కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం

malliswari

తెలుగు సినీపరిశ్రమలో కథాచౌర్యాలూ, భావచౌర్యాలూ, పైరసీభూతాలూ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో చరిత్రలో నిలిచిపోయే తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి” కథావివాదం గురించి ‘ నరేష్ నున్నా’ గారు రాసిన పరిశోధనాత్మక వ్యాసం  మీ కోసం…

BuchiBabu_Devulapalli

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

26 Comments to “కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం”

  • నేటి రచయితలు ,దర్శకుల్లా ఆ నాటి వారు నీతి మాలిన వారు అయితే కాదు , బుచ్చిబాబు పేరు వేయకపోవటానికి ఇతర కారణాలు ఉండవచ్చు , తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేయకండి.
    హంపి విశేషాలు చెప్పటానికి ఇదేమి చరిత్ర గురించిన సినిమా కాదు , ఓ ప్రేమ కథ . ఆ కథ కు ఎంత వరకు అవసరమో అంతే దర్శకుడు తీసుకున్నాడు. మీరు చెప్పినవన్నీ చూపితే అసలు కథ త్రోవ తప్పుతుంది.
    నాకు మీరు నచ్చలేదు ,మీ వితండ వాదం నచ్చలేదు.

    • [ నేటి రచయితలు, దర్శకుల్లా ఆ నాటి వారు నీతి మాలిన వారు అయితే కాదు, బుచ్చిబాబు పేరు వేయకపోవటానికి ఇతర కారణాలు ఉండవచ్చు. తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేయకండి. హంపి విశేషాలు చెప్పటానికి ఇదేమి చరిత్ర గురించిన సినిమా కాదు, ఓ ప్రేమ కథ - ఆ కథ కు ఎంత వరకు అవసరమో అంతే దర్శకుడు తీసుకున్నాడు. మీరు చెప్పినవన్నీ చూపితే అసలు కథ త్రోవ తప్పుతుంది. ]

      [ నాకు మీరు నచ్చలేదు, మీ వితండ వాదం నచ్చలేదు. ]

      - నా మనసులొని మాటను మీరు యదాతతముగ ముందుగనె తెలియజేసారు. ఆలస్యముగ స్పందిస్తున్నందుకు ఖ్చంతవ్యుడను!

      • మీరన్నది నిజమె సుమ! ఇలాంటి వారు వేయి మంది తమ అక్కసు వెల్లగట్టిన, బి.ఎన్‌. గారిపై మనకు గల అభిమానాన్ని యెవరు తుడిచివేయలేరు. ‘కార్తిక్’ గారు బాగా చెప్పారు “నాకు మీరు నచ్చలేదు, మీ వితండ వాదం నచ్చలేదు.” అని!

        రచయిత పై నాకేమి వ్యక్తిగత మయిన కోపమేమి లేదు, కాకపోతె నా అభిప్రాయాన్ని తెలియ చెప్పాలనిపించింది.

  • చాల మంచి వ్యాసాన్ని మాకు మరిచయం చేసారు అతిధి గారు.
    కృతజ్ఞతలు.

  • చాలా మంచి వ్యాసం. ఒకవేళ బుచ్చిబాబు గారి కథ ఆధారంగానే మల్లీశ్వరి నిర్మింపబడినట్లైతే, సినిమాలో కథలో ఉన్నంత డెప్త్(అన్ని విధాలా) సినిమాలో లేకపోవడం చూస్తే, ఇప్పటి మన నేతిబీర చందంగా ఉన్న తెలుగు సినిమా కథలకు బీజం అపుడే పడిందనుకోవాలా?

    ఏది ఏమైనా బుచ్చిబాబు గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాగైనా ఆయన్ని తలచుకోవడం మన అదృష్టం.

  • వ్యాసం నాకూ నచ్చలేదు. మాతృక లేదా ప్రేరణ ఉన్నంత మాత్రాన, బుచ్చిబాబు గారి పేరు ఎందుకు వెయ్యలేదో తెలియ నంత మాత్రాన, ఆనాటి మహానుభావులని ఇంత కటువైన మాటలు వాడి అవమాన పరచడము దోషము.

    మరొక్క మాట, ఈనాటి వారు చెడిపోయారు, ఆనాటి వారు పవిత్రులు అని మరొక మిత్రులు వ్రాశారు. అది మాత్రము తప్పు అని ఘంటాపథము గా చెప్పగలను. ఎందుకంటే, మాన్యులు రావూరి భరద్వాజ గారి “మాయ జలతారు” లేదా “పాకుడు రాళ్ళు” అన్న కథ అప్పటి సినీ జగత్తులోని మోసాలని మాయలని బయట పెట్టినదే. ఎన్నో కథలు మనమూ విన్నవే..

    భవదీయుడు,

    సీతారామం

  • Excellent article, I feel he must be acknowledged. Thanks for the post

  • ఇది ఖచ్చితంగా కథాచౌర్యం కాదు. ‘ మల్లీశ్వరి ‘ కథా రూపకల్పనకు ‘ రాయలవారి కరుణ కృత్యం ‘ బీజం వేసింది గానీ పూర్తిగా అనుసరించలేదనేది సత్యం. ఒక కథకు మరో కథో, సంఘటనో ప్రేరణ కావడం సహజం. బుచ్చిబాబు గారి రచనతో ‘మల్లీశ్వరి ‘ రచనను పోల్చలేం ! దేనికదే సాటి ! ఆయన నాటికా రచన అద్భుతమైతే బి.ఎన్. గారి సెల్యులాయిడ్ రచన అనితర సాధ్యం. చారిత్రికాంశాల విషయానికొస్తే బుచ్చిబాబుగారు తమ కథకు చారిత్రికాదారమేదీ లేదని ముందుమాటలో స్పష్టంగా చెప్పారు. అలాగే ‘ మల్లీశ్వరి ‘ చిత్రకథకు కూడా చారిత్రికాదారమేదీ లేదనేది స్పష్టం ! రాయలవారి కాలంలో జరిగినట్లుగా చెప్పబడిన ఊహాజనిత గాథలివి. ఇలాంటి కాల్పనిక గాథలెన్నో మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి. అంత మాత్రం చేత పురాణాల్లోంచి చౌర్యం చేసారని అనగలమా ? మహాభారతం లోదిగా భ్రమకలిగించే కాల్పనిక గాథ ‘ మాయాబజార్ ‘ లో పాండవులు లేకపోవడం లోపమా ? సెల్యులాయిడ్ రచనా ( స్క్రీన్ ప్లే ) చాతుర్యమా ? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి తెలుగువారు గర్వంగా చెప్పుకునే చిత్రాలను, కథలను వివాదాస్పదం చెయ్యకండి.
    కృష్ణదేవరాయని కరుణకృత్యం-1 మరియు కృష్ణదేవరాయని కరుణకృత్యం-2
    ఒకసారి చదవండి.

    • I completely agree with Mr. SRRao.

      One of the worst article that I ever read in my life. It’s better to take down this article from here.

      I wonder why NavaTarangam posing (even discussing) this kind of useless posts, may be to increate comments (for ads too!)

      Am I right?

  • ప్రేరణకీ, పైరసీకీ తేడా వుంది. ఒకే సంఘటన ప్రేరణతో పలువిధాలుగా కథలు రాయచ్చు. ఒకరి సృజనని యథాతధం కాపీ కొట్టడం ( భావ చౌర్యం ) నిస్సందేహంగా పైరసీ క్రిందకే వస్తుందనుకుంటాను.

    బుచ్చి బాబు గారి “రాయల వారి కరుణ తత్వం” కథకు చారిత్రాత్మక ఆధారం లేదు కానీ, రాయల కంటే ముందు వంద సంవత్సరాల క్రింద ( అంటే 1400 శతాబ్దంలో ) దేవరాయల కాలంలో ఒక అందమైన అమ్మాయిని బలవంతంగా భార్యగా తెచ్చుకోడానికి ప్రయత్నిస్తే, ఆ అమ్మాయి అది తిరస్కరిస్తుంది. ఆ తిరస్కార పర్యవసనాలు ఊహాకందని మలుపులు తిరిగి దేవరాయలు రాజ్యం కోల్పోయే స్థితికొస్తుంది. బుచ్చి బాబు గారి నాటకానికిది ప్రేరణ కావచ్చు. ఎందుకంటే ఈ సంఘటన చరిత్రలో నిక్షిప్తమయ్యింది.

    ఈ కథ ఆథారంగానే, కౌముది లో నేహల పేరుతో నోనొక చారిత్రాత్మక నవల రాస్తున్నాను. మీరిక్కడ చదవచ్చు.

    http://vennello.wordpress.com/

  • ఇప్పుడున్న వాళ్ళందరు copycats, ఆ కాలంలో ఉన్నవాళ్ళు పై నుండి ఊడి పడ్డారు అనుకోవడం తప్పు.
    దేవులపల్లి క్రిష్ణశాస్త్రి అయినా, బి.ఎన్. రెడ్డి అయినా వాళ్ళూ మనుషులే… ఇందులో ఎదో మతలబు తప్పకుండా ఉండి ఉంటుంది… నిప్పు లేనిదే పొగ రాదు కదా!
    ఆ కాలం వారు అయినంత మాత్రాన అందర్నీ సత్యవంతులు అనుకోలేము…

  • ఈ రంధ్రాన్వేషణ బాగుందో లేదో,ఎందుకుపయోగపడిందో ముచ్చటించలేను కానీ ఈ వ్యాసం చదివిన తర్వాత నాకు మాత్రం రాజీవ్ గాంధి-బోఫోర్స్ వ్యవహారం గుర్తొస్తోంది ఎందుకో.ముద్దాయి చచ్చిపోయాడు,ప్రతివాది చచ్చిపోయాడు,సాక్షులు చచ్చిపోయారు,తీర్పుచెప్పాల్సిన జడ్జి సంగతి తెలీదు బహుసా ఆయన కూడా కాలంచేసేఉండచ్చు తదుపరి కాలంలో ఆయన ఇంటివారికే ఆ కేసు అప్పగించి ఉండచ్చు కూడా,కానీ విశేషమేంటంటే కార్గిల్ యుద్ధంలో అవే బోఫోర్స్ శతఘ్నులో,తుపాకులో వాడారని వార్త.
    దీనికీ పైన వ్యాసానికి ఏమన్నా సంబంధం ఉందనిపిస్తే మంచిదే లేకపోతే ఒక కామెంటుకు జాగా-బొ అనుకోడమే.అయ్యా అదీ సంగతి.

    • You are 100% correct. Rasinayana ledu – Teesinayana ledu; Atla anukonte Pathala Bhairavi ki, Alibaba Adbutha Deepam kathaki chala sambandham vundi.

      Yendukee vruda gusa gusalu. B.N. Reddy pi ala rase sariki, vundabatta leka office lo nunche ila rastunnanu.

  • నవతరంగంలో నున్నా నరేష్ గారు పోస్ట్ చేసిన మల్లీశ్వరి చౌర్యం గురించి అనుకూల, ప్రతికూల స్పందనలు సమానస్థాయిలో వస్తున్నట్లున్నాయి. పది రోజుల క్రితం ఈ వ్యాసం నాకు పర్సనల్‌గా అందినప్పుడు నాకు తెలిసిన వారితో పంచుకున్న నేపథ్యంలో ఈ వ్యాసంపై కింది వ్యాఖ్యలు వచ్చాయి. సందర్భసహితంగా ఉంటుందనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ పొందుపరిస్తున్నాను.

    “It is an interesting reference. B.N.Reddy admitted that the idea for Malliswari had been gestating in his mind since 1939. But the idea of lovers of maidens in kings’ harem is not so new. Even K.L.Saigal’s
    Shah Jahan movie has a Malliswari-like theme.”
    kodavatiganti Rohiniprasad

    “we heard about the controversy including that of rajani. but the article you sent was of great quality and stands as a great exapmle of critical evaluation.
    thanks for the forward.”
    vasundhara

    “Thank you for the stuff which is interesting.
    I do possess the hand written script by Butchibabu of the play broadcast in AIR some where in my dumps – very carefully preserved. Quite long ago I thought of reproducing as it is but kept in abeyance for some reason or other.”
    Rachana sai

    రాయల కరుణకృత్యం నాటికకు, మల్లీశ్వరి సినిమాకు మధ్య భావచౌర్యం అనే ఆపాదింపును పక్కన పెట్టి చూస్తే నరేష్ గారి సమీక్షావ్యాసం చూసాక మల్లీశ్వరి సినిమా కంటే బుచ్చిగారి నాటికే ఒక మెట్టు ఉన్నతస్థాయిలో ఉందనిపిస్తోంది. అలాగే జీవితకాలంలో ఎన్నడూ బీఎన్ రెడ్డిగారు ఈ విషయంపై వివరణ ఇవ్వడం లేదంటే అది ఆశ్చర్యకరమే.. ప్రేరణ, చౌర్యం రెండు పదాలకు వార పెద్దగా లేదేమో.. భారతీయ సినిమా చరిత్రలో కొన్ని వందల దృశ్యాలు, పాటలు, సంగీత బాణీలు కూడా ఒక భాషనుంచి మరొక భాషలోకి కబ్జా చేసినవే అంటే ఎవరూ ఆగ్రహించనవసరం లేదు. ఈ విషయం మన కంటే రాంగోపాల్ వర్మ గారికి కాస్త ఎక్కువే తెలుసనుకుంటాను. ఇంగ్లీష్ సినిమాల నుంచి ప్రేరణ పొందని భారతీయ సినిమాలను లెక్కగడితే మన భండారం బయటపడుతుంది. చౌర్యం అనే పదం వినగానే ఇంతగా భుజాలు ఎందుకు తడుముకుంటున్నామో అర్థంకాదు. బుచ్చిబాబు గారి రచన, మల్లీశ్వరి సినిమాలను పరిచయం చేయడంలో నరేష్ గారు అసాధారణ సమతూకంతో వ్యవహరించారనే అనుకుంటున్నాను. ఆయన చౌర్యం గురించి ప్రస్తావించిన దానికంటే ఈ రెంటినీ హృద్యంగా పరిచయం చేసిన తీరును ఆస్వాదిస్తే చాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో ఆయనకు అభినందనలు.
    రాజు.

  • hi. after reading this article, my humble view is that, it’s not the way to treat the minimalist controversy, if at all, if it is there.

  • hi,
    onething i understood with this article from Naresh Nunna, he seems to be a Mr.Complaint.

    Sri

  • ఈ కథ తస్కరించబడిందేమో అన్న ప్రతిపాదన వచ్చినందుకే పాథకులు అంత తల్లడిల్లి పోవలసిన పనిలేదని నా ఉద్దేశం. దేవులపల్లి గొప్ప కవి. బీయెన్ గొప్ప దర్శకుడు. ఆ సంగతి ఎవరూ కాదనడంలేదు వ్యాస రచయితతో సహా. అంతమాత్రాన వారు సర్వకాల సర్వావస్థలయందూ కలనైనా పాపం తలపెట్టని మహాపురుషులు అనుకోవలసిన పని లేదు. పైగా ఈ కథ కర్తృత్వం గురించి సినిమా విడుదలైనప్పటి నించీ ఇప్పటిదాకా వినిపిస్తూ వచ్చిన వివాదాలని కూడా వ్యాస రచయిత ఉదహరించారు. అందుకని వ్యాసంలో చేసిన ప్రతిపాదనని గమనించి, ఋజువుల్ని పరిశీలించి తమకి తాము ఓ నిర్ధారణకి రావడమే పాఠకులు చెయ్యగలిగినది. పైగా, సృజన విషయంలో ఏది ప్రేరణ, ఏది కాపీ, ఏది చౌర్యం అనేది కూడా ఎప్పటికీ వివాదాస్పదమే.

    కాకపోతే ఒకటుంది. వ్యాసరచయిత నరేష్ గారు మాటల్ని బాణాల్లాగా వొదిలే నేర్పున్న రచయిత. ఒక్కోసారి ఆయన తన మాటలమోహంలో తానే పడిపోయి కాస్త ఆదమరిచినప్పుడు ఆ బాణాలు కొంచెం గురితప్పి వెక్కిరింపు అవసరమైన దానికన్న పదునుగా గుచ్చుకుంటుంది. సంచలనాత్మక విషయాల్ని స్పృశించేప్పుడు నిర్భీతి ఎంత అవసరమో సంయమనం కూడా అంతే అవసరం.

    • “మల్లీశ్వరి” కథకు మూలం ఎక్కడిదన్న విషయంపై చాలా చర్చ జరిగింది. ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారు తమ “రాయలవారి కరుణకృత్యము” అన్న నాటికకు రాసిన పరిచయంలో “ఈ నాటికలో యితివృత్తానికి, ‘ మల్లీశ్వరి ‘ యితివృత్తానికి కొన్ని పోలికలు కనపడవచ్చు. ఈ నాటిక ‘ భారతి ‘ లో ప్రచురింపబడిన ఏడెనిమిది సంవత్సరాలకా చిత్రం విడుదలైందని పాఠకులు గుర్తుంచుకుంటే చాలు” అని రాసారు. “మల్లీశ్వరి”కి రచన, పాటలు సమకూరుస్తూ సినీ రంగ ప్రవేశం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీ పత్రిక “విజయచిత్ర”లో రాస్తూ (డిసెంబర్‌, 1977), “బుచ్చిబాబుగారు ‘ భారతి’ లో ప్రచురించిన కథ, ‘ ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా ‘ లో వచ్చిన వేరొక కథల ప్రభావంతో ‘ మల్లీశ్వరి ‘ కథ రూపొందింది” అన్నారు.కాని, “అందమైన అమ్మాయిలను తమ ఆటవస్తువులుగా తెప్పించుకొని జనానాలలో జాగ్రత్త చేయడం ఆనాటి రాజులు ఎందరో చేసినదే అని,కృష్ణదేవరాయల గురించి అలా చూపడం బాగుండదని కొన్ని మార్పులు చేసినట్లు” బి.ఎన్‌. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “మల్లీశ్వరి” చిత్రం గొప్పదనం గురించి వేరు చెప్పనవసరం లేదు. దానిని మించిన చిత్రం తెలుగులో రాలేదు అంటే పెద్ద అతిశయోక్తి కాదు!

      “మల్లీశ్వరి” కథకు మూలం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” కాదన్నమాట!

  • I am thoroughly impressed with the quality of criticism and writeup of this essay. Have not read any such in years. I am also thrilled by the rephrased narration of Buchibabu’s drama by Naresh Nunnaa garu.

    A written drama or story has the opportunity to be more expressive about the inner feelings of its characters, at the expense of being a little verbose. A movie or a stage play can not quite do the same, without impacting its _rassanubhooti_ or without interfering with the flow and narration. How many times are we annoyed by movie characters engaging in soliloquies with their inner selves. Such an expression does not sound out of place in a written story or a drama. Expressions of the body and face are the only means at the directors’ and actors’ disposal to communicate with their audience. To make up for this, a movie director has other devices like audio and songs – which live unto perpetuity in the viewers’ minds. A written story or drama does not enjoy the same status in a reader’s mind. So, expecting the same and exact kind of expressiveness from a writer and movie is a flawed idea in the first place. A written story is the creation of its author; a movie is the collective creation of many personalities.

  • శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా ‘వందేమాతరం’ షూటింగు కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు వ్రాసిన ఒక కథ(రాయలకరుణకృత్యం) కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు.

    అంతమాత్రమున ఈ చిత్రానికి బుచ్చిబాబు గారు రాసిన కథ అని అనడము సమంజసము కాదు. “కథాచౌర్యం” అనె పేరిట ప్రచురించటం వారి అభిమానులను వారిని అవమానించటమె అవుతుంది.

    దయచెసి “కథాచౌర్యం” అను మాటను “ఆధారము” గ మార్చగలరు.

    • “విజయనగర సామ్రాఙ్యామును పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల వారిని గూర్చి ఆబాల గొపాలము ఆప్యాయముగ చెప్పుకుంటు వచ్చిన గాథలు ఈ మల్లీశ్వరి కథకు ఆదారములు.” అని చిత్రము మొదలయినప్పుడు వ్యాక్యాత (నాగయ్య) చెపుతాడు.

    • @సంధ్య: వ్యాసం శీర్షిక విషయంలో అంత బాధపడాల్సిన పరిస్థితి లేదనుకుంటాను. ప్రస్తుతం సినీపరిశ్రమలో జరుగుతున్న కథాచౌర్య/భావచౌర్య చర్చల నేపధ్యంలో మల్లీశ్వరి వివాదం గురించి వ్యాసమే తప్ప మల్లీశ్వరిలో కథాచౌర్యం ఉందనే ఆరోపణ లేదు.

  • మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నదేమిటంటే ఈ వ్యాసం చాలా బాగా రాయబడింది. నరేష్ నున్న గారి వ్యాసాలు నాకు సుపరిచితమే. ఆయన బుచ్చిబాబు కథని, మలీశ్వరి సినిమాని సమపాళ్ళలో విశ్లేషించారు. చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు. కొత్తపాళీగారు చెప్పినట్టు అక్కడక్కడా వ్యంగ్యాలు కాస్త వంకర తిరిగాయి. నాకు చాలా చాలా నచ్చిన సినిమాలు మాయాబజార్, మలీశ్వరి. మల్లీశ్వరి లో కథా చౌర్యమే ఉండొచ్చు కానీ బి.ఎన్ రెడ్డి గారు ప్రతిభ, దేవులపల్లిగారి పాండిత్యం అసాధారణమైనవి. అవి ఎప్పటికి వన్నె తరగనివి. ఈరోజు కథాచౌర్యం అని చెప్పినంత మాత్రాన మల్లీశ్వరి విలువ తగ్గిపోదు అలాగని నిజాలని పక్కనబెట్టడం కూడా మంచిదికాదు. ఇలా జరిగింది అని తెలుసుకొవడం చాల ముఖ్యం. అదే సమయంలో ఈ విషయమాధారమగా మల్లీశ్వరి ని ద్వేషించడం సమంజసం కాదు. దీన్నే లౌక్యం అంటారేమో నాకు తెలీదుగాని నరేష్ గారి వ్యాసం చాలా బాగుంది. ఇంత పెద్ద నిందకి గురైనా, ఈనాటికి మలీశ్వరిని ప్రజలు ప్రేమిస్తున్నారంటే అది ఖచ్చితం గా బి.ఎన్, రెడ్డి, దేవులపల్లి గార్ల గొప్పతనమే, కాబట్టి మల్లీశ్వరి ఎప్పటికీ ఆణిముత్యమే.

    • “మల్లీశ్వరి లో కథా చౌర్యమే ఉండొచ్చు కానీ…అలాగని నిజాలని పక్కనబెట్టడం కూడా మంచిదికాదు. ఇలా జరిగింది అని తెలుసుకొవడం చాల ముఖ్యం.” – సౌమ్య గారు, యేమిటా నిజము?

      [ ఈ తరుణంలో చరిత్రలో నిలిచిపోయే తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి” కథావివాదం గురించి ‘ నరేష్ నున్నా’ గారు రాసిన పరిశోధనాత్మక వ్యాసం మీ కోసం… ] – అసలు కథావివాదమేమిటి? “గజ్జి కి లేని దురద …… ఏందుకొ”?

      “చిత్రకథ బుచ్చిబాబు కథను ఆధారంగా తయారు చేసారనడానికి ఆధారాలున్నా సినిమా క్రెడిట్స్ లో ఎక్కడా బుచ్చిబాబు పేరు కానరాదు. అప్పుడు బుచ్చిబాబు ప్రభుత్వోద్యోగిగా ఉండటం దీనికి కారణం కావచ్చని ‘భరాగో’ (మరో నూట పదహార్లు) అభిప్రాయపడ్డారు.” – ఇదె నిజమయితె మరి అంత బహిరంగముగ “సినిమా క్రెడిట్స్” లో ఈ విదముగా ఎన్దుకు చెప్పినట్టొ?

      “విజయనగర సామ్రాఙ్యామును పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల వారిని గూర్చి ఆబాల గొపాలము ఆప్యాయముగ చెప్పుకుంటు వచ్చిన గాథలు ఈ మల్లీశ్వరి కథకు ఆదారములు.” అని చిత్రము మొదలయినప్పుడు వ్యాక్యాత (నాగయ్య) చెపుతాడు.

      • మీరన్నది నిజమె సుమ! ఇలాంటి వారు వేయి మంది తమ అక్కసు వెల్లగట్టిన, బి.ఎన్‌. గారిపై మనకు గల అభిమానాన్ని యెవరు తుడిచివేయలేరు. ‘కార్తిక్’ గారు బాగా చెప్పారు “నాకు మీరు నచ్చలేదు, మీ వితండ వాదం నచ్చలేదు.” అని!

        రచయిత పై నాకేమి వ్యక్తిగత మయిన కోపమేమి లేదు, కాకపోతె నా అభిప్రాయాన్ని తెలియ చెప్పాలనిపించింది.

  • I agree with you on this: “కథాచౌర్యం” అనె పేరిట ప్రచురించటం వారి అభిమానులను వారిని అవమానించటమె అవుతుంది. దయచెసి “కథాచౌర్యం” అను మాటను “ఆధారము” గ మార్చగలరు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories