Menu

Monthly Archive:: May 2010

మొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ

శ్రీ మోహన్ గాంధీగారు ‘కర్తవ్యం’ , ‘మౌనపోరాటం’.. లాంటి సందేశాత్మక, సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతోపాటు ‘మంచి మనసులు’ , ‘వారసుడొచ్చాడు’ లాంటి ఫేమిలీ సెంటిమెంట్ సినిమాలకూ దర్శకత్వం వహించి సూపర్‍ హిట్‍ చేసిన ఘనత ఆయనది. ఇంతవరకూ దాదాపు 40 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన గాంధి గారు కొన్ని కన్నడ సినిమాలకి కూడా దర్శకుడిగా పనిచేశారు. మొదటిసినిమా అనుకోగానే ఒక్కసారిగా మనసు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. చిత్రరంగంలో పనిచేసే వాళ్లకి మొదటి సినిమా అంటే

నిమజ్జనం

తెలుగు చిత్రరంగంలో వాస్తవవాద దృక్పథంతో సినిమాలు నిర్మించి జాతీయస్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. ఆయన తన నలభై ఏళ్ళ సినీరంగ ప్రస్థానంలో 32 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఎక్కువ శాతం వ్యాపార చిత్రాలే. హెచ్.వి.బాబు, కె.బి.తిలక్, కె.ఎస్.ప్రకాశ్ రావు లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్గానూ, అసోసియేట్ గానూ పనిచేసిన బి.ఎస్.నారాయణ 1960 తర్వాత తానే స్వీయదర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం ఆరంభించారు.శ్రీదేవి, పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి చిత్రాలు నిర్మించిన

డాక్యుమెంటరీ సినిమా-5

అమెరికాలో కార్మిక సినిమా (1930 – 1935) అమెరికా బూర్జువా వ్యవస్థలోని దుర్గుణాలను, కర్కశత్వాన్ని బట్టబయలు చేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ఉన్న బానిస విధానాన్ని, అమెరికా రాజ్యాంగంలో దాగిన ప్రాధమిక లోపాల్నీ, బహిర్గతం చేసి శ్రామికవర్గంలో విప్లవ జెండా ఎగరెయాలనీ, విప్లవపధంలో వీరోచితంగా నడుస్తున్న శ్రామికవర్గం అండగా సినిమా మాధ్యం తన రంగూ రూపూ మార్చుకుంది. పనివేళల కోసం, కనీస సౌకర్యాల కోసం, ఆహారం కోసం, చేసిన పనికి సరైన కూలీ డబ్బులకోసం, యుద్ధాన్ని వ్యతిరేకించడం