Menu

ఉట్టే స్వర్గం:ప్రస్థానం

(ఈ సమీక్షలో సినిమా కథలోని కొన్ని కీలక దృశ్యాలను వెల్లడించడం జరిగింది. పాఠకులు జాగ్రత్త వహించగలరు.)

మొదటిగా నవతరంగంఫై చిన్న సమీక్ష. మీడియా ఒక బఫూన్ని కూడా గ్రేట్ పొలిటీషియన్ చేయగలదు. కాని మీడియా ఒక సాధారణ సినిమాని గొప్ప సినిమా చేయలేదు. తాత్కాలికంగా సొమ్ములు రాబట్టుకోవటానికి, అవార్డ్స్ రాబట్టుకోవటానికి హెల్ప్ చేయగలదు అంతే. అలా చేయటం వలన మీడియా నష్టపోతుంది. ఈ సినిమా ఇప్పుడున్న పిచ్చికి మందు…ఇది చూడకపోతే చాలా మిస్ అవుతారు…లాంటి బోలెడు మాటలతో నవ తరంగం వారు పోటి నిర్వహించారు. ఇది తప్పకుండా సైట్ నిజాయితీని, విలువల్ని శ౦కించే ఆస్కారం కలిపించింది. ఇక్కడ సైట్ నిజాయితీని నేను ప్రశ్నించటం లేదు..ఎందుకంటే ఈ కామెంట్స్ కూడా మీరు ప్రచురిస్తారు..ఆ నిజాయితి మీకు వుంది….కాని మీరు చేసిన పని, దాని ప్రభావము గురించి మాత్రమె చెప్పాను.

ఉట్టినే స్వర్గంగా వర్ణించి మీరు చెప్పే మాటలవల్ల మీకు కలిగే నష్టం గురించి, మీ వ్యక్తిగత అభిప్రాయాలను సహజ అభిప్రాయంగా సూత్రీకరించటం గురించి చెప్పాను.

ఈ సమీక్ష పోటిలో ఎంట్రీ కోసం కాదు. బహుమతి కోసమూ కాదు. ఇప్పటికే ఇక్కడ ఈ సినిమా గురించి చాలా చర్చలు జరిగాయి. సో నేను ఆల్రెడీ చర్చించిన విషయాల జోలికి పోవటం లేదు.

ఇక ప్రస్ధానం విషయానికి వస్తే ఇది ఏ రకంగా గొప్ప సినిమానో అర్ధం చేసుకోలేపోతున్నాను. మీరు చెప్పినంత గొప్పగా కాకపోయినా మామూలు గొప్ప సినిమాగా కూడా నాకు తోచటం లేదు.

 1. సాయికుమార్ని అవకాశవాద వ్యక్తి అనుకొందాం. (సినిమా అంతా అతని కారక్టర్ ఇలానే చిత్రించబడింది )
  ఒక వ్యక్తిని చంపట౦ వలన ఊరికి నాయకుడు అయ్యే అవకాశం వస్తుందని, చంపే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ అతను తప్పించుకొనే అవకాశం వేరే అతను ఇచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నాడు. మరి తన అవసరాన్ని మర్చిపోయే అవకాశం ఏమొచ్చిందని సిటీకి బయలుదేరాడు. ఊరికి నాయకుడు అవ్వటం ఏమయిపోయింది.
 2. సాయి కుమార్ని ఆశయవాది , తప్పనపుడు ఆశయాన్ని పక్కకు పెడతాడు అనుకొందాం. (ఇక్కడ కొంతమంది రాసిన వ్యాసాల్లో మరియు డైరెక్టర్ మాటల్లో అతని క్యారెక్టర్ ఇలా చెప్పబడింది ) ఆశయవాదే బాషా నుంచి అవకాశం రాగానే ఎటువంటి సంఘర్షణ లేకుండా అందిపుచ్చుకొంటాడు. తను తప్పు చేసే ప్రతి సారి తన సంఘర్షణను డైరెక్టర్ చిత్రించలేదు. కొంతసేపు తనవాడిని ఏమి చేయ వద్దు అంటాడు. కొంత సేపటి తరువాత చంపేయమని అంటాడు….ఆ మద్యలో సంఘర్షణ ఈ సినిమాకి ఆయువుపట్టు. ఆ విషయాన్ని డైరెక్టర్ మరిచాడు.
 3. క్లినిక్ కి హాస్పిటల్ కి తేడా మనకి తెలుసు. క్లినిక్ లో పని చేసే సురేఖ, పోస్టుమార్టం ఎలా చేస్తుంది.
 4. చిన్న చనిపోయినపుడు , పోలీసు చెప్పిన ప్రకారం మిత్ర చంపుతాడు..సో ” నీకొడుకు నాకొడుకుని ఏ౦చేసాడో చూసావా” అంటాడు. వారం రోజులు ఇంట్లోనే ఉండి కొడుకు గురించి ఆస్థి సంపాదించి వేస్ట్ అని బాధ పడతాడు. ఇక్కడ అతని భాద అంతా కొడుకు పోయిన వైరాగ్యంలో నుంచి వచ్చినట్లే చూపారు. మళ్ళీ పోలీసు వస్తాడు…”నేను చెప్పిన పని (బాషాని చంపటం) చేసుంటే ఇప్పుడు ఈ కర్మ వుండేది కాదు నాకు” అంటాడు…. ఏవిధంగా రిలేట్ చేసుకోవాలి.
 5. పిచ్చి పిచ్చిగా చిల్లర చిల్లరగా తిరిగే వ్యక్తీ తను కేసులోనుంచి బయటపడటానికి రిక్వెస్ట్ చేయటానికి వెళ్లి తత్వం బోదిస్తుంటాడు….”మనిషి చరిత్ర అన్న తమ్ముళ్ళ యుద్ధం తోనే మొదలయ్యి౦ది కదా” . ఈ డైలాగు ఆ సీన్లో పంటి కింద రాయి…
 6. ఆ సోంబాబు ఎవడో కాని సినిమాలో మొహంతో పని లేని క్యారెక్టర్ అవసరం అయిన చోట ఇదే పేరుని వాడారు. అసలు పరస్పర సంబంధం లేని సీన్స్ కి కూడా.
 7. ఇవన్ని కాసుల కష్టాలకి, సినిమా ఫార్మటులకి సంబంధం లేని తప్పులు..ఇంకా 6 పాటలు, కామెడీ అంటూ చేసిన తప్పులు ఎలానూ ఉన్నాయి.
 8. పైన నె౦ 2 గా చెప్పుకొన్న విషయం వలన సినిమా మూడ్ క్రియేట్ చేయలేకపోయింది అనుకొంటే, సా౦కేతిక విభాగం సినిమాకి ఒక స్టయిలుని కాని, లుక్ ని కాని, జేనేరుని కాని తీసుకు రావటంలో విఫలము అయింది. అక్కడక్కడ కెమెరా పనితన౦ కనిపించినప్పటికి అది సినిమా మొతానికి ఒక స్టయిలుని క్రియేటు చేయలేకపోయింది. (ఈ విషయం అర్దమవ్వాలంటే సర్కార్,శివ లతో పోల్చి చూడ౦డీ. దానికంటూ ఒక స్టైల్ ఆఫ్ లైటింగు, మ్యూజిక్, కేమెర వుంటాయి)
 9. ఇక పాత్ బ్రేకింగ్ వాల్యూస్ విషయంలోకి వస్తే,ఒక రేప్ సీన్ ని భీకర౦గా చూపించే అవకాశం వున్నా సంయమనం పాటించి మంచి పని చేసాడు…..కాని ఈ సిద్దాంతం చిత్రమంతా అన్ని విషయాల్లో పాటిస్తే పాత్ బ్రేకింగ్ అయ్యేది.
 10. మనిషి మనస్తత్వం మీద సినిమా తీయాలనే ఆలోచన, మంచి డైలాగులు అభినందనలకి సంపూర్ణ అర్హతలు పొందాయి. కాని తన ఆలోచనని తెరపైకి తీసుకురావటంలో వైఫల్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. గాడి తప్పిన స్క్రీన్ప్లే కూడా ఈ చిత్రానికి అన్యాయం చేసింది. ఇది డైరెక్టర్కి ఉన్న పరిధుల వలన జరిగింది అయినట్లయితే సిని ప్రేమికులు అర్ధం చేసుకోగలరు కాని కళ్ళకు కనిపించే “స్వర్గానికి నిచ్చెన” ఉట్టిని కూడా చేరినట్లనిపించటం లేదు. ఈ ప్రయత్నము ఉట్టికి చేరని స్వర్గ యాత్ర(ప్రస్ధానం)గా మిగిలింది.

–వర ప్రసాద్.వి

49 Comments
  • vara May 1, 2010 /
 1. Chaitanya April 30, 2010 /
  • vara April 30, 2010 /
   • Chaitanya May 3, 2010 /
 2. Rallapalli Krishna April 30, 2010 /
  • vara April 30, 2010 /
   • kay May 1, 2010 /
   • vara May 1, 2010 /
   • kay May 2, 2010 /
 3. మెహెర్ April 30, 2010 /
   • మెహెర్ April 30, 2010 /
   • మెహెర్ April 30, 2010 /
 4. Sharath Chandra April 30, 2010 /
 5. కొత్తపాళీ April 30, 2010 /
  • చక్రధారి May 1, 2010 /
 6. a2zdreams May 1, 2010 /
  • vara May 1, 2010 /
 7. kay May 1, 2010 /
  • vara May 1, 2010 /
   • kay May 1, 2010 /
   • vara May 1, 2010 /
   • kay May 2, 2010 /
 8. kay May 1, 2010 /
  • vara May 1, 2010 /
 9. Rallapalli Krishna May 1, 2010 /
  • vara May 1, 2010 /
 10. Latha May 3, 2010 /
 11. jazz May 5, 2010 /
  • Subramanyam May 5, 2010 /
  • vara May 5, 2010 /
   • Rallapalli Krishna May 5, 2010 /
  • srujan May 7, 2010 /
   • vara May 7, 2010 /
 12. Deva May 5, 2010 /
  • Rallapalli Krishna May 5, 2010 /
 13. more_holes May 5, 2010 /
 14. Chandu May 6, 2010 /
  • vara May 7, 2010 /
 15. rao&rao May 6, 2010 /
 16. kanni May 17, 2010 /
 17. l.hanimireddy July 15, 2017 /