Menu

Monthly Archive:: April 2010

తెలుగు సినిమా వ్యాపార రహస్యం !

ఒక సినిమా విజయవంతం కావటానికి ఎన్ని కారణాలుంటాయో,అపజయం పాలుకావటానికి అంతకన్నా ఎక్కువే కారణాలు ఉండొచ్చు.అయితే అటు విజయానికీ,ఇటుపరాజయానికీ గల కారణాలు ఇవీ అని ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోవటమే సినిమా వ్యాపారంలో ఉన్న మిస్టరీ.ఆ మిస్టరీనీ ఛేదించటానికి సుమారు శతాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.అవి చిత్రనిర్మాణంలో పాల్గొన్నవారు కావచ్చు,ఇతర నిపుణులు కావచ్చు,పత్రికలు,ఇతరమీడియా కావచ్చు.కానీ ఇంతవరకూ ఎవరూ ఖచ్చితమైన నివేదికను ఇచ్చిన దాఖలాలు లేవు. కాకుంటే ఒక సినిమా,రెండుసినిమాల జయాపజయాలను విశ్లేషించి ఫలానా కారణాల వల్ల ఇది సంభవించిదీ అని

ప్రస్థానం—My View—వెంకట్ గోపు

(ఈ సమీక్షలో సినిమా కథలోని కొన్ని కీలక దృశ్యాలను వెల్లడించడం జరిగింది. పాఠకులు జాగ్రత్త వహించగలరు.) నేపధ్యం: తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల మద్య జరిగే సంఘర్షణ ఎప్పూడూ ఆసక్తికరంగా ఉంటుంది.. హాలీవుడ్ క్లాసిక్ “గాడ్ ఫాదర్” దగ్గర్నుండి, ఘర్షణ(పాత), నిన్న మొన్న వచ్చిన “సర్కార్” సినిమా వరకు ఈ తరహా సన్నెవేశాలు చూడొచ్చు.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల మద్య ఆదిపథ్య పోరు అసక్తికరమే… దానికి ఉదాహరణగా ధీరుభాయి అంబానీ కుటుంబం గురించి చెప్పుకోవచ్చు.

విజయ “ప్రస్థానం”

నేపధ్యం: ఈ సినిమా వేల ఏళ్ళ తరబడి మనిషి సాగించిన / సాగిస్తున్న ప్రస్థానం గురించి. ఐతే ఈ ప్రస్థానం లో మనిషి ఏం నేర్చుకున్నాడు అనేదే ప్రశ్న. ఒక పాట లో “సిరివెన్నెల” అంటారిలా. వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా రెండే రెండు వాక్యాల్లో మనిషి తత్వం గురించి స్థూలంగా చెప్పారాయన. ఆ పాట తో ఇన్స్పైర్ అయి తీసిన సినిమా డ్రమాటిక్ ముగింపు తో