Menu

రన్నింగ్ కామెంట్రీ-Jump Cut

జంప్ కట్ అంటే ఈ రోజు సినిమాలు చూసే వాళ్ళందరికీ పరిచయమే అనుకుంటాను. అయినా సరే తెలియని వాళ్ళ కోసం ముందుగా ఈ ఎడిటింగ్ టెక్నిక్ గురించి ఒక చిన్న పరిచయం.

What makes film a film is editing అన్నారు ఒక పెద్దాయన. ఒక స్టేజి మీద జరుగుతున్న నాటకాన్ని పిల్మ్ కెమెరా తో రికార్డ్ చేసినంత మాత్రాన అది సినిమా అవదు అని అందరూ ఒప్పుకునే విషయమే. ఉదాహరణకు, మొన్నీ మధ్య రవీంద్రభారతిలో చాలా మంది సినీ నటులతో వరవిక్రయం నాటక ప్రదర్శన జరిగింది. ఆ నాటకాన్ని కెమెరా తో రికార్డ్ చేసి తెర మీద ప్రదర్శిస్తే అది recorded stage play అవుతుంది కానీ, (సినీ నటులు ఉన్నప్పటికీ) దాన్ని సినిమా అని ఎవరూ ఆమోదించరు. మొదట్లో, అంటే ఫిల్మ్ కెమెరా ని invent చేసిన రోజుల్లో రోజువారీ జీవితంలోని సంఘతనలను రికార్డ్ చేసి తెర మీద ప్రదర్శించే వాళ్ళు. అప్పటి రోజులకు అదే సినిమా అయినప్పటికీ రాను సినిమా అనేది ఒక కళగా ఎదగడానికి కారణమయ్యింది మాత్రం ఎడిటింగ్. హాలీవుడ్ కి చెందిన ప్రఖ్యాత ఎడిటర్ Walter Murch మాటల్లో చెప్పాలంటే ఎడిటింగ్ ద్వారా సినిమా కి రెక్కలొచ్చాయట. ఆధునిక ప్రపంచంలో ప్రయాణ రంగంలో విమానం ఎంతటి విప్లవాత్మక మార్పుతెచ్చిందో, సినిమా రంగంలో కూడా ఎడిటింగ్ అంతే విప్లవాత్మకమని ఆయన అభిప్రాయం.

సినిమా రంగంలో అంతటి ప్రాముఖ్యం ఉన్న ఎడిటింగ్ అనే ప్రక్రియ మొదలయినప్పటినుంచీ కూడా ఎడిటర్ లక్ష్యం ఎప్పుడూ ఒకటే – వివిధ సమయాల్లో, వివిధ చోట్ల షూట్ చేసిన సీన్లను స్థలము మరియు కాలము అవిఛ్ఛన్నంగా ఉండేలా ప్రేక్షకులను భ్రమింపచేయడమే. ఈ విధానాన్నే కంటిన్యూయస్ ఎడిటింగ్ అంటారు. కొన్ని special cases లో ఉపయోగించిన సోవియట్ మోంటాజ్ లో తప్పితే మిగిలిన సమయాల్లో ఎక్కువగా ఈ కంటిన్యూయిటీ ఎడిటింగ్ ఆధారంగా సినిమాలు ఎడిట్ చెయ్యబడేవి. అంటే రెండు వేరు వేరు షాట్స్ లోని ఫ్రేమ్స్ ని అవిఛ్ఛన్నంగా ఉండేలా అతికించడమే (Match frame) ఈ కంటిన్యూయిటీ ఎడిటింగ్ ముఖ్య లక్ష్యం. అందుకే ఎడిటింగ్ అంటే cutting అనుకునే వాళ్ళకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. నిజానికి ఎడిటింగ్ అంటే కట్టింగ్ కాదు, join చెయ్యడం. అందుకే తెలుగులో ఎడిటింగ్ ని కూర్పు అన్నారు.

అయితే ఇదంతా యాభై ఏళ్ళకి పూర్వపు మాట.

1958 లో మొదలైన ఫ్రెంచ్ న్యూ వేవ్ అనే సినీ ఉద్యమం ద్వారా వచ్చిన మార్పులు ఎడిటింగ్ రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చాయి. అప్పటి వరకూ కంటిన్యూయస్ ఎడిటింగ్ ఒక ప్రమాణంగా కొనసాగుతున్న రోజుల్లో ఎడిటింగ్ నియమాల్ని తిరగరాశారు అక్కడి చలనచిత్రకారులు. ఫ్రెంచ్ న్యూవేవ్ ఉద్యమం ద్వారా వచ్చిన ఎన్నో మార్పుల్లో ఈ జంప్ కట్ అనే ఎడిటింగ్ విధానం ఒకటి.

ఇది Match frame కి పూర్తిగా వ్యతిరేకం. జంప్ కట్ లో స్థల కాలాలకు అనుగుణంగా ఉండేలా రెండు షాట్స్ అవిఛ్ఛన్నంగా ఉండవు. ఉదాహరణకు మొదటి షాట్ లో తలుపు దగ్గర తాళం తెరుస్తున్న వ్యక్తి ని చూపించి, ఆ తర్వాత షాట్ లో అదే వ్యక్తి వాష్ బేసిన్ దగ్గర మొహం కడుగుతూ, వెంటనే ఆ తర్వాత షాట్ లో టివి దగ్గర కూర్చున్న ఆ వ్యక్తిని చూపించడాన్ని జంప్ కట్ అనొచ్చు.

మరో సారి Match Frame Vs Jump Cut

Match frame and jump cut have very specific significations in the technical language of filmmaking.

A match frame in its pure form is the combination of two takes, showing completely different places. They are forced into a correlation by the movement of a person, who is passing from one take to the other, continuing exactly the same action. The interest focuses on the acting person, while the space is only important in relation to it. Even if the abrupt changing of the places will create an effect of poetry or humour, the match frame shows clearly, that the cinematographic interest does not lie in the representation of the spatial world, but in the presentation of somebody acting.

The jump cut, on the contrary, sets the place above the action. By cutting out a part of the temporal continuity of a take, the acting person is found again in a different position in the same cadre. This jumping of the person does not correspond to a rational explanation. The pure form of the jump cut does not necessarily signify a lap of time. It stands for a static vision of the world. The person is thrown into a space, which is extraneous to it. Its movement does not make any sense. It is absurd, contradicted by a space that cannot be changed by action anyway.

అయితే సినిమా అనేది నిజంగా జరుగుతున్నట్టుగా భ్రమింపచేసే ఒక క(ల)ళ. కాబట్టి నిజ జీవితంలోలాగే స్థల/కాలాలకు అనుగుణంగా ఉండాలని మొదట కంటిన్యూయస్ ఎడిటింగ్ ప్రక్రియను ఎన్నుకొన్నప్పటికీ అసలు మన జీవితంలో మనం మన చుట్టూ జరిగే విషయాలను చూసే విధానం ఒక సారి గమనించినట్టయితే మనం ఏదీ కంటిన్యూయస్ గా చూడము అని నా అభిప్రాయము.

కెఫే లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతుంటాం. అతను/ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోము కదా. కళ్ళు అటూ ఇటూ చూస్తూనే ఉంటాయి. ఎన్నో విషయాలను గమనిస్తూ ఉంటాయి. అందుకే Alejandro González Iñárritu సినిమాలు చూసినట్టయితే అందులో ఎడిటింగ్  నిజ జీవితంలో ఎలా అయితే మన దృష్టి ఎప్పుడూ అన్ని దిక్కులనూ గమనిస్తూనే ఒక వైపు మాత్రం దృష్టి కేంద్రీకరిస్తామో అలా ఉంటుంది. అంతకు ముందు ఎప్పుడూ లేని ఇలాంటి ఫిల్మ్ గ్రామర్ ఇప్పుడు ఎన్నో సినిమాల్లో మనం చూడవచ్చు. అందుకే ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎక్కువగా కంటన్యూటీ ఎడిటింగ్ వదిలి దానికంటే dynamic ఎడిటింగ్ styles కి ప్రధాన్యం ఇస్తుండడం గమనించవచ్చు.

అయితే మొదటి కంటిన్యూటీ ఎడిటింగ్ నుంచి ఇప్పుడు జంప్ కట్ ద్వారా చేస్తున్న డైనమిక్ ఎడిటింగ్ కి ప్రేక్షకులు ఎలా అలవాటు పడ్డారు అనే విషయం గురించి చర్చించాలంటే Blink of An eye పుస్తకంలో Walter Murch చెప్పిన ఒక సంగతి ప్రస్తావించాలి. అదేంటంటే…

తేనె పట్టు అందరూ చూసే ఉంటారు కదా. తేనెటీగలు ఎక్కడెక్కడో తిరిగి పువ్వుల నుంచి సేకరించిన తేనె ను తేనె పట్టులో దాచిపెడతాయి. అయితే ఎక్కడెక్కడో తిరిగి చివరకు తమ సొంత తేనె పట్టుకే చేరుకునే తేనెటీగలు దారెలా గుర్తుపెట్టుకుంటాయా అనే విషయం ఇప్పటికీ అంతుపట్టని విషయమే. (తేనేటీగలే కాదు, చీమలు కూడా అంతే..అయినా మనం చర్చించేది దాని గురించి కాదు కాబట్టి దాన్ని పక్కనపెడదాం. ఈ subject మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ లింక్ చూడండి.)

తేనెటీగలు తమ తేనె పట్టు చేరుకునే దారి ఎలా గుర్తుంచుకుంటాయనేది ఒక విచిత్రమైతే అంతకంటే విచిత్రమైన మరో విషయముంది. ఒక తేనె పట్టు లోనుంచి అన్నీ తేనెటీగలు తేనె సేకరణ కోసం వెళ్ళిపోయాక ఆ తేనె పట్టుని ఉన్నదున్నట్టుగా తీసి ఇంకో వంద మీటర్ల దూరంలో ఉంచామనకోండి. సాయంత్రానికి తేనె సేకరించిన ఆ తేనెటీగలు తమ తేనె పట్టుని చేరగలుగుతాయా? లేదా? సైటింస్టులు చెప్పేదేంటంటే అవి ఏ మాత్రం సందేహం లేకుండా దారి కనుక్కోగలవని! విచిత్రం కదా! అదే ఆ తేనె పట్టుని కేవలం రెండు మూడు మీటర్లు దూరంలోనే ఇంకో ప్రాంతంలో పెడితే అవి కనుక్కోలేవట. ఇది ఇంకా చిత్రం.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పబడిందంటే Match frame అనేది తేనెపట్టు ఎప్పుడూ ఒకే చోట ఉండడంతో పోలిస్తే Jump Cut ని తేనె పట్టుని వంద మీటర్ల దూరం జరపడంతో పోల్చవచ్చు. ఈ మధ్యలో ఉంది చూశారా….అదే అటు ఇటు కానిది. (తేనె పట్టుని మూడు నాలుగు మీటర్ల దూరం కి జరపడం) దాంతోనే అసలు సమస్య. ఇలాంటి ఎడిటింగ్ మన దేశంలో ఎన్నో సినిమాల్లో చూడవచ్చు. Time and spatial continuity అనేది మన సినిమాల్లో అసలు పట్టించుకున్నట్టే ఉండదు.

మొన్నో మధ్యే ప్రస్థానం చూస్తుంటే ఒక సీన్లో తండ్రి కొడుకు రూంకి వెళ్ళి అక్కడున్న పేపర్స్ ని చిందరవందరగా కిందపడేస్తాడు. ఈ పేపర్స్ ఒక షాట్ లో ఉంటాయి. మరో షాట్ లో ఉండవు. అలాగే ఇంకో సినిమాలో హీరో ఒక షాట్ లో లెఫ్ట్ నుంచి exit అవుతాడు, తిరిగి తర్వాత సీన్ లో లెఫ్ట్ నుంచే enter అవుతాడు. సినిమాటిక్ గ్రామర్ ప్రకారం స్క్రీన్ left నుంచి exit అయితే right నుంచి enter అవడం ద్వారా continuity ఫీలింగ్ కలుగచేయొచ్చు. లేదా పూర్తిగా space and time shift చేయడం ద్వారా కూడా ప్రేక్షకులకు confusion లేకుండా చేయొచ్చు.

Final గా చెప్పొచ్చేదేమిటంటే సినిమాలో Match frame (Continuity editing) లేదా Jump Cut (Dynamic editing) ఉపయోగించవచ్చు కానీ ఈ రెండింటికీ మధ్యలో మాత్రం ప్రయత్నించవద్దు అనేది సారాంశం.


6 Comments
  1. కమల్ April 21, 2010 /
  2. కొత్తపాళీ April 21, 2010 /
    • Srikanth January 18, 2013 /
  3. Srikanth January 17, 2013 /