Menu

Monthly Archive:: April 2010

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం

కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం-ఒక స్పందన

శ్రీనరేష్‌నున్నాగారికి నమస్కారములు ఒంటిచేత్తో పదిమంది దొంగలను ఎదుర్కొన్న మహావీరుడుగా,  పేద ప్రజలపాలిటి పెన్నిధిగా మహానటుడు సినిమాలలో ప్రజల మనసులలో నిలుస్తాడు. అంతమాత్రాన అతడు నిజజీతములో ఆ సినిమా ప్రదర్శనంతటి శౌర్య పరాక్రమ శోభితుడని అనుకోలేము. అతడిచ్చిన ప్రేరణ మాత్రము మహావీరులను తయారు చేస్తుంది.అలా అసాధారణ జనవ్యక్తిత్వ వికాసపాత్రకు ప్రేరణ ఇవ్వగల నటుడు పదిమంది దొంగలను ఒక్కసారిగ మీదపడితే ఎదుర్కోవడముకాని, ఉదాత్తజీవిత ప్రమాణాలతో నిజజీవిత నటనలో ఆదర్శము అవ్వాలని ప్రయత్నించి భంగపడకుండా నటుడిగా నిలిచిపోతే చిరస్మరణీయుడవుతాడు. అపహాస్యముగా భంగపడితే

కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం

తెలుగు సినీపరిశ్రమలో కథాచౌర్యాలూ, భావచౌర్యాలూ, పైరసీభూతాలూ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో చరిత్రలో నిలిచిపోయే తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి” కథావివాదం గురించి ‘ నరేష్ నున్నా’ గారు రాసిన పరిశోధనాత్మక వ్యాసం  మీ కోసం… BuchiBabu_Devulapalli

డాక్యుమెంటరీ సినిమా-4

మొదటి ప్రపంచ యుద్ధంలో సినిమా కళ చాలా పవిత్రమైనదని, దాన్ని క్షుద్రమైన తాత్కాలిక ప్రయోజనాలకు వాడకూడదని, కళావిలువలకు, కళా ప్రయోజనానికి శాశ్వతత్వం ఆపాదించే అన్ని వర్గాల వారు కూడా కళను ఒక చీపురుకట్టలాగ, ఒక గ్లాసుడు మంచినీళ్లలాగా తక్షణావసరాలకు వాడుకోవడం చరిత్ర అంతటా జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యుద్ధం, సరిహద్దు తగాదాలు మొదలైన సందర్భాలలో కవులూ, కళాకారులూ విజృంభించి ప్రచారంతో హోరెత్తిస్తారు. మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ దేశాలే కాక తటస్థంగా ఉన్న అమెరికా