Menu

అవును..’హరిశ్చంద్రచి ఫ్యాక్టరి’ఎలా పుట్టింది?

ఈ చిత్రం డైరక్ట్  చేయటానికి  దర్శకుడు పరేష్ మొకాషీ కి ఎలా ప్రేరణ వచ్చిందన్నదానికి నేనో కథనం విన్నాను. పరేష్ మొకాషీ బేసిక్ గా నాటకాల నుంచి వచ్చినవాడు (ఇప్పటికీ మరాఠీలో నాటకాలకు మంచి డిమాండ్ ఉంది). ఆయన ఓ సినిమా స్క్రిప్టు పట్టుకుని తిరుగుతూంటే నాటకాల వాడని, మరాఠి వాడు, సినిమా అనుభవం లేని వాడని  చిన్న చూపుతో కథ వినటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపేవారు కాదట.

భేజాఫ్రై లాంటి బ్యాచ్ అక్కడక్కడా తగిలితే వారే వారి ఎంజాయ్మెంట్ కోసం విని వెనక వెక్కిరించేవారుట. ఆ సిట్యువేషన్ లో నిరాశ చెందిన ఆయనకి – ‘సినిమా అనేది ఇంత డెవలప్ అయి, అందరికీ సినిమా అంటే తెలిసి ఆసక్తి చూపుతున్న ఈ రోజుల్లోనే ఓ స్క్రిప్టు ఓకే చేయించుకుని సినిమా తీయటం ఇంత కష్టంగా ఉంది – అలాంటిది మహానుభావుడు దాదా ఫాల్కె సినిమా అంటే ఎవరికీ తెలియని రోజుల్లో ఎలా సినిమా తీసాడు’ అన్న ఆలోచన వచ్చింది.

ఆ ఆలోచన ఆయన్ను మరి కొంత కాలం పాటు మరింత పట్టుదలగా తిరిగేలా చేసినా ఫలితం లేకపోయిందిట. ఖాళీ పడ్డ ఆయన తన అనుభవాలను దాదా పాల్కె అనుభవాలు (ఊహించుకోవటం) తో  పోల్చి చూసుకుని ఊరట చెందుతూ…దాన్నే స్క్రిప్టు గా రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందిట. అంతే శరవేగంగా స్క్రిప్టు రెడీ అయింది. ఆ స్క్రిప్టే …విచిత్రంగా ఆయన్ను అంతకు ముందు కాదన్న నిర్మాతే పిలిచేలా చేసి సినిమా తీసేదాకా ఊరుకోలేదట. ఆ తర్వాత అంతా హిస్టరేనే. ఇది నేను విన్నదో.. చదివిందో గుర్తులేదు.. కానీ నిజమైతే బావుండననిపించింది. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ లో  చాలా మందికి ఆశ ఎంతలా ఉంటుందో నిరాశ అంతకంటే ముందుంటుంది (పరిస్ధితులను బట్టి..మరీ విపరీతమైన పాజిటివ్ పర్సన్స్ గురించి కాదు). వాళ్ళకి  ఈ కథనం కొంతైనా నమ్మకం కలిగిస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ చెప్తూంటారు…సినిమాకు ఐడియానే ప్రాణమని. అంత గొప్ప  ఐడియా వస్తే ..అదే మన జీవితాలని మార్చేస్తుంది.

సౌమ్య గారి ఆర్టికల్ చదివాక ఇది రాయకుండా ఉండలేకపోయాను. ధాంక్స్ టు సౌమ్య గారు.

One Response
  1. Sowmya May 26, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *