Menu

ప్రస్థానం సమీక్షల పోటీ విజేతలు


ప్రస్థానం సినిమాని ప్రమోట్ చెయ్యడానికి మేము సైతం..అంటూ మా స్థాయిలో నిర్వహించిన సమీక్షల పోటీ నేటితో ముగిసింది. ఈ పోటీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.

ముందుగా అనుకున్నట్టుగా రోజుకి కనీసం ఐదు సమీక్షలు వస్తేనే ఈ పోటీ నిర్వహిద్దామని అనుకున్నప్పటికీ ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎంత బాగా సినిమాని సమీక్షించారని తెలుసుకోవడం కాకుండా మరింతమంది చేత సినిమా చూపించి వారి వ్రాసిన సమీక్షల ద్వారా ఇంకొంత మంది ప్రేక్షకులను ప్రస్థానం సినిమా చూసేలా చెయ్యడం కాబట్టి ఈ పోటీకి సమీక్షలు పంపిన వారందరూ విజేతలే.

ఇప్పటివరకూ ఈ క్రింద పేర్కొనబడిన వారు ఈ పోటీలో పాల్గొన్నారు.

  1. గురుచరణ్
  2. శీతల్ కిరణ్
  3. కృష్ణ చైతన్య
  4. వెంకట్ గోపు
  5. రాజశేఖర్
  6. సత్యప్రసాద్
  7. కేశవ్ చరణ్
  8. శరత్ చంద్ర

ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ మరో సారి మా ధన్యవాదాలు. వీరందరికీ ఒక్కొక్కరికీ ఈ క్రింది వాటిలో ఏదో ఒక బహుమతి ఎన్నుకొని ఆ వివరాలు మాకు మైల్ ద్వారా [admin at navatarangam dot com] తెలియచేస్తే వారికి బహుమతులు అందచేస్తాం.

బహుమతుల వివరాలు:

1)500 రూపాయల గిఫ్ట్ వౌచర్-Landmark షాపు నుంచి
లేదా మీ బహుమతిని మీరు 1)సామాన్యశాస్త్రం (కందుకూరి రమేష్ బాబు) కి డొనేట్ చెయ్యవచ్చు లేదా 2)మీ బహుమతిని కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నవతరంగం ఇచ్చే అవార్డు కోసం డొనేట్ చేయవచ్చు.

కందుకూరి రమేష్ బాబు గురించి:

కందుకూరి రమేష్ బాబు అనే జర్నలిస్టు సామాన్యుల కోసం పత్రికను ప్రారంభించారు. ఇది తెలుగు సామాన్యుల పత్రిక అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇందులో రెండు రకాల రచనలుంటాయి. ఒకటి – సామాన్యుల రచనలు. రెండు – సామాన్యులపై రాసిన రచనలు. అయితే స్వయంగా సామాన్యులు రాసుకున్న రచనలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని రమేష్ బాబు అంటున్నారు. వారి శైలి శిల్పాలతో సంబంధం లేకుండా రచించడమే ఏకైక విలువగా వారి అభివ్యక్తిని సామాన్యశాస్త్రం గుర్తిస్తుందని ఆయన చెప్పుకుంటున్నారు. సామాన్యుల రచనలు సేకరించి యధాతథంగా ప్రచురిస్తామని ఆయన చెప్పారు. ఇక రెండు రకం రచనలు తాము రాసేవని ఆయన అంటున్నారు. ఇందులో విశిష్టత కలిగిన సామాన్యులపై, సేవాదృక్పధం ఉన్న మామూలు మనుషులపై అక్షర జ్ఞానం ఉన్నవారు మొదలు రచయితలు, పాత్రికేయులు రాసిన రచనలు ఇవి. సంస్థగా ఎదిగినవారిపై ఇందులో చోటు లేదు.

ఈ విధంగా సామాన్యుల రచనలు, వారిపై రాసిన రచనలతో నెలనెలా ఈ మాసపత్రిక సామాన్యుల జీవితాలకు అక్షర నీరాజనం పలుకుతుంది. ఈ ప్రయత్నంలో ఆయా వ్యక్తులపై ముందు వ్యాసాలు రాస్తామని, అనంతరం పుస్తకాలు ప్రచురిస్తామని ఆయన చెప్పారు. ఈ పత్రిక నిర్వహణ కోసం సామాన్యశాస్త్రం ఇప్పటికే 119 మందిని కూడగట్టినట్లు రమేష్ చెప్పారు. వీరందరూ ఒక ఏడాది పాటు నెలనెలా ఇచ్చే వంద రూపాయలను ఫెలోషిప్ గా స్వీకరిస్తామని అన్నారు. వీరంతా ఆర్థిక సౌజన్యంతోనే సరిపెట్టుకోవడం లేదని, స్వయానా పౌర పాత్రికేయులుగా వ్యవహరిస్తూ తమకు తెలిసిన విశిష్టమైన వ్యక్తుల ఆచూకీ చెబుతున్నారని అంటూ ఈ సమిష్టి ప్రయత్నంలో జత కలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

“ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఓ లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయం తప్పక ఉండాలి” అనే ఆదర్శంతో, సమిష్టి పుస్తక ప్రచురణ లక్ష్యంగా సామాన్యశాస్త్రం రెండేళ్లుగా పేరులేని పెద్ద మనుషులపై పది పుస్తకాలు వెలువరించింది. లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాలను పది రూపాయలకే పాఠకులకు అందించింది.

నవతరంగం అవార్డు గురించి:

గత సంవత్సరం ఫిభ్రవరిలో కరీంనగర్ నందు జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ క్రింది గైడ్ లైన్స్ తయారు చేసాము.

1. First time filmmakers should be considered prior to experienced ones.
2. Does the film reflect creativity? Is it imaginative?
3. Does the work feel unique and fresh? Has the filmmaker created a compelling program? Is it accessible?
4. Will it appeal to (a national/local) audience? Is it well-produced?
5. Is the subject chosen reflect anything representing common good of the public or not?
6. If Fiction: does it have any substance or simply an entertainer?
7. డైలాగ్స్ తో కాకుండా విజువల్ గా స్టోరీ చెప్పగలగడం.
8. ఎడిటింగ్ లో ఏవైనా కొత్త ప్రయోగాలు చేసారా?
9. సబ్జక్ట్ కూడా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అయితే మేలు. మొత్తానికి రొటీన్ కి భిన్నంగా అని అర్థం:-)

మీ వివరాలు, మీరు కోరుకున్న బహుమతి వివరాలు మాకు అందచేయాల్సిన మైల్ ఐడి : admin at navatarangam dot com
PS: ఈ రోజుతో సమీక్షల పోటీ ముగిసినప్పటికీ ప్రస్థానం సినిమా గురించి మీరు వ్రాసిన వ్యాసాలు మాకు పంపిస్తే ప్రచురించగలమని తెలియచేస్తున్నాము.

2 Comments