Menu

Monthly Archive:: April 2010

కళ్ళకు కనిపించని సినిమా ! తెలుగులో కూడా వస్తే!

సినిమామీద వ్యామోహంతో , శాస్త్రీయంగా దాన్ని చదువుకునేందుకు కాసిన్ని పుస్తకాలూ సినిమాలు చదివాక నేను నేర్చుకున్న సినీ గ్రామరును జనరంజకంగా సినిమాలు తీయడంలో ఎలా ఉపయోగించాలా అని తర్జనభర్జనలు పడుతున్న కాలంలో , ఈ మధ్య మన తెలుగులో సినిమాల మీదా , వాటి గ్రామరు మీదా జరుగుతున్న చర్చలలో నా గొంతు కూడా వినిపేంచుందుకు , నాకు బాగా ఇష్టమయిన ఒక  దక్షిణ కొరియన్ సినిమా :   Spring, Summer, Fall, Winter … and

ప్రస్థానం సమీక్ష వ్రాయండి. బహుమతులు గెలుచుకోండి

మంచి సినిమా ఎక్కడొచ్చినా ఎలుగెత్తిచాటే తెలుగు వేదిక నవతరంగం.అలాంటిది తెలుగులో వచ్చే మంచి సినిమాల గురించి చెప్పకపోవడం అన్యాయమే అవుతుందనే స్పృహతో, తెలుగు సినిమా సమీక్షలు ప్రచురిస్తే అనవసరమైన రభసలేతప్ప సభ్యత కలిగిన చర్చలు జరగవనే అనుభవం కలిగినా, వాటన్నింటినీ పక్కనబెట్టి ‘ప్రస్థానం’ చిత్రం సమీక్షని ప్రచురించడం జరిగింది. మంచి సినిమాని ప్రోత్సహించే వేదికగా నవతరంగం “ఉత్తమ సమీక్షకు ఐదువేలు” పోటీ నిర్వహిస్తోంది. ‘ప్రస్థానం’ చూడండి. సమీక్ష రాయండి. పోటీలో పాల్గొనండి. బహుమతులు గెలుచుకోండి. వివరాలు ఈ

గమ్యానికి చేరువగా ‘ప్రస్థానం’ (సమీక్ష)

తొంబై దశకంలో వచ్చిన  కోడిరామకృష్ణ తరహా అచ్చతెలుగు ఆంధ్రా పొలిటికల్ థ్రిల్లర్ల తరువాత శంకర్ తరహా “అవినీతిని అంతంచేద్ధాం!” టైపు ఫాంటసీ ఆదర్శాల సినిమాలొచ్చాయి. మొన్నమొన్న వచ్చిన ‘లీడర్’ కూడా శంకర్ తరహా ఫాంటసీకి మరోరూపం. కానీ దేవకట్టా ‘ప్రస్థానం’ ఒకడుగు పక్కకొచ్చి పొలిటికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ జాన్రా ను తెలుగు తెరకు పరిచయం చేసింది. ‘రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించడమో లేక ఫాంటసీ సొల్యూషన్లు ఇవ్వడమో ఈ సినిమా ఉద్దేశం కాదు. రాజకీయనేపధ్యంలో ఒక కుటుంబ

‘మహా’ ప్రస్థానం

ప్రస్థానం సినిమా చూసి బయటకు రాగానే నాకొచ్చొన ఫీలింగ్, “ఎంత కాలానికి తెలుగులో మంచి సినిమా చూశానూ!” అని. ఆ తరువాత నిజంగానే ఆలోచించా, “ఈ మధ్యకాలంలో నాకు బాగానచ్చిన తెలుగు సినిమా ఏమిటా?”. గుర్తుకురాలేదు… నిజంగా….అస్సలు గుర్తుకురాలేదు. అందుకే “తప్పక చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను. ప్రస్థానం…DON’T MISS IT. నటీనటులు: శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు. సంగీతం: మహేష్ సంకర్