబట్టేనేమో ప్రేమ కథలూ , సినిమాలు మెచ్చనివారు చాలా తక్కువమంది ఉంటారు. అయినా ఒక ఆడది , ఒక మగవాడు. ఎలాగోలా తంటాలు పడి ప్రేమించుకుంటారు , ఇందులో conflict ఏముంది అనుకునేవాళ్ళందరూ తప్పక చూడాల్సిన చిత్రం 

మొదటి సినిమా-శ్రీను వైట్ల

‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, మొదటి సినిమాకే ఏడు నంది బహుమతుల్ని గెలుచుకుని, ‘ఎవరీ సరికొత్త టేకింగ్ ఉన్న కుర్రాడూ..!?’ అని అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీను వైట్ల ‘ఆనందం’ తో ఎంత సక్సెస్ సాధించారో అందరికీ తెలుసు. అప్పటినుంచీ తన దిగ్విజయయాత్ర కొనసాగిస్తున్న శ్రీను వైట్ల గారు తన మొదటి సినిమా జ్ఞాపకాలని ఇలా పంచుకుంటున్నారు.. మాది తూర్పు గోదావరి జిల్లా లో రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్నగారు

డాక్యుమెంటరీ సినిమా-10

బ్రెజిల్ కొత్తసినిమా సామాన్యంగా తిరుగుబాటు సినిమా లేక విప్లవ సినిమా విప్లవ విజయానంతరం మాత్రమే సాధ్యమవుతుందని భావిస్తారు. ఉదాహరణకి 1959 తరువాతే క్యూబాలో ఒక నిర్దుష్టమైన విప్లవ చలనచిత్ర రంగం ఆవిర్భవించింది. అట్లని అంతకుముందు సినిమా మీడియాని ఉపయోగించుకోలేదని అర్ధం కాదు.. కాని ఇందుకు భిన్నంగా బ్రెజిల్లాంటి కొన్ని చోట్ల విప్లవానికిముందే తిరుగుబాటు సినిమా సగర్వంగా తలెత్తి నిలిచింది. 1960 పూర్వం లాటిన్ అమెరికాలో సినిమాలన్నీ హీనస్థాయి వినోదాన్ని కుప్పతెప్పలుగా అందించేవి. నిజం చెప్పాలంటే అవన్నీ ఉత్తర