Menu

1969 – ఖామోషీ

అది ఓ పిచ్చి ఆసుపత్రి. డాక్టర్ కల్నల్ సాబ్ – నసీర్ హుస్సేన్, ఆక్యూట్ మానియా ట్రీట్ చెయ్యడానికి ఓ వినూత్న పద్దతి ఉపయోగిస్తాడు. ప్రతి పిల్లవాడు తన తల్లి దగ్గర నుంచి పరిధులు లేని ప్రేమ కోరుకుంటాడు. ఆమె నుంచి దూరమైన తర్వాత అదే రకమైన ప్రేమ కోసం తపిస్తాడు. అది దొరకనప్పుడు పిచ్చివాడైపోతాడు. అలాంటి ప్రేమ దొరికినప్పుడు తిరిగి మామూలు అవుతాడు. అటుంటి పేషంట్ అరుణ్.. అదే మన రాజేష్ ఖన్నా.. ఓ రచయిత.. కాని ప్రియురాలు సులేఖ తిరస్కరించేసరికి పిచ్చివాడయి హాస్పటల్ లో చేరుతాడు. నర్స్ రాధ – వహీదా, అతనికి సపర్యలు చెయ్యడానికి నిరాకరిస్తుంది. కారణం అంతకు ముందే అటువంటి పేషంట్ దేవ్ ని ట్రీట్ చేసి ఉంటుంది. కాని వచ్చిన ప్రాబ్లమ్ అతని తో ప్రేమలో పడుతుంది. కాని పిచ్చి తగ్గిన దేవ్ ఆమెను మర్చిపోయి వెళ్ళిపోతాడు.

కానీ డాక్టర్ బలవంతంవల్ల పైగా పరిస్థితులవల్ల అరుణ్ కి సపర్యలు చేయటం మొదలు పెడుతుంది. మళ్ళీ అతని తో ప్రేమ లో పడుతుంది. పిచ్చి తగ్గిన అరుణ్ ఆమెను పెళ్ళి చేసుకున్నాడా లేక తన దారిన తను పోయాడా. అదే చివరకు మిగిలేది.

ఈ సినిమా సావిత్రి నటించిన “చివరకు మిగిలేది” అని విన్నా కానీ నేనా సినిమా చూడలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేను. సైలెన్స్ అని ఇంగ్లీష్ లో సినిమా తీస్తున్నారని చాలా రోజుల క్రితం చదివాను కానీ మిగతా వివరాలేమి తెలియవు.

పాటలు సినిమాకు హైలైట్..వో షామ్ కుచ్ అజీబ్ థీ.., హమ్నే దేఖీ హై…తుమ్ పుకార్ లో.. చెబితే గుర్తుకురాకపోవచ్చు.. వినండి. అప్పుడు తెలుస్తుంది.

హేమంత్ కుమార్ ప్రొడ్యూసర్ కమ్ మ్యూజిక్..అసిత్ సేన్ డైరక్టర్.. దేవ్ గా కనిపించేది ధర్మేంద్ర. కానీ ఒక్క డైలాగ్ లేదు. మనిషి ని పూర్తిగా కూడా చూపించరు. వహీదా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి నామినేట్ మాత్రమే అయ్యింది.

నర్స్ లు మరబొమ్మలు కాదు. వాళ్లకి  అనుభూతులుంటాయి అని తెలియచెప్పే ఓ మంచి సినిమా

హేమంత్ కుమార్ సంగీతం కోసం ఈ సినిమా చూడండి. వహీదా రెహమాన్ నటన కోసం ఈ సినిమా చూడండి. ఓ చక్కని సినిమా చూసామన్న అనుభూతి కోసమైనా ఈ సినిమా చూసి తీరాలి. నాకు డీవీడి హైద్రాబాద్ లో దొరికింది.

ఓ ఫీల్ గుడ్ సినిమా..

6 Comments
  1. Sowmya V.B. May 17, 2010 /
  2. V. Chowdary Jampala May 18, 2010 /
    • Manjula May 18, 2010 /
      • స్నేహిత్ May 18, 2010 /
  3. MBS PRASAD July 2, 2010 /