Menu

Monthly Archive:: May 2010

Before The Rain – పరిచయం

“Time Never Dies. The Circle Is Not Round” పై వాక్యం అంతఃసూత్రంగా నడిచే Macedonian సినిమా, Milcho Manchevskiచే డైరెక్ట్ చేయబడిన Before The Rain (1994) . ఈ సినిమాకి నేపథ్యం 90 లలో Macedonian క్రిస్టియన్లకి, Albanian ముస్లింలకు మధ్య తరతరాలుగా…కచ్చితంగా చెప్పాలంటే 500 సం.లుగా నడచిన ఘర్షణలు. వీటికి Balkan Conflict అని పేరు. story has a beginning, a middle and an end… but not

మొదటి సినిమా – ముత్యాల సుబ్బయ్య

తెలుగు సినిమా దర్శకుల్లో చక్కటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ముత్యాల సుబ్బయ్యగారు దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం హిట్ సినిమాలే. ఒకే నిర్మాతకి ఐదారు సినిమాలు తీసి నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుబ్బయ్యగారు. చిరంజీవి తో ‘హిట్లర్’ , ‘అన్నయ్య’ సినిమాలూ ; వెంకటేశ్ తో ‘పవిత్రబంధం’ , ‘పెళ్ళి చేసుకుందాం’ ; బాలక్రిష్ణ తో ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ , ‘పవిత్రప్రేమ’ , ‘కృష్ణబాబు’ ; ఏ

డాక్యుమెంటరీ సినిమా-6

రెండో ప్రపంచ యుద్ధ సినిమా మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీలో ఆర్ధిక సాంఘిక రంగాలలో అనేక మార్పులు వచ్చాయి. ‘వర్సెల్స్ సంధి ‘ నియమాలు జర్మన్ జాతికి అవమానకరంగా కనబడ్డాయి. అంటే మొదటి ప్రపంచయుద్ధానికి ముందున్న ఉత్సాహ ఉద్వేగాలు మౌనరూపం దార్చాయి. అందులో విషాదరేఖ ప్రస్ఫుటంగా ఉంది. దీనికి రాజకీయ ఆర్ధిక కారణాలు గమనించి, గమనించకా కొందరు మధ్యతరగతి మేధావులు సంయమనం కోల్పోయారు. నిరాశ, నిస్పృహ రాజ్యమేలింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన నాలుగైదు సంవత్సరాల కాలాన్ని

1969 – ఖామోషీ

అది ఓ పిచ్చి ఆసుపత్రి. డాక్టర్ కల్నల్ సాబ్ – నసీర్ హుస్సేన్, ఆక్యూట్ మానియా ట్రీట్ చెయ్యడానికి ఓ వినూత్న పద్దతి ఉపయోగిస్తాడు. ప్రతి పిల్లవాడు తన తల్లి దగ్గర నుంచి పరిధులు లేని ప్రేమ కోరుకుంటాడు. ఆమె నుంచి దూరమైన తర్వాత అదే రకమైన ప్రేమ కోసం తపిస్తాడు. అది దొరకనప్పుడు పిచ్చివాడైపోతాడు. అలాంటి ప్రేమ దొరికినప్పుడు తిరిగి మామూలు అవుతాడు. అటుంటి పేషంట్ అరుణ్.. అదే మన రాజేష్ ఖన్నా.. ఓ రచయిత..

మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్

మనందరికీ తెలిసినా మనం తలుచుకోకూడదు అనుకునే పరమ సత్యం : మరణం. చచ్చిపోతాం అని తెలిసినా బ్రతుకుకోసం ఆరాటపడతాం. జీవితంలో అందరం ఇంకొందరితో భవబంధాలతో ఇరుక్కున్నవాళ్ళం. తల్లి, తండ్రి, సోదరులు,భార్య, భర్త, స్నేహితులు..మనకంటే మనకు అమూల్యమైనవారు ఎందరని ? మనం ఎలా ఉన్నా వీళ్ళు బావుండాలి అని ఎంతగా తాపత్రయపడతామో కానీ. ఇటువంటి మానవజీవితంలో మనిషికి తన మరణం కంటే కూడా భయంకరమైన శాపం, ఆప్తుల మరణాన్ని చూసే స్థితి. ఇప్పటికి ఈ వ్యాసం చదువుతున్న మీరు,