పూవుగా ప్రాణాలు పోనీ, తావిగా నన్నుండిపోనీ : వేటూరి సంస్మరణ

zeesare8

Veturi Commemoration

నరేష్ నున్నా

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

51 Comments to “పూవుగా ప్రాణాలు పోనీ, తావిగా నన్నుండిపోనీ : వేటూరి సంస్మరణ”

  • ఒక్కముక్కలో చెప్పాలంటే, వ్యాసం తలా తోకా లేకుండా, ఏం చెప్పకుండా, ఏం నిరూపించకుండా, ఏడిచినట్టుంది!

    ఉదాహరణకి…

    >>> “సినీరంగంలో కొనసాగుతున్న monopoly పట్ల తన సీనియర్లకన్నా వేటూరికి కోపం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.” ["అవకాశం ఉంది" అంటూ ఊహ]

    >>> “దానికి కారణం- వేటూరికి వారికి మధ్య ఉన్న భౌగోళిక భిన్నత్వమే.” [తన ఊహ మీదే "కారణం" పుట్టించడం]

    >>> “మరోలా చెప్పుకోవాలంటే మీ స్థాయికి ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదని వైరి వర్గంతో ఆయన చేసిన ఎకసెక్కమే.” [ఒక ఊహాత్మక ప్రాతిపదిక మీద నిజం పేరిట తలాతోకా లేని తీర్మానం]

    వేటూరి రాసిన అడ్డమైన చెత్తా డబ్బుకోసం రాసాడంటే ఎవరైనా కొడతారా?

    అయినా బొద్దింకలకి అబ్బే! బల్ల మీద పెట్టిన పళ్ళు అక్కర్లేదు, సింకు వెనకనుండే కుళ్ళే కావాలి!

  • మరో కోణంలో వేటూరి సాహిత్యాన్ని పరామర్శించారు. బాగుంది. అన్ని కోణాలూ, అన్నిపాటలూ ముఖ్యమే.

  • టపా కి పెట్టిన పేరుకి టపాకి సంబంధం లేనట్లు ఉంది!

  • ఏ ఆధారాలూ లేకుండా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానికి వాస్తవాన్ని కిట్టించాలని చూస్తే ఇట్లాగే తగలడుతుంది. ఈ “భౌగోళిక భిన్నత్వం” ఏ ఇంగ్లీషు పదానికి తర్జుమా?
    వేటూరితో ఎప్పుడయినా మాట్లాడారా? పోనీ ఆయన ఆత్మీయులతోనయినా?
    ఆ సోషియాలజీతో పాటు కాస్త ఎకనమిక్స్ కూడా చదువుకుంటే సినిమా పరిశ్రమను అర్థం చేసుకోవడంలో ఉపకరిస్తుంది.

  • ఏమిటి ఈ వింతపోకడలు…? మనిషిలోని విద్వత్తను గుర్తించకుండా..! ఆ మనిషియెక్క సామాజిక నేపధ్యాన్ని లేక కులాన్నో లేక ప్రాంతాం బట్టి ఆమనిషి విద్వత్తను నిర్ణయిస్తారా..? గత 15 సంవత్సరాలుగా ముఖ్యంగా కోస్తాప్రాంతాలలో ఈ కుల, ప్రాంతీయతత్వపైత్యం ఎక్కువగా వస్తున్నది. మరక్కడ అలాగె పెంచబడుతున్నారేమో..మనుషలను..? వేటూరి గారు తను రాసిన బూతుపాటలను నిజాయితిగా ఒప్పుకున్నారు, అవెందుకు రాయాల్సివొస్తుందో కూడో చెప్పారు..బహుశ ఈ వ్యాసకర్త వాటిని పరిగణలోకి తీసుకోలేదు, కేవలం వేటూరి పై వ్యక్తిగతమైన అసంతృప్తలేమన్న ఉన్నాయేమొ..దానిని ఇలా ప్రదర్సించినట్లున్నారు. మీలాంటివారు ఎన్ని విమర్శలు చేసినా..మాకున్న అభిమానం మాత్రం తరగదు ఆయనమీద.

  • adimeste appadam emo kaani …ee 4 puta la sodi nareshni podicheste pappadam ……….em raaytam em kathaa…..

    bodi gundu ki …mokalauku anukovataani ki koodaa ledu……edi bodugundo…edi mokaalo koodaa teliyakundaa mudeyaalani choostunaadu……..moorka sunnaa gaaru

  • నవతరంగం లో ఇంతవరకూ వచ్చిన వ్యాసాలన్నిట్లోకీ అతి చెత్త వ్యాసం ఇదేనేమో. మరో కోణం అంటూ ఇలాంటి ‘లో’కోణం (LOW) ఇక్కడ అస్సలు నప్పలేదు. “గొప్ప” వెబ్ సైట్లలో రావలసిన స్థాయి కలిగిన వ్యాసం నా అభిమాన నవతరంగంలో చూసి చాలా బాధ కలిగింది.
    - చక్రపాణి

    • @చక్రపాణి: ఈ వ్యాసం సండే ఇండియన్ అనే పత్రికలో కూడా వచ్చింది.

      • @Kathi

        “@చక్రపాణి: ఈ వ్యాసం సండే ఇండియన్ అనే పత్రికలో కూడా వచ్చింది”.

        What is that you are trying to convey by this??
        That this is a great a article as it was published in so called Nations Greatest News magazine?

        For Gods sake accepting our mistake is not all that bad. I don’t know why you get in to argumentative mood on everything these days.

  • చెత్త అని అందరూ వ్యాఖ్యానిస్తే ఏంటో అనుకున్నా, మఱీ ఇంత చెత్తా!
    కొరమీను కోమలం సొరచేప శోభనం, మావిళ్ళతోపుకాడ పండిస్తే మరుమల్లె తోట కాడ పువ్విస్తే… వంటివి ఛిఛీ బూతు పాటలు అనుకునేవారి ‘మధ్యతరగతి విలువలు’ ఎంత మాధ్యమికంగా వున్నాయో తెలుస్తుంది।
    వేటూరికి అందరూ అభిమానులమే, ఆయన వ్రాసినవి మీ ధార్మిక బారోమీటరు ప్రకారం ‘బూతు’ అయితే, “అబ్బే ఆయన మహానుభావుఁడు, ఆ తప్పు ఆయనిది కాదు వేఱెవరిదో” అని సరిదిచెప్పుకోవడం పిల్లపోకడ అవుతుంది। ఆ దిగఁజారుడు పని చేసేటప్పుడు కనీసం causality అయినా సరిఁజూసుకోవాలిగా?

    ధర్మాధర్మాలనీ, మంచీచెడులనీ, పవిత్రాపవిత్రాలనీ ప్రపంచాన్ని తలుపూనలుపుల్లో చూసేవారికి మహాశివుని వైభవం ఆయని సృష్టికి శిఖరాగ్రం అయిన వేటూరి వైభవం కండ్లకు మిరుమిట్లుగొలపడం సహజం। పిండంతే నిప్పటి।

    • ఉన్న విషయం ఒకటే అయినా – చూసేవారు తమ దృష్టిని/పరిజ్ఞానాన్ని బట్టి అన్వయించుకోవడం సహజం

      మంచి-చెడు, పవిత్రం-అపవిత్రం … ఇలాంటివాటిని సాపేక్షకాలుగా గ్రహించుకోవాల్సి ఉంటుంది

      అందరికీ తెలిసినదే మరల ఓసారి: యత్ భావం – తత్ భవతి

  • ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు’ అన్నట్టుగాక, గొప్ప వస్తుదృక్పథం వున్న పరిశీలన. బాలగోపాల్ చెప్పినట్టు ఆంధ్రదేశంలో ‘వ్యవసాయపు మిగులంతా సారావ్యాపారంలోకి సినిమాలలోకీ అక్కడ్నంచి రాజకీయలలోకి వచ్చి’, శ్రీశ్రీ, సినారేలు వచ్చిన కమ్యానిస్టు(అచ్చుతప్పు కాదు) నిర్మాతలు పోయి, ఇన్స్టంట్ లాభాలు, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అవసరమయిన సారాజులు నిర్మాతలయిన కాలం వేటూరి వచ్చిన కాలం.

    పెద్దమనుషులు గుర్తించ నిరాకరించవచ్చుకానీ, యిన్ని లక్షల సంవత్పరాల జీవ పరిణామంలో బొద్దికంలు మనగలిగాయంటే వాటి రహస్యం, అవి నాచు తిని మనగలగలగడమే.

  • ఎన్ని బూతు పాటలు వ్రాసినా వేటురి చాలా నిజాయితీ గా ఒప్పుకున్నారు. బాలు లా ఫొజు కొట్టకున్ద్దా(Reference : A Dialog in INDRA Movie). Thats why i LIKE VETURI So much.

  • ఇంత చెత్త వ్యాసం వ్రాసిన రచయతకు, దానిని తీసుకొచ్చి వెబ్సైట్ లో పెట్టుకొన్న పిచ్చితరంగం వాళ్లకు నా అభినందనలు.

  • నరేష్ గారూ,

    ఒక పేజి మొత్తం చాలా కష్టపడి వేటూరి గారు రాసిన బూతు(అని మీరు అనుకుంటున్న…పోనీ సాహిత్య విలువలు లేని ఫక్తు కమర్షియల్ అనుకుందాం) పాటల్ని సేకరించారు (గుర్తు తెచ్చుకోడానికి చాలా కష్టపడి ఉంటారు). అయితే నాదొక చిన్న సందేహం. “భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి” అన్న అన్నమయ్యనూ బూతు పాటల రచయిత గానే గుర్తిస్తారా మీరు? మీరన్న “ఆ తరహా” పాటలు అన్నమయ్య నుండి ఆత్రేయ వరకు వేటూరి ముందు కవులు కూడా రాశారు.

    అయినా చూసే దృష్టి బట్టే “మాట” కు అర్ధం మారుతుంది. ఉదాహరణకు “లింగం” అన్న మాటకు భక్తి కలిగినవాడి మనసుకు ఒకటి తోస్తే, వేరోకడి మనసుకు ఇంకో అర్ధం తోస్తుంది.

  • ఏమైంది నవతరంగానికి.
    చాలా కాలం తరువాత నవతరంగానికి వచ్చా. వేటూరి గురించి ఏం రాశారో అని. “సంస్మరణ” పేరుతొ తలా తోక లేని ఈ పరమ చెత్త వ్యాసం ఎదురైంది.
    అర్థం పర్థం లేని ఈ వ్యాసాన్ని ఎలా ప్రచురించారో నాకర్థం కాలేదు.

  • పోతన పేరు చెబితే భాగవతం గుర్తొస్తుంది అందరికీ. ఎవరికైనా భోగినీ దండకం గుర్తొస్తే వాడిలో ఏదో ఉందనే అనుకోవాలి.

    వెతికి వెతికి, చెత్తను సేకరించి ప్రచురించినందుకు నవతరంగానికి అభినందనలు.

    ఓ చిన్నపొరబాటు. “కొరమీను కోమలం, సొరచాప శోభనం” – ఈ పాట ధర్మక్షేత్రం సినిమాలో సీతారామశాస్త్రి గారు వ్రాసినట్టు గుర్తు.

  • నన్ను డిఫెండ్ చేస్తూ ఒకే ఒక్కరు!!!
    పొగడ్తలకి పొంగి, వీరే నన్ను సరిగా అర్థం చేసుకున్నారని, తిట్లకు కుంగి, నన్ను అర్థం చేసుకునే స్థాయి వారికి లేద’ని అనుకోజూడదన్న ఆదర్శాన్ని conscious level లో నేనూ అంగీకరిస్తాను. కానీ మెహర్ గారితో మొదలై, తాజాగా బ్లాగాడించె రవి గారి వరకూ తిడుతుంటే, Vara నన్ను పొడిచేంత వరకూ వెల్టుంటే, రమణ గారి స్వాంతన వచనాలకి పొంగిపోకుండా ఉండలేకపోయాను. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గనుక, మెజారిటీదే రాజ్యం కనుక, అధిక సంఖ్యాకుల వారు ప్రకారం నాదొక చెత్త వ్యాసం. కానీ, స్వీయరక్షణలో భాగంగా, దృశ్యాన్ని అదృశ్యం చేసి, డైలాగ్సనే వాచాలతతో బెంబేలెత్తించే తెలుగు సినిమాలు ‘భశుం’ కార్డు పడేముందు మళ్ళి లిఖిత, మౌఖిక వ్యాఖ్యానాలతో తెగబడినట్లు, నేను కూడా అంత వ్యాసం రాసి, మళ్ళీ మరికొంత వివరణతో తయారయిపోయాను. ఓపిక చేసుకోండి.
    * * *
    అది 1952 (58 ఏళ్ళనాటి మాట)
    వేదిక: ఆంధ్రరత్నభవన్, బెజవాడ
    సందర్భం: ఆంధ్ర పిసిసి అధ్యక్షుని ఎన్నిక
    పోటీదారులు: ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు బలపరిచిన నీలం సంజీవరెడ్డి, కులబలమే దన్నుగా నిలబడిన ఆచార్య రంగా (గోగినేని రంగ నాయకులు)
    అదొక సం’కుల’ సమరం. నువ్వు – నేనా అన్నట్టు ప్రతిష్టాత్మకంగా సాగిన పోటి. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యాన్ని నిరూపించే, నిర్దేశించే అతి కీలకమైన పోటి. ప్రకాశం పంతులు చాణక్యంతో సంజీవరెడ్డి గెలుపు.
    రంగా వర్గం (వర్ణం) ఈ ఘోర ‘అవమా’నాన్ని సహించలేకపోయింది. ధనబలం, స్థానబలం, బలగం ఉండి, ఒక విధంగా తమ రాజ్యంగా చెప్పబడే బెజవాడలో తమ అభ్యర్థి ఓటమి వారికి మింగుడు పడలేదు. పిసిసి డెలిగేట్లు ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నప్పుడు, రంగా వర్గాలలో ప్రముఖులైన పిన్నిమనేని సోదరులు (కోటేశ్వరరావు, శ్రీనివాసరావు). తమ కుల సమావేశానికి తక్షణ పిలుపునిచ్చారు. జమిందార్లయిన చర్లపల్లి రాజా వారి తర్వాత, ప్రాంతంలో అత్యంత పెద్ద భూస్వాములు పిన్నమనేని వారే (1600 ఎకరాలు). పార్టీలతో సంబంధం లేకుండా కమ్మ ప్రముఖలందరూ బెజవాద గోపాలరెడ్డి చౌల్ట్రిలో సమావేశమయ్యారు. ఇంత అంగబలం, ధనబలం ఉండి కూడా ప్రకాశం పంతులు అనే బ్రాహ్మణుడి వ్యూహానికి చిత్తవడం మీదే చర్చ ప్రధానంగా సాగింది. బ్రాహ్మణాధిక్యత మీద వారు అప్పటికి అర్థ శతాబ్ది పైగా చేస్తున్న సాంస్కృతిక యుద్ధాన్ని భూమార్గం పట్టించి, పోరు ప్రత్యక్షం చేయవలసిన అవసరాన్ని ఆ సభ నొక్కి చెప్పింది. తత్ఫలితంగా సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలలో కొన్ని.

    1. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా తమ సంతానాన్ని చదివించడానికి విద్యావకాశాలున్న పట్టణాలకి తల్లి లేదా, తండ్రి వలసరావాలి.

    2. ప్రొఫేసర్లు, డాక్తర్లు, ఇంజనీర్లు, సివిల్ సర్వెంట్లు, బ్యాంకు మేనేజర్లు….. ఇలా దాదాపు అన్ని ఉన్నతోద్యోగాలను ఆక్రమించిన బ్రాహ్మణుల స్థానాన్ని తమ వారసులు సాధించాలి. అందుకుగాను అవసరమైన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఎటువంటి శ్రమనైనా తీసుకోవాలి.

    3. బ్రాహ్మణుల ఆస్తుల్ని (మాన్యాల్ని) ఎలాగైనా కొనుగోలు చేయడం ద్వారా వారికి గ్రామాలతో ఉన్న లింకుల్ని తెంచేయాలి.

    ఇవన్ని ధీర్ఘకాలపు ప్రణాళికలు కాబట్టి, ఇక తక్షణం అమలు చేయడానికి వ్యాపార రంగాన్ని ఆశ్రయించాలని, ఆ వ్యాపారులు కచ్చితంగా ‘క్యాష్ ఓరియంటెడ్’ గా మాత్రమే ఉండాలని సభ తీర్మానించింది. అంటే, కస్టమర్లు ముందే డబ్బు చెల్లించే వ్యాపారులు: హోటళ్లు, లాడ్జీలు, బస్సు సర్వీసులు, సినిమా హాళ్లు…. వంటి ‘అప్పు’పెట్టే రిస్కులేని వ్యాపారులు మాత్రమే చేయాలన్నిది తీర్మాన సారాంశం.
    సభ ఆమొదించిన తీర్మానాలు కులానికి శిరోధార్యాలయ్యాయి. తు.చ తప్పకుండా అమలవడంతో గురి తప్పలేదు; అక్ష్యం నెరవేరింది, నెరవేరుతూనే ఉంది.
    నిజానికి శతాబ్దాల బ్రాహ్మణాధిక్యతన ప్రశ్నించి, ఆత్మగౌరవ ప్రకటన చేసిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సారధులు గుంటూరు, కృష్ణ (అప్పటి కృష్ణ మాత్రమే) కమ్మవారే. మొక్కవోని పట్టుదల, చెదరని ఆత్మవిశ్వాసం, సడలని పోరాటపటిమ, నిత్య ఉద్యమ స్ఫూర్తి, విలక్షణ శరీర సౌష్టవం, స్ఫురద్రూపం…. …ఇవన్నీ వారి సహజ సామాన్య లక్షణాలు. జీవితాన్నే ప్రతిఘటనోద్యమంగా మార్చుకున్న పునరుజ్జీవనోద్యమకారుడు త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారి త్యాగాల ఫలితమే వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదాని కట్టబెట్టింది. ఈ పరిణామక్రమంలో కమ్మవారు మరో ఆధిపత్య వర్గంగా మారడం దురదృష్టకరమైన పరిణామం. ఈ ఉత్థాన చరిత్రలో వారూ ఒక దాష్టిక వర్గమైనారన్న నా అభిప్రాయానికి ఒక ఉదాహరణ ఇస్తాను.
    అవి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ఉదృతంగా ఉన్ననాటి దినాలు. బ్రాహ్మణులు ఆచరిస్తున్న status quo ను బద్దలు చేసి, కొత్త విలువల్ని ప్రతిష్టించాలని త్రిపురనేని, గుత్త చలమయ్య ప్రభృతులు ఉద్యమిస్తున్న రోజులు. ‘సూతపురాణం’, వేనరాజు ‘ఖూనీ’ వంటి ప్రత్యామ్నాయ రచనలతో త్రిపురనేని ఉద్యమ సారధ్యం వహిస్తున్న కాలం. కొల్లూరులో జరుగుతున్న ఒక బ్రాహ్మణుల సభకు ప్రేక్షకుల స్థానం నుంచి త్రిపురనేని బృందం నుండి సవాళ్లు ఎదురయ్యాయి. తర్కం హద్దులు దాటి, ఉద్వేగాలు పెచ్చరిల్లాయి . ఉడుకుమోతుతనంతో వేదిక పైన ఉన్న బ్రాహ్మలు ఇలా అన్నారు: “కమ్మ-కుమ్మర ఏక గర్భ సంజాతులు. కుల శబ్దంలో ఉన్న పోలిక కూడా దీనిని స్పష్టం చేస్తుంది”. క్షణం ఆలస్యం చేయకుండా త్రిపురనేని రామస్వామి చౌదరి గారిట్లా అన్నారు: “విప్ర-ఉప్పర ఏకోదరులు. ఇక్కడ శబ్దసామ్యం గురించి చెప్పనక్కర్లేదు….”
    ఈ వివరాలన్నీ ‘బ్రాహ్మణేతర విజయం’ అనే పుస్తకంలో ఎవరైనా చూడవచ్చు. అంటే, ‘అలగా”కులాలతో పోలిక తేవడం ద్వారా ‘కుల దురహంకారులై’న బ్రాహ్మలు, ‘కులరహిత సమాజ స్వాప్నికు’లైన బ్రాహ్మణేతరులు (కమ్మవారు) ఒకరినొకరు అవమానించుకున్నారు. కమ్మవారు మరో ఆధిపత్య వర్గంగా రూపొందిస్తున్న క్రమానికి అదొక సూచిక మాత్రమే. కనుక కృష్ణా, గుంటూరు జిల్లాలలో ‘కులం’ తాలుకు ప్రభావాన్ని, వేడిని వేరే జిల్లాల వారు ప్రాంతాలవారు అర్థం చేసుకోవడం కొంత కష్టమే.

    ఇక కళల విషయానికొస్తే, భారతదేశ చరిత్రకి, సామాజిక స్థితిగతుల దృష్ట్యా సాంస్కృతిక, కళా రంగాలన్నీ బ్రాహ్మణ వర్గాల గుత్త సొత్తులు. వారి ఆధిక్యతని ప్రశ్నించి, తిరగబడిన త్రిపురనేని వర్గం కళల జోలికి అట్టేపోలేదు (దానికి కారణాన్ని పైన ప్రధాన వ్యాసంలో పేర్కొన్నాను. ‘సినిమా’ అనే వ్యాపార కళని కబ్జా చేయడానికి కూడా కారణాన్ని రాశాను). భాషమీద, యాస (మాండలికాల)మీద వారికున్న అభిప్రాయాలు, జీవితం పట్ల వారి దృక్పథం, వారు ఆదర్శమని భావించే విలువలు…. ఇలా ఎన్నో వారి లక్షణాలు తెలుగు సినిమాకి సోకాయి. దాని వల్ల అనర్థం జరిగిందని, జరుగుతుందని నా ప్రధాన వ్యాసంలో రాశాను. వారు స్థాపించిన విద్యాసంస్థలు, పెట్టే భోజన హోటళ్ళు, నడిపే సూపర్‌మార్కెట్ చైన్లు… అన్నింటా వ్యాపించిన లాభనష్టాల భాషలోనే సినిమాలని కుదించి, నిర్మించడం సహజ వైరి సూత్రాల ప్రకారం వేటూరికి అంతరాల్లో ఆగ్రహముండవచ్చునని రాశాను.
    అది ఊహే! పోనీ అపోహ అందాం.
    @ మెహర్ గారు! మీ అభిప్రాయాలు తరచూ చదువుతుంటాను గనుక, మీ విద్వత్తు, పరిశీలన పట్ల గౌరవం. అందుకని మరికొంత వివరణ ఇస్తాను:
    Merchant of Venice లో Shylock అనే యూదు వ్యాపారిని పరమ కర్కోటక పిసినారిగా, Othelloలో నాయకుడు Othello అనే Moorని పరమ క్రూరుడిగా చిత్రించడానికి షేక్సిపియర్ క్రైస్తవుడు అవ్వడమే కారణమని ఆధునిక సాహితీ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అది వాటి సామాజిక, రాజకీయ స్థితిగతులననుసరించి చేసే ఊహ కాదా? షేక్సిపియర్ ఎప్పుడైనా చెప్పాడా? కనీసం మిత్ర బంధు వర్గం దగ్గరైనా వెల్లగక్కి ఉంటాడా అని ప్రశ్న సంధించడం సబబేనా (శ్రీనివాస్ చిలకపాటిగారూ)!
    నేను ఊహించిన దానిని వేటూరే నాతో అన్నారని (అన్నారో, లేరో తేల్చడానికి ఆయన లేరుగనక) నేను రాసి ఉంటే, అప్పుడు నాది ఊహ కాకుండా, నికార్సయిన నిజం అయిపోయేదా? మెహర్ గారూ! మీరు నన్ను బొద్దింకతో పోల్చినందుకు కూడా బాధలేదు (రమణగారి సమర్థనకి మరోసారి కృతజ్ఞత). ఎందుకంటే, ఆధునిక పూర్వం శిష్ట ఉపమానాలుగా చెలామణి అయిన కోకిలలు, కలకూజితాలు, నెమళ్లు, సింహాల స్థానే కాకులు, పందులు, గ్రామసింహాలు కూడా వచ్చి, తమ లోతు కనుక్కోమంటున్న ఆధునిక, ఆధునికోత్తర దశల్లో నన్ను బొద్దింకతో పోల్చడం నేను అవమానంగా భావించడంలేదు (వ్యక్తి గతంగా చెప్పాలంటే, సింక్ కింద కుళ్ళు విషయం చెప్పలేనుగానీ, బల్లమీద పళ్ళే కాదు, పళ్లు ఎక్కడ ఉన్నా నాకు చిరాకే, చిన్నతనం నుంచి).
    ఇక మీరన్నట్లు అటువంటి పాటలన్నీ వేటూరి డబ్బుకోసమే రాశాడనుకుందాం. విచిత్రమేమిటంటే, ఆయనకు ముందు గానీ, ఆయన తర్వాత సిరివెన్నెల మొదలుకొని నేటి భాస్కరభట్ల… ప్రభృతుల వరకూ ఎవరూ అటువంటి ‘చెత్త’ రాయడం లేదు, డబ్బుకోసం వేరే రకంగా కూడా రాయవచ్చనే నిరూపిస్తున్నారు మరి.
    దీనికి కూడా ఒక చిన్న ఉదాహరాణ:
    ‘ధర్మక్షేత్రం’ అనే చిత్రానికి ఒకే ట్యూన్‌కి ‘సిరివెన్నెల’, వేటూరి ఒకరికి తెలియకుండా మరొకరు రాసిన పాటల పల్లవులివి:
    1. సిరివెన్నెల:
    ఒకటా రెండా మరి
    కిలాడి కళ్ళు నన్నే చూస్తూ ఉన్నవీ…
    2. వేటూరి:
    ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
    చీరలో మూరకో చిటపట….
    ….వేటూరి పెద్దవారు కాబట్టి ఈ పాటే చిత్రంలో ఉంచేశారు.
    ‘ఎంగిలే సంపెగ రంగు వేయగానే
    ఎందుకో ఏమిటో అలసట’ ….అని రాయమని శ్రోతలు నినాదాలు చేయలేదు. డైరక్టర్లు భీష్మించలేదు. నిర్మాతలు గానీ, వారి బామ్మర్దులుగానీ హఠంవేయలేదు. మహా అయితే,

    ‘నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచి కొట్టుడు దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే’… వరకూ విని ప్రేక్షక్, దర్శక, నిర్మాతలు లైంగికోల్లాసం పొందవచ్చునేమోగానీ,’

    మట్టుడించి కొట్టాల బుగ్గల్లో నా ముద్దు| మట్టుగించి తొక్కల మంచాలే ఈ పొద్దు| కోకపిల్ల రాజ్యంలో కోరుగుమ్మ మేడుందో| ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో’;
    చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు/ కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు/ రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో/ చిక్కులిప్పతీసే దాకా మోమాటాలమ్మో; పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో/
    పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో; పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో/ తేనేబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో…….
    …….. అంటూ చరణాలు చరణాలుగా స్కలించేయమని మాత్రం ఎవరూ ‘డిమాండ్’ చేయలేదని, దానికేవో ulterior motives ఉండవచ్చని అనిపించింది. బహుశా అదే వైరి వర్గం ‘కీలెరిగి పెట్టిన వాత’ అని రాశాను.

    @ రాకెశ్వరరావు: రాకేశ్వర రావు గారు! మీరు జాగ్రత్తగా గమనించారో లేదో నేను ‘బూతు’ అనే పదం ఎక్కడా వాడలేదు. ‘చెత్త’ అని రాశాను. ‘మామిళ్ళ తోపుకాడ… కాలికేస్తే వేలికేసి…. వేలికేస్తే కాలికేసి… ఎత్తి కుదేశాడే… చిత్తు చిత్తు చేశాడే….’ అనే శ్రవణానందకరమైన గీతరాజాలను నా అజ్ఞానం వల్ల ‘చెత్త’గా భావించాను. “మహాశివుడి వైభవం ఆయన సృష్టికి శిఖరాగ్రం అయిన వేటూరి వైభవం కళ్లు మిరుమిట్ల ” అంటూ చాలా పెద్దమాటలు రాశారు. వేటూరి కన్నుమూసిన సందర్భంగా, ఆయనని స్మరించడంలో ఆయన పరిమితుల్ని ప్రస్తావించడం సబబు కాదు కనుక, నా వ్యాస పరిధిని కుదించాను. మీరంటున్న “వేటూరి వైభవం’….. ఏమిటి? డబ్బులకి అక్షరాలు అమ్ముకునే వాళ్ళేదో సాహిత్యస్రష్టలన్నట్టు మాట్లాడుతున్నారేమిటి?
    ఆధునిక తెలుగు సాహిత్యంలో తమదైన సంతకాలు చేసిన ఇస్మాయిల్, స్మైల్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి కవులు (ఇంకెంతో మంది రచయితలు కూడా) ఇటీవల కాలం చేశారు. వారి నిష్క్రమణ సందర్భంగా ఎవరో గుప్పెడు మంది అభిమానుల సంస్మరణలు మినహాయిస్తే, అంత నిశ్శబ్దం ఎందుకుంది ఆంధ్రదేశంలో. వేటూరి మరణం… ఇంత ఆర్భాటానికి ఎందుకు దారితీసింది? ఆయన సినిమా వాడు కావడం వల్లనే కదా? మరో చోట తనికెళ్ళ భరణి గారు వేటూరికి నివాళిగా కాళిదాసు, వాల్మీకి, వ్యాసాదుల నుంచి నన్నయ్య, పెద్దన, పొతన, శ్రీనాధుల మీదుగా, దేవులపల్లి, విశ్వనాధ, శ్రీశ్రీల వరకూ… మహాప్రయాణం చేశారు. వేటూరి రాసిన గుప్పెడు మంచి పాటలైనా, (మెహర్‌గారి మాటల్లో బల్లమీద పళ్ళు) తెలుగు సాహిత్యానికి contribution గా భావించ వచ్చా? వేటూరి సీనియర్లయిన సినీరచయితలు పింగళి, మల్లాది, దేవులపల్లి, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దాశరథి…. డబ్బులకి రాసిన సినిమా రచనలకు అతీతంగా తమదైన రచనలు చేసిన వారే. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఒకరిద్దరిని మినహాయించి, పైన పేర్కొన్న వారందరూ తెలుగు సాహిత్యంలో అతి ముఖ్యులు. సినిమా రచన వారికి ఉపాంగం, లేదా ఆరువేలు. తీసేసినా నష్టం లేనే లేదు. వేటూరి కూడా ‘జీవనరాగం’, ‘సిరికాకులం సిన్నది’ వంటి తనదైన రచనలు ప్రారంభంలో చేసినా, వాటి ఆధారంగా ఆయన contributionని ఎంచగలమా?
    పండిత వంశ పారంపర్యం, పంచకావ్యాలు చదివిన జ్ఞానం, అన్నీ ఉన్న కవి… ‘గంపలకెత్తిన మందల తాకిడికి/ బీంగిరి జింకల ఎంగిలి వేటకు రా…. అంటూ రాయడానికి మాత్రమే పరిమితం కావడం విషాదం. అక్షరాలు చిల్లర డబ్బులుగా మారి, కనిపిస్తున్నప్పుడు…. తనదైన సంతకాన్ని చేయడానికి టైం ‘వేస్ట’ని భావించే నైజం అలవడుతుంది. అంటే, వృత్తికి పరిమితం కావల్సిన కొన్ని గుణాలు, ప్రవృత్తిలోకి ప్రవేశించి, ఆ గుణాలే అస్తిత్వానికి ప్రతీకలై మిగిలిన మహా విషాదాలలోకి వేటూరి జారిపోయారు.
    ఇక చివరిగా శంకర్ గారికి కూడా చిన్న విన్నపం:
    ‘అంచేత చెప్పొచ్చేదేంటంటే’ పేరిట వీరు నడిపే బ్లాగులో చాలా స్వచ్చమైన, ప్రేమ కనబడుతుంది (అక్షరం పట్ల). అందుకే, అక్షరం విషయంలో మీకు ఏమరుపాటు కూడదనీ, ‘బూతు’, ‘శృంగారం’ వంటి వేర్వేరు పదాల గురించి స్పష్టత ఉందాలని ఇది రాస్తున్నాను. వేటూరి వ్యాసంలో నేను మొదట ఉటంకించిన పల్లవులు…. ‘చెత్త’, ‘గార్బేజ్’ అనే కేటగిరిల కింద ప్రస్తావించినవే. వేటూరి బూతు గురించి నేను మాట్లాడలేదు. ‘ముందున్న ఆ ముంత మామిళ్ళతోట రాసివ్వనా నీకు రసకేళిలో/ ఎనకాల అలపాటి దిబ్బల తోపు చేసేయనా సాగు చెలి పేరుతో; రేతిరికి జాతరలో షోకులకి యమ షాకు షేకు / కొత్తరకం కౌగిలిలో మదన జ్వరం ఇక నీకూ నాకూ; ‘ఇది ఎక్కిదిగి దిగి ఎక్కే యవ్వారం….. వంటి వందలాది పాటల్లో వేటూరి స్కలించినదీ, “కడుక్కుంటే బోదు కాంక్షలోన జీడ్డు / వారి చన్నులతో తుడుచుకోవయ్యా” అని అన్నమయ్య వేలాది సంకీర్తనల్లో గానంచేసిన శృంగారమూ ఒకటేనా అని అడుగుతున్నారా?
    సినిమా పాటల గురించి మాట్లాడుజింటొన్నప్పుడు, జాతి సంపద వంటి వాగ్గేయకారుల, మహకవుల రచనల్ని ప్రస్తావించడం ‘దేశభక్తి’ కంటే పాపం కదూ!
    పైన ప్రధాన వ్యాసం ఉపసహారంలో కవి సమయాలుగా పేర్కొన్న వేటూరి పాటలలో…. “మల్లేలు పూసే… వెన్నెలకాసే…. ఈ రేయి హాయిగా…” ప్రస్తావించాను గమనించారా? “కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే…” అనడం శృంగారం. “విచ్చుకున్న పువ్వు మీద తుమ్మేదోలదా…. ఓలమ్మీ… నా గుమ్మీ… గగ్గోలు దేనికే….’ అనడం బూతు. శృంగారం నవరసాల్లో ఒకటి. ‘ఏకో రసః శృంగారమేవా అన్నా పర్వాలేదు. కానీ, బూతుని, శృంగారాన్ని జిమిలీ చేసి… కంగాళీ చేసేయకండి!

    • నరేష్ గారూ:

      మీరు పైన చెప్పిన చారిత్రక సంఘటనల గురించి వివరంగా తెలుసుకోవటానికి రిఫరెన్సులేమిటి?

      • జంపాల చౌదరి గారూ!

        క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పాత తరం పెద్దల్ని సంప్రదిస్తే బెజవాడ గోపాలరెడ్డి చౌల్ట్రీలో జరిగిన సమావేశం వివరాలు దొరకవచ్చు. జమీ లేకుండానే 1600 ఎకరాలు ఉన్న పిన్నమనేని వారి స్వస్థలం కైకలూరు దగ్గర మండవల్లి పరిసరాల్లోని పెద్దలకి కూడా ఈ విషయాలు తెలుసు. మానికొండ గ్రామం గోగినేని కుటుంబాలకి, వెలగపూడి రామకృష్ణ వారికి పిన్నమనేని వారు అందించిన చేయూత అంతా ఇంత కాదు. వారి కుటుంబాలలో పెద్దలు కూడా సమావేశ వివరాలు అందించగలరు. సమావేశానికి సంబంధించిన మినిట్స్ కూడా దొరకవచ్చు.

        సత్యసాయిబాబా బెంగుళూరు ఆశ్రమం – వైట్‌ఫీల్డ్ స్థలాలన్నీ పిన్నమనేని వారి వితరణే. సత్యసాయి ఆశ్రమంలో అధికారం, ఆధిపత్యం కోసం కల్నల్ జోగారావు (కాపు), రామబ్రహ్మం (కమ్మ) వర్గాల మధ్య ప్రచ్చన్న కులపోరాటాలు జరుగుతుంటే, పిన్నమనేని వారి దానశీలత పదే పదే ప్రస్తావనగా వినవచ్చేది (1990- 91 మధ్య నేను అక్కడ ఇంజనీర్‌గా పనిచెస్స్తున్నప్పుడు మా బంధువులు వావిలాల వారింట్లో ఆధ్యాత్మికఆశ్రమంలో కుల రాజకీయాల ఔచిత్యం మీద చర్చోపచర్చలు జరుగుతుండేవి. కాపుల పక్షం వహించకపోయినా, ఆ చర్చోపచర్చల్లో అక్కడ బ్రాహ్మలందరూ కమ్మవారి ‘కులాభిజాత్యం’ మీద పైన సహజాతమైన అక్కసు వెళ్ళగక్కేవారు.. కమ్మవారిపై ముఖ్యంగా కృష్ణా, గుంటూరు కమ్మవారిపై బ్రాహ్మల అక్కసుకు ఒక ‘చక్కని’ దృష్టాంతం ఉంది.

        రంగా హత్యానంతరం చెలరేగిన అమానవీయమైన అతి హేయమైన అల్లర్లలో కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మవారు ఎన్నో దారుణమైన దాడులకు గురయ్యారు. ఎందరో హతమయ్యారు. ఎన్నో వేలకోట్లు దోచుకోబడ్డారు. ఆ సందర్భంగా, పత్రికలు నిర్వహించవలసిన పాత్ర ఏమిటో స్పష్టంగా తెలిసిన రామ్‌నాథ్ గోయంకా వారి ఇండియన్ ఎక్స్‌ప్రేస్ పత్రిక ఒక పూర్తి పేజీ వార్త ప్రచురించింది. అందులో రంగా ‘వ్యక్తిత్వం’ ఆవిష్కృతమయ్యింది. వంగవీటి రంగా మీద ఉన్న దొమ్మీ, హత్య తదితరమైన అన్ని పోలీసు కేసులు, ఆయన చరిత్ర అంతా ప్రచురించబడింది. అంటే, అటువంటి మనిషి కోసమా ఈ ఘోర మారణకాండ జరుగుతుంది అని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆక్రోశం. ఈ పేజీ వాసుదేవ దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఉన్న ‘ఆంధ్రప్రభ’లో ప్రచురితం కాలేదు. కాపులకు మద్దతుగా కాదు; ‘శత్రువులైన’ కమ్మవారికి ఈ శాస్తి జరగవలసిందేనన్న ఉద్దేశంతో. ఆ పేజీ తెలుగులో ప్రచురించక పోవడం ఒక సామాజిక బాధ్యత – అనుకున్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ గారు. ‘ఆంధ్రప్రభ’ ఎడిటర్ అంటే, సగటు బ్రాహ్మణుడు కాదు; ఇంటలెక్చువల్స్, సమాజ నిర్దేశకులు కూడా ‘కమ్మ వ్యతిరేకత’కు మినహాయింపు కాదనడానికి ఇంకా ప్రత్యక్ష ఉదాహరణలు కావాలంటారా?

        ఇకపోతే, కొల్లూరు సభ : వాదప్రతివాదాలు- ‘బ్రాహ్మణేతర విజయం’ అనే పుస్తకంలో గ్రంధస్థమై ఉన్నాయి. ఎవరైనా రిఫర్ చేసుకోవచ్చు చౌదరిగారూ!

        -నరేష్ నున్నా

        • 1) బ్రాహ్మణేతర విజయం పుస్తకం గురించి మరిన్ని వివరాలు (రచన, ప్రచురణ కాలం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండటం వగైరా) తెలుపగలరా?

          2) గోపాలరెడ్డి భవన్‌లొ జరిగిన మీటింగు గురించిన రిపోర్టులు ఎక్కడైనా ఇప్పుడు దొరుకుతాయా? లేక ఈ మీటింగు, తీర్మానాల ప్రస్తావనలు కానీ వేరే పుస్తకాలలో ఎక్కడైనా దొరుకుతాయా? మీరు ఈ వివరాలు వినడమేనా, ఎక్కడైనా చదివారా? వింటే ప్రత్యక్ష సాక్షుల ముఖంగానా, లేక ఇతరత్రానా?

          వాస్తవాలు, వ్యాఖ్యానాలూ, పుక్కిటిపురాణాలూ (facts, interpretations, myths) విడగొట్టి తెలుసుకొనే ప్రయత్నంలో అడుగుతున్నాను. మీ సహాయానికి ముందస్తుగా ధన్యవాదాలు.

          • ఇంతకీ, ఈ గోపాలరెడ్డి భవన్ ఎక్కడ ఉంది?

    • Ok… If he written all bad songs not for money, but with the intention you mentioned…
      why did he write good songs for Ramoji Rao (Srivariki Premalekha, Pratighatana) who is one of the highest icons kammas look?

      And why he didn’t write great songs for Chiranjeevi, Kodandarami Reddy, Yandamuri combination movies? There are no kammas involved there?

      In my opinion, it is very simple. He is ready to write anything as long as he is getting money, I don’t think there was any other motive.

    • BTW, thanks for the information in the comment (explanation). I liked it.

  • రాకేశ్వర్రావు వ్యాఖ్యలు ఆయనకే అర్థం కావులెండి ఒక్కోసారి!పండితుడు కదా!

  • అయ్యా,
    ఇంతకీ (ఒరిజినల్ రచనకి మూడింతల వివరణతో కలిపి) చివరాఖరిగా మీరు చెప్పదల్చుకున్నదేమిటి? 97% చెత్త + 3% మంచిపాటలు రాసిన వేటూరి గొప్పకవి కాదు, అతి మామూలు రచయిత అని నిరూపించాలనేదా మీ తాపత్రయం? పోనీ మీ సంతృప్తి కోసం అలాగే కంటిన్యూ అయిపోండి. వేటూరి వారి విద్వత్తుని అర్ధం చేసుకోలేకపోయిన 97% మహానుభావుల్లో మీరూ ఒకరు. అంతే!

    “క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర గానమిది” అని ఆయన రాసింది ఎందుకో ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్ధమౌతోంది.

  • అయ్యా నరేష్ నున్న గారు! మొత్తానికి బదులుగా పెద్ద వ్యాసమే రాసారు..! కులాల గురించి అప్పటి కాలమాన పరిస్థ్తితులలో మీరు చెబుతున్న విదంగానే జరిగి ఉండచ్చు, కాని జరిగిన సంఘటనలో ఉన్న భావం మొత్తం సమాజమంతా విస్తరించిఉన్నట్లు చెబుతున్నారు, మీరు చెప్పిన లేక జరిగిన సంఘటన కేవలం జరిగిన స్థలం వరకే లేక దానికి సంబందించిన వ్యక్తితాలుకా మనుషులకే పరిమితమై ఉంటుంది..అదే భావం మొత్తం సమజానికి..లేక అప్పటి సంఘానికి విస్తరించి ఉండకపోవడానికే చాలా ఆస్కారమున్నది, నేను అలా చెప్పడానికి కారణం మీరు చెప్పిన విషయంలోను సందర్భంలోను ఉన్న వ్యక్తి “శ్రీ నీలం సంజీవరెడ్డి ” గారు ఒకరు, ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన మనిషి…! మరి మీరు చెప్పిన ఆ కులాల భావం రాయలసీమలో లేదు. కావున మీరు చెప్పిన భావజాలం కొన్ని పరిమిత ప్రాంతాలకో లేక మనుషలకు మాత్రం వర్తిస్తుంది. వేటూరి వారు అక్కడి వారే కావడం వలన ఆయనపై ప్రభావం ఉండచ్చేమో గాని.. సాహిత్యపరంగా ప్రభావం అనుమానమే..!

    సినిమా పాటలకొస్తే మీరు చెప్పినట్లు ” ధర్మక్షేత్రం ” సినిమాలో సిరివెన్నెల వ్రాసిన మరో పాటని మీరు వేటూరిని విమర్శించే ఉత్సాహంలో మరిచినట్లున్నారు.. ‘ పెళ్ళికి ముందు ఒక సారి చూపించావా మేరి ప్యారి ‘ వ్రాసారు..సిరివెన్నెల గారు…! మీరు సిరివెన్నెల నుండి భాస్కరభట్ల వరకు అటువంటి చెత్త రాయలేదు అని చెబుతున్నారు..మరి భువనచంద్ర మాటేమిటి..! ” కిందనే ఉన్నది చూసుకో స్వర్గమే ” చరణాలు వాటికి కథానాయుకుడు కిందనే అంటూ వ్రేలు కూడ చూపుతాడు ఒక సినిమాలో..చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
    “డబ్బులకి అక్షరాలు అమ్ముకునే వాళ్ళేదో సాహిత్యస్రష్టలన్నట్టు మాట్లాడుతున్నారేమిటి?”

    ఈమాటలేమిటి…? పాటలు వ్రాసే ప్రతి రచయతకి ఈ వ్యాక్యాలు వర్తిస్తాయి..! అంటే ఉచితంగా వ్రాస్తేనే స్రష్టలా..? మరి జీవనం మాటేమిటి..!
    “ఆధునిక తెలుగు సాహిత్యంలో తమదైన సంతకాలు చేసిన ఇస్మాయిల్, స్మైల్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి కవులు (ఇంకెంతో మంది రచయితలు కూడా) ఇటీవల కాలం చేశారు. వారి నిష్క్రమణ సందర్భంగా ఎవరో గుప్పెడు మంది అభిమానుల సంస్మరణలు మినహాయిస్తే, అంత నిశ్శబ్దం ఎందుకుంది ఆంధ్రదేశంలో. వేటూరి మరణం… ఇంత ఆర్భాటానికి ఎందుకు దారితీసింది? ”

    ఓహ్ వేటూరి మరణం తర్వాత మీడియా చేసిన హడావుడి చూసి మీరు ఇంతగా వ్యధ చెందుతున్నారా..? వేటూరికి ఇంతటి ఆర్భాటమేమిటీ అనీ ఈర్షనా..? ఆయన బూతు పాటలను పరిగణలోకి తీసుకొని ఒక అర్భకుడికి ఇంతటి ప్రాముఖ్యతా…? అన్న కోణంలో నుండి వచ్చిన ఆక్రోశమా..?

    మీరు కోట్ చేసిన పాటలను మీరే కాదు జ్ఞానమున్న మనుషులు కూడ బూతు అనే చెబుతారు, అయితే వాటికి కూడ నేను బాద్యత వహిస్తున్నా అని తన తప్పును బహిరంగాగానే చెప్పుకున్నారు..మరెందుకు మీరు కేవలం ఆ ఒక్క విషయం మీదే అలా వక్కానిస్తూ వ్యాసం వ్రాసి మల్లి కామెంట్స్ మీద పదే పదే బదులిస్తున్నారు. బహుశ మీకేదొ వేటూరి మీద కొన్ని పరిమితమైన ఒక ” ఫిక్సుడ్ ” వ్యక్తిగత అభిప్రాయలున్నాయి..వాటి చుట్టు వాదనలు తయారు చేసుకొని మాట్లాడుతున్నారు…! మీరే కాదు ఈ ప్రపంచంలో చాలా మంది మీలాగే వాదిస్తారు..మాట్లాడతారు.
    పోనీలేండి మీలాంటి మేధావుల దృష్టిలో ఆయనొక ” చెత్త రచయత ” , మాలాంటి పామురలకు గొప్ప రచయత..! అలా సర్దుకుందాము.

  • నరేష్ గారూ,
    లాభం లేదు, మీరు కాస్త తర్కశాస్త్రమూ తిరగేయాలి :-)
    ఒక మతానికి చెందిన కవీ, నాటక కర్తా తన నాటకంలో మరొక మతానికి చెందిన వాడిని దుర్మార్గుడిగా చూపెట్టాడు. అతనికి ఆ మతం వారిపైఉన్న ద్వేషం వల్లనే అలా రాసి ఉండాలి.
    ఒక కులానికి చెందిన కవి మరొక కులానికి చెందిన వారి దగ్గర డబ్బు తీసుకుని నానా చెత్తా రాసి ఇచ్చాడు. ఆయనకి ఆ కులానికి చెందిన వారిపైఉన్న ద్వేషం వల్లనే అలా రాసి ఉండాలి.
    రెండింటికీ ఏమిటి పోలిక?
    ఆయన అంతటి కోపాన్నీ లోలోపలే అణిచిపెట్టుకుని, దగ్గరి వాళ్ళ వద్దా బయటపడకుండా, ఇన్నేళ్ళూ ఆ కులం మీద కసి రహస్యంగా తీర్చుకుని పోయాడని సిద్ధాంతరీకరిస్తున్నప్పుడు ఒక బలహీనమైన ఆధారమయినా చూపవలసిన అవసరం లేదా? ఇలాంటివి మిత్రుల మధ్య సరదాగా చెప్పుకుని నవ్వుకోడానికి బావుంటాయేమో కానీ ఒక విశ్లేషణలా చూపబోతే తేలిపోతుంది. మీరు రాసిన నేపథ్యమంతా ఆయనకి ఆ కులంపై ఎందుకు కోపం ఉండొచ్చో వివరిస్తుంది. కానీ ఆ కోపమో, కసో ఎక్కడ కనిప్స్తుందో చెప్పలేదు(రు) మీరు. పత్రికా రంగంలో నార్లా, సినిమాల్లో రామారావూ తనకిచ్చిన ప్రోత్సాహాన్ని ఆయన ఇష్టంగా తల్చుకోవడం నాకు తెలుసు.

    చెత్త రాయడానికి తన మార్కెట్ పడిపోకుండా చూసుకోవడం కంటే ulterior motive వెదకడం ఎలా ఉందంటే మీరు ఈ వ్యాసం రాయడానికి మీ కులం కారణం అనడంలా ఉంటుంది. అట్లాగే నేను ఈ జవాబు రాయడానికి నా కులం అన్నట్టు కూడా ఉంటుంది.
    ఇక బూతుకూ, శృంగారానికీ మధ్య గీత ఎంత చిన్నదో ఆ “గోపీ పీన పయోధర మర్థన చంచల కరయుగ శాలే” మనకు చెప్పాలి.

    • Good comment. Thumbs Up. :)

  • నరేష్ నున్నా గారు,

    ముందుగా: నేను నా కామెంట్లో బొద్దింకల్ని ప్రస్తావించినపుడు కొంతమంది మనుషుల్లో ఎక్కువ వుండే morbid inclinations కి ఆ ఉపమానాన్ని ఉద్దేశించాను. వ్యక్తిగా ఎవరో తెలియని మిమ్మల్ని బొద్దింకతో పోల్చనూ లేదు, వ్యక్తిగా మీ పళ్ళ అభిరుచి నాకంతకన్నా అనవసరం. అందుకే “జీవ పరిణామక్రమంలో బొద్దింకలు మనడానికి నాచు తినడమే” కారణమన్న రమణగారి సమర్థన నాకో సమర్థనగానే కనపడలేదు. నేను అదే ఉద్దేశంతో రాసి వుంటే, “కాకిలా కలకాలం బతికే కంటే హంసలా ఆరునెలలు” తరహా ప్రత్యుత్తరమేదో ఆయనకి పడేసేవాణ్ణి.

    వద్దన్నా విచ్చలవిడిగా సమాచారం వచ్చి జీవితాల్లో చొరబడే ఈ యుగంలో ఏది విలువైందీ, ఏది చెత్త అన్నది తేల్చుకోవడానికి కొన్ని కొండగుర్తులు వుంచుకోవటం మన సమయాన్ని వ్యర్థం కాకుండా రక్షిస్తుంది. నాకూ అలా కొన్ని కొండగుర్తులున్నాయి. అవి మీ పై వ్యాసంలోనే, “కులం” అన్నప్పుడే, చాలా కనపడ్డాయి. అయినా దానికి స్పందన తెలపటం నా పొరబాటు. ఇపుడు మళ్ళీ మీ సమర్థనలోనూ అవే కనపడుతున్నాయి. పైగా ఇప్పుడు “ఆధునిక, ఆధునికోత్తర”, “సాహితీ విమర్శకులు విశ్లేషించడం”… అంటూ సాహిత్యపరంగా కూడా కొన్ని చేరి మరీ కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. మీరింకో ఇన్ని ప్రశ్నలకి, ఇంకో ఇంత సమాధానం రాసినా, పై వ్యాసాన్ని నాకు జస్టిఫై చేయలేరు. ఆ ప్రయత్నం కూడా మానేయండి. నేను కూడా ఇక మీదట ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయటానికి ప్రయత్నిస్తాను.

    >>> క్రైస్తవుడు అవ్వడమే కారణమని ఆధునిక సాహితీ విమర్శకులు విశ్లేషిస్తున్నారు.

    ఇలాంటి వాళ్లని విమర్శకులనడం కంటే బొద్దింకలనడమే మర్యాద. వీటి ప్రాతిపదిగా కళని ఆకళించుకునే వాళ్లనీ, వాళ్ల ఊహల్నీ/ అపోహల్నీ నేను పట్టించుకోను. These are the people that have no business being in the realm of literature. Their feeble opinions should be sledge-hammered to pulp. “ఆగ్రహముండవచ్చునని” తరహా ఊహల్తో బయటపడేవి వ్యాసాలు కావు, వట్టి అభిప్రాయాలో దృక్పథాలో బయటపడతాయంతే. ఆ అభిప్రాయాలు వేరే వ్యక్తిపై అయినపుడు మంచివైతే ఇచ్ఛానుసారంగా వ్యక్తం చేసుకోవచ్చు; ఇలా చెడువైతే కాస్త ఆధారాలతో వ్యక్తపరచాలి, సమయసందర్భాలు చూసుకోవాలి. ఊహలు/ అపోహలూ అంటే లాభం లేదు. వేటూరిపై మీకు ఎలాంటి అభిప్రాయముందో మీ వ్యాసంలో సరిగా వ్యక్తం కాకపోయినా, మీరు ఇపుడు ఇచ్చిన సమాధానంలో సరిగానే వ్యక్తమవుతోంది. మరెందుకా చేతగాని ముసుగులో గుద్దులాట వ్యవహారం. “పూవుగా ప్రాణాలు పోనీ, తావిగా నన్నుండిపోనీ…” లాంటి శీర్షిక పెట్టి, “సంస్మరణ” పేరిట ఆయన్ని కించపరచడం? అలా కించపరిచినపుడు ఎవరైనా ఆధారమేంటని అడిగితే చెప్పే దమ్ముండాలి. అంతేగానీ, మళ్ళీ, ఊహలూ అపోహలూ అంటూ ఈ గుంజాటనలేంటి?

    బూతు, శృంగారం… ఈ విభజనంతా వైయక్తిక కొలతల్ని బట్టిపోతుంది. మీరుదహరించిన వాటిలో నాకు చాలా పాటల్లో బూతేమీ కన్పించలేదు. లైంగికోల్లాసం ఏ ముసుగుల్తో జరిగినా, ఏ ముసుగుల్తోనూ జరక్కపోయినా ఉల్లాసమే! ముసుగుల్తో వుంటే బహుశా భావుకులైన మీకు ఉల్లాసం; ముసుగులేం లేకుండా పచ్చిగా వుంటే టీకప్పులు కడిగేవాడికో, ఆటోవాలాకో ఉల్లాసం! “కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే” అన్నది మీకు శృంగారం. “విచ్చుకున్న పువ్వు మీద తుమ్మేదోలదా…. ఓలమ్మీ… నా గుమ్మీ… గగ్గోలు దేనికే….” అన్నది కాంట్రాక్టు రోడ్డు కూలీకి శృంగారం. మీ కథలు (ముసుగులోనివీ, ముసుగులేనివీ కూడా) చదివిన వాడిగా, మీ తత్త్వం కాస్తో కూస్తో అర్థమవడం మూలాన, మీకు వేటూరిలో అంత బూతెందుకు కన్పించిందో, ఆ బూతుకి బహుశా ఏ ముసుగులుంటే (మీ కథల ఆధారంగా) మీ దృష్టిలో పవిత్రమవుతుందో నాకు అర్థమైంది (అసలా పాటల సాహిత్యమంతా అంత బాగా ఎందుకు గుర్తుంచుకున్నారో మాత్రం అర్థం కాలేదనుకోండీ!). ఆ పరంగా చూసినా కూడా వేటూరి మీ పొట్టి కొలతలకి అందనంతగా, ఇంకాస్త పైననే ఉన్నాడని మాత్రం చెప్పగలను. అయినా ప్రస్తుత విషయం ఏది “బూతు”, ఏది “శృంగారం” అన్నది కానే కాదు. మీ వ్యాసంలో మొదటి భాగం చదివితే మీకు ఆంధ్ర దేశంలో కుల పీడన చరిత్ర గురించి చాలా తెలిసినట్టే వుంది (దానికీ, వేటూరి మీద ప్రస్తుత వ్యాసానికీ ఏం సంబంధం లేకపోయినా). ఆ అవగాహనతో మీరు సింపిల్‌గా “తెలుగు సినిమా రంగంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష” అనో వ్యాసం రాసుకుంటే సరిపోయేది. వేటూరి మరణాన్ని సాకుగా తీసుకుని వేరే ఏదో నిరూపించాలనుకోవడం బాలేదు. సమాధిలో సమాధానం చెప్పుకోలేని మనిషికి మీకు నదురుగా తోచిన ఉద్దేశాలేవో ఆపాదిస్తానంటే అదింకా లేకితనం.

    >>> నేను ఊహించిన దానిని వేటూరే నాతో అన్నారని (అన్నారో, లేరో తేల్చడానికి ఆయన లేరుగనక) నేను రాసి ఉంటే, అప్పుడు నాది ఊహ కాకుండా, నికార్సయిన నిజం అయిపోయేదా?

    ఇదెక్కడి అర్థం పర్థం లేని తర్కం! అలా రాస్తే అది ఆత్మవంచన అవుతుంది. అదీ ఆయన మృతి సంస్మరణగా రాస్తే ఓర్వలేనితనం అవుతుంది. నిజం ఎందుకవుతుంది? మీకు ఎదుటివాళ్లే గీటురాళ్ళా? మీకు మీరు గీటురాయి కాదా?

    >>> వారి నిష్క్రమణ సందర్భంగా ఎవరో గుప్పెడు మంది అభిమానుల సంస్మరణలు మినహాయిస్తే, అంత నిశ్శబ్దం ఎందుకుంది ఆంధ్రదేశంలో. వేటూరి మరణం… ఇంత ఆర్భాటానికి ఎందుకు దారితీసింది?

    ఇది నిజంగా మీకర్థం కాలేదా? ఛస్తే ఎన్ని గొంతుకలు భోరుమన్నాయన్న దాన్ని బట్టి ఆ వ్యక్తికి విలువ ఏర్పడదని నా భావన. ఇప్పుడింతమంది ఏడ్చారు కాబట్టి, ఇంతమంది చేత ఏడ్పించుకోలేకపోయిన వాళ్ల కన్నా వేటూరి గొప్పవాడైపోడు. అది చాలా హాస్యాస్పదమైన వాదన. ఆయన స్థానం ఆయనదే. ఎవరితోనో ఎందుకు పోలిక? ఆయన జనంలోకి బాగా చొరబడగలిగే సినీ మాధ్యమంలో వున్నాడు. మీరు పేర్కొన్న “ఇస్మాయిల్, స్మైల్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ” కన్నా ఎక్కువమంది జీవితాల్లో (ఏ స్థాయిలోనైతేనేం/ వాళ్లదే స్థాయి అయితేనేం) ఎక్కువ ఉల్లాసాన్ని కల్గించాడు. అందుకే ఆయన మృతి ఎక్కువమందిని కదిలించింది. దీనికి మీరేదో అక్కసు పడి, ఆయనకు సంబంధంలేని ఏదో కుల లంపటాన్ని ఆయన మెడలో తగిలిద్దామంటే (అదీ ఒక funeral wreath గా!) ఎవరికైనా బాధ కల్గుతుంది.

    మీ వ్యాసంలో మొదటి భాగం నాకు తెలియని విషయాలు చెప్పింది. ఇంకా ఆ కుళ్లుని పట్టించుకుని, చరిత్రగా నమోదు చేసి, తెలియక కాస్తో కూస్తో స్వచ్ఛంగా మసలుకుంటోన్న తర్వాతి తరాలకి ఒబ్బిడిగా సరఫరా చేయజూస్తున్నందుకు కృతజ్ఞతలు.

    • @మెహర్: మీకు నచ్చేదీ, మీరు అంగీకరించేదీ మాత్రమే సత్యం. మిగతా అంతా ‘బొద్దింక’. అంతేగా ! అర్థమయ్యింది.

  • 1999 లో మనకు పాకిస్థాన్ కి కార్గిల్ వార్ జరిగింది. మనదేశంలో హిందువులు ఎక్కువ. పాకిస్థ్హాన్ లో ముస్లింలు ఎక్కువ. కాబట్టి, కొంతమంది మనదేశంలో ఉన్న ముస్లింలకి కూడా, మనదేశం మీద కోపం ఉండే అవకాశం ఉంది. అప్పట్లో అజారుద్దీన్ మాచ్ ఫిక్సింగ్ చేసి పట్టు పడ్డాడు.

    మీరు వేటూరి గారి మీద చెప్పిన లాజిక్ ఎలా ఉందంటే, నేను పైన చెప్పిన 2 లైన్ల ప్రకారం ముస్లింలకి మనదేశం మీద కోపం ఉండే అవకాశం ఉంది కాబట్టి, అజారుద్దీన్ ముస్లిం కాబట్టి, మనదేశం పరువుతీసి తన పగ తీర్చుకోవాలనే అతను మాచ్ ఫిక్సింగ్ చేశాడు కానీ డబ్బు కోసం కాదు అన్నట్లుంది. నాకు అనిపిస్తే నేను అలా కూడా రాస్తాను, నా అభిప్రాయం నాది, అడగటానికి నువ్వెవరు అని అడిగితే నేను ఏమీ చేయలేను.

    మీకు కులం వివక్శ అనే ఒక సమస్య ఉందని అనిపించొచ్హు. దానికి ఆధారాలు ఉండోచ్హు. కానీ దానిని ఎవరి మీద పడితే వాళ్ల మీద అధారాలు లేకుండా రుద్దటం ఏమీ బాలేదు. మీకు కులాలు అనే సమస్య ఉందనిపిస్తే దాని మీద మీరు అసంతృప్తిగా ఉంటే దాని మీద సూటిగా వ్యాసం రాయండి. మేమూ సపోర్ట్ చేస్తాం. వేటూరి గారు ఈ మధ్యే చనిపోయారు కాబట్టి, వారి గురించి ఇప్పుడు ఏం చెప్పినా అందరూ చదువుతారు కదా అని, మీ అభిప్రాయలు ఆయన మీద రుద్దొద్దు దయ చేసి. అలా చేస్తూపోతే, అయిన దాన్ని కాని దాన్ని కులానికి అన్వయిస్తూ మన్ం ఇంకా సమస్యను పెద్దది చేస్తున్నట్లు అవుతుంది.

    పోతే వేటూరిగారి గురించి, మీరు మరి సిరివెన్నెల ఎందుకు రాయలేదు అంటున్నారు. KRR సినిమాలకి సిరివెన్నెల ఎన్ని పాటలు రాశాడు. ఎక్కువ రాయకపోతే ఎందుకు రాయలేదు? సిరివెన్నెల పాటను మార్చటానికి ఒప్పుకోడు, దర్శకులకి నచ్హకపోయినా సరే….మొహం మీదే చెప్పేస్తాడు (ఆయనవి కొన్ని interviews చదవండి)..వేటూరి అలా చెప్పలేకపోయి ఉండొచు. ఆయనే చాలా సార్లు చెప్పారు, దర్శకుల బలవంతం మీదే రాశాను అని. కొన్ని సార్లు ఆయన రాసిన తర్వాత కూడా assitant directos వాళ్లూ మార్చేసేవారని..ఆవేశంగా కూడా చెప్పారు (ఉదాః ఘరానా బుల్లోడు పాట). ఆ మాటకొస్తే చక్రవర్తి మీరు చెప్పిన వాటిలో చాలా పాటలు చేశారు. Music director కూడా పాట మీద హక్కు, బాధ్యత ఉంటాయ్..ఆయన కూడా అందుకే అలాంటి పాటలు చేసారా….అలాంటి పాటలు చేయాలని KRR లాంటి దర్శకుల ఒత్తిడి చాల ఉండేదని కీరవాణి గారు కూడా చాలా సార్లు చెప్పారు చక్రవర్తి గారి గురించి చెప్పాల్సి వచినప్పుడు. అయినా మీరు ఒప్పుకోకపోగా ఇంకా సమర్థించుకుంటున్నారు ఎవో సంబంధంలేని ఉదాహరణలు చెప్పి…

    చెప్పాగా ఇదెలా ఉందంటే నేను డబ్బుకోసమే మాచ్ ఫిక్సింగ్ చేశానని అజారుద్దీన్ అంటే, లేదు పాకిస్థాన్ కోసమే చేశాడు, ఉరి తీయండీ అన్నట్లుంది..

    • మీరు వేటూరి గారి మీద చెప్పిన లాజిక్ ఎలా ఉందంటే, నేను పైన చెప్పిన 2 లైన్ల ప్రకారం ముస్లింలకి మనదేశం మీద కోపం ఉండే అవకాశం ఉంది కాబట్టి, అజారుద్దీన్ ముస్లిం కాబట్టి, మనదేశం పరువుతీసి తన పగ తీర్చుకోవాలనే అతను మాచ్ ఫిక్సింగ్ చేశాడు కానీ డబ్బు కోసం కాదు అన్నట్లుంది.

      Good reply. :)

  • ఈ వ్యాసంపై అంత చర్చ అనవసరం అనిపిస్తోంది.వేటూరి స్వయంగా మీతో తన కమ్మద్వేషాన్ని చెప్పి ఉండకపోవచ్చుగానీ తన సన్నిహితుల దగ్గర”డబ్బు కోసం పాటల్ని ఎండు చేపల్ని అమ్మినట్టు అమ్ముకోవాల్సి వస్తోంది”అని బాధ పడేవారు.ఐనా ఈ బాధ కవిగా రాజును ఆశ్రయించిన ప్రతి వాడికీ తప్పదు.రాజుల్ మత్తులు(కులం కాదు రాజంటే పదవి) వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులు ఆత్మ వ్యధా బీజముల్ అన్నారు.కనుక ద్వేషం చులకనా ఉన్నా అది ఆ డబ్బున్న మా రాజుల మీదే అవుతుంది,అందునా ఈ నిర్మాతలు అభిరుచీ పచీ లేని వారేమో అది రెండింతలవుతుంది.అంతే గానీ అది కులద్వేషం నుండి పుట్టింది అనడం ఎలా సమర్ధనీయం.
    కృష్ణా గుంటూరుల్లో కమ్మ వారి బ్రాహ్మణ వ్యతిరేకోద్యమమే కాదు అంతకు మునుపు నియోగి వైదీకి భేదాలు కూడా భగ్గుమన్నాయి.పూర్వం పల్నాటి యుద్ధం మొదలుకుని ఆ ప్రాంతం పరిస్థితే అంత.మీరు చెప్పిన ఆ వివరాలు అన్నీ సరైనవే కానీ ఆ వివరాలకు వేటూరికి సంబంధం స్పష్టంగా(కుల ప్రస్తావనలూ ప్రాంత ప్రస్తావనలూ సర్లెండి) చెప్పలేదు.
    ఇక మిగతా రచయితలంతా బూతుకు బదులు శృంగారం మాత్రమే వార్చారనడం అడ్డగోలు తనం.తానేదో తెలుగు సినిమాను ఉద్ధరిస్తానని చెప్పుకునే సిరివెన్నెల గారు చక్కర ఎక్కడ నక్కినా కనిపెట్టవా చీమలు ఠక్కున అంటూ రాస్తారు(తానే సినిమాలకోసం చెత్త రాయాల్సి వస్తోంది అని ఒప్పుకుంటే ప్రజలు పూర్తిగా ఈసడిస్తరని అట).
    ఐనా ఇదీ ఒక కోణం అనుకోవడం తప్పుకాదేమో ఎందుకంటే ఇక్కడ వాదన లోపం కన్నా వాది లోపాలే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు.
    —సంతోష్ సూరంపూడి.

  • నరేష్ గారు చెప్పిన దానితో కొంత వరకు ఏకీభవించాలి….
    అది వేటూరి గారు రాసిన చెత్త గురించి…
    కారణం కమ్మవారా, కాపులా అనేది అప్రస్తుతం…
    అదే కారణం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు…
    దాని గురించి బాధపడనక్కర్లేదు కూడానూ…
    ఏ కులం దిగజార్చుడు వ్యవహారాలు వారికుంటాయి…
    మనం కొత్తగా నొక్కి వక్కాణించాలనుకోవడం అనవసరం!
    అక్కర్లేని ఎడ్వెంచరూనూ!!
    బూతు లెవెల్స్ గురించి ఎవరెవరో ఏదేదో అన్నారు !!
    మరి సామాజిక బాధ్యత ఏమైంది ఈ హడావుడిలో అంటాన్నేను !!
    మన ఇల్లు తగలడే వరకు అందరూ మహాకవులే !!

  • సిట్యువేషన్ డిమాండ్‌ని బట్టి పాట ఎవరైనా రాస్తారు!!
    ఆయనెవరో కమల్ గారు సిరివెన్నెల గారి గురించి ఏదో అన్నారు!!
    ఆ వాక్యం ముందూ వెనుక స్పష్టంగా ఇమ్మని కోరుతున్నాను!!
    బూతు ఇది బూతు అది అనేమీ ఉండదు!!
    సంస్కృత పదాలను వాడి రాసినా, తెలుగు పదాలను వాడి రాసినా బూతు బూతే…!!
    కానీ ఆ బూతును ఎంత వరకు అవాయిడ్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారనేది ముఖ్యం!!
    ఇలాంటి పాటలు వినేటప్పుడు ఇంట్లో పక్కన అమ్మా,నాన్న, అక్కాచెల్లెళ్లతో ఉండగలమా?

    ఖడ్గం సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద”(సిరివెన్నెల గారు రాశారు) అనే పాట తెలిసిన వారు అదే పాటకి మరొకరు, ఉదా: వేటూరి గారైతే ఎలా రాసేవారో చెప్పగలరు!
    అలాగే “నాని” సినిమాలో “చక్కెర ఎక్కడ నక్కినా” అనే పాట మరొక ఉదాహరణ!
    ఈయన చెత్త రాస్తున్నాడయ్యా అంటే ప్రపంచంలో అందరూ చెత్త రాశారని చెప్పి అందరినీ అదే మురుగ్గుంటలోగి లాగాలని ప్రయత్నించడం హాస్యాస్పదం!
    నేరం కూడానూ!!

  • వేటూరి గారు అలాంటి “చెత్త” ఎందుకు వ్రాసారో అర్థం కాక “అంతటి విద్వత్తున్న వ్యక్తి స్థాయికి తగునా?” అని గింజుకుని బాధపడి, పుంజుకుని వాదించినవాఱిలో నేనూ ఒకడిని. ఆయన మరణించే లోపు నాకు సమాధానం ఎవఱూ ఇవ్వలేదు… ఆ తరువాత మాత్రం నా మిత్రబృందంలో ఎవఱో చెప్పిన మాట, వేటూరి గారెప్పుడో అన్న ఒక మాట, ఇంచుమించుగా: “నా పాటలన్నీ నా పోలిక, కాకపోతే వాటిని అడిగిన వాళ్ళ పోలికలే ఎక్కువ”! ఇది నాకు ఆవేశంగా వచ్చిన సమర్థనలా కాక ఆవేదనలోంచి పుట్టిన సమాధానంలానే కనిపించింది. అప్పుడు మఱో కోణంలో ఆలోచిస్తే అనిపించింది “తన పిల్లలుగా చూసుకుంటున్న పాటలని చెత్తతో నింపటమన్నది యే మనిషి మనసుకూ, కవి హృదయానికీ అయినా ఎంత కష్టమో కదా అని!”

    ఇక నరేశ్ గారిదో వస్తుపరిశీలనా దృక్పథం అంటే ఇటీవలే “Freakonomics” అన్న పుస్తకం చదివిన మత్తులో అడ్డగోలు ప్రశ్నలని, కోణాలని *సమర్థించకపోయినా* “తప్పేంటి? అదో కోణం!” అని సర్దిచెప్పుకోగలగటం వచ్చింది. (కాకపోతే, ఆ కోణంలోనైనా సమగ్రమైన, తార్కికమైన, సత్యానుగతమైన పరిశోధన జఱగవలసిన అవసరముంది. ఆ క్రమంలో వాఱిచ్చిన కుల కలకలమూ, తదాది లుకలుకల జాబితా academic discussionకి పనికి వచ్చేదిగా ఉంది. దానికంతటికీ నరేశ్ గారికి నెనఱ్లు. జంపాల చౌదరి గారు అడిగిన వివరాలు నరేశ్ గారు కానీ మఱెవఱైనా కానీ ఇస్తే ఇంకా సంతోషం!) ఏది ఏమైనా సంస్మరణార్థం వ్రాసిన వ్యాసంగా నరేశ్ గారి వ్యాసాన్ని చూడటానికి నాకే కాదు, ఎవఱికీ మనసొప్పదేమో! (వారి వ్యాసాన్ని అంతో ఇంతో సమర్థించిన మహేశ్ కుమార్ గారు, రమణ గారు యేమంటారో!)

    ఈ చర్చలోకి వాగ్గేయకారులను తీసుకురావటం సమంజసం కాదని నా అభిప్రాయం. “Comparison across generations is inappropriate.” అన్నది నా నమ్మకం. దేశకాలపరిస్థితులు మాఱిపోయాక మనం ఉన్న చోటే ఉండి సమకాలీనులైన వాళ్ళని మనకు తెలియని కాలంలోని వాళ్ళతో పోల్చి ఏదో ఒకటి తేల్చటంలో ఔచిత్యభంగమే ఎక్కువని నా ఉద్దేశ్యం. సమకాలీనులతో పోల్చి “సిరివెన్నెల నుంచి భాస్కరభట్ల దాకా” ఎవఱూ (అంతటి/అలాంటి) బూతులు వ్రాయలేదంటే తెలుగు సినిమా పాటలని చెప్పుకోదగ్గ విస్తృతిలో వినే నేను ఒప్పుకోలేను. (చక్కెర ఎక్కడ నక్కినా… అన్నది బూతు కాదు, కానీ ఉదాహరణకు వేఱే పాటలు లేకపోలేదు నా దృష్టిలో.) ఎవఱో వ్రాస్తే మఱొకరికీ సమర్థన అవుతుందంటే అసలు ఒప్పుకోను!

    వేటూరి గారే నాతో స్వయంగా అన్న మాట: “ఒకప్పుడు మల్లాది వాఱో పింగళి గారో వ్రాసినప్పుడు ఉన్న పరిస్థితి కాదుగా ఇవాళ! ‘పంతులు గారూ, ఎట్టోకట్టా జేసి ఇక్కడో మంచి పాట రాయాల!’ అంటూ వస్తారు ఇవాళ నిర్మాతలు. వాళ్ళకి సాహిత్యమూ తెలియదు, అక్కర్లేదు. భావమూ తెలియదూ, అక్కర్లేదు. అసలు అక్కడ పాట ఎందుకన్నదే ఇదమిత్థంగా తెలియదు! ‘ఛిగరెత్తె పాట’లని కొన్ని ఉంటాయి. అంటే సినిమా కథ బరువుగా సాగుతున్నప్పుడు ప్రేక్షకులకి కాస్త ఆటవిడుపు కోసం, సిగరెట్లూ అవీ తాగి రావటం కోసం ఉద్దేశించే పాటలు. అసలు అలాంటి వర్గమే లేదు పాత సినిమాల్లో! ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యే పాట వ్రాయాలంటే ఏం వ్రాయాలి? అలా పుట్టేవే చాలా పాటలు.” (రస్టన్, లూసియానా, USAలో సెప్టెంబరు 8, 2000న చెప్పిన ఈ మాటలు నా మిత్రుడు వేటూరి గారిదిగా పైన చెప్పిన మాట తలచుకునే దాకా నాకే గుర్తు లేవు!)

    నాగార్జున, సంతోష్ మారంపూడి గార్లు వ్రాసిన వ్యాఖ్యలతో నేను దాదాపుగా ఏకీభవిస్తాను. అలాగే శ్రీకాంత్ గారు ఉదహరించిన అజహరుద్దీన్-కార్గిల్ వార్ ప్రస్తావన కూడా సూటిగా ఉంది, నరేశ్ గారి వాదనలోని లోపమిదీ అని చెబుతూ!

    నరేశ్ గారూ, చివఱగా ఒక చిన్న వివరణ మీకు, <> అన్న మీ మాటలకి: వాఱంటున్న వైభవం గుఱించి నాకు తెలియదు కానీ మీరు ప్రస్తావించిన “నిజం కవులు” సాధించని (Sadly so!) వైభవం వేటూరి గారిది. Even by definition, సాహిత్యం సృష్టించిన ఎవఱైనా స్రష్టలే అవుతారు! ఆ రకంగా “కిరాతార్జునీయం” ఘట్టాన్ని original కన్నా అద్భుతంగా సృష్టించిన వేటూరి స్రష్ట కాదని యే కొలమానంతో అంటున్నారు? “డబ్బులకి అక్షరాలు అమ్ముకునే వాళ్ళు” అన్న మాటలో ఉన్న నిఖార్సయిన కసికి కారమేంటో తెలుసుకునే ఉద్దేశం నాకు లేదు, కానీ మీరే ఆలోచించండి. డబ్బుకి పంటలు అమ్ముకునే రైతు, డబ్బుకి వైద్యం చేసే వైద్యుడు, డబ్బుకి కళను అమ్ముకునే కళాకారుడు – వీళ్ళెవఱిదీ తప్పు కాదు! అవన్నీ డబ్బుతో కొలవటానికి వీల్లేకపోయినా కొలుస్తున్న మన అజ్ఞానమూ, అహంకారమూ… వీటిని కాదా తప్పు పట్టవలసింది? నాకైతే యే రచయితనూ ఇంతటి మాటల్లో ఈసడించుకునేంత ఘోరపాపం ఏమీ కనిపించలేదు రచనలు చేసి డబ్బు పుచ్చుకోవటంలో! ఆలోచించండి, మీరు మెచ్చిన ఇస్మాయిల్ గారు “చెట్టు”నే నమ్ముకుని బ్రతికారా, లేక విత్తమా? లేక మీ దృష్టిలో రాజాదరణ కోసం తపించని పోతన, వేమన తప్పించి ఎవరూ “సాహితీస్రష్ట”లే కారా?

    • <>

      “Cigarette పాట’లని కొన్ని ఉంటాయి” ani chaduvukOgalaru.

    • * నరేశ్ గారూ, చివఱగా ఒక చిన్న వివరణ మీకు, అన్న మీ మాటలకి: *

      “మీరంటున్న “వేటూరి వైభవం’….. ఏమిటి? డబ్బులకి అక్షరాలు అమ్ముకునే వాళ్ళేదో సాహిత్యస్రష్టలన్నట్టు మాట్లాడుతున్నారేమిటి?” అన్నవి ఆ మాటలు.

      [నవతరంగం నిర్వాహకులు గమనించవలసినది: "<<" అన్న double-angular brackets మధ్యన quote చేస్తూ వ్రాయటం అలవాటున్న వాఱు నేను కాక ఎవరైనా ఉన్నారేమో తెలియదు. అందులో ఉన్న content మొత్తమూ మాయమవటం నాకిది మూడో సారి. (పైన 'ఛిగరెత్తె' పాటలు అన్నది quote చేస్తే కూడా అదే జఱిగింది.) దయ చేసి దీనిని ఎలాగో సరిదిద్దగలిగితే సంతోషం.]

  • <>

  • Thanks to Mr. Reddy for citing my article. In my article, I ridiculed the idea of writing lyrics as per the caste of producer.
    Mr. Nunna is mixing up lot of things. He is taking certain outdated, stray incidents, reading too much into them and trying to apply them to his fantastic theory.
    Reg. the 1952 meeting Mr. Nunna is misreporting.
    The election took place in 1951 April.
    Prakasam has sided with Ranga. Since 4 voters have switched sides to Sanjiva Reddy and because of the camp his group ran in WG dist, he won by 4 votes.
    Then Prakasam and Ranga walked out of Congress to start “Andhra Praja Party”
    This being the case, where is the question of Kammas getting angry with Prakasam for his ‘chanakyam’?
    I am citing these facts from Prakasam’s autobiography (this 4th part was penned by Tenneti Viswanatham)
    I challenge Mr Nunna to contradict this.
    Let him not spread disinformation to incite unnecessary caste rivalry.
    Better he stop viewing everything through caste-glasses
    regards
    prasad mbs

    • Thanks for coming here and clarifying, Prasad gaarU! That helps …a lot!!

    • hmmmm…. so information about caste meeting also wrong. Good.

    • ప్రసాద్ గారు, నేను మీ అభిప్రాయం తో ఎకీభవిస్తాను. ఈ వ్యాసాన్ని సమర్ధించిన వ్యక్తుల గురించి తెలుగు బ్లాగు లోకం లో అందరికి సుపరిచితులు . అదేకాక ఎప్పుడు ఎదో ఒకటి సంచలననాల కోసం రాస్తుంట్టారు. వీరు ఆరితేరింది మోకాలికి , బోడిగుండుకి లింక్ పెట్టటం. ఇటువంటి వారు మనకు ఇంటెర్ నేట్ లో చాలా మంది దొరుకుతారు. నవతరంగం లో సినీ అభిమానులకు వివిధ శాఖలలో ఉన్న విషయాలను వివరం గా తెలేపె ఈ వెబ్ సైట్, ఇటువంటి వ్యాసాలను ప్రచూరించ కుండా ఉండి ఉంటె బాగుంట్టుంది. సినేమా అభిమానులకు ఇదొక నిరుపయోగ వ్యాసాం దీనివలన తెలుసుకునేది ఎమీ లేదు. అందరికి సమయం వృథా.

  • I approached Dr. N. Innaiah, who wrote a book on caste politics in AP to authenticate the information provided by Mr. Nunna. Dr. Innaiah wrote, “Here are the historical incidents accurately. Before first national elections 1952, the andhra congress elected the president of Pradesh congress. The contest was between Sanjeeva Reddy and Ranga. Prakasam at that time was with Ranga and not opposed him as depicted. Sanjivreddi was supported by Kala Venkatarao who played major role. He was supported by congress kamma leaders like kalluri Chandramouli. In the last minute Kakani Venkataratnam supported Sanjiv reddi.
    The congress party also stopped voting power of congress delegates from Guntur district where Ranga had majority. Thus defeat of Ranga was tactically managed.
    Prominent reddis like Kandula Obul reddiand Chegireddi Balireddi were with Ranga,
    After the defeat both Ranga and Prakasam followers met in Ayyadevara Kaleswararao`s residence in Bezwada and decided to form seperate party. Thus they left congress and formed Praja party. Ranga was strongly supported by Goutu Latchanna during the fight with Sanjiv Reddi. Also Anne Anjaiah opposed Ranga.
    Hence it is not just Kamma -Reddi fight but two factions in congress.
    At that time all India Kisan Majdoor Prajaparty was formed at Patna and Ranga, Prakasam joined in it.
    A little later Ranga came out and formed Krishikar Lok Party.
    In the first general elections 1952, Prakasam and Ranga opposed congress and defeated several congress leaders including Sanjiv Reddi ( who lost to his brother in law Tarimela nagireddi from Anantapur and never contested again from Anantapur!)
    Hence it is simplistic to say Kamma-Reddi fight thought prominent people are in both sides.

    Dr. Innaiah further wrote, “There are several prominent brahmins who stood by Ranga againsst Sanjivareddi. They are Tanguturi Prakasam, Tenneni Viswanatham, V V Giri, Vennelakanti Raghavaiah, Tenneni Chalapatirao, Nadimpalli Narasimharao, P V Chalapati rao. Nageswararao (Rajahmundry).
    There is no Gopalareddi Bhavan. Only Gopalareddy road is there.
    They all met in andhra ratna bhavan for election and afterwords met in A.Kaleswararao`s house.

    • Also, I am still looking for any references with regards to the so called meeting and resolutions of the Kamma leaders.

      • Wow, thanks, Jampala gaarU, for the wealth of information provided by Dr. Innaiah Narisetti! After Sree MBS Prasad’s message, Dr. Innaiah’s message shatters nearly all the info provided by Mr. Naresh Nunna as the basis for his rather strange argument. That settles it. :-)

  • Jampala Garu,
    Good work. You poured in more info.
    Nageswara Rao (Rajahmundry) was Dr. AB Nageswara Rao, who served as Minister for a brief time and remained Prakasam-loyalist till the end.
    The so-called meeting must have been a fig of imagination or a hearsay.
    I can say one thing at least – bank manager jobs were not coveted ones in 1951/1952. No one would have hankered after them and passed resolutions.
    And reg. the resolution to delink Brahmins from villages – who can force anyone else to leave the village? Brahmins were fond of jobs and they were the first ones who migrated from villages to cities in pursuit of them. In the process, they sold off their lands, whoever offered them best price, not necessarily Kammas.
    Slowly all the castes – Kammas were first among them – moved from villages to towns and cities. There may not have been any design. Anti-Brahminism was already a spent force by then.
    regards
    prasad MBS

    • Thanks for all the info, Prasad gaarU!

      I am waiting to see if Mr. Naresh Nunna would come here and respond. :-) I am sure he has a say here!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories