Menu

Withnail and I

ఈ మధ్య  సినిమా హాలులో చూసిన మరో మంచి సినిమా Withnail and I.

1987లో వచ్చిన ఈ సినిమాకి Bruce Robinson దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు ఈయన పేరు ఎప్పుడూ వినలేదు. అయినా బ్రిటీష్ సినిమాలోని ఆణిముత్యాల సీరీస్ లో చివరిగా ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఎలా అయినా చూడాలని అఫీసునుంచి హడావుడిగా పరిగెత్తుకొచ్చి చూస్తే సినిమా హాలులో ఎప్పుడూ లేనంత పెద్ద క్యూ కట్టబడివుండడం చూసి ఆశ్చర్యపోయాను. తీరా చూస్తే ఆ క్యూ Withnail and I సినిమాకని తెలిసి ఆనందం వేసింది.

ఇరవై ఏళ్ళ నాటి సినిమాను చూడడానికి జనాలు ఇలా క్యూలు గట్టి మరీ చూస్తున్నారంటే అంతకంటే కావలిసిందేముంది నా లాంటి సినీ అభిమానికి? ఈ సినిమా గురించి చదవడం కంటే చూడడం చాలా మేలని నా అభిప్రాయం. మరీ అతిగా అంచనాలు పెట్టుకోకండి. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పటంలేదు కానీ ఎలాంటి వారైన తప్పక ఆనందించగలరని నా నమ్మకం.

Withnail and I – ట్రైలర్

3 Comments
  1. sekhar kola July 10, 2008 /