Menu

Monthly Archive:: May 2010

Harishchandrachi Factory (2009)

రష్మీ బన్సాల్ రాసిన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకంలో పరిచయం చేసిన ఇరవై మందిలో – పరేష్ మొకాషీ ఒకరు. ఆయన గురించి చదువుతూ ఉంటే – నాకు మరీ అంత బలమైన భావనలేమీ కలుగలేదు కానీ, ఆయన తన మొదటి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టాక, కుతూహలం మొదలైంది. పైగా, అది దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై అనగానే అది రెట్టింపైంది. ఇక ఆ సినిమా పోయినేడు ఆస్కార్ లకి మన దేశం నుండి అధికారిక ఎంట్రీ

వేటూరి పాటే మంత్రము

వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు. పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా “ఓ సీత కథ”లో

ఒక్క నిమిషం సినిమాల పోటీ – 2010

ఒక నిమిషం సినిమాపోటీలు 2010 సంవత్సరానికి గానూ మొదలైపోయాయి. ఆగష్టు 20 ఆఖరి తేదీ. పోటీకి పంపాల్సిన సినిమాల నియమాలు కొన్ని క్రింద ఉన్నాయి. మిగతా వివరాలకు ఈ లంకె నొక్కండి. 10 Points to Consider Your film must be 60 seconds – no more, no less. Produce your one-minute piece at broadcast quality. Consider your viewing audience – from mobile phones, to broadband

తెలుగు చలనచిత్ర సాహిత్య భారతానికి భీష్ముడు – వేటూరి

వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో “జగడజగడజగడానందం” అన్నా, వెర్రితనంతో “అ అంటే అమలాపురం” అన్నా, ప్రేమభావంలో “ప్రియా! ప్రియతమా రాగాలు” అన్నా, విరహవేదనతో “చిన్న తప్పు అని చిత్తగించమని” అన్నా, ఆరాధనాభావంతో “నవరససుమమాలికా” అన్నా, చిలిపిదనంతో “ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ” అన్నా, భక్తిభావంతో “శంకరా! నాదశరీరాపరా!” అన్నా, వైరాగ్యంతో “నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన”

వేటూరి స్మృతిలో కొన్ని నిముషాలు…

’గుండెపోటుతో వేటూరి మృతి’ -ఈనాడు వార్త, నిద్రపోబోతూ సగం మత్తులో చూసాను. ఉన్న మత్తంతా వదిలి – కళ్ళనీళ్ళు తిరిగాయి. నాకేం సంబంధం అయినా? నేనెందుకు ఏడవాలి? – మరి, వేటూరి పాటలేని జీవితం ఊహించుకోగలిగే విధంగా ఉంటుందా ఏం? ’గొడవేగొడవమ్మా చేయిపట్టే…’ అబ్బబ్బా! ఈయనేంటి ఇంత పచ్చిగా రాస్తాడు? ’గసగసాల కౌగిలింతా?’ – ఎంత బాగుందీ ప్రయోగం! ’చేరువైనా రాయబారాలే..చెప్పబోతే మాటమౌనం..’ – అబ్బ! ఎంతంగా చెప్పారో! ’మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో – మెరుపుతీగ మీటి చూడు