Menu

ప్రస్థానం సమీక్ష వ్రాయండి. బహుమతులు గెలుచుకోండి

మంచి సినిమా ఎక్కడొచ్చినా ఎలుగెత్తిచాటే తెలుగు వేదిక నవతరంగం.అలాంటిది తెలుగులో వచ్చే మంచి సినిమాల గురించి చెప్పకపోవడం అన్యాయమే అవుతుందనే స్పృహతో, తెలుగు సినిమా సమీక్షలు ప్రచురిస్తే అనవసరమైన రభసలేతప్ప సభ్యత కలిగిన చర్చలు జరగవనే అనుభవం కలిగినా, వాటన్నింటినీ పక్కనబెట్టి ‘ప్రస్థానం’ చిత్రం సమీక్షని ప్రచురించడం జరిగింది.

మంచి సినిమాని ప్రోత్సహించే వేదికగా నవతరంగం “ఉత్తమ సమీక్షకు ఐదువేలు” పోటీ నిర్వహిస్తోంది.

‘ప్రస్థానం’ చూడండి.
సమీక్ష రాయండి.
పోటీలో పాల్గొనండి.
బహుమతులు గెలుచుకోండి.

వివరాలు
ఈ మధ్యనే విడుదలయిన ప్రస్థానం సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాకు నవతరంగం ద్వారా మాకు చేతనయినంతలో ప్రచారం చేద్దామనే ఆలోచనతో మొదలుపెట్టిందే ఈ కొత్త ప్రయత్నం.

ఈ సినిమా చూసి మీ రివ్యూలు admin@navatarangam.com కు మీ వివరాలతో సహా పంపండి.

ప్రతిరోజూ వచ్చిన సమీక్షలకు ఆ తర్వాత రోజు voting నిర్వహిస్తాము. అందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన వారికి ప్రతి రోజూ 1000 రూ బహుమతిగా (పుస్తకాలు, DVD ల రూపంలో) అందచేయబడుతుంది.

నియమనిబంధనలు:

  1. సమీక్ష కనీసం ఒక పేజి (A4 సైజులో) ఉండాలి.
  2. రోజుకు కనీసం ఐదు సమీక్షలు వస్తే తప్ప ఓటింగ్ నిర్వహించబడదు. ఆ వ్యాసాలు తర్వాత రోజు పోటీలో చేర్చబడుతాయి.
  3. ఓటింగ్ లో కనీసం వందమందైనా పాల్గొంటేనే ఆ రోజు పోటీ జరిగినట్టు.
  4. ఈ పోటీ 20 April నుంచి మొదలు.


19 Comments
  1. కొత్తపాళీ April 19, 2010 /
  2. a2zdreams April 19, 2010 /
    • చక్రధారి April 20, 2010 /
  3. kay April 20, 2010 /
  4. అబ్రకదబ్ర April 20, 2010 /
    • అభిమాని April 20, 2010 /
    • మంచు April 21, 2010 /
  5. kay April 21, 2010 /
  6. pokiri April 21, 2010 /
  7. uma April 21, 2010 /
  8. Chakri April 22, 2010 /
  9. JB April 22, 2010 /
  10. JB April 23, 2010 /
  11. JB April 23, 2010 /
  12. prasanth April 24, 2010 /