Menu

వేటూరి స్మృతిలో కొన్ని నిముషాలు…

’గుండెపోటుతో వేటూరి మృతి’
-ఈనాడు వార్త, నిద్రపోబోతూ సగం మత్తులో చూసాను. ఉన్న మత్తంతా వదిలి – కళ్ళనీళ్ళు తిరిగాయి.
నాకేం సంబంధం అయినా? నేనెందుకు ఏడవాలి?
– మరి, వేటూరి పాటలేని జీవితం ఊహించుకోగలిగే విధంగా ఉంటుందా ఏం?

’గొడవేగొడవమ్మా చేయిపట్టే…’ అబ్బబ్బా! ఈయనేంటి ఇంత పచ్చిగా రాస్తాడు?
’గసగసాల కౌగిలింతా?’ – ఎంత బాగుందీ ప్రయోగం!
’చేరువైనా రాయబారాలే..చెప్పబోతే మాటమౌనం..’ – అబ్బ! ఎంతంగా చెప్పారో!
’మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో – మెరుపుతీగ మీటి చూడు తందనాలతో’ – తమాషాగా ఉందే
’చిలిపియాత్రలో చల్ చల్ చల్ చల్ జరుపమందిలే జంతర్ మంతర్’ – ఏమిటో ఈ భాష!
’ఈ దుర్యోధన దుశ్శాసన….’ – వింటూంటేనే ఆవేశం పుట్టేయదూ?
“అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగల చేమంతులే వాడిపోయే…
తన రంగు మార్చింది రక్తమే తనలో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పొయే…
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై ” – అక్షరమక్షరం ఎన్ని జీవితానుభవాల కలయిక?
-ఎన్నని తల్చుకునేది? ఎన్నిసార్లని అబ్బురపడేది? ఎక్కడ మొదలుపెట్టేది? ఎక్కడ ఆగేది?

ఈయనతో నా తొలి పరిచయం – వేటూరి అన్న పేరుతోనైనా, ఆయన పాటతోనైనా – ప్రతి తెలుగు వ్యక్తికి మల్లే – ఊహ తెలుస్తూనే జరిగింది. బహుశా ఊహ తెలీనప్పుడు కూడా పరిచయమేనేమో!! అక్కడినుండి జీవితంలో భాగమైయ్యాడు. ఇకపై వేటూరి కనబడ్డు….పాట మాత్రమే మిగిలింది…అన్న ఆలోచన ఎంత భయంకరంగా ఉందో…

“మనసు రాయి చేసుకున్నా మమత ఘోష మానకుంది
కళ్ళ నీళ్ళు దాచుకున్నా కలల బరువు తీరకుంది” (ఈపాట వేటూరిది కాదనుకుంటాను కానీ – ఇప్పుడు పదేపదే గుర్తొస్తోంది!!)
-నిజం!! వేటూరి పాటంత నిజం. ఇవాళ ఏడవని తెలుగువాడు తెలుగువాడేనా??

15 Comments
  1. Badri May 23, 2010 /
  2. Venkat Gopu May 23, 2010 /
  3. అరిపిరాల May 23, 2010 /
  4. సుజాత May 23, 2010 /
    • సౌమ్య May 23, 2010 /
  5. వేణు May 23, 2010 /
    • సౌమ్య May 23, 2010 /
      • స్నేహిత్ May 23, 2010 /
  6. వేణు May 23, 2010 /
  7. ananda Vihaari May 23, 2010 /
  8. సుజాత May 23, 2010 /
  9. రవి May 25, 2010 /
  10. Sridhar parupalli May 20, 2015 /